గత కొన్ని సంవత్సరాలుగా అనేక రాజకీయ చర్చా వేదికలు మరియు రాజకీయ పార్టీలు భారతదేశం యొక్క అట్టడుగు
మరియు అణగద్రొక్కబడిన కమ్యూనిటీ ప్రజలు అయిన దళితులు మరియు ముస్లింల ఐక్యత
గురించి చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన ప్రశ్న ఉదయిస్తుంది - పార్లమెంటరీ
రాజకీయాల బయట దళిత-ముస్లిం ఐక్యత సాద్యమవుతుందా? సాద్యమైతే?అది ఎప్పుడుసాధ్యమవుతుంది.
దీనికి సమాధానం మనకు 1850 లో అణగద్రొక్కబడిన వర్గాల విద్య వ్యాప్తి కి కృషి చేసిన ఫాతిమా
షేక్, జ్యోతిబా మరియు సవిత్రి బాయి ఫులే దంపతులు చేపట్టిన విద్యా కార్యక్రమాలలో
కనిపిస్తుంది.
ఫాతిమా షేక్ మరియు సావిత్రి బాయి ఫులే
జ్యోతిబా మరియు సావిత్రి బాయి ఫులే పీడిత కులాలకు చెందిన మహిళలకు బోధన ప్రారంభిoచినప్పుడు దానికి నిరసన గా స్థానికులు వారిపై దాడికి ప్రయత్నించారు. జ్యోతి
బా పులే కుటుంబo లక్ష్యంగా దాడులు జరిగాయి మరియు వారికి వారి కార్యకలాపాలు ఆపివేయడం లేదా ఇంటిని వదిలివేయడం ఎంపికగా ఇవ్వబడింది. ఫులే కుటుంభం రెండోవది ఎంచుకున్నారు.
ఫులే కుటుంబ మరియు సమాజ సభ్యులు వారి
ఆశయం కోసం నిలబడలేదు. ఏకాకి అయిన ఫులే దంపతులు తమ జీవితాశయం అయిన పీడిత వర్గానికి
చెందిన మహిళలకు విద్యనేర్పడం కోసం ఆశ్రయం కొరకు వెదక సాగరు. ఆ శోధన లో వారికి పూనే
యొక్క గంజ్ పేట్(అప్పటి పూనా గా కూడా పిలుస్తారు) లో
నివసిస్తున్న ఒక ముస్లిం ఉస్మాన్ షేక్, సహకారం లబించినది.
ఉస్మాన్ షేక్, ఫులే దంపతులకు తన ఇంట
ఆశ్రయం ఇచ్చినాడు మరియు తన ఇంటి ప్రాంగణంలో స్త్రీ-విద్యా పాఠశాల నడుపుటకు అంగీకరించినాడు.
1848 లో
ఒక పాఠశాల ఉస్మాన్ షేక్ మరియు అతని సోదరి ఫాతిమా షేక్ ఇంట్లో
ప్రారంభించబడింది.
ఆ నాటి పూనా అగ్రవర్ణాల వారు జ్యోతి బా మరియు సావిత్రి బాయి ఫులే చేపట్టిన పీడిత వర్గానికి చెందిన మహిళలకు విద్యా ప్రధాన కార్యకలాపాలకు
వ్యతిరేకంగా ఉన్నారు మరియు వారి పై అనేక హత్య ప్రయత్నాలు చేసినారు. ఫాతిమా షేక్,
ఫులే దంపతుల ప్రతి కార్యక్రమం లో వారికి అండగా ఉండి అడుగడుగున వారికి సహకరించినది.
ఫాతిమా షేక్, సావిత్రి బాయి ఫులే తో కలిసి జ్యోతి బా స్థాపించిన పాఠశాలలో బోధన
ప్రారంభించింది. వారికి సగుణ బాయి సహకరించినది. ఫాతిమా షేక్ సోదరుడు, ఉస్మాన్ షేక్ కూడా ఫులే దంపతుల స్త్రీ
విద్యా ఉద్యమం తో ప్రేరణ పొందినాడు. ఆ
కాలం నాటి ఆర్కైవ్ ప్రకారం ఉస్మాన్ షేక్, సమాజంలో విద్య వ్యాప్తి కోసం తన సోదరి ఫాతిమా షేక్ ను
ప్రోత్సహించినాడు.
జ్యోతి బా ఫులే స్థాపించిన పాఠశాలకు
ఫాతిమా షేక్ మరియు సావిత్రి బాయి వెళ్ళడం ప్రారంభించినప్పుడు అగ్రవర్ణాల వ్యక్తులు వారిని హింసింపజేయడం మరియు తిట్టడం ప్రారంభించారు.
స్త్రీ విద్యకు కృషి చేస్తున్న వారిపై ఆవు
పేడ వేయడం మరియు రాళ్లు రువ్వ సాగరు. ఫాతిమా
షేక్ మరియు సావిత్రి బాయి వీటికి జంకక తమ కార్యక్రమాలు నిర్భయంగా కోనసాగించ సాగరు.
ఫాతిమా షేక్ తను చేస్తున్న పనికి ఉబయ వర్గాలు అనగా హిందూ మరియు ముస్లిం వర్గాల
నుండి వ్యతిరేకత పొందసాగింది. అయినప్పటికీ ఆమె జంకక ముస్లిం కమ్యూనిటీ సబ్యుల ఇళ్ళకు ఆ ఇళ్ళ నుండి ఆడపిల్లలను స్కూల్ కు
పంపవలసిందిగా వారి తల్లిదండ్రులను ప్రోత్సహించ సాగింది. అమ్మాయిల ను పంపడానికి
అంగీకరించని తల్లితండ్రులకు ఫాతిమా గంటల కొద్ది
కౌన్సిలింగ్ ఇచ్చేది.
19 వ శతాబ్దం మొదటి ముస్లిం మహిళ ఉపాద్యయురాలుగా ఫాతిమా షేక్ ప్రసిద్ది
చెందినది దానికి భారతీయ ముస్లిం కమ్యూనిటీ
గర్వపడుతుంది.
ఫాతిమా షేక్ జివీతం-రచనలు గురించి సాహిత్యం అందుబాటులోకి లేనప్పటికీ ఆమె పాత్ర
ను ఈ నాటి ప్రభుత్వం గుర్తించినది. 2014 లో ఫాతిమా సంక్షిప్త జీవిత చరిత్ర, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్,
జాకీర్ హుస్సేన్, అబుల్ కలాం ఆజాద్ తో పాటు బాల భారతి మహారాష్ట్ర రాష్ట్ర స్కూల్
ఉర్దూ పాఠ్యపుస్తకాలలో చేర్చారు. దీనికి మరాఠా
కమ్యూనిటీ నుండి కొన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ ఆమె
మరాఠా ప్రాంతంలో పుట్టి అదే ప్రాంతంలో స్త్రీ విద్య
కోసం ప్రచారం చేసిన ధీర మహిళ.
“దళిత హిస్టరీ మంత్” గా ఏప్రిల్ నెల గుర్తించబడిన సందర్భంగా, ఇంటర్నెట్ ఆర్కైవ్ 'దళిత చరిత్ర' లో ఫాతిమా షేక్ గురించి వ్రాయబడినది.
ఫాతిమా షేక్ మరియు సావిత్రి బాయి
మధ్య స్నేహం, గౌరవం, దయ మరియు సమాహారం తో కూడినది. సావిత్రి బాయి ఫులే తరచూ తన ఉత్తరాలలో ఫాతిమా షేక్ ను ఆప్యాయత తో
వర్ణించేది. వారి స్నేహం, వారు సమాజం లోని అట్టడుగు వర్గాల సముద్దరణ కొరకు చేసిన కృషి లో పునాదిరాయి అయింది.
ముస్లింలు, దళితులు,
ఆదివాసీలు మరియు బహుజనుల మధ్య సంబంధాలకు సుదీర్ఘ చరిత్ర
ఉంది. అది బ్రాహ్మణీయతకు, అణచివేతకు
వ్యతిరేకంగా సాగిన పోరాటం. సావిత్రి భాయి
ఫులే, జ్యోతిరావు ఫులే, ఫాతిమా షేక్ మరియు దళితులు , ఆదివాసీలు, బహుజన్ సంఘం సబ్యల సంఘీభావం లేదా "పీడిత జాతి యునిటీ" కోసం వారు చేసిన కృషికి చిహ్నం గా ఉంది. సమకాలీన
సమాజం లో ఎస్సీ/ఎస్టీ/ ఓబీసీ మరియు మతపరమైన అల్పసంఖ్యాకుల పోరాటాలు బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది.
No comments:
Post a Comment