హైదరాబాదీ బిర్యాని
భారతదేశం యొక్క ఇష్టమైన రుచికరమైన వంటకాలలో ఒకటి. దీని వంట శైలి ప్రత్యేకమైనది. మాంసం, బియ్యం, ఇతర సుగంధ దినుసులతో కలిపి దీనిని వండుతారు. ఇది స్పైసి కోడి మాoసం లేదా మటన్
తో బియ్యం యొక్క పలుచని పై పొరను కలిగి ఉంటుంది. ఇoకా దీనిని వేయించిన ఉల్లిపాయలతో కలిపి మరియు రైతా (పెరుగు) తో కలిపి వడ్డిస్తారు.
బిర్యాని యొక్క
నివాసస్థానం:
మొఘలులు: బిర్యాని
హైదరాబాద్ నిజాం ఆస్థాన వంటగదిలో ప్రారంభమైంది. ఇది మొఘలాయి మరియు ఇరానియన్ వంటల
మిశ్రమం. పర్షియన్ భాషలో 'బిరియా' అంటే వంట ముందు
వేయించినది. 'బిరిన్జజ్'(‘Biriynj’) అనేది వరి కోసం వాడబడే
పర్షియన్ పదం. బిరియాని పుట్టుక పై భిన్నమైన
సిద్ధాంతాలు' ఉనప్పటికీ, పర్షియాలో బిరియానీ
ఉద్భవించిందని మరియు మొఘలులు దీనిని భారతదేశంలో ప్రవేశపెట్టారని సాధారణంగా అంగీకరించబడుతుంది.
ముంతాజ్ కనెక్షన్: ఒకసారి చక్రవర్తి
షాజహాన్ భార్య ముంతాజ్ మహల్, సైన్యం
బారకాసులను సందర్శించారు. సైనికులు బలహీనంగా మరియు కుపోషణ తో ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. సైనికులకు అవసరమైన
పోషకాలను అందించడానికి - మాంసం, బియ్యం మరియు మసాలా దినుసుల కలయికతో తయారు చేసిన ఒక వంటకం
ను వండమని (డిష్ ను) ఆమె ఆదేశించింది. ఇలా
బిర్యాని జన్మించినది.
మంగోల్స్ & బిరియాని: మరొక కధనం ప్రకారం, మంగోల్ విజేత - తైమూర్, సైనికులకు ప్రధాన ఆహారంగా బిరియాని ప్రకటించినాడు. ఒక మట్టి కుండ లో బియ్యం, సుగంధ ద్రవ్యాలు కలిపిన మాంసం భూమిలో నిల్వ ఉంచి మరియు దానిని తన సైన్యం కు ఆహార సమయం బయటకు తీసి అయినప్పుడు వడ్డించేవారు.
హైదరాబాదీ బిరియానీ
2 రకాలు: బిరియాని లో
రెండు రకాలు కలవు.
1.పక్కీ Pakki:పక్కి బిర్యాని వంట కోసం మటన్ కర్రీ బేస్ మరియు
బియ్యం అవసరం
2.కచ్చి బిరియానీ katchhi Biryani: కచ్చి బిరియాని ముందు మాంసం ను ఒత్తిడితో (Presure)వండుతారు. దానికి మిర్చి,
వెల్లుల్లి , ఉప్పు తో కలుపుతారు. ఆపై దానిని రిఫ్రిజిరేటర్ లో ఉంచుతారు.
ఆ తరువాత దానికి పుదీనా పేస్ట్ మరియు
పైనాపిల్ రసం,కలుపుతారు.
'హైదరాబాదీ బిరియానీ' వండుటకు కు కావలసిన దినుసులు:
ప్రధాన పదార్థాలు బాస్మతి
బియ్యం, చికెన్ లేదా
మాంసం, పెరుగు, సుగంధ ద్రవ్యాలు, నిమ్మ, ఉల్లిపాయ, కొత్తిమీర ఆకులు,
వేయించిన ఉల్లిపాయలు మరియు రోజ్ వాటర్ మరియు కుంకుమ పువ్వు ను కూడా వండటానికి ఉపయోగిస్తారు.
ఇది హైదరాబాదీ బిరియానీ
యొక్క చరిత్ర.