19 February 2019

భారతదేశం లో మహిళా పార్లమెంటేరియన్ల ప్రాతినిద్యం పెరగాలి. (India needs more women parliamentarians)



Image result for indian parliament house

16 వ లోక్ సభ  సమావేశాలు  ముగిసినాయి. 17 వ లోక్ సభ  ఎన్నికలు మార్చి ప్రారంభంలో ప్రకటించబడుతున్నాయి మరియు ఏప్రిల్ మరియు మే నెలలలో జరుగుతాయి. రాజకీయ వాతావరణం అంతా   ఓట్లు, సీట్లు, సంకీర్ణాలు మరియు ప్రధాన మంత్రి ఎవరు అన్న దాన్ని  గురించి చర్చలతో నిండి ఉంది కాని  పార్లమెంటులో మహిళల ప్రాతినిద్యంగురించి ఎటువంటి  ఎటువంటి చర్చ లేదు. .


ప్రపంచము లోని పార్లమెంటు దిగువ సభలలో మహిళల ప్రాతినిద్య శాతం విషయం లో భారత దేశం 190 దేశాల జాబితా లో 153వ స్థానం లో ఉంది.  ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సంకలనం చేసిన జాబితా ప్రకారం, దిగువ సభలో మహిళా  ప్రతినిధుల విషయం లో  రువాండా 61%  తో మొదటి స్థానంలో  ఉన్నది. UK మరియు US వరుసగా 32% మరియు 23% తో ఉంటాయి. ఒక ప్రాంతం యూనిట్ గా తీసుకొంటే  నార్డిక్ దేశాలు సగటున 40% తో ఉన్నాయి.
ఇటివల అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికలలో మహిళల ప్రాతినిద్య శాతం మెరుగుగా ఉంది.   20% మహిళలతో పాకిస్థాన్ పార్లమెంట్ దిగువ సభ   భారతదేశం కన్నా ముందు ఉంది.. 2014 మేలో 16 వ లోక్ సభ కు ఎన్నికైన 545 పార్లమెంటు సభ్యులలో 65 మంది మాత్రమే మహిళలు కలరు. 12 శాతం మహిళా  ప్రాతినిధ్యం ఉంది. ఒకటి  నుంచి 14 లోక్ సభల వరకు ఎన్నికైన మహిళా సబ్యుల ప్రాతినిద్యం 9% కు మించ లేదు కాని  15 వ మరియు 16 వ లోక్ సభ లో  భారత మహిళా ఎంపీలు 9% కంటే ఎక్కువుగా ప్రాతినిధ్యం వహించారు.

భారత దేశం లో లోక్ సభ కు  సబ్యుల ఎన్నిక నియోజక వర్గాల ప్రాతిపదికన జరుగు తుంది.  ఆ విధంగా 200 మిలియన్ల మందికి పైగా జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కు  80 మంది ఎంపీలు, 100 మిలియన్ల మంది జనాభా ఉన్న బీహార్ కు  40 మంది ఎంపీలు, 114 మిలియన్ల జనాభా ఉన్న మహారాష్ట్రకు 48 మంది ఎంపిలు కలరు. ఈశాన్య రాష్ట్రాలయిన  నాగాలాండ్, మిజోరం, మేఘాలయ మరియు సిక్కింలకు లోక్ సభ లో  ఒక్కొక్క సీటు మాత్రమే ఉంది.

మహిళా ప్రాతినిద్యం విషయం లో ఉత్తర ప్రదేశ్ 14 స్థానాలు, మహారాష్ట్ర ​​6 స్థానాలు,  బీహార్ 3 స్థానాలు కలిగి ఉన్నాయి. జనాభా  ప్రాతిపదికన వివిధ రాష్ట్రాలకు కేటాయించిన లోక్ సభ స్థానాలను పరిశిలిస్తే దేశం మొత్తం మీద ఎన్నికైన మహిళల ప్రాతినిధ్యం 12%,  దేశం లోని మహిళల వాస్తవ జనాభా కంటే తక్కువగా ఉంది. ఇది అసమానత తో కూడుకొన్నది. దేశం లోని అన్ని వర్గాలకు, స్త్రీ-పురుషులకు   ప్రాతినిద్యం వహించే పార్లమెంట్ ప్రాధాన్యతలను రూపొందించుటకు మరియు ఒక ప్రజాస్వామ్య సమాజము యొక్క ఆర్ధిక మరియు సాంఘిక భవిష్యత్తును రుపొందనకు అనుమతిస్తుంది.

పార్లమెంటులో ఎక్కువ మంది మహిళలకు ప్రాతినిద్యం కల్పించడానికి మార్గం సాధారణంగా మూడు రూపాలలో ఉంది: (1) పార్లమెంట్లో మహిళలకు కోటాలు; (2) రాజకీయ పార్టీలలో మహిళలకు రిజర్వేషన్లు; (3) మహిళలకు అవగాహన, విద్య మరియు రాజకీయాలు వైపు ప్రోత్సహo ఉండాలి. భారత రాజ్యాంగంలోని 73 వ మరియు 74 వ సవరణలు స్థానిక స్వ పరిపాలన సంస్థలలో మూడవ వంతు స్థానాలు రిజర్వ్ చేసినవి.

లోక్ సభ లో  మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు ప్రతిపాదన ఇంతవరకు కార్య రూపం దాల్చలేదు. అది కార్య రూపం దాల్చడానికి రాజ్యాంగ సవరణ అవసరం.  ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో  దీనికి సమాధానంగా రాజకీయ పార్టీలలో రిజర్వేషన్ల రెండవ ఆలోచనను అనుసరిస్తున్నాయి. ఇందుకు స్వీడన్, నార్వే, కెనడా, UK మరియు ఫ్రాన్స్ ఉదాహరణలు.

భారత దేశం లో రాజకీయ పార్టీలలో మహిళలకు రిజర్వేషన్లను ప్రోత్సహించేందుకు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో కృషి జరగాలి. రాజకీయ పార్టీలలో మహిళా రిజర్వేషన్లు కోసం మహిళలకు అవగాహన, విద్య మరియు రాజకీయాలు వైపు ప్రోత్సహo ఉండాలి.. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కుల, తరగతి లేదా మతం ఆధార రిజర్వేషన్లతో ముడి పెట్టరాదు.భారతదేశం సుదీర్ఘకాలం పనిచేసిన మహిళా ప్రధానమంత్రిని  మరియు అనేకమంది మహిళా ముఖ్యమంత్రులను కలిగిన చరిత్రను కలిగి  ఉంది.  కాని వారి ప్రాతినిద్యం లోక్ సభ లో ఎల్లప్పుడూ తక్కువుగానే ఉంది. దేశంలో సమతుల్య భవిష్యత్తు కోసం, దీనిని ఎలా మార్చాలనే దానిపై చర్చజరగాలి.

 PS: కమలాదేవి చటోపాధ్యాయ ఎన్నికలలో పోటీ చేసిన మొట్ట మొదటి భారతీయ మహిళ. ఐరిష్-భారతీయ వనిత మార్గరెట్ కజిన్స్ మరియు మహాత్మా గాంధీచే ప్రభావితురాలు అయిన ఆమె ఎల్లప్పుడూ మహిళా ప్రాతినిద్యం కు సమర్ధనగా బలమైన వాణి వినిపించే వారు..

No comments:

Post a Comment