ప్రవక్త(స) ముహమ్మద్ మరణం
తరువాత మొత్తం 25 సంవత్సరాల లోపు అరబ్బులు, పర్షియా, సిరియా, ఆర్మీనియా మరియు మధ్య
ఆసియా జయించారు. తూర్పు లో వారు ఇండస్ నది
మరియు సింధ్ నది దాటినారు పడమరలో ఈజిప్ట్ మరియు
ఉత్తర ఆఫ్రికా అంతటా వ్యాపించి సముద్రాలు దాటి జిబ్రాల్టర్ చేరుకొన్నారు ఆ సమయంలో స్పెయిన్
కుడా జయించారు.
751 AD లో అరబ్బులు చైనీయుల నుండి కాగితం తయారి నేర్చుకొన్నారు.
దీనితో గ్రంద రచన మరియు గ్రంధ నిల్వ
స్వభావం మారింది. ప్రపంచంలో గ్రంధాలయాలు స్థాపించటం ప్రారంభమైనది మరియు అరబ్బుల అడుగుజాడలలో నడుస్తూ ప్రతిచోటా గ్రంధాలయాలు
స్థాపించబడినవి. ఇతర సంస్కృతుల నుంచి లిఖిత ప్రతులు మరియు తాళపత్ర గ్రంధాలను అనువదించే
కార్యక్రమం లో అరబ్బులు ఆసక్తిని ప్రదర్శించారు. ఖలీఫాల జ్ఞాన
సామ్రాజ్యంగా పిలువబడే ఇస్లామిక్
లైబ్రరీ భవనంకు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. తొమ్మిదవ శతాబ్దం
నాటికి, కార్డోబ మరియు స్పెయిన్ పండితులు కైరో, బోకోహర, సమర్ఖండ్ మరియు బాగ్దాద్ ల్లోని పండితులతో సంభందాలు
ఏర్పరచుకొన్నారు. బాగ్దాద్! పెర్షియన్ "దేవుని బహుమతి"గా విలసిల్లినది.
ఖలీఫా మన్సూర్ కాలం లో బాగ్దాద్ 762 AD లో స్థాపించబడినది.
అతని సామ్రాజ్యం అట్లాంటిక్ నుండి భారతదేశం వరకు విస్తరించినది మరియు అతను తన రాజధానిని డమాస్కస్ నుండి బాగ్దాద్ కు మార్చినాడు. అతను అనేక
మంది పరిశోధనకారులను మేదావులను ప్రోగుచేసి ప్రపంచ ప్రఖ్యాత రచనలు అరబిక్ లోకి అనువదించడానికి
శ్రీకారం చుట్టాడు. అనేకమంది నాన్ అరబిక్ పండితులు ఈ అనువాద కార్యక్రమం లో
పాల్గొన్నారు.
అబ్బాసీయ వంశ ఖలీఫాలు సిరియన్, గ్రీక్, పెర్షియన్, యూదు, హిందూ మరియు అర్మేనియన్ అనువాదకులను
ప్రోత్సహించారు. మేధావులు, పండితులకు అనువాదం ఒక వ్యాపకంగా మారింది. అనువాదం
ఉన్నత జీవిత స్థితి యొక్క చిహ్నంగా మారింది మరియు అనువాదకులకు బంగారo
రూపేణా ప్రతిపలం చెల్లించటం జరిగేది. అరుదైన పత్రాలు మరియు పురాతన గ్రంథాలు ప్రాధాన్యత
గల వస్తువులు గా మారినవి. ఉదాహరణకు, టోలెమి యొక్క అల్మగేట్
(Almaget) గ్రంధం అబ్బాసీయ మరియు
బైజాంటైన్ సామ్రాజ్యం మధ్య యుద్ధం తర్వాత శాంతి కోసం ఒక షరతు గా మారింది. ప్రపంచంలో అత్యంత నాగరిక స్థలంగా శాస్త్రవేత్తలు, కళాకారులు మరియు పండితులు ద్రుష్టి లో బాగ్దాద్ ఖ్యాతిని ఆర్జించింది.
తాళపత్ర గ్రందాల కొనుగోలు
ప్రారంభం అయినది మరియు సంస్కృత బాష లోని ఒక గణిత పరిశోధన బ్రహ్మసూత్ర (Bramhasphuta) సిధ్ధాంతo 8 వ శతాబ్దంలో
అరబిక్ భాషలోనికి అనువదింప బడినది. పండితులు ప్రపంచం అంతట పర్యటించి ఖగోళశాస్త్రం, వైద్యం, తత్వశాస్త్రం
మరియు సామాన్య విజ్ఞాన శాస్త్ర రాతప్రతులు ధనం ఖర్చు చేసి సేకరించసాగరు. అరబ్ విజ్ఞాన శక్తీ ప్రపంచం అంతటా విస్తరించి
సాగినది మరియు బాగ్దాద్ నగరం ప్రపంచం లోని అన్ని రకాల గ్రంధ సేకరణ కు నెలవయినది.
830 AD లో ఖలీఫా హరున్ అల్ రషీద్ కుమారుడు అల్ మమున్ బైతుల్
హిక్మః ( జ్ఞాన నిలయం) స్థాపించినాడు.జ్ఞానాభిలాషులు అందరికి ఇందులో
ప్రవేశం గలదు. అనువాదకులు, శాస్త్రవేత్తలు, లేఖకులు, రచయితలు, నకలు చేసేవారు అందరు ఇక్కడ ప్రతి రోజు అనువాదం, సంభాషణ మరియు చర్చ కోసం కలుసుకునేవారు. అనేక
శాస్త్రీయ విషయాలపై వివిధ భాషలలో మాన్యుస్క్రిప్ట్స్ తయారు చేయబడి వాటిని వివిధ
భాషల నుండి అరబిక్ లోనికి అనువదించ బడేవి.
బైతుల్ హిక్మః గ్రంధాలయ గోడలు
అరబిక్, పర్షియన్, హీబ్రూ, అరామిక్, సిరియాక్, గ్రీకు మరియు లాటిన్ మరియు అప్పుడప్పుడు
సంస్కృతంతో మారుమ్రోగేవి. అరిస్టాటిల్ తర్కం, విశ్వోద్భవo, విశ్వం, వైద్యం మరియు గణిత శాస్త్రాలు అందరు పండితులకు
అందుబాటులో వచ్చినది. బైతుల్ హిక్మః లో రూపొందించబడిన
జ్ఞానం ఆ తరువాత కార్డోబ మరియు టోలెడో ప్రాంతాలలో
లాటిన్ లోకి తర్జుమా చేయబడేది. ఈ విధంగా పురాతన విజ్ఞానం సoరక్షించ బడినది.
ఫిబ్రవరి 10, 1258 న మంగోల్ నియంత హులగు ఖాన్ బాగ్దాద్ పై దండయాత్ర
చేసి బాగ్దాద్ ను దోపిడీ చేసినాడు. బాగ్దాద్ పై దండయాత్ర మొత్తం ముస్లిం ప్రపంచం
పై దండయాత్ర అను ఖలీఫా యొక్క సందేశం ను విస్మరిస్తూ, బాగ్దాద్ నగరాన్ని
కొల్లగొట్టాడు. దేవుడు బహుమతి మరియు అనువాద రాజధాని అయిన బాగ్దాద్ సంపద కొల్లగోత్తబడినది
మరియు బైతుల్ హిక్మః సర్వనాశనం చేయబడింది. వేలకొద్ది విద్యార్థులు, వైద్యులు మరియు పరిశోధకులు ప్రాణాలు
కోల్పోయారు. రాజరికానికి గుర్తుగా మిగిలిన ఖలీఫా ఒక తివాచి లో చుట్టి గుర్రలచే
త్రోక్కిoచబడి హత్య చేయబడినాడు.
మంగోలు సైన్యం రాజభవనాలు, గృహాలు మరియు 36 గ్రంధాలయాలను దోచుకోవడం జరిగింది. బైతుల్ హిక్మః దగ్ధమైంది. టిగ్రిస్
నది తాళపత్ర గ్రంధాల నల్లని సిరా తో మరియు పండితుల, అనువాదకుల రక్తం తో నిండి పోయినది. లైబ్రరీతో పాటు ఖగోళ పరిశోధనా
కేంద్రాలు మరియు ఇతర ప్రయోగాత్మక కేంద్రాలు అనువాద గ్రంధాలు అన్ని నాశనం అయినవి.
హులగు ఖాన్ వారసులు ఆ
తరువాత ఇస్లాం స్వీకరించి విజ్ఞానం, కళల విలువ
గ్రహించినారు.
No comments:
Post a Comment