19 April 2017

భారతీయ సమాజం లో భర్త వదిలివేసిన మహిళల స్థితి గతులు (Problems of Abandoned Women in India)



భర్త చే వదిలివేయబడిన(Abandoned) ప్రతి స్త్రీ యొక్క జీవితం విషాదకరమైనదిగా ఉంది. వారు వారి వైవాహిక మరియు మాతృ  కుటుంబాలలో సవాళ్లు మరియు అడ్డంకులు ఎదుర్కొంటున్నారు.

భారతదేశం 2011 సెన్సస్ డేటా లోని “మారిటల్ స్టేటస్ ఆఫ్ ది రిలీజియస్ కమ్యూనిటి అండ్ సెక్స్” నుండి C3 టేబుల్ డేటా ను విశ్లేషించగా* (పరిశోధన కర్తలు  శ్రీ అబూ సాలె షరీఫ్, ప్రఖ్యాత ఆర్ధిక వేత్త మరియు సచార్ కమిటి మెంబెర్ మరియు శ్రీ సయ్యద్ ఖలీద్, రీసెర్చ్ అసోసియేట్)  చేసినప్పుడు  విశ్లేషణ లో
•, వివాహ బంధం లో ఉంటున్న మహిళల శాతం హిందువులలో (86.2%), క్రైస్తవులలో  (83,7%) మరియు ఇతర మత మైనారిటీలలో  (85.8%)ఉంది. ముస్లింలలో మాత్రం (87.8%) గా అత్యధిక శాతం లో  ఉంది.
వితంతు మహిళల శాతం ముస్లింలలో (11.1%) హిందువులలో (12.9%), క్రైస్తవులలో (14.6%) మరియు ఇతర మత మైనారిటీలలో (13.3%) గా ఉంది.
భర్త చే గా వదిలివేయబడిన(Abandoned)   మహిళల శాతం ముస్లింలలో (0.67%) తక్కువ. ఇది  హిందువులలో  (0.69%), క్రైస్తవులలో  (1.19%) మరియు ఇతర మత మైనారిటీలలో (0.68%) గా ఉంది..
·         డేటా ప్రకారం  విడాకులు పొందిన  మహిళల శాతం హిందువులలో  0.22% వద్ద ఉండగా , ముస్లింలలో  0.49%, క్రైస్తవులలో0.47%  మరియు ఇతర మతపరమైన మైనారిటీలలో  (0.33%) గా ఉంది. సాంప్రదాయకంగా హిందువులలో  విడాకులు పొందే అవకాసం లేదు.

·         340 మిలియన్ వివాహం అయిన మహిళలలో 9.1 లక్షల మంది విడాకులు పొందారు  మరియు వారిలో 2.1 లక్షల ముస్లింలుగా  ఉన్నారు.

రాజకీయపక్షలన్ని సమాజంలోని అన్నివర్గాలకు,  ప్రాంతాలకు చెందిన 43 మిలియన్ వితంతు మహిళల కొరకు ఆందోళన చేయాలి? వారు జీవించడానికి పునర్వివాహం లేదా వారి సంక్షేమం పధకాల కోసం ఆర్థిక మద్దతు, ప్రోత్సాహకాలు కల్పిoచాల్సిన  అవసరం ఎంతైనా ఉంది.
అంతే కాక భారతదేశం లో దాదాపు ఒక మిలియన్ విడాకులు పొందిన  మహిళలు ఉన్నారు వారికి   సామాజిక మరియు ప్రభుత్వం మద్దతు అవసరం ఉంది.
గత జనాభా లెక్కల ప్రకారం భారతదేశం లో 2.3 మిలియన్ వేరు పడిన లేదా  ఏకపక్షం గా వదిలివేయబడిన మహిళలు ఉన్నారు. వారి సంఖ్య విడాకులు పొందిన మహిళల కంటే రెండు రెట్లు  ఎక్కువగా  ఉంది.  ఏకపక్షం గా భర్త చే వదిలి వేయబడిన  రెండు మిలియన్ హిందూ మహిళలు ఉన్నారు; ఈ సంఖ్య ముస్లింలలో  2.8 లక్షలు గా,  క్రైస్తవులలో  0.9 లక్షలుగా, ఇతర మతాలలో  0.8 లక్షలుగా ఉంది.
ఏకపక్షంగా భర్త నుండి వేరుపడిన  ప్రతి స్త్రీ యొక్క జీవితం విషాదకరం. ఆమె తన వైవాహిక మరియు మాతృ కుటుంబాలు రెండిటిలోనూ  సవాళ్లు మరియు అడ్డంకులు ఎదుర్కొంటున్నది. ఆమె  తిరిగి వివాహం చేసుకొనజాలదు కారణం ఆమె  విడాకులు పొందలేదు. వారు సామాజికంగా మరియు ఆర్థికంగా అత్యంత భయంకరమైన పరిస్థితులలో  అత్యంత హీనంగా నివసిస్తున్నారు; మరియు ఇతరుల దోపిడీకి గురి అయ్యే  ప్రమాదం ఉంది. ఆఖరికి వదిలివేయబడిన  భార్యలు భారతదేశం లో ఒక పాస్పోర్ట్ (passport)పొందటం కూడా కష్టంగా ఉంది. ప్రభుత్వం 2.4 మిలియన్ వదిలివేయబడిన (deserted) మహిళల స్థితిగతులను పరిష్కరించాలి.



No comments:

Post a Comment