14 వ శతాబ్దపు ముస్లిం యాత్రికుడు ఇబ్న్ బటుట ఇస్లామిక్ ప్రపంచం లో సాగించిన ప్రయాణపు గాధలు ప్రపంచ
వ్యాప్తంగా ప్రజలను విశేషంగా ఆకర్షించినవి.
మధ్యయుగ సమాజాన్ని అర్ధం చేసుకోవటం లో
అతని పర్యటనలు తోడ్పడినవి.మధ్యయుగ సమాజం లో కనిపించే ప్రపంచ ప్రఖ్యాత ఆక్రమణదారులు,
అన్వేషకులు, వ్యాపారులు, సాహసికులు మరియు ప్రతిభ గల వివిధ దేశాల స్త్రీ-పురుషులు, మత నాయకులు, మరియు చక్రవర్తులు అతని పర్యటన గాధలలో దర్సనమిస్తారు.
ఇబ్న్ బటుట మధ్యయుగ యాత్రికులలో ఘనుడు. అతని పర్యటన గాథలు
మార్కో పోలోతో పోల్చినప్పుడు చాలా ఘనమైనవి. రాజకీయ మరియు సాంస్కృతిక అన్వేషణల మద్య
అసాధారణ జీవితాన్ని అతను గడిపినాడు. అతను
గొప్ప సాహసి. అతని పర్యటనలు ఇస్లామిక్ ప్రపంచం లోని రకరకాల ఆచారాలను అలవాటులను వివరిస్తాయి.
అతని పర్యటనలను గురించిన సమాచారం మద్య యుగ చరిత్రను, నాటి సమాజంను విశ్లేషించడంలో సహాయపడతాయి.
ఇబ్న్ బటుట మూలాలు:
ఇబ్న్ బటుట తాన్గిర్స్ మొరాకో ప్రాంతం లోని బెర్బెర్ సున్నీ
ముస్లిం పండితుల కుటుంబానికి చెందినవాడు. ఒక పవిత్ర ముస్లింగా తన బాధ్యతను నెరవేర్చటానికి
అతను 21 ఏళ్ళ వయసులో అనగా 1325 లో మక్కా హజ్ యాత్ర కొరకు ఇంటిని విడిచినాడు. అనంతరం మరొక 29 ఏళ్ళ పాటు పర్యటనలు కొనసాగించినాడు. నాటి
ఇస్లామిక్ ప్రపంచం “దార్ అల్-ఇస్లాం” (వెస్ట్
ఆఫ్రికా నుంచి మాఘ్రిబ్ (ఉత్తర ఆఫ్రికా మధ్యధరా సముద్ర ప్రాంతం) మరియు దక్షిణ
ఆఫ్రికా లోని హార్న్, సెంట్రల్, దక్షిణ, ఆగ్నేయ ఆసియా మరియు మధ్యప్రాచ్య ఆసియా నుండి చైనా వరకు
విస్తరించిన1,20,000 కి.మీ ఇస్లామిక్
పాలకుల క్రింద ఉన్న విశాల భూభాగం) లోని 44 దేశాలలో విస్తృతంగా పర్యటించినాడు.
ఇబ్న్ బటుట యొక్క పర్యటనలు మనోహరమైన ఘనీభవించిన పర్వత దారుల మద్య, ఎడారులు,
కల్లోల నదులు మరియు దట్టమైన అడవులు,
బంజరు భూములు, ప్రకృతి దృశ్యాల మద్య కొనసాగినవి. పురాతన జానపద గాధలలోని బందిపోట్లు,
క్రూరమైన అడవి జంతువులు, చక్రవర్తులు ఇతని పర్యటన లలో
దర్సనమిస్తారు. ఇతను తన పర్యటనలలో(travels) ప్రముఖ ముస్లిం మతాచార్యుల వద్ద
ధార్మిక, లౌకిక విద్య అబ్యాసించినాడు. అనేక సార్లు వివాహం చేసుకున్నాడు,
అనేకమంది భార్యలను కలిగి ఉన్నాడు మరియు అతనికి అనేకమంది
పిల్లలు జన్మించారు. అతని అనేక సాహసాలను గురించిన వర్ణన రిహ్లా లేదా పర్యటన లో వివరంగా ఉంది.
ఇబ్న్ బటుట గురించి ఉత్తమoగా తెలిసిన విద్వాంసుల్లో ఒకరు,
టిమ్ మాకింతోష్-స్మిత్ తన BBC పర్యాటక
డాక్యుమెంటరీ “రిహ్ల ( Rihla)” లో ఇబ్న్ బటుట వ్రాసిన
పర్యటక విశేషాలు గురించి
వివరిస్తూ అవి ఒక “పురాణ'
యాత్రా మరియు భౌగోళిక, మానవ
శాస్త్ర విశేషాలు” అని పేర్కొన్నాడు.
విద్యావంతులైన పురుషులు వ్రాసిన ప్రయాణ సాహిత్యంలో “రిహ్లా” ఒక భాగమని అమెరికన్
రచయిత డగ్లస్ బుల్లిస్ వివరించారు. ఇబ్న్ బటుట యొక్క కథనం మద్య యుగ సమాజానికి సంబంధించిన వివరాలను,
పాలిటీ, భూగోళ శాస్త్రం, ఆచారాలు మరియు ప్రముఖ వ్యక్తుల వ్యక్తిత్వాలను, పవిత్ర ప్రదేశాల గురించి వివరిస్తుంది. రిహ్లా
దాని క్రోనాలజీ, యాత్ర విశేషాలు మరియు
కధనాల గురించి విమర్శలను ఎదుర్కొంది.
అయినప్పటికీ ఇబ్న్ బట్టుట మౌఖిక చరిత్రకు గొప్ప మూలం గా మిగిలాడు. ఆంగ్ల అనువాదకుడు H.
A. R. గిబ్ రిహ్ల ను '.
మొట్టమొదటిది ఒక మానవ డైరీ' అని పిలుస్తాడు.
డిల్లీ మరియు దాని సుల్తాన్ పై అతని అభిప్రాయలు:
తన పర్యటన లో భాగం
గా ఇబ్న్ బటుటా డిల్లి సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానానికి 1334 లో చేరినాడు. ఆక్కడ 8 సంవత్సరాలు లేదా పర్యాటక జీవితం లోని
పావు వంతు గడిపినాడు.
ఢిల్లీ గురించి అతను ఇలా చెప్పాడు:
భారతదేశం యొక్క మహానగరాలలో దిల్లీ నగరం ఒకటి,
అది బహు విస్తారమైన మరియు అద్భుతమైన
నగరం. అది చుట్టూ గోడతో నిండి ఉంది, ఇది మొత్తం ముస్లిం ప్రాచ్యం లో అతిపెద్ద నగరం.
కుతుబ్ మినార్ గురించి అతను ఇలా చెప్పాడు:
ప్రాంగణం(court) ఉత్తర భాగం లో మినార్ ఉంది. ఇది ఎర్ర రాతితో నిర్మించబడింది, మిగిలిన భవనం వలె
కాకుండా, శిల్పాలతో అలంకరించబడి గొప్ప ఎత్తు కలిగి ఉంది. పైభాగంలో బంతిని తెల్లని
పాలరాయితో మరియు దాని 'ఆపిల్స్' (ఒక మినార్ను ఆవహించిన చిన్న బంతులు) స్వచ్ఛమైన బంగారంతో ఉన్నాయి.నడక దారి ఏనుగులు వెళ్ళగల విశాలం గా ఉంది. నిర్మించినప్పుడు ఏనుగు
రాళ్ళదారి గుండా పైకి ఎక్కేవి.
మెహ్రౌలి వద్ద ఐరన్ పిల్లర్:
మసీదు మధ్యలో ఒక స్థంభం (పిల్లర్) కలదు మరియు
పిల్లర్ నిర్మించిన లోహం గురించి ఎవ్వరికి తెలియదు, హాఫ్ట్ జష్ అనగా 'ఏడు లోహాల” తో నిర్మించబడింది అంటారు. ఈ స్థంభం (పిల్లర్) యొక్క నిలువు భాగం లో వేలు వెడల్పు భాగం మెరుగుపరచబడింది, మరియు అది ఒక అద్భుతమైన కాంతిని ఇస్తుంది. పిల్లర్ ముప్పై మూరలు పొడువు ఉంది మరియు దాని చుట్టూ ఒక తలపాగాని చుట్టగా అది ఎనిమిది
మూరల వెడల్పుగా ఉండేది.
అనేక మంది వ్యాపారులు, పండితులు,
సైనికులు, కళాకారులు, కళాకారులు మరియు పర్యాటకులు ఢిల్లీ నగరానికి వచ్చారు. డిల్లి
సుల్తాన్ విదేశీ పండితులను అనేక బహుమతులతో స్వాగతించారు మరియు తన ఆస్థానం లో సేవలో
ఉండమని వారిని కోరినాడు. బటుట ఒక మాలికి
న్యాయాధిపతి యొక్క స్థానం పొంది, ఎక్కువ జీతం, బహుమానం గా అనేక గ్రామాల నుండి వచ్చే
ఆదాయాలు,
ట్రెజరీ నుండి వచ్చే బహుమతులు మరియు నగదు పొందేవాడు. డిల్లి సుల్తాన్ ఒక హింసాత్మక, అనూమాన పాలకుడు, అతను విదేశి పండితులు, న్యాయనిర్ణేతలు మరియు పరిపాలకులను నియమించుకోవడం ద్వారా తన ప్రభుత్వo సుస్థిరంగా ఉండేటట్లు చూస్తాడు.
డిల్లి సుల్తాన్ బహుమతులు ఇవ్వడం లోను మరియు రక్తం పారిoచడం
లోను ఆసక్తి కలవాడు. డిల్లి సుల్తాన్ ఒక హింసాత్మక, అనూమాన పాలకుడు. అతని ద్వారం ఎల్లప్పుడూ అతని
ఔదార్యం మరియు క్రూరత్వంతో నిండి ఉండేది. అతని హింసాకాండ గురించి ప్రజలలో కథలు ఉన్నాయి మరియు అతను ఎల్లప్పుడూ
సామాన్య ప్రజల పట్ల సమానత్వం మరియు న్యాయం చూపించడానికి సంసిద్దం గా ఉండేవాడు.
డిల్లి సుల్తాన్ యొక్క అసంతృప్తి కి గురిఅయిన
ఒక సూఫీ షేక్ తో ఉన్న అనుబంధం కారణంగా ఇబ్న్
బటుట సుల్తాన్ ఆగ్రహానికి గురి అయినాడు. సూఫీ షేక్ క్రురంగా హింసించబడినాడు మరియు చివరికి అతనికి శిరఛ్చేదం జరిగినది. సుల్తాన్
ను క్షమాబిక్ష కోరటం కోసం ఇబ్న్ బటుట తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి చివరకు సుల్తాన్
క్షమాభిక్ష పొందినాడు. క్షమా బిక్ష
పొందినప్పటికీ ఈ అనుభవము ఇబ్న్ బటుటా ను పూర్తిగా క్రుంగ దిసింది. అత్యంత విలాస జీవితాన్ని త్యజించి కమలద్దిన్
అబ్దుల్లా అల్-ఘారీ అని పిలవబడే మరొక సుఫీ సన్యాసి సాంగత్యం లో ఐదు నెలలు
గడిపినాడు.
వెయ్యి మంది సైనికులు, బంగారు మరియు
వెండి పాత్రలు, కత్తులు, స్క్రాబ్బార్డ్లు, టోపీలు, గుర్రాలు, మగ బానిసలు, నృత్యం చేసే అమ్మాయిలు మరియు నపుంసకులతో తన రాజ ప్రతినిధిగా చైనాకు వెళ్లవలసినదిగా
బటుటాను చక్రవర్తి పిలుపునిచ్చారు. కానీ బతుటూ దౌత్య సమూహం పై ఢిల్లీ వెలుపల తిరుగుబాటుదారులు దాడి చేశారు. జరిగిన
దాడులలో అతను తన బృందం నుండి వేరుచేయబడ్డాడు మరియు చాలా కష్టాలను ఎదుర్కొన్న
తర్వాత ఒక వారం తర్వాత తన సమూహం తో చేరినాడు.
దౌత్య సమూహం కాంబే చేరుకోని అక్కడ నుండి కాలికట్ చేరుకోOది. ఇక్కడ వారు
రెండు చైనా వెళ్ళేటానికి రెండు ఓడలు
మరియు చిన్న కకంను పొందారు. కానీ ఇబ్న్ బటుట
దురదృష్టవశాత్తు ఒక భయంకర తుఫాను లో చిక్కుకొని తన విలువైన సరుకు, పరివారాన్ని, జంతువులను నష్ట పోయాడు. మిగిలిన చిన్న ఓడను సముద్రపు దొంగలు దోచుకొన్నారు. ఉత్త చేతులతో ఢిల్లీకి తిరిగి వెళ్ళటానికి, సుల్తాన్ కు వివరణ ఇవ్వడానికి ఇబ్న్ బటుట కు ధైర్యం చాలలేదు. ఇబ్న్ బటుట యొక్క తన
ప్రయాణం కొనసాగించినాడు మాల్దీవ్, శ్రీలంక, సుమత్రా మీదగా చివరకు చైనా చేరినాడు.
ఒక సాటిలేని కథకుడు, ఉత్తమ పర్యాటకుడు.
షేక్ అబూ అబ్దుల్లా మహ్మద్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్
మొహమ్మద్ ఇబ్న్ ఇబ్రహీం అల్-లాతతి అల్-తన్జీ ఇబ్న్ బట్టుట (అది అతని పూర్తి పేరు)
కేవలం ప్రస్సిద్ద యాత్రికుడు కాదు, అతను సందర్శించిన భూముల చరిత్రకు గొప్ప మూలం. వివిధ దేశాల ప్రజలు మరియు స్థలాల
యొక్క అతని వర్ణనలు అతని పర్యటనలను
వివరిస్తాయి. అతను తన కాలం నాటి ఉత్తమ
కధకుడు, పర్యాటక చక్రవర్తి.
No comments:
Post a Comment