ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా అంతర్జాతీయ శాంతి సదస్సు ప్రారంభమైంది.
ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య దశాబ్దాల నుంచి ఆపరిష్కృతంగా మిగిలిపోయిన వివాదాన్ని
పరిష్కరించాలనే ఎజెండాతో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సదస్సుకు 70 దేశాలకు
చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. యురోపియన్ యూనియన్, ఐక్యరాజ్య
సమితి, అరబ్ లీగ్, రెండు
ఆఫ్రికన్, ఇస్లామిక్
సంస్థలు కూడా ఈ సమావేశం లో పాల్గొన్నాయి.
కాగా ఈ సదస్సుతో తమకెలాంటి ప్రయోజనం లేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ
పేర్కొన్నారు. ఇతర దేశాల జోక్యంతో ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదాన్ని పరిష్క
రించలేమని ఆయన పునరుద్ఘాటించారు. తమపై ఒత్తిళ్లు పెంచేందుకే ఫ్రాన్స్ ఈ సదస్సును
నిర్వహిస్తోందని విమర్శించారు. ఇస్రాయెలీ జెరూసలెం పోస్ట్ ప్రకారం జనవరి 15, 2017 న 70 దేశాల ప్రతినిధులు హాజరు అయిన పారిస్ శాంతి సదస్సు కేవలం మరొక మధ్య
ప్రాచ్యం శాంతి సమావేశం కాదు, అది మరొక శాంతి సమావేశం అయి ఉంటే, ఇస్రాయిల్ ప్రభుత్వం మరియు పాలస్తీనా అథారిటీ (PA) నుండి ప్రతినిధులు కూడా హాజరు అయి ఉండేవారు. ఈ సదస్సుకు
హాజరయ్యేందుకు పాలస్తీనా మాత్రం సుముఖత వ్యక్తం చేసింది.
నిజానికి, ఇజ్రాయెల్ మరియు దాని అరబ్ పొరుగు దేశాలు - పాలస్తీనా తో సహా
మధ్య శాంతి చర్చలు అక్టోబర్ 1991 మాడ్రిడ్ కాన్ఫరెన్స్ తో
అధికారికoగా ప్రారంభ౦ అయి ఉంటే - జనవరి 2017 పారిస్ చర్చలు వాటి ముగింపు గా ఉన్నాయి.
పాలస్తీనా సమస్యపై మాడ్రిడ్
చర్చలు ప్రారంభo గాక మునుపే ఇజ్రాయెల్ అనేక
రాజకీయ ఉచ్చులు మరియు అడ్డంకులను సృష్టించినది. ఉదాహరణకు హైదర్ అబ్దుల్
షఫీ నేతృత్వంలో పాలస్తీనా జట్టు తో (ఇజ్రాయెల్ దృష్టిలో పాలస్తీనా
ఉనికిలో లేదు) చర్చలు నిరాకరించినది, మరియు దాని సంభాషణ కర్త సేబ్ ఎరేకాట్ పాలస్తీనా
తలపాగా (కుఫియః) దరించినందుకు నిరసన తెల్పింది.
పాలస్తీనా సమస్య పై ప్రారంభ సమావేశం (మాడ్రిడ్ చర్చలు) జరిగి 25సంవత్సరాలు
నిండినాయి. అప్పటి పాలస్తీనా ప్రతినిధి
బృందం సభ్యులు పలువురు దివంగతులు అయినారు కొందరు శాంతి గురించి మాట్లాడుతూ ముసలివారు అయినారు. యువ ఎరేకాట్ PA యొక్క ప్రధాన చీఫ్ సంభాషణ కర్త అయినాడు. కాని సాధించినది ఏమిలేదు.
ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్
మరియు తూర్పు జెరూసలేం లో దాని అక్రమ నిర్మాణాలు రెట్టింపు చేసి నప్పుడు, యూదు
సెటిలమెంట్స్ 6,00,000 కన్నా
అధికమైనప్పుడు (1993 లో వాటి సంఖ్య 2,50,000) 1967 యుద్ధం తరువాత
పాలస్తీనా భూమి కోల్పోయినప్పుడు మరియు గాజా ప్రాంతం 10 సoవత్సరాలు నిర్భంధం లో ఉన్నప్పుడు, ఇంకా మాట్లడేoదుకు ఏమి
మిగిలింది?
అయినా అమెరికన్లు
శాంతి చర్చలకు వత్తిడి చేశారు. వారికి శాంతి ప్రక్రియ అవసరమైనది. అంతర్జాతీయ
రాజకీయాలలో అమెరికన్ కీర్తి మరియు నాయకత్వ గౌరవం దాని మీద ఆధారపడినది.
ప్రెసిడెంట్ ఒబామా,జార్జి
డబ్ల్యూ బుష్, క్లింటన్ “రెండు దేశాల” సిద్ధాంతం ద్వార సమస్యకు పరిష్కారం పొందుటకు ప్రయత్నించారు. అయితే “రెండు
దేశాల”(two state theory) భావన ఒక అసాధ్యమైన తపనగా మారింది.
మాజీ అధ్యక్షుడు బరాక్
ఒబామా, జార్జ్ W. బుష్ యొక్క పాలనా
సమయంలో ప్రారంభం అయిన చర్చలకు ఊతం ఇచ్చారు. బుష్ దూత సెనేటర్ జార్జ్ మిషెల్ 2010 మరియు 2011 లో చూపిన చర్చ నైపుణ్యాలు ఇజ్రాయెల్ ను ఆక్రమ యూదు నివాసాల విస్తరణ పై దాని స్థానం
నుండి తరలించడానికి వీలు కాలేదు మరియు 2013 మరియు 2014 మధ్య ఒబామా విదేశాంగ కార్యదర్శి, జాన్ కెర్రీ చర్చలు పునరుజ్జీవింప చేయడానికి ప్రయత్నించి విఫలుడు అయినాడు.
ప్రెసిడెంట్ ఒబామా ఒక సమయంలో
తన ప్రయత్నాలు విఫలమైనవని గ్రహించినాడు. ఒక సమయo లో నెతాన్యహు, అధ్యక్షుడు ఒబామా కంటే అమెరికా కాంగ్రెస్ మీద ఎక్కువ ప్రభావం కలిగినట్లు కన్పించింది. ఇది అతిశయోక్తి
కాదు. నెతాన్యహు ఇరాన్ అణు ఒప్పందం మీద ఒబామా తో విభేదించినప్పుడు అతను అధ్యక్షుడుని
వ్యతిరేకించాడు మరియు మార్చి 2015లో, ఉమ్మడి కాంగ్రెస్
ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఒబామాను ఇరాన్ ఒప్పందం విషయంలో వ్యతిరేకించినాడు.
అమెరికన్ ప్రజల ప్రతినిధులు అతని ప్రసంగమునకు నిలబడి వందనమును ఇచ్చారు.
డిసెంబరు ఆఖర్లో కెర్రీ యొక్క చివరి ఉపన్యాసం చర్చల
వైఫల్యం సూచిస్తున్నది ఇందుకు కెర్రీ మరియు ఒబామా తమకు తామే నిందకు బాద్యులు. ఇజ్రాయెల్ పై వత్తిడి తెచ్చే రాజకీయ పలుకుబడి కలిగి
ఉండి కుడా వారు మిన్నకున్నారు.
ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ దిగ్గజం, డోనాల్డ్ ట్రంప్, యునైటెడ్
స్టేట్స్ అధ్యక్షుడు అయినాడు. అతని అజెండా ప్రస్తుత ఇస్రాయిల్ ప్రభుత్వ ఎజెండా ను పోలిఉంది. ప్రస్తుతం చర్చల
యుగం ముగిసినట్లు ఉంది. శాంతి ప్రక్రియ వెనుక బడినది. పాలస్తీనియన్లు అమెరికా
ప్రబుత్వ యంత్రాంగ ప్రయత్నాలకు పలు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నారు.
నిజానికి జార్జ్ బుష్, బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్ మరియు ఒబామా ప్రబుత్వ ప్రయత్నాల తో ఇజ్రాయెల్
రాజీకి సిద్ధంగా ఉంది మరియు పాలస్తీనీయుల పై వత్తిడి తెచ్చి అమెరికా ఒక తటస్థ
పార్టీ గా నిజాయితీ బ్రోకర్ గా వ్యవహరించవలసి ఉంది అన్న అభిప్రాయం కలిగినది.
ఇజ్రాయిల్ ఆక్రమిత
ప్రాంతాల్లోని వారి కాలనీల కు హాని లేనంత కాలం శాంతి ప్రయత్నాలను పట్టించుకోవడం లేదు, పాలస్తీనా నాయకత్వం కూడా నిధులు మరియు రాజకీయ గుర్తింపు కోరుతున్నది మరియు యునైటెడ్ నేషన్స్ దూరము నుండి తన పాత్రను
పోషిస్తున్నది. కానీ, ఇప్పుడు, ఇజ్రాయెల్ ఆ శాంతి
ప్రయత్నాలకు సహకరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అమెరికన్ 'బ్రోకర్', స్వయంగా శాంతి
చర్చలలో ఆసక్తి కోల్పోయారు. ప్రెసిడెంట్ ట్రంప్ కి శక్తివంతమైన ఇజ్రాయెల్ తో పోరాటానికి ఆసక్తి లేదు.
ట్రంప్
తన అధ్యక్ష ఎన్నికల ప్రచారం లో పాలస్తీనియన్లు మరియు ఇజ్రాయిల్నుండి సమాన దూరం
పాటించారు. కానితన ఎన్నికల ప్రచారం లో అమెరికా రాయబార కార్యాలయం ను టెల్ అవీవ్ నుండి
యెరూషలేమునకు మార్చుటకు అంగీకరిస్తూ వాగ్ధనం చేసారు. ఇజ్రాయిల్ ఆక్రమణ నిర్మాణాలను
మాత్రం ఖండించారు. రాజధాని మార్పును పాలస్తీనా వర్గాలు వ్యతిరేకిస్తున్నవి, అది
అంతిమంగా విప్లవానికి(ఫతా) దారితీస్తుందని అంటున్నవి.
యూఎస్ దౌత్య కార్యాలయాన్ని జెరూసలేం నగరానికి తరలించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్‌మార్క్ ఐరౌల్త్ తెలిపారు. ఇలాంటి నిర్ణయాలతో ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకునే ప్రమాదముందని చెప్పారు .
యూఎస్ దౌత్య కార్యాలయాన్ని జెరూసలేం నగరానికి తరలించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్‌మార్క్ ఐరౌల్త్ తెలిపారు. ఇలాంటి నిర్ణయాలతో ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకునే ప్రమాదముందని చెప్పారు .
ఇజ్రాయిల్, పాలస్తీనా రెండు దేశాలు శాంతి, సామరస్యతలతో, భద్రతతో పక్కపక్కనే జీవించడమే శాశ్వత శాంతి సాధనకు గల ఏకైక మార్గమని పారిస్ శాంతి సమావేశం విడుదల చేసిన సంయుక్త డిక్లరేషన్ పేర్కొంది. ఈ పరిష్కారం దిశగా సంబంధిత పక్షాలు తమ నిబద్ధతను ప్రదర్శించాలని కోరింది.
పాలస్తీనా-ఇజ్రాయిల్
శాంతి చర్చల పునరుత్తేజం కావడానికి పారిస్ సమావేశం చాలా దోహద పడిందని పాలస్తీనా
విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వారంలో జరిగిన ఈ సమావేశం ఫలితాలు ఊహించనివేమీ
కావని, అయితే, పాలస్తీనా ప్రయోజనాలను పునరుద్ధరించడమే కాకుండా, అంతర్జాతీయ ఎజెండాల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళిందని అన్నారు. పాలస్తీనా నాయకత్వం
అదికారికంగా ఈ డిక్లరేషన్‌ను స్వాగతించింది. కాగా ఇజ్రాయిల్ మాత్రం
తిరస్కరించింది
అమెరికా ఇక తన మిత్రుడు
కాదని తెలుసుకొన్న 'పాలస్తీనా
మితవాదులు' ఇప్పుడు
ప్రత్యామ్నాయాలు కోరుతున్నారు. ట్రంప్
పగ్గాలు పట్టిన రోజున, పాలస్తీనా వర్గాల
వారు మాస్కో లో సమావేశ మైనారు.
పాలస్తీన్ లిబరేషన్
ఆర్గనైజేషన్ (PLO) లోకి హమాస్ మరియు
ఇస్లామిక్ జిహాద్ రెండు ప్రవేశ ఒప్పందం కు కొద్దిగా మీడియా కవరేజ్ లభించింది, కానీ ఇది మిడిల్ ఈస్ట్ లో మారుతున్న రాజకీయ రియాలిటీ ని
చెప్పడం జరిగింది.
కానీ పారిస్ కాన్ఫరెన్స్ ఏమి
సాధించదలుచుకోన్నది? క్లిష్టమైన మరియు విభిన్నమైన రాజకీయ భూభాగంలో ఫ్రెంచ్ -
యూరోపియన్-అమెరికన్ ప్రయత్నాలు ఏమి సాధించ దలచు కొన్నవి? అది కేవలం 'మరొక మధ్య ప్రాచ్యం శాంతి సమావేశం' కాదు, మధ్యప్రాచ్యంలో ముగిసిన అమెరికన్
శకం ను వివరిస్తున్నది.