జనాభా, మతపరమైన అంశంపై అద్యయనం చేసిన అమెరికా కు చెందిన ఫ్యూ(Pew) సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రప్రంచం లో వేగంగా విస్తరిస్తున్న మతం గా ఇస్లాంఅవిర్భవించ బోతున్నది.
Ø 2050 నాటికి క్రైస్తవుల సంఖ్య 290 కోట్లు (తొలి స్థానం)ఉంటుందని, ముస్లింల సంఖ్య 280 కోట్లకు(రెండో స్థానం)చేరుతుందని పేర్కొంది.
Ø మొదటి సారిగా 2050 లో ప్రపంచ జనాభా లో ఇస్లాం క్రైస్తవం దాపుకు చేరబోతున్నది. 2070 నాటికి ఇస్లాం క్రైస్తవాన్ని అధిగామించవచ్చు.
Ø ముస్లిం జనాభా లో ప్రతి ముగ్గిరిలో ఒకరు 15 సంత్సర లోపు వారిగా ఉంటారు. ప్రతి ముస్లిం స్త్రీ సగటున 3 పిల్లలను కలిగిఉంటుంది.
Ø 2050 నాటికి ప్రపంచ జనాభా 900కోట్ల కు చేరవచ్చు అప్పట్టికి ప్రపంచ జనాభా లో 1/3వంతు ముస్లింలు ఉంటారు. మరియు ప్రపంచ జనాభా లో ప్రతి 10 మంది లో ఆరుగురు క్రైస్తవులు + ముస్లిం లు అయి ఉంటారు.
Ø హిందువుల జనాభా కూడా ప్రపంచవ్యాప్తంగా 34 శాతం పెరిగి 140 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రపంచం లో 3వ అతిపెద్ద జనాభా గా హిందువులు ఉంటారు.
Ø 2050 నాటికి భారత దేశంలోని హిందువుల జనాభా 79.5% నుంచి 76.7% కు తగ్గుతుంది,ముస్లిం జనాభా 18% కు పెరుగుతుంది.
Ø భారత్ హిందూ మెజారిటీ దేశంగానే కొనసాగుతుందని పేర్కొంది..
Ø 2050 నాటికి ప్రపంచ జనాభా లో క్రైస్తవులు 31%, ముస్లింలు 30% ఉంటారు. హిందువులు 14.9% ఉంటారు.
Ø ప్రపంచ వ్యాప్తంగా నాస్తికుల సంఖ్య 13.2% పెరగనుంది. వీరు బ్రిటన్ లో అత్యధికం గా ఉంటారు. ఇక బోద్దమత పురోగతి కి అవకాసం లేదు.
Ø ప్రపంచంలో అత్యధిక ముస్లీంలను కలిగిన దేశo గా 2050 నాటికి భారత్ మొదటి స్థానానికి వస్తుందనీ ఆ సంస్థ వెల్లడించింది.
Ø యూరప్ జనాభా లో 10% ముస్లింలు ఉంటారు. ప్రతి పది మందికి ఒకరు ముస్లిం అయి ఉంటారు.
Ø బ్రిటన్ అత్యధిక ముస్లిం జనాభా కలిగిన 3వ దేశం గా మారుతుంది. 2050 నాటికి బ్రిటన్ లో ప్రతి తొమ్మిది మంది లో ఒకరు ముస్లిం గా ఉంటారు.
Ø అమెరికా లో ముస్లిమ్స్ జనాభా పెరిగి యూదుల కన్న అతి పెద్ద నాన్-క్రిస్టియన్ వర్గంగా రుపొందుతారు.
Ø ప్రపంచ దేశాలలో క్రైస్తవ మెజారిటి కల దేశాల సంఖ్య 151 కు తగ్గుతుంది.
Ø 51 పైగా దేశాల జనాభా లో ముస్లిమ్స్ 50% కి పైగా ఉంటారు.
No comments:
Post a Comment