సాధారణంగా ముస్లిం సమాజం అనగా ఆర్ధికంగా విద్యాపరంగా
వెనుకబాటుతనం కూడుకోన్నది అనే భావనకు భిన్నంగా
దేశవ్యాప్తంగా ఒక చిన్న, అభివృద్ధి చెందుతున్న ముస్లిం మధ్యతరగతి
వర్గం అభివృద్ధి చెందుతుంది. వివిధ
రంగాలలో కమ్యూనిటీ ఎదుర్కొంటున్న కఠోర మరియు సూక్ష్మ సామాజిక వివక్షలు ఎదుర్కొంటూ ఈ
ఆవిర్భావం జరిగింది. ఈ తరగతిలోని కొంత భాగం ఒక ప్రత్యేక ఆర్థిక
మైలురాయిని చేరుకోవడమే కాదు, నూతన జీవన శైలిని,
నూతన ఆలోచనలను పరిచయం చేసింది.
గత దశాబ్దాల కాలంలో భారతదేశ ముస్లింలు విద్యా, ఆర్ధిక సాధికారత పరంగా కొంత ప్రగతి సాధించినారు.వివిధ
రాష్ట్రాలలో ముస్లింలు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ పధకాలను ఉపయోగించు కొంటూ అభివృద్దిని కొంత వరకు సాధించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా,కర్ణాటక,
కేరళ, తమిళ్ నాడు వంటి దక్షిణాది రాష్ట్రాలలో
మరియు దేశ వ్యాప్తంగా ముస్లింలు ప్రభుత్వ పరంగా రిజర్వేషన్స్ పొంది అనేక మంది
డాక్టర్లు, ఇంజినీర్స్ గా తయారయ్యారు. ముఖ్యంగా ముస్లిం మహిళా విద్యా శాతం బాగా
పెరిగింది. ఉద్యోగాలు సాధించి తమ ఆర్ధిక, సామాజిక స్థితిని మెరుగు పరుచుకోన్నారు. దక్షిణాది
రాష్ట్రాలలో ఉద్యోగాలలో మరియు విద్య లో
ప్రభుత్వ ప్రయోజనాలను వినియోగించుకొని ముస్లింల ఆర్ధిక సామాజిక పరిస్థితులు మెరుగు
పడినవి.
భారతదేశంలో మధ్య
తరగతి అనేపదం అస్పష్టమైనది ambiguous. దాదాపు ప్రతి ఒక్కరూ తాము మధ్య తరగతి లో ఉన్నట్లు వాదిస్తారు. అయితే, సాధారణంగా, విద్యా
స్థితి, ఆదాయం, వినియోగం మరియు వృత్తి అనే విస్తృత సూచికల ఆధారంగా మధ్యతరగతి వర్గ పరిమాణం గణించవచ్చు. ఈ పారామితులు ఉపయోగించి
జరిగిన దేశవ్యాప్త నమూనా సర్వేలలో అధిక భాగం, ముస్లింలలో
మధ్యతరగతి వర్గం చిన్నదైనప్పటికీ పరిమిత పెరుగుదలను చూపుతున్నది
అని చెబుతున్నాయి
ఉదాహరణకు, జాతీయ
కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలోని అన్ని
మతాలలో ముస్లింలు అత్యధిక సంపద క్విన్టైల్
(టాప్ 20%) లో ఇప్పటికీ తక్కువగా ఉన్నప్పటికీ, వారి వాటా
పెరిగింది 2005-06లో మొత్తం ముస్లింల జనాభా 17.2%, టాప్ సంపద
బ్రాకెట్లో top wealth bracket
పడిపోయింది, కాని 2015-16 నాటికి 18.8% వరకు పెరిగింది. కొంతకాలం లోనే అనగా 2000 ల
మధ్యకాలం మరియు ఈ దశాబ్దపు ప్రారంభ భాగంలో, సెలవుల్లో (on vacations) ముస్లిం గృహ సగటు ఖర్చు మూడురెట్లు
పెరిగింది మరియు సామాజిక కార్యక్రమాలపై on social functions రెండు
రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది (ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే ప్రకారం).
NFHS జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2016 లో ముగిసే
దశాబ్దంలో కనీసం 12 వ తరగతి వరకు అధ్యయనం చేసిన ముస్లిం పురుషుల భాగస్వామ్యం రెట్టింపు
అయ్యింది. ముస్లిం మహిళల విద్యా హోదా పురుషులు కంటే వేగంగా అభివృద్ధి చెందింది, అయితే 12 వ తరగతి
మించి చదివిన మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ 15% కంటే
తక్కువగా ఉంది. విద్యా హోదా పరంగా పాఠశాల చదువు మించిన వారు ముస్లింలలో తక్కువుగా
ఉన్నారు. జనాభా లెక్కల ప్రకారం కేవలం 5% మంది
ముస్లింలు మాత్రమె (పురుషులు మరియు మహిళలు) గ్రాడ్యుయేట్లుగా ఉన్నారు,.
కథ స్పష్టంగా మిశ్రమంగా ఉంది. మరియు అనేక సందర్భాల్లో మార్పు నెమ్మదిగా ఉంది. కానీ పెరుగుదల స్పష్టంగా లేదు. చుట్టుపక్కల ఉన్న దృశ్యం ఈ పెరుగుదల సంకేతాలను చూపుతుంది. ముస్లింలు క్రీడా సామాగ్రిని కొంటున్నారు , షాపింగ్ మాల్ లో షాపింగ్, చలన చిత్రాలను చూడటం వంటి 'సాధారణ' పనులు చేస్తున్నారు మరియు వారి విశ్వాసం మరియు ఆధునిక జీవితం ను సమ్మిళితం చేసి జీవిస్తున్నారు. మనం వారిలో మధ్యతరగతి, వినియోగ-ఆధారిత ఆవిర్భావం యొక్క సంకేతాలను చూస్తున్నాము.
కథ స్పష్టంగా మిశ్రమంగా ఉంది. మరియు అనేక సందర్భాల్లో మార్పు నెమ్మదిగా ఉంది. కానీ పెరుగుదల స్పష్టంగా లేదు. చుట్టుపక్కల ఉన్న దృశ్యం ఈ పెరుగుదల సంకేతాలను చూపుతుంది. ముస్లింలు క్రీడా సామాగ్రిని కొంటున్నారు , షాపింగ్ మాల్ లో షాపింగ్, చలన చిత్రాలను చూడటం వంటి 'సాధారణ' పనులు చేస్తున్నారు మరియు వారి విశ్వాసం మరియు ఆధునిక జీవితం ను సమ్మిళితం చేసి జీవిస్తున్నారు. మనం వారిలో మధ్యతరగతి, వినియోగ-ఆధారిత ఆవిర్భావం యొక్క సంకేతాలను చూస్తున్నాము.
ప్రభుత్వం నియమించిన సచార్ కమిటీ ముస్లింల
జీవితాలను విస్తృతంగా డాక్యుమెంట్ చేసి, వారు
ఎదుర్కొంటున్న వివక్షతపై ఒక నివేదికను సమర్పించినది. అది ప్రాంతీయ విభేదాలు, లేదా కుల
మరియు పితృస్వామ్యాల వంటి అంతర్గత అసమానతలు లేని ఒక ముస్లిం సమాజం ఆవశ్యకతను నొక్కి
చెప్పింది.
న్యూ డిల్లీ యొక్క సెంటర్ ఫర్ ది డెవలపింగ్
సొసైటీస్ సెంటర్లో, ముస్లిం రాజకీయాల పై(Muslim Politics) పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ హిలల్ అహ్మద్ భారతదేశం లోని ఇతర వర్గాల వలే ముస్లింలు కూడా ఒక తరగతి సోపానక్రమం class hierarchy కలిగి ఉన్నారని మరియు ముస్లిం మధ్య తరగతి అనేది
ఇప్పటివరకు ప్రధాన స్రవంతి పదజాలం యొక్క భాగంగా లేదు అని అభిప్రాయపడ్డారు.
ప్రొఫెసర్ హిలల్ అహ్మద్ అభిప్రాయం ప్రకారం "ముస్లిమ్స్ లో ఒక చిన్న ధనిక ముస్లిం తరగతి, చిన్న
మధ్యతరగతి, పెద్ద మధ్యతరగతి, ఆర్టిజాన్స్ వర్గం, చివరకు
పెద్ద పేదలు మరియు మార్జినైజేడ్ వర్గం small rich
Muslim class, a tiny middle class, a big lower middle class, the artisan class,
and finally a big poor and the marginalized class. ఉన్నాయి.
మన దేశంలో ముస్లింల విషయంలో చూస్తే, చివరి
రెండు తరగతులను మాత్రమె చూస్తాము. ముస్లిమ్స్ లో కొన్నివర్గాల
ఉనికిని, మరియు ముస్లిమ్స్
లోపల ఇతర తరగతులు ఏర్పడట్టాన్ని నిర్లక్ష్యం చేశాము ".
ఈనాడు ముస్లిం మధ్యతరగతి వర్గం విభజన తరువాత ముస్లిం కులీన వర్గం కన్నా బిన్నంగా ఉంది. ముస్లిం కులీన
వర్గం తరువాతి
దశాబ్దాల్లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఉర్దూ భాష వంటి గతంలోని సింబాలిక్ శేషాలను భద్రపరచడానికి మరింత దృష్టి
పెట్టింది.
ముస్లింలలో ఈ నూతన తరగతి ఆవిర్భావం ఎక్కువగా
ఉత్తర భారతదేశం చుట్టూ కేంద్రీకృతమై ఉంది, ఎందుకంటే
దక్షిణాన ఉన్న ముస్లింలు నిలకడగా ఇతర తరగతులతో పాటు అనేక సంవత్సరాల పాటు
రిజర్వేషన్లు మరియు సంస్కరణల కారణంగా అభివృద్ధి చెందినారు. విభజన ప్రభావం దక్షిణానికి లేదు మరియు ఉత్తర భారతదేశంలో వలే
ఇక్కడ మతతత్వ రాజకీయాలు లేవు. ఉత్తరాన, ఉన్నత
ముస్లింలలో పెద్ద భాగం విభజన తరువాత పాకిస్తాన్కు వలస పోయింది. ఇది 1960 ల చివరి
వరకు కొనసాగింది మరియు ఈ
ప్రాంతంలో ప్రధానoగా పేదలైన ముస్లింలు
మిగిలిపోయారు. దశాబ్దాల తరువాత మాత్రమే వీరిలో పైకి కదలిక/పురోగతి (upward mobility) ప్రారంభమైంది.
ముస్లింల మధ్య ఈ వర్గపు (మధ్యతరగతి), పుట్టుక నెమ్మదిగా ఉన్నప్పటికీ, అనేక కారణాల వల్ల అనివార్యం.
ముస్లిం సమాజం యొక్క పురోగతికి (upward mobility) విద్య అనేది చాలా ముఖ్యమైన
మార్గం గా గుర్తించారు. సమాజంలో ఒక బలమైన పునాదిని కల్పించటానికి విద్య అనేది
సమాధానం గా కన్పించినది. .
1990 ల మధ్యకాలంలో ముస్లిం కమ్యూనిటీ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించింది, అన్వర్
ఆలం, పాలసీ ప్రాస్పెక్టివ్ ఫౌండేషన్ లోని సీనియర్ ఫెలో, ఢిల్లీ
ఆధారిత థింక్ ట్యాంక్ మరియు అనేక మంది పరిశోధకులు డాక్యుమెంట్ చేసిన ప్రకారం, ఇది ఒక
నాటకీయమైన చర్య కాదు. కొందరు హైబ్రిడైజ్డ్ (hybridized) విద్యను ఎంచుకున్నారు. మదరసాస్ నెమ్మదిగా తమ పాఠ్య ప్రణాళికలో ఇంగ్లీష్
మరియు కంప్యూటర్ శిక్షణను చేర్చి తమను మరింత ఆధునికీకరించవలసి వచ్చింది.
చమురు బూమ్ సమయంలో గల్ఫ్ యాక్సెస్ ముస్లింలలో
ప్రారంభ ఆర్థిక విజయాలు సాహించడానికి దోహదపడింది. చాలామంది గల్ఫ్ అవకాశాలను పొందుతూ
, వారి జీవన ప్రమాణాలను పెంచుకొన్నారు.
అనేక డేటా
నివేదికలు చూపినట్లు చాలామంది ముస్లింలు
పట్టణ కేంద్రాలలో వున్నందున, కమ్యూనిటీ దేశంలోని పట్టణ ఆర్థిక వృద్ధి లబ్ధిదారుగా మారింది. ముస్లిం సమాజాల
ముఖ్యమైన ఆర్థిక దృక్పథాల స్థానంగా ఈ
పట్టణ ప్రదేశాలు మారినాయి. అందుకే ప్రొఫసర్ ఆలం "పట్టణాలు ఆధునిక భారతదేశంలో మత ఘర్షణల ప్రదేశంగా మారినాయి" అని అన్నారు.
ప్రధానంగా వలస సామ్రాజ్య వాదపు తదుపరి కాలంలో /పోస్ట్ కోలోనియల్ సమాజo లో "జీతాలు పొందే వర్గం” మధ్యతరగతి అని పిలవబడేది మరియు ముస్లింలలో మధ్యతరగతి వృద్ధి పెరుగుతుందని అన్నార్ ఆలం రాశారు.ముస్లింలు చేస్తున్న సాంప్రదాయ ఉద్యోగాలను అధిగమించి వ్యవస్థాపన రంగంలో ముస్లింల విజయానికి భారతీయ ముస్లిం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వంటి సంస్థలు మరియు ఆల్ ఇండియా ముస్లిం బిజినెస్ స్టార్ట్అప్ నెట్వర్క్ ఇటీవలే ముందుకు వచ్చాయి. వ్యవస్థాపక విజయాలు కూడా ముస్లిం మధ్యతరగతి స్థాపనకు దోహదంచేసింది. .
జాగ్రత్తగా గమనించినట్లయితే దేశంలోని ఈ మార్పు
కనిపించే గుర్తులను చూడవచ్చు. ఇటీవల బాలీవుడ్ చలన చిత్రం “గుల్లీ బాయ్” లో , ఆలియా భట్ ఆధునిక హిజబి మధ్యతరగతి మహిళా ప్రధాన
పాత్ర ధరించినది. భారతదేశంలో ఢిల్లీలో గల ఖాన్ మార్కెట్లో అత్యంత ఖరీదైన మార్కెట్లలో ఒకటి
- ఇటీవలే ఇక్కడ నూతన షేడ్స్ను ప్రదర్శిస్తున్న హిజబి మోడల్ పోస్టర్ను కనిపిస్తున్నాయి.
స్పోర్ట్స్ కంపెనీలు వర్క్-అవుట్స్ కోసం హిజబ్స్ మరియు స్విమ్మింగ్ కోసం బుర్కినిస్ తయారు చేస్తున్నాయి. హలాల్ ఉత్పత్తులు తయారు చేసే
కంపెనీలు, హలాల్ మాంసం, హలాల్ సౌందర్య వస్తువులు, హలాల్ టూరిజం, హలాల్ దుస్తులు మరియు షరియా-కంప్లైంట్
మ్యూచువల్ ఫండ్ల వరకు హలాల్ మార్కెట్ పెరిగింది. ముస్లింల కొనుగోలు సంభావ్యతకు ఇది
సంకేతంగా ఉంది.
"ఈ తరగతి ప్రత్యేకంగా ప్రవర్తిస్తుంది ... వారు
ముస్లింలుగా ఉంటారు కానీ సాధారణ ప్రజల నుండి భిన్నంగా ఉండాలని వారు
కోరుకుంటారు" అని హిలల్ అహ్మద్ అభిప్రాయ పడ్డారు. "కామ్ కామ్ హై, దీన్ దీన్ హై ... దోనోం అలాగ్ హై," అని అంటారు వీరు. వ్యవస్థాపకత మరియు విద్యల మేళవింపు విజయవంతంగా వీరు అమలు పరిచారు.
No comments:
Post a Comment