11 April 2017

భారతదేశం లో గోవధ నిషేధం పై మహాత్మా గాంధీ అబిప్రాయాలు

.
ఇటివల భారత దేశం లో మత అసహనం బాగా ప్రబలింది. ఉత్తరప్రదేశ్ లోని దాద్రి లో ముహమ్మద్ అక్లాక్ మరియు ఇటివల రాజస్తాన్ లోని అల్వార్ నేషనల్ హై-వే లో  గో రక్ష దళ సబ్యుల చేతిలో హతం కాబడిన ఫెలు ఖాన్  (Pehlu Khan) దీనికి ఉదాహరణలు. ఈ సందర్భం గా  గో వధ పై భారత దేశ జాతి పిత మహాత్మా గాంధీ అభిప్రాయలు తెలుసుకొందాము.

 “స్వయంగా భావిస్తే తప్ప గోవధ పై నిషేధం విధించామని ఒకరిని నేను ఎలా బలవంత పెట్టగలను? భారత యూనియన్ లో ఒక్క హిందువులు మాత్రమే కాదు ఇక్కడ ముస్లిమ్స్, ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులు మరియు ఇతర మత సమూహాలు ఉన్నాయి.”

మహాత్మ గాంధీ అంటున్నారు:
రాజేన్ బాబు(భారత దేశ ప్రధమ రాష్ట్రపతి) నాతో అన్నారు “గో వధ పై నిషేధం విధించామని 50వేల పోస్ట్ కార్డులు మరియు  25,000 నుంచి  30,000 ఉత్తరాలు మరియు అనేక వేల టెలిగ్రాములు వారికి వచ్చినాయి అని. నేను వారితో(రాజెన్ బాబుతో) ఈ విషయం లోగడ ప్రస్తావించాను. మళ్ళి ఇప్పుడు ఈ ఉత్తరాల ప్రస్తావన ఎందుకు? వాటి వలన ప్రభావం లేదు”  నా ఇంకో మిత్రుడు కూడా గోవధ  సమర్ధన కు సత్యాగ్రహం మొదలు పెట్టాడు అని  టెలిగ్రాం వచ్చింది.

భారతదేశం లో గో వధ నిషేధించాలని ఎలా చట్టం చేస్తారు? హిందువులు గో వధ పై  నిషేధము విధించామని కోరుకొంటారంటం లో నాకు  సందేహం లేదు. నేను గోవు కు సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేసాను, కాని నా మతం మిగతా భారతీయుల మతం ఎలా అవుతుంది? ఇది  హిందువులు కాని మిగతా భారతీయులపై బలవంతం ఆగుతుంది.
మనం  మతం విషయంలో ఎటువంటి బలాత్కారానికి ఆస్కారం లేదని మొదటినుంచి అంటున్నాము. ప్రార్ధన లో దివ్య ఖురాన్ ఆయతులు పఠిస్తున్నాము. ఎవ్వరి బలవంతం పై నేను వాటిని వల్లించటం లేదు. “స్వయంగా భావిస్తే తప్ప గోవధ పై నిషేధం విధించామని ఒకరిని నేను ఎలా బలవంత పెట్టగలను? భారత యూనియన్ లో ఒక్క హిందువులు మాత్రమే కాదు ఇక్కడ ముస్లిమ్స్, ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులు మరియు ఇతర మత సమూహాలు ఉన్నాయి.”

భారతదేశం ప్రస్తుతం హిందువుల భూమి గా మారింది అన్న  హిందువుల భావన తప్పుడు భావన. భారతదేశం ఇక్కడ నివసించే అందరికి  చెందినది. మనము  ఇక్కడ గోవధ నిషేదిస్తూ చట్టం చేస్తే  దానికి రివర్స్ పాకిస్తాన్లో జరుగుతుంది. ఫలితం ఏమి ఉంటుంది? వారు హిందువులు దేవాలయాలు సందర్శించడానికి అనుమతి లేదoటారు కారణం  విగ్రహాలను పూజించటం షరియత్ కు  వ్యతిరేకం అంటారు? నేను ప్రతి రాయి లో దేవుని చూస్తాను  కానీ నా  ఈ నమ్మకాన్ని ఇతరులపై రుద్దలేను? అట్లాని నేను దేవాలయాల సందర్సన ఆపలేదు వాటిని సందర్సిస్తునే ఉన్నాను.  కాబట్టి ఈ టెలిగ్రాములు, ఉత్తరాలు వెంటనే ఆపి వేయండి  వాటి పై డబ్బు వృధా చేయడం  సరైన చర్య  కాదు.

కొoదరు సంపన్న హిందువులు గోవధ ప్రోత్సహిస్తున్నారు. నిజంగా వారు ఆ పనిని వారు స్వయంగా  చేయుట లేదు. వారు ఆవులను ఆస్ట్రేలియా మరియు ఇతర దేశాలకు పంపి వాటిని వధింప చేసి వాటి మాసంతో చేసిన పాదరక్షలు తిరిగి భారతదేశంనకు పంపుతున్నారు?  నాకు ఒక  సనాతన వైష్ణవ హిందూ మతస్తుడు  తెలుసు. అతను గొడ్డు మాంసం సూప్ తన పిల్లల తిండికి ఉపయోగిస్తున్నాడు. అతను ఔషధంగా గొడ్డు మాంసం వినియోగించడం లో ఏ మాత్రం పాపం లేదని నేను అడిగితే చెప్పాడు.
నిజమైన మతం యొక్క అర్ధం ఏమిటి? గోవధ చట్టం ద్వారా నిషేధించబడాలని కోరుకొంటున్నారా?  గ్రామాల్లో హిందువులు ఎడ్ల-బండ్ల పై ఎడ్లు బరిoచలేనంత భారీ బరువులు తీసుకువస్తారు. అది గోవధ కాదా! ఎడ్లలను హింసించటం కాదా?  అందువలన నేను ఈ విషయం పై రాజ్యాంగ అసెంబ్లీలో ఒత్తిడి చేయకూడదు అని సూచించాను.  
నన్ను అడిగారు:  'ముస్లింలు చేస్తున్న దురాగతాల వలన మనం ఏ ముస్లింలను నమ్మాలి. భారత యూనియన్ లో ముస్లింల పట్ల మన  వైఖరి ఎలా  ఉండాలి? పాకిస్తాన్లో ముస్లిమేతరులు ఏమి చేయాలి? నేను ఇప్పటికే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాను. పాకిస్థాన్ ముస్లింలకు చెందవచ్చు కానీ భారత యూనియన్ అందరకు  చెందినది.

నా 30 సంవత్సరాల బోధన అసమర్థమైనందుకు విచారం గా  ఉంది.  అహింస పిరికివాని   ఆయుధం అయినoదుకు భాదగా  ఉంది? మనం నిజంగా ధైర్య వంతులయితే ముస్లింలను  ప్రేమించవచ్చు దానివలన తమ భావాలను మార్చుకొని మనకు వ్యతిరేకంగా ముస్లింలు ద్రోహాo చేయరు. వారు ప్రేమ కు బదులు ప్రేమను  పంచుతారు. మనము కోట్ల కొద్ది ముస్లింలను బానిసలుగా ఇండియన్ యూనియన్ లో ఉంచగలమా? ఇతరులను బానిసలను చేసే వ్యక్తి తానూ స్వయంగా బానిస అవుతాడు. కత్తికి కత్తి, లాటి కి లాటి, తన్ను కు తన్ను సమాధానం కాదు?  పాకిస్తాన్ లో కూడా ప్రతిక్రియ అలాగే ఉండవచ్చు. దీనివలన మనం సాధించిన స్వతంత్రం ను త్వరలో కోల్పోతాము.

ఆధారం:
ప్రార్థన ప్రవచనం 25జూలై,1947 – 1.పేజి 277-280- ఫ్రం దికలేక్టేడ్ వర్క్స్ అఫ్ మహాత్మా గాంధీ, వాల్యూం 88, పబ్లిషెడ్ ఆన్-లైన్  బై గాంధీ హెరిటేజ్ పోర్టల్.

గమనిక: గోవధ నిషేధం ప్రశ్న రాజ్యాంగ అసెంబ్లీలో చర్చించారు మరియు గొడ్డు మాంసం వినియోగం పై నిషేధిస్తూ జాతీయ శాసనం వద్దు అని  ఒక ఏకాభిప్రాయం ఉద్భవించింది. దానికి  బదులుగా గోవధ నిషేధం విషయం ఆదేశిక సూత్రాలలో  చేర్చారు




No comments:

Post a Comment