5 July 2017

తల్లిపాలపై ఇస్లామిక్ అభిప్రాయాలు.





ఒక చిన్న పిల్లవాడి ఆకలి తీర్చడానికి సహజ మార్గంగా తల్లిపాలను ఇస్లాం ప్రోత్సహిస్తుంది.ఇస్లాం ప్రకారం  తల్లిదండ్రులు మరియు పిల్లలు ఇద్దరూ హక్కులను  మరియు బాధ్యతలను కలిగి ఉన్నారు. ఇస్లాం లో తల్లి నుండి తల్లిపాలను పొందటం  ఒక బిడ్డ యొక్క హక్కుగా పరిగణిస్తారు, మరియు దానిని తల్లి నెరవేర్చవలసిన  అత్యంత ముఖ్యమైన కార్యంగా సిఫార్సు చేయబడింది.

తల్లిపాల పై  దివ్య ఖుర్ఆన్ వివరణ:

దివ్య  ఖుర్ఆన్ లో తల్లిపాలు అత్యంత  స్పష్టంగా ప్రోత్సహించబడినవి. “తమ సంతానం యొక్క పాలు పట్టే గడువు పూర్తి కావాలని తండ్రులు కోరిన పక్షం లో తల్లులు తమ పిల్లలకు పూర్తిగా  రెండు సంవత్సరములు పాలు పట్టాలి. అప్పుడు ఆమెకు పిల్లల తండ్రి తగురీతిగా భోజన వస్త్రాలను ఇచ్చి పోషించ వలసి ఉంటుంది.  కాని శక్తీ కి మించిన భారం ఎవరి మీద మోప కూడదు. బిడ్డకు తండ్రి కనుక తండ్రిని ఇరకాటం లో పెట్టడం కూడా సమంజసం కాదు- పాలిచ్చే తల్లిని పోషించే బాద్యత తండ్రి పై ఉన్న విధంగానే తండ్రి వారసులపై పై కూడా ఉంది- కాని ఇరు పక్షాల వారు సంప్రదించుకొని పరస్పర అంగీకారం తో  బిద్దచే పాలు విడిపిస్తే అందులో దోషం లేదు. ఇంకా మీరు మీ మీ సంతానానికి వేరే స్త్రీ ద్వారా పాలు ఇప్పించే ఏర్పాటు చెయ్యదలిస్తే అది అక్షేపణీయం కాదు. కాని మీరుఅమెకు ఇవ్వవలసిన దానిని న్యాయ సమ్మతం గా చెల్లించాలి. అల్లాహ్ కు బయపదండి. మీరు చేస్తున్నదంతా అల్లాహ్ ద్రుష్టి లో ఉంది అనే విష్యం తెలుసుకొండి”.- దివ్య ఖురాన్  (2: 233).

 అలాగే వారి తల్లిదండ్రుల పట్ల  దయతో వ్యవహరించడానికి ప్రజలను గుర్తుచేస్తూ, దివ్య ఖురాన్ ఇంకా ఇలా చెబుతోంది: "అతని తల్లి  బలహీనత పై బలహీనతను  సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచిపెట్టడానికి రెండు సంవత్సరాలు పట్టింది. " (31:14).  
అల్లాహ్ దివ్య ఖురాన్ లో ఇలా అన్నాడు: "అతని తల్లి అతనిని ఎంతో శ్రమతో తన గర్భం లో పెట్టుకొని మోసింది. ఎంతో శ్రమతో అతనిని కన్నది. అతనిని గర్భం లో పెట్టుకొని మోసేందుకు, అతని చే పాలు మన్పించేదుకు ముప్పై మాసాలు పట్టింది. " (46:15).

అందువల్ల ఇస్లాం  తల్లిపాలను సిఫార్సు చేస్తుంది, కానీ వివిధ కారణాల వలన తల్లిదండ్రులు రెండు సంవత్సరాల కాలం  పూర్తి చేయలేకపోవచ్చు. తల్లిపాలను గురించి తల్లిదండ్రులు ఇద్దరు  పరస్పర మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దివ్య ఖుర్ఆన్ ఇంకా ఇలా చెబుతోంది: "ఇరు పక్షాల వారు సంప్రదించుకొని పరస్పర అంగీకారం తో  బిద్దచే పాలు విడిపిస్తే అందులో దోషం లేదు. " (2: 233).అదే ఆయత్ ఇంకా ఇలా చెబుతుంది "మీరు మీ సంతానానికి వేరే స్త్రీ ద్వారా పాలు ఇప్పించే ఏర్పాటు చెయ్యదలిస్తే అది అక్షేపణీయం కాదు. కాని మీరుఅమెకు ఇవ్వవలసిన దానిని న్యాయ సమ్మతం గా చెల్లించాలి.  (2: 233).

పాలు విడుచుట:

పైన ఉదహరించబడిన దివ్య ఖురాన్ ఆయతుల ప్రకారం పిల్లవాడు రెండు సంవత్సరాల వయస్సు వరకు తల్లి పాలు పొందటాన్ని ఒక హక్కుగా పరిగణిస్తారు. ఇది ఒక  సాధారణ మార్గదర్శకం; తల్లిదండ్రులు  తమ పరస్పర అంగీకారంతో రెండుసంవత్సరాల కాలం ముందే లేదా ఆతరువాత  గాని పాలు విడిపించ వచ్చు. తల్లిపాల విడుపు సమయం ముందే విడాకులు తీసుకుంటే, భర్త పాలిచ్చెతన  మాజీ భార్యకు ప్రత్యేకమైన పోషణ వ్యయం చెల్లించాల్సి ఉంటుంది.

" ఇస్లాంలో "మిల్క్ సిబ్లింగ్స్ లేదా పాల సోదరులు "

కొన్ని సంస్కృతులలో మరియు లేదా విబ్బిన్న కాలాల్లో, శిశువులను పెంపుడు-తల్లి పాలిచ్చి పెంచడం  జరుగుతుంది.(వారిని కొన్నిసార్లు ""పాల తల్లి" లేదా పెంపుడు తల్లి   అని పిలుస్తారు). ప్రాచీన అరేబియాలో నగర కుటుంబాల వారు  తమ శిశువులను ఎడారిలో ఒక పెంపుడు తల్లి వద్దకు పంపింటం సాధారణంగా జరిగేది  కారణం  అక్కడ అది ఆరోగ్యకరమైన జీవన వాతావరణంగా పరిగణించబడేది. ప్రవక్త ముహమ్మద్ (స) వారు కుడా చిన్న తనం లో  తన తల్లి మరియు హాలిమా అనే పెంపుడు  తల్లిచే  పెంచబడినారు.

ఇస్లాం  పిల్లల యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి తల్లిపాల అవశ్యకతను గుర్తించినది  మరియు ఒక నర్సింగ్ స్త్రీ మరియు శిశువుకు మధ్య అభివృద్ధి చెందే ప్రత్యేక బంధాన్ని గుర్తించింది. ఇస్లామిక్ చట్టం క్రింద శిశువు కు పాలు ఇచ్చే స్త్రీ ప్రత్యేక హక్కులతో శిశువు కు "పాలు తల్లి" గా మారుతుంది. పాలు పొందే శిశువు పాల తల్లి యొక్క ఇతర పిల్లల పూర్తి తోబుట్టువుగా గుర్తింపు పొందుతాడు మరియు పాల తల్లి కి మహ్రుం అవుతాడు.  ముస్లిం దేశాలలో దత్తత తీసుకొన్న  తల్లులు కొన్నిసార్లు ఈ నర్సింగ్ అవసరాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు తద్వారా దత్తత తీసుకున్న బిడ్డ కుటుంబానికి మరింత సులువుగా విలీనం చేయబడుతుంది.

మోడేస్టి (సబ్యత) మరియు బ్రెస్ట్ ఫీడింగ్:

ముస్లిం మహిళలు  దుస్తులు ధరించడం లో సబ్యత పాటిస్తారు మరియు శిశువు కు  పాలు ఇచ్చేటప్పుడు  చాతిని దుస్తులు, దుప్పట్లు లేదా స్కార్వ్లు ధరించడం  ద్వారా మరుగు పరుస్తారు.అయితే వ్యక్తిగతం గా  లేదా ఇతర మహిళలతో కలసి ఉన్నప్పుడు  ముస్లిం మహిళలు సాధారణంగా వారి పిల్లలకు బహిరంగంగా పాలు పడతారు. ఇది కొంతమంది కి   వింత అనిపించవచ్చు. కాని పిల్లలకు  పాలు పట్టడం అనేది తల్లికి సహజ ధర్మంగా  భావించబడుతుంది మరియు  ఇది ఏవిధమైన అశ్లీలమైన, అక్రమమైన  లేదా లైంగిక చర్యగా పరిగణించబడదు.

 టఫ్సీర్  విద్వాంసుల  అభిప్రాయాలు:

 పైన తెలిపిన ఆయతులను  ప్రస్తావిస్తూ, ఇబ్నె కథీర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు: " పిల్లలకు రెండు సంవత్సరాల పాటు తల్లిపాలు ఇవ్వడం కోసం తల్లులకు ఇది మార్గదర్శకత్వం."
ప్రవక్త ముహమ్మద్ (స)ప్రకారం  "నా కొడుకు ఇబ్రాహీమ్ చనిపోయాడు. అతడు స్వర్గం  లో రెండు సంవత్సరాల పాటు పాలు ఇచ్చే ఇద్దరు  పాల  తల్లులను కలిగి ఉన్నాడు." (ముస్లిం) “అతను స్వర్గం లో ఒక పాల తల్లి ని కలిగి ఉన్నాడు.  [అల్ బుఖారీ]

  " చాలామంది ప్రవక్త(స) యొక్క సహచరులు మరియు ఇతరులు “పాలు త్రాగే శిశువుకు రెండు సంవత్సరాలు రానంత వరకు   పెళ్లిని నిషేదించడం  ఒక అలవాటు గా” భావిస్తారు. వారిలో అలీ, ఇబ్న్ అబ్బాస్, ఇబ్నె మాసూద్, జాబిర్, అబు హురైరా, ఇబ్నె ఉమర్, ఇబ్న్ సలామహ్, సయీద్ ఇబ్నె అల్-ముసాయిబ్ మరియు 'అటా' ముఖ్యులు.

ఇదే అభిప్రాయం ఎక్కువమంది పండితుల ఆమోదం పొందినది.  అల్-ఖుర్తుబి “రెండు సంవత్సరాల కాలం  సంతానం యొక్క పూర్తి పాలు తాగే  కాలం” అని అన్నారు.
ఇమామ్ మలాక్ అభిప్రాయo లో  వివాహాన్ని నిషేధించడం పిల్లల వయస్సు రెండు సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది.

ఇబ్నె అబ్బాస్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా పలికినారు, " శిశువు పాలు త్రాగే రెండు సంవత్సరాల కాలం ల్లో వివాహం నిషేదించడం జరుగుతుంది."
తన తఫ్సీర్ గ్రంథంలో, అర-రాజీ ఇలా అన్నారు, "రెండు సంవత్సరములు తల్లి పాలివాలన్ని పేర్కొనడం షరియత్ లో  లో ప్రత్యేకమైన నిర్ణయాన్ని సూచిస్తుంది. 
తన తఫ్సీర్లో అష్-షావకానీ మాట్లాడుతూ, "రెండు సంవత్సరాల పాటు శిశువుకు రొమ్ముపాలు ఇవ్వడం పరిపూర్ణత చర్యగా ఉంటుంది, కానీ అంతకు తక్కువ కాలం ఇవ్వడానికి కూడా అనుమతి ఉంది."

రెండు సంవత్సరాల కాలానికి కారణము
 షరియా ప్రకారం శిశువుకు రెండు సంవత్సరాల కాలం వరకు  తల్లి పాలు ఇవ్వడం  జరుగుతుoది.  కానీ, దిని వెనుక ఏమైనా శాస్త్రీయ వైద్య ఆధారం  ఉందా?

1994 లో ప్రచురించబడిన ప్రపంచ ప్రసిద్ధమైన పీడియాట్రిక్స్ మ్యాగజిన్ నెల్సన్ ఎసెన్షియల్స్ లో  తల్లి పాలిచ్చె కాలానికి   మరియు టైపు -1 మధుమేహంమద్య ఉన్న సంభందాన్ని వివరించినది.   ఇది నార్వే, స్వీడన్ మరియు డెన్మార్క్లలో పిల్లలపై నిర్వహించిన కొన్ని సంబంధిత అధ్యయనాలపై ఆధారపడింది.తల్లి పాలు పిల్లలలో ప్యాంక్రియాటిక్ బీటా కణాలను నాశనం చేసే పర్యావరణ కారకాలకు వ్యతిరేకంగా శిశువుని రక్షించుతాయి. కృత్రిమ ఆహారాలు మరియు ఆవు పాలు కూడా ఆ కణాలను విషపూరితం చేసే రసాయనిక అంశాలని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా తల్లి పాలిచ్చె కాలనికి  మధుమేహం కు మద్య దగ్గిర సంభంధం  ఉన్నట్లు గమనించారు. అందువల్ల, పరిశోధకులు తల్లిదండ్రులు  శిశువు కు ఎక్కవ కాలo తల్లిపాలను ఇవ్వడాన్ని సిఫార్సు చేస్తారు దీనితో శిశువు ఆరోగ్యనికి సంపూర్ణ రక్షణ ఉంటుంది.

ఇటీవల అభివృద్ధి చెందిన ఒక సిద్ధాంతం ప్రకారం  ఆవు పాలు  ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ కణాలు నాశనం చేయడాన్ని సూచిస్తుంది. ఈ సిద్ధాంతానికి మద్దతుగా, డయాబెటిస్ పిల్లల సీరం లో  ఆవు పాల ప్రోటీన్లకు అధిక ప్రతిచర్యలు ఉన్నట్లు కనుగొనబడింది.
1998 లో డయాబెటిస్ డైజెస్ట్ యొక్క జనవరి సంచికలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, ఆవు పాల ప్రోటీన్ కొందరు  పిల్లలలో  మధుమేహం కలిగించే ఒక స్వతంత్ర మూలకం అని పరిశోధకులు కనుగొన్నారు. అదే జర్నల్ దయబితిస్ కు ఆవు పాలు త్రాగే శిశువు మొదటి సంవత్సర కాలం  మద్య మధుమేహం అభివృద్ధిలో ఉన్న బలమైన సంబంధాన్ని వివరించినది.

1998 లో మరో అధ్యయనం "ఇమ్యునిటీ జర్నల్ "లో ప్రచురించబడింది. దాని ప్రకారం పరిశోధకులు, తల్లి  పాల కు  ప్రత్యామ్నాయంగా ఇచ్చే  పాల ఆహారం మరియు కొన్ని ఇతర కృత్రిమ శిశువు ఆహారాలు తొమ్మిది నెలల శిశువులకు మధుమేహం త్వరగా అభివృద్ధి చేయడానికి దారితీసిందని వెల్లడించారు. అందువల్ల వారు దీర్ఘకాలిక సహజమైన తల్లిపాలను సిఫార్సు చేస్తారు.

పై పరిశోదనలు శిశువు కు తల్లిపాల కొరకు  దివ్య ఖుర్ఆన్ నిర్దేశించిన రెండు పూర్తి సంవత్సరాల కాలం ను స్పష్టంగా రుజువు చేస్తుంది. దివ్య ఖురాన్ ఇంకా ఇలా చెబుతోంది: "అతని తల్లి  బలహీనత పై బలహీనతను  సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచిపెట్టడానికి రెండు సంవత్సరాలు పట్టింది. " (31:14).

అల్లాహ్ దివ్య ఖురాన్ లో ఇలా అన్నాడు: "అతని తల్లి అతనిని ఎంతో శ్రమతో తన గర్భం లో పెట్టుకొని మోసింది. ఎంతో శ్రమతో అతనిని కన్నది. అతనిని గర్భం లో పెట్టుకొని మోసేందుకు, అతని చే పాలు మన్పించేదుకు ముప్పై మాసాలు పట్టింది. " (46:15).

షరియా ప్రకారం  తల్లి పాలు ఇవ్వడానికి రెండు సంవత్సరాల నియమం సరళ తరం చేయబడింది. "రెండు సంవత్సరాల పాటు శిశువుకు రొమ్ముపాలు ఇవ్వడం పరిపూర్ణత చర్యగా ఉంటుంది, కానీ అంతకు తక్కువ కాలం ఇవ్వడానికి కూడా అనుమతి ఉంది."ఇరు పక్షాల వారు సంప్రదించుకొని పరస్పర అంగీకారం తో  బిడ్డచే పాలు విడిపిస్తే అందులో దోషం లేదు. -దివ్య ఖురాన్  (2: 233).

ఇబ్న్ కతేర్ ఇలా అంటాడు, "రెండు సంవత్సరాల లోపు తల్లి పాలు మాన్పించడం అనేదానికి తల్లితండ్రుల ఇద్దరి అంగీకారం ఆవసరం.  పిల్లలను పెంచడం  మరియు మార్గదర్శక పొందటం లో అల్లాహ్ యొక్క దయ పొంది అల్లాహ్  యొక్క నియమాలను పాటించడం తల్లిదండ్రులకు  మేలుతరం.”  

తల్లిపాలను ఇవ్వడం వలన బిడ్డకు మరియు  తల్లి కి  అనేక ప్రయోజనాలు కలవు.   తల్లి పాలు పసిపిల్లలకు ఉత్తమమైన పోషకాహారం అనే శాస్త్రీయ దృక్పధo కు  ఇస్లాం మద్దతు ఇస్తుంది, మరియు బిడ్డకు రెండు సంవత్సరాల వరకు తల్లి పాలు ఇవ్వవలనని అది సిఫార్సు చేస్తుంది


దివ్య ఖుర్ఆన్ లో  ఉదహరించబడిన విధంగా, తల్లి పాలు పొందటానికి పూర్తి రెండు సంవత్సరాలు కాలం  ఎందుకు పూర్తి చేయాలనేది ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం లో పదనాలుగు వందల సంవత్సరాల క్రితం  దివ్య  ఖుర్ఆన్ చేసిన అద్భుత సిఫారసులను ఆధునిక వైద్య శాస్త్రం ద్రువికరించినది. అల్లాహ్ ఇంకా  ఇలా ప్రకటిస్తున్నాడు: "మేము త్వరలోనే వారికి మా సూచలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలో చూపిస్తాము. వారిలోనూ చూపిస్తాము. చివరికి ఈ ఖురాన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశదమైపోతుంది. నీ ప్రభువు ప్రతి  దానికి సాక్షి అనే విషయం సరి పోదా? తేలుసుకో, అయన ప్రతి వస్తువును పరివేష్టించి ఉన్నాడు.- దివ్య ఖురాన్ 41:53.

No comments:

Post a Comment