ఇస్లాం మరియు ముస్లింలు హింస కు పర్యాయపదం అనే భావన నేడు ప్రపంచవ్యాప్తం
గా అనేక వర్గాలలో విస్తృతంగా వ్యాపించింది. కాని వాస్తవానికి ఇస్లాం అహింసకు కట్టుబడి ఉంది. మార్టిన్ లూథర్ కింగ్
జూనియర్ మరియు మహాత్మా గాంధీ వంటి అహింసా
పరుల క్రియాశీలక చిహ్నాలు ముస్లింలలో
కూడా కనిపిస్తారు.
ఇస్లాం సమస్యలను పరిష్కరించడానికి 'హింస” మార్గమును అనుసరించమని చెప్పదు. ఇస్లాం పేరిట తీవ్రవాదాన్ని అనుసరించమని
చెప్పదు. మనోవేదనలను పరిష్కరించడానికి సామాజిక
ఆర్ధిక మార్పును తేవడానికి ఒక సాధనంగా అహింస తోడ్పడుతుంది. ఇస్లాం ద్రుష్టి లో హింస తప్పుడు
చైతన్యం యొక్క రూపం. హింసకు పాల్పడినవారు వాస్తవానికి తమ అసంతృప్తి యొక్క మూలాన్ని
ఉపశమనం చేసేందుకు దోషపూరిత మార్గంగా హింస ను అమలుచేస్తున్నారు.
ఇస్లాం యొక్క పేరుతో” జరిపే హింసాకాండ కారణంగా ముస్లిం
సమాజాలు ఘోరమైన వినాశనాన్ని ఎదుర్కొంటున్నవి. "తీవ్రవాది ప్రదర్శించే హింస
అర్ధరహితం,వ్యర్ధం మరియు ఘోరంగా వైఫల్యం చెందుతుంది”.
మానవజాతి యొక్క పురోగతి, శ్రేయస్సు గౌరవం అహింస మాత్రమే సాధించ
గలుగుతుంది అని ఇస్లాం ప్రబోదిస్తుంది.
ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు ఇస్లాం "కొంత ప్రత్యేకం, అహేతుకం మరియు హింసాత్మకమైనది" అని చూపుతుంది, కాని ఆ భావన తప్పు. వాస్తవానికి అన్ని మతాలు, అహింసను ప్రబోదిస్తున్నవి.
ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు ఇస్లాం "కొంత ప్రత్యేకం, అహేతుకం మరియు హింసాత్మకమైనది" అని చూపుతుంది, కాని ఆ భావన తప్పు. వాస్తవానికి అన్ని మతాలు, అహింసను ప్రబోదిస్తున్నవి.
హింసమార్గాన్ని అనుసరించేవారు ఇస్లామిక్ గ్రంధాలలో హింసకు సంబంధించిన కొన్ని
సూచనలు ఎత్తి చూపుతారు. కాని ఆ ప్రస్తావనల
ఉద్దేశం హింసా మార్గం ను అనుసరించమని కాదు. వాటిని అర్ధం చేసుకోటం లో మనం విఫలం
చేoదాము. ఇస్లాం హింసకు వ్యతిరేకంగా ఆహింస
క్రియాశీలతను చాటుతుంది.
ఇస్లాo లో జిహాద్ అనే భావనను మనం సరిగా అర్ధం చేసుకోలేదు. జిహాద్
అనగా చెడు పై విజయం సాదించడం. జిహాద్ ఒక గొప్ప కారణం కోసం జరిపే అహింసా ప్రయత్నాలు
అనే అర్ధం ఇస్తుంది. తీవ్రమైన ప్రసంగాలు ఎదుర్కొనేందుకు ఈ అవగాహన మరింత విస్తృతంగా
అమలు చేయబడాలి. మహాత్మా గాంధీ మరియు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వివరించినట్లు
హింసాత్మకను తిరస్కరించడం, అహింసాత్మకత క్రియాశీలత అనబడుతుంది. సాంఘిక రాజకీయ సమస్యల పరిష్కరించడానికి అహింసా
మార్గమును అనుసరించమని ఇస్లాం చెబుతుంది. "సమకాలీన ముస్లిం ప్రపoచo లో
బాధపడుతున్న దారుణమైన హింసకు, విరుగుడు ఇస్లామిక్
అహింసతత్వo. ఇస్లామిక్ అహింసవాదం ఒక రియాలిటీ.
ఇస్లాం చరిత్ర, దాని మతసంబంధమైన సాంప్రదాయాలు మరియు వారసత్వం అహింసను చాటును. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల
నుండి అహింస యొక్క ఐదుగురు ఆధునిక ముస్లిం
చాంపియన్ల బోధనలను వివరిస్తూ ఇస్లాం మరియు అహింసతత్వానికి అనుకూలతను చాటుదాము. వారు అందరూ అహింస "దివ్య ఖుర్ఆన్ మరియు ప్రవక్త
ముహమ్మద్(స) బోధనలతో పూర్తిగా అనుకూలంగా ఉంది అంటారు. ఇస్లాం యొక్క గొప్ప వైవిధ్యం
మరియు శాంతియుత అంశాలు వీరు ప్రపంచానికి
చాటారు.
1.ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్:
సామాజిక-రాజకీయ పరివర్తనకు మార్గంగా అహింసను చాటిన వారు మహాత్మా
గాంధీ అనుచరులు అయిన పఠాన్ నాయకుడు, ఖాన్ అబ్దుల్ గఫర్
ఖాన్ (1890-1987). ఇతను ఇస్లామిక్ అహింసావాది. సంక్లిష్ట సామాజిక-రాజకీయ
సమస్యలను పరిష్కరించడానికి అహింసా మార్గoను మాత్రమే సరైన మార్గంగా భావించిన నాయకుడు
"ఫ్రాంటియర్ గాంధీ".
2. షేక్ జాదత్ సయీద్:
ఇస్లామిక్ అహింసవాద రెండవ సమర్ధకుడు షేక్ జాదత్ సయీద్. 1931 లో సిరియాలో జన్మించిన సయీద్, సున్నీ ఇస్లామిక్ అభ్యాసనకు ప్రధాన కేంద్రంగా ఉన్న కైరోలోని
అల్ అజార్ లో చదువుకున్నాడు. ఇస్లామిజం లేదా ఇస్లాం రాజకీయాలు-కేంద్రీకృత వివరణలు మరియు ఇస్లామీయ
దృక్పథం నుండి అహింస గురించి రాసిన ఒక ప్రముఖ రచయిత మరియు విమర్శకుడు.
జిహాద్ భావన యొక్క తారుమారు అవగాహన "ముస్లింలకు మరింత హాని
కలిగించిందని" అతను అంటాడు. జిహాద్
ను హింసాత్మక సాధనంగా ఉపయోగించడం మరియు రక్తం చిందించడం అణిచివేయలంటాడు. ఎందుకంటే
తీవ్రవాదులు, ఇస్లాంను వక్రీకరించడానికి మరియు అవినీతికి పాల్పడడానికి
ప్రయత్నిస్తున్నారు అని అంటాడు.
3.మహమౌద్ తహా
సుడానీస్ పండితుడు, మహమౌద్ తహా (1985 లో ఉరితీయబడ్డాడు) ఇస్లామిక్ అహింస యొక్క మూడవ ఛాంపియన్.
తహా ప్రకారం ఇస్లాం, శాంతి మరియు అహింసత్వం యొక్క విస్తృత వివరణను అందిస్తుంది మరియు అవి ఇస్లామిక్
ప్రమాణలు.
4.ముహమ్మద్ ఇబ్న్ మహ్దీ హుస్సేనీ అల్-షిరాజీ (Muhammad ibn Mahdi Hussaini al-Shirazi)
ఇస్లామిక్ అహింసా వాదులలో నాల్గోవవాడు ముహమ్మద్ ఇబ్న్ మహ్దీ
హుస్సేని అల్-షిరాజి (1928-2001). ఇరాక్ లోని నజాఫ్ లోని షియా పండితుల కుటుంబంలో జన్మించిన అల్-షిరాజి ఒక
అద్భుతమైన రచయిత.
దివ్య ఖుర్ఆన్ మరియు ప్రవక్త(స) మరియు ఇమాంల సంప్రదాయాల్లో
నుండి అహింస మరియు క్షమాపణ బోధనలు ఆయన
నొక్కి చెప్పారు. అల్-షిరాజీ అభిప్రాయం లో "ఆత్మ శరీరానికి
కన్నా బలంగా ఉన్నట్లుగా, అహింసత్వం కూడా బలమైనది. ఎందుకంటే అది
ఆత్మ యొక్క ఆయుధంగా ఉంది.” అహింస అనునది పదార్థంతో
తయారైన శరీర ఆయుధం కంటే శక్తివంతమైనది. అణచివేతకు వ్యతిరేకంగా అహింసాత్మక
ప్రతిఘటనను పాల్పడిన తొలి తరం ముస్లింలను అతను ఉదాహరణ గా చూపాడు.
అహింస అనునది కేవలం హింస కు పాల్పడకుండా ఉంటం కంటే ఎక్కువ అని అతను అంటాడు.
ఇస్లాం ప్రకారం “అలా చేయగల హక్కు కలిగి ఉన్నఒక వ్యక్తి తన ప్రత్యర్థులపై మరియు బలమైన వేరొక వ్యక్తిని దెబ్బ తీయటానికి
ప్రయత్నించడు మరియు దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ అంటాడు క్షమ, నీతి(సద్ప్రవర్తన) కి దగ్గరగా ఉంటుంది.'
అల్-షిరాజి "శారీరక అహింస" (physical nonviolence)” తో పాటు "శబ్ద అహింస" (“verbal nonviolence)” మరియు "హృదయ అహింస “nonviolence of the heart” గురించి
వివరించాడు. ఇoదులొ తదుపరిది ("జిహాద్ అల్-నఫ్ఫ్స్" లేదా ఆత్మ జిహాద్
") గా ఆల్-షిరాజీ పేర్కొన్నాడు.
శబ్ద అహింస అనగా శత్రుత్వం
మరియు ఉగ్రమైన/చెడు మాటలను నిరోధించడం. విశ్వాసి అవమానాలను ఎదుర్కొoటు మౌనంగా అల్లాహ్ ను శరణు కోరాలంటాడు. "హృదయ అహింస అనగా "శత్రువుల పట్ల తన హృదయం లో హింసా భావం
నింపకుండా ఉండాలి అంటాడు. ఈ అహింసా రూపాలను అభ్యాసన చేయడం శారీరక అహింస కంటే మరింత కష్టసాధ్యమని, అయితే వాటిని తప్పని సరిగా సాధన చేయాలి.
5.మౌలానా వాహిద్దద్దీన్ ఖాన్
న్యూఢిల్లీ కు చెందిన మౌలానా వాహిద్దద్దీన్ ఖాన్ (1925-) ఇస్లామిక్ అహింస యొక్క ఐదవ విజేత. మౌలానా
అభివృద్ధి చేసిన ఇస్లామిక్ వేదాంతశాస్త్రంలో ఇస్లాం యొక్క రాజకీయాల్లో కేంద్రీకృత
వివరణ (ఇస్లామిజం) తో పాటు జిహాద్ పేరుతో జరుపుతున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మౌలానా అభివృద్ధి చేసిన శాంతి యొక్క
కొన్ని అవగాహనలను తెల్సుకోవచ్చు.
తమ బోధనల ద్వారా ముస్లింల అహింస తత్వం గురించి గొప్ప చర్చ మరియు అవగాహనను
ప్రోత్సహించటానికి ముస్లిం పీస్ చాంపియన్స్/అహింసా వాదులు ప్రయత్నిచారు. వీరి అభిప్రాయం లో ఇస్లామిక్ సాంప్రదాయం లో మరియు
ముస్లిం సమాజాలలో హింసను ఎదుర్కోవడానికి మరియు
ఇస్లామిక్ సాంఘిక జీవితాన్ని చర్చించడానికి ఒక మార్గంగా అహింస తోడ్పడుతుంది.