15 April 2017

భారతదేశ దళిత ముస్లింలు (Dalit Muslims of India)

.

అంటరానితనం బానిసత్వం కంటే బాధపెడుతుంది” అని  భారతదేశం యొక్క గొప్ప రాజనీతిజ్ఞుడు మరియు భారత దేశం యొక్క దళితుల తిరుగులేని నాయకుడు డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ అన్నారు.

దళిత ముస్లిమ్స్ అనగా సామాన్య బాష లో ఇస్లాం స్వీకరించిన హిందూ దళితులు అని అర్ధం. (Dalit Muslim refers to Hindu Untouchables converted to Islam) పేదరికం మరియు కుల వివక్ష తప్పించుకోవడానికి హిందూ ధర్మం  లోని కొందరు దళితులు ఇస్లాం మరియు ఇతర విశ్వాసాల లోనికి  మారుతున్నారు.  శతాబ్దాలుగా భారతదేశం యొక్క సామాజిక నిర్మాణం ఒక దృఢమైన కుల వ్యవస్థ చుట్టూ నిర్మించబడింది. కుల వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా 1950 లో నిర్మూలించబడింది, కాని దాని వారసత్వం ఇంకా లోతుగా సమకాలీన భారతీయ సమాజంను  ప్రభావితం చేస్తుంది.

సుమారు 1.2 బిలియన్ ప్రజలు దేశంలో నివసిస్తున్నారు వారిలో హిందువుల జనాభా 84% గా ఉంది. భారత దేశం ఇప్పటికీ వర్ణ వ్యవస్థ పై ఆధార పడి నడుస్తుంది అందులో ప్రధానమైన వర్ణాలునాలుగు. అందులో 1. బ్రాహ్మణులు -  మతపరమైన మరియు విద్యా తరగతి వర్గం,  2.క్షత్రియసైనిక వర్గం, 3.వైశ్యులు - వ్యాపార సంఘం, మరియు 4.శూద్రులు కార్మికవర్గం ప్రధానమైనవి.

నాలుగు బృందాల వెలుపల సోపానక్రమం దిగువన దళితుల తో  సహా ఇతరులు ఉన్నారు. దళితులు  (గతంలో వారిని అంటరానివారు గా పిలుస్తారు) హిందూ ధర్మం యొక్క వర్ణ వ్యవస్థలో అట్టడుగు భాగాన ఉన్నారు. దళితులు సాంప్రదాయకంగా చెత్త సేకరణ, వీదుల శుబ్రం, చనిపోయిన మృతదేహాలు దహనం, మానవ వ్యర్థాలను పారవేయడం వంటి పనులు  చేసారు.

కొందరు దళితులు  సమాజం లో వారిపట్ల కొనసాగుతున్న  అసూయ మరియు సాంఘిక వివక్షత ఎదుర్కొనేలేక  బౌద్ధ, క్రైస్తవ, సిక్కు లేదా ఇస్లాం లోకి మారటం ద్వారా సాంఘిక ఆమోదం పొందటానికి ప్రయత్నించు చున్నారు. కాని భారతీయ సామాజిక వ్యవస్థ మత మార్పిడులను ఆహ్వానించే స్థితిలో లేదు. మత మార్పిడికి పాల్పడిన వారిపట్ల ఇతర విశ్వాసాల వారు మరియు సొంత విశ్వాసం వారు    పక్షపాతo/చిన్న చూపు  కలిగి ఉన్నారు.  మత మార్పిడులకు పాల్పడిన వారికి  సొంత సమాజం లోను మరియు  కొత్తగా విశ్వసించిన సమాజం లోను సవాళ్లు తక్కువ కాలేదు.  కొందరు ప్రాణాలు కోల్పోయారు. కొందరు శారీరక హింసకు గురియినారు.

1947 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నూతన రాజ్యాంగం ప్రకారం భారత ప్రభుత్వం సామాజికంగా తక్కువ/నిమ్న/అణగారిన కులాల/వర్గాల పట్ల సానుకూల వైఖరిని అవలంభించి రాజ్యంగ పరంగా ఉద్యోగ, విద్య, శాసన సభ లలో రిజర్వేషన్స్ ను కల్పించింది కానీ అందరూ ఒకే విధమైన ప్రయోజనాలు పొందుట లేదు. రిజర్వేషణ్ సౌకర్యం సిక్కు, జైన మరియు బౌద్ధం స్వీకరించిన దళితులకు విస్తరించడం జరిగింది ముస్లిం మరియు క్రైస్తవ మతాలను స్వికరించినవారిని  ఉపేక్షించడం జరిగిందిముస్లిం మరియు క్రైస్తవ మతాలను స్వీకరించిన దళితులు తమ ఎస్.సి. ప్రతిపత్తి ని కోల్పోతారు. దీనితో వీరికి ప్రభుత్వం తరుఫున విద్యా, ఉపాధి, రంగాలలో ఎటువంటి సహాయం(రిజర్వేషన్) మరియు రాజకీయ ప్రాతినిద్యం  లబించుట లేదు.

మిలియన్ల కొద్ది దళిత ముస్లిమ్స్ కుల వివక్షత ఎదుర్కొంటున్నారు. భారత దేశం లో సుమారు 10 కోట్ల  మంది దళిత ముస్లిమ్స్ ఉన్నారని ఒక అంచనా. సామాజిక శాస్త్రవేత్తల అబిప్రాయం ప్రకారం ఎస్.సి. లకు వర్తించే సౌకర్యాలు వీరికి కూడా వర్తింప చేయాలి. భారతదేశం యొక్క దళిత ముస్లింల కుల-సంబంధ సమస్యలు ప్రభుత్వం లేదా వారి సొంత మత కమ్యూనిటీ  పరిష్కరించుట లేదు.  దళిత హిందువులు, సిక్కులు, బౌద్ధులు లాగా వారు 'షెడ్యూల్డ్ కులాల' కేటగిరిలో వర్గీకరించబడలేదు. వారు తరచుగా ఇతర మతపరమైన నేపధ్యాల  తోటి దళితుల లాగా వివక్షను ఎదుర్కొంటునే ఉన్నారు.


హిందువుల్లో అంటరానితనం విస్తృతంగా ఉంది మరియు దాని ఉనికిని భారతదేశం యొక్క ముస్లింలలో అరుదుగా చర్చించారు. దానికి ఒక కారణం బహుశా ఇస్లాం మతం కులo గుర్తించ లేదు మరియు సమానత్వం ప్రోత్సహిస్తుంది. ఇస్లామిక్ మత గురువుల అభిప్రాయం ప్రకారం ఇస్లాం లో కుల వివక్షత లేదు అది ఇస్లాం కు విరుద్దం. దళిత ముస్లిమ్స్ కు ఇతర ముస్లింలకు  జీవన ప్రమాణాల మధ్య అంతరం కూడా తక్కువ."మొత్తం ముస్లిం కమ్యూనిటీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇతర సమాజాలతో పోలిస్తే తీవ్రంగా వెనుక బడి ఉంది. ముస్లిం లలో దళిత ముస్లిమ్స్, దళితులు కాని ముస్లిమ్స్ మద్య అంతరం చాల తక్కువ అని  నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ 2008 నివేదికలో   గుర్తించారు.

భారతదేశం యొక్క 14కోట్ల  ముస్లింలలో అధికులు  చాలావరకు స్థానికoగా మత మార్పిడి చెందిన వారి నుండి వచ్చారు. వారు హిందూ మత అగ్రవర్ణాల అణచివేతను  తప్పించుకోవడానికి ఇస్లాం మతం లోకి మారబడినారు.

అంటరానితనం కేవలం హిందువులకే పరిమితo కాలేదు. ఇది ఇతర వర్గాలలో కుడా వ్యాపించినది. భారతదేశం లోని అన్ని ధర్మాలలో ముస్లింల తో సహా  వ్యాపించి ఉంది.  ఈ సోషల్ ఆంక్షలు అమలు విషయానికి వస్తే, అగ్రవర్ణ ముస్లింలు హిందూ అగ్రవర్ణాల వారికీ ఏమాత్రం తీసిపోరు అని పరిశోధకులు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ప్రచురించిన ఒక వ్యాసం లో తెలిపారు.

ప్రస్తుతం భారత ముస్లిం  జనాభా లో  75% మంది దళిత ముస్లిమ్స్ మరియు వారి వారసులు. కొంతమంది పరిశోధకులు ఉత్తర భారతం లో విపులంగా జరిపిన సర్వే ప్రకారం వెల్లడైన విశేషాలు కొన్ని: చని పోయిన దళిత ముస్లిమ్స్ ఖననం  "అగ్రవర్ణాల"ముస్లిమ్స్  స్మశాన వాటిక లో జురుగుట లేదు. స్మశాన వాటికలో వారి శవాల రాకపై నిషేధం ఉంది. అనేక దళిత ముస్లింలకు  వివాహాలు-విందులలో  ఆహ్వానం లేదు. కొన్ని చోట్ల దళిత ముస్లింలకు విందులలో  వేరుగా స్థానంకల్పించడం జరుగుతుంది. వారు ఆధిపత్య కులాల ప్రజల కన్నా తరువాత తినడo చేస్తారు. కొంతమంది పిల్లలు తరగతి గదులు మరియు భోజనం విరామాలలో విడిగా కూర్చుంటారు మరియు దళిత ముస్లింలు తమను "అగ్రవర్ణాల" ముస్లింలు మరియు హిందువులు నుండి దూరంగా భావిస్తున్నారు. చాల చోట్ల ముస్లింలు ఒకే మసీదులో ప్రార్థనలు చేస్తారు కాని కొన్ని చోట్ల “దళిత ముస్లింలు" ప్రధాన మసీదులో కాకుండా వేరే చోట ప్రార్ధన చేస్తారు.   "దళిత ముస్లింలు” తాము చిన్న పనులకే పరిమితం అయ్యామని భావిస్తున్నారు. కొంతమంది "దళిత ముస్లిం"లు తమకు ఉన్నత వర్గాల ముస్లిమ్స్ గృహాలలో వేరే పాత్ర్తలలో నీరు మరియు ఆహరం పొందినట్లు తెలిపారు.

 సామాజికంగా వెనుకబడిన ముస్లింలకు ప్రాతినిధ్య సంస్థ నాయకుడు ఎజాజ్ ఆలీ ప్రకారం కులం, అంటరానితనం భారతదేశం మరియు దక్షిణ ఆసియాలో నివసిస్తున్న ముస్లీంలు బాదపడుతున్నారు.  ఒక రాజకీయ శాస్త్రవేత్త డాక్టర్ అఫ్తాబ్ ఆలం ప్రకారం  అంటరానితనం ముస్లిం కమ్యూనిటీ యొక్క దాచిపెట్టిన సీక్రెట్ గా  ఉంది."

స్టడీస్ ప్రకారం ముస్లిం"శుభ్రత  మరియు అపరిశుభ్రత, కులాల స్వచ్ఛత మరియు కల్మషము యొక్క భావాలు" సమూహాల్లో ఉన్నాయి. ఆలీ అన్వర్ అనే పుస్తకములో దళితులను  హిందూ  సమాజంలో అస్పృశ్యులు (asprishya) (అంటరానివారు)గా పిలిచినప్పటికీ, వారు ముస్లిమ్స్ లలో ఆర్జల్(arzal) (నాసిరకం) ముస్లింలు  అని చెప్పారు. డాక్టర్ ఆలం 2009 నాటి తన  అధ్యయనం లో  ఒక సింగిల్ దళిత ముస్లిం " ప్రముఖ ముస్లిం  గ్రూపులలోఆధిపత్య స్థానం లో ” లేడు అని అన్నారు. ఈ ముస్లిం గ్రూప్లను   ముఖ్యంగా ముస్లింలలోని ప్రధాన నాలుగు ఆధిపత్య వర్గాల వారు చలాయిస్తున్నారు అని అన్నారు. పరిశోధక బృందం అంటరానితనం శాపంగా సజీవంగా మరియు విస్తృతంగా భారత ముస్లింలలో ఉంది అని చెబుతారు.

 భారతదేశం లో దళిత ముస్లింల కచ్చితమైన సంఖ్యను తెలియదు. భారత దేశం లో ముస్లింల అధికారిక సంఖ్య (2011 జనాభా లెక్కల ప్రకారం) సుమారు 17.2కోట్లు మరియు కొన్ని అంచనాల ప్రకారం వారిలో  75% దళితులు. ఈ ప్రకారం దళిత ముస్లింల సంఖ్య 10 కోట్లు మించి పోతుంది. భారతదేశం లో 30 కోట్ల కన్నా అధికంగా  దళితులు ఉండొచ్చు.

దళిత ముస్లింలు అనేక దశాబ్దాలుగా తమకు రిజర్వేషన్ కల్పిచమని, తమ సమస్యను సానుభూతి తో పరిశిలించమని  ప్రభుత్వంకు విజ్ఞప్తి చేయుచున్నారు. కాని  'షెడ్యూల్ కులాల' ప్రతిపత్తి వీరికి లబించుట లేదు.కొంతమంది సామాజిక వేత్తల ప్రకారం కుల వ్యవస్థ హిందూ ధర్మ దృగ్విషయం అని దానికి హిందూ ధర్మ గ్రంథాల నుండి చట్టబద్ధత ఉద్భవించింది.  కలోనియల్ కాలం నుండి ప్రభుత్వాల ఆలోచన ఆలాగే ఉంది. దళిత క్రైస్తవులు, దళిత ముస్లిమ్స్ కుడా  దళిత హిందువుల లాగే ప్రయోజనాలకు(రిజర్వేషన్స్)  అర్హత ఉంది అని వారు అభిప్రాయపడ్డారు.

కుల వివక్ష భారతదేశం లో రాబోయే అనేక సంవత్సరాలు  అత్యంత తీవ్రమైన మానవ హక్కుల సమస్యలలో   ఒకటిగా ఉండటానికి అవకాశం ఉంది. కుల వ్యతిరేక చట్టాలు కాగితంపై మంచిగా కనిపిస్తాయి కాని అమలు కావు. హిందూ ధర్మం నంచి  కంటే ఇతర ధర్మలలోనికి  మారటం వలన సమస్య పరిష్కరింప బడదు.

భారతదేశం లో కుల-సంబంధ పక్షపాతాలు  సిక్కులతో  సహా - అన్ని మతాల లో గుర్తించబడ్డాయి. పార్సీలు బహుశా ఒక మినహాయింపు కావచ్చు.

"మీరు భారతదేశం లో కులo వదిలి వేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ కులం మిమ్మల్లి  వదిలి వెళ్ళటానికి  నిరాకరిస్తుంది."





No comments:

Post a Comment