"ముస్లింలు కానప్పటికీ, పురాతన
ఆచార్యుల నుండి తర్కం నేర్చుకోవాలి." ఇబ్న్ రష్ద్ (అవర్రోస్)
ప్రపంచ చరిత్రలో ఇస్లామిక్
స్వర్ణ యుగం లేదా ముస్లిం పునరుజ్జీవన యుగం అనేది అద్భుతమైన, ప్రసిద్దిచెందిన యుగం. ఈ యుగం లో ఇస్లామిక్/ముస్లిం
భూభాగాలు అత్యంత మేధావులైన
కొంతమంది ఆలోచనాపరులకు జన్మనిచ్చినవి. తొమ్మిదవ మరియు 13 వ
శతాబ్దాల మధ్య, బాగ్దాద్ (బైట్ అల్-హిక్మా), డమాస్కస్
(అల్-జాహిరియా), టింబక్టు (సాంకోరే), కార్డోబా
(రాయల్ మస్జిద్) మరియు కైరో (దార్ అల్-హిక్మా)లోని గ్రంథాలయాలు మొత్తం గ్రీక్ ప్రపంచంలో కంటే ఎక్కువ
లిఖిత ప్రతులు మరియు సాహిత్యం కలిగి ఉన్నవి.
చైనా నుంచి నేర్చుకొన్న కాగితం తయారి మరియు ప్రపంచ
యాత్రికులనుంచి గ్రహించిన అనువాద నైపుణ్యాలతో ఇస్లామిక్ పండితులు బహుముఖ విజ్ఞాన
శాస్త్రవేత్తలుగా, ప్రతిభా వంతులు గా మారారు. గోళాకార త్రికోణమితి, వ్యవసాయం, భౌతికశాస్త్రం, ఔషధం
మరియు విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేశారు, ఖగోళశాస్త్రజ్ఞులు ఖగోళ
పట్టికలను ఉపయోగించి నక్షత్రాల ఎత్తును కొలిచేందుకు ఆధునిక ఖగోళ వేధశాలను ఏర్పాటు
చేశారు.
చీకటి
యుగాలలో యూరోప్ క్షీణిస్తున్నప్పుడు మరియు
చర్చి మూఢ నమ్మకాలతో విజ్ఞాన శాస్త్రాన్ని
అవహేళన చేస్తున్నప్పుడు ఇస్లామిక్ పండితులు మానసిక ఆసుపత్రులను, సంచార వైద్యశాలలను ఏర్పాటు చేశారు. టోలెమిని
సరిదిద్దడం, భూమి యొక్క చుట్టుకొలతను నిర్ధారిoచారు. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసి, మశూచి
, చికెన్ ఫాక్స్ లేదా తట్టు నివారణకు టికాలు
వేయడం ప్రారంభించారు.
రోగులకు కైరోలోని కలావన్ వైద్యశాలలో సార్వత్రిక ఆరోగ్య
సంరక్షణ క్రింద సేవలు అందించబడేవి. అవిర్రోస్ మరియు అవిసెన్న గ్రీక్ తత్వ
శాస్త్రమును సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. ముస్లిం ప్రపంచం లో అక్షరాస్యత
అధికం గా ఉంది. సింద్ బాద్ మరియు అలీ-బాబా
ప్రపంచానికి అభిమాన వ్యక్తులుగా మారారు. డియోఫాంటస్, ఆర్యాభట్ట, ఆర్కిమెడెస్, బాదుయానా
సిద్దాంతాలు ప్రచురితం పొందినాయి. "అల్గోరిథం " ఉపయోగించిన ఆల్-ఖర్విజ్మి ఆల్జీబ్రా పితామహుడిగా పేరుగాంచాడు.
ఇస్లామిక్ స్వర్ణయుగం మహిళలకు
అత్యంత ప్రాధ్యాన్యత ఇచ్చింది. మూరిష్
స్పెయిన్లో అనేకమంది స్త్రీ విద్వాంసులు ఉన్నారు మరియు అవిర్రోస్ స్త్రీ సమానత్వం
గురించి బహిరంగ చర్చను లేవనేత్తినాడు. అవిర్రోస్
తన తహఫత్ అల్-తహాఫత్ (Incoherence of Incoherence) లో అరిస్టాటిల్ తత్వశాస్త్రం కు బలమైన సమర్ధకునిగా
నిలిచాడు మరియు అరబిక్ ప్రపంచo లో తత్వశాస్త్రం
మరియు వేదాంతశాస్త్రంను సమన్వయ పరిచాడు. నియోప్లాటోనిజం మరియు మాలిక్ ఇబ్నె అనస్ భావాల ద్వారా విశ్వం యొక్క అంతిమ అవగాహన కోసం కృషి
చేసాడు. అల్-ఘాజలి మరియు అవేర్రోస్ సమగ్రమైన మానవ హక్కుల కోసం పోరాడారు.
దురదృష్టవశాత్తు
క్రైస్తవులు స్పానిష్ మూర్స్ కు వ్యతిరేకంగా జరిపిన పోరాటాలు, హులగ్ ఖాన్ నాయకత్వం
లో మంగోలుల దండయాత్రలు ఇస్లామిక్ విజ్ఞాన భాండాగారాలను దహనం చేసినవి మరియు అరబ్ నాగరికత మరియు విజ్ఞానంను ద్వంసం
చేసినవి. ఈవిధంగా 13వ శతాబ్దం లో అరబ్/ముస్లిం నాగరికత,విజ్ఞాన వికాసమ క్షిణిoచి యూరప్ లో సాంస్కృతిక పునర్జీవన చాయలు
ప్రారంభమైనవి.
ఒకప్పుడు
విజ్ఞాన స్వర్ణ యుగంకు ప్రతీకలుగా నిలిచిన అరబ్ ప్రపంచం లోని ప్రభుత్వాలు నేడు తమ
జాతియాదాయం లో కేవలం 0.2% మాత్రమే విజ్ఞానం, పరిశోధన మరియు అభివ్రుద్ది రంగాలకు
కేటాయిస్తున్నాయి. మొత్తం ఇస్లామిక్ ప్రపంచం లో కేవలం 500
విశ్వవిద్యాలయాలు మాత్రమె ఉన్నాయి. ప్రపంచంలోని టాప్ 100 ర్యాంకింగ్ విశ్వవిద్యాలయాల్లో ఒక్కటి కూడా అరబ్
ప్రపంచం లో లేదు. ఉన్నత విద్య ప్రమాణాలు
క్షీణించినవి. 1901 నుండి, ఇద్దరు ముస్లింలు మాత్రమే సైన్స్ లో నోబెల్
బహుమతిని పొందారు. ఇస్లామిక్ దేశాల్లో పురుషుల ప్రస్తుత అక్షరాస్యత రేట్లు
ఆఫ్గనిస్తాన్లో 43 శాతం, పాకిస్తాన్లో 58 శాతం, ఈజిప్ట్లో 70 శాతం, మాలి, సెనెగల్
మరియు గినియా లో 30-40 శాతం వరకు ఉన్నాయి. మహిళా
అక్షరాస్యత వెనుకబడి ఉంది
ఈ
గణాంకాలు ఒక ముస్లిం హృదయాన్ని బద్దలు
చేస్తాయి. మధ్య ప్రాచ్యం, తూర్పుదక్షిణ ఆసియా మరియు ఆఫ్రికా లోని ముస్లిం ప్రపంచం అంతటా హింస, లింగ అసమానత ప్రబలoగా ఉన్నాయి. సుదూర భవిష్యత్తులో తిరిగి అరబ్/ఇస్లామిక్
ప్రపంచం లో మేధో అభివృద్ది, విజ్ఞాన అభివృద్ధి వెలుగులోకి రావచ్చని ఆశిద్దాము.
No comments:
Post a Comment