12 January 2019

10% వెనుకబడిన' కోటాపై ముస్లింలు మొట్టమొదటి హక్కును కలిగి ఉన్నారు,





జనరల్ కేటగిరీ రిజర్వేషన్ బిల్లు అగ్రకులాల కోసం ఎన్నికల గాలం గా పరిగణించబడుతున్నప్పటికి, ప్రభుత్వం వాస్తవంగా అర్హులైన పేదల గణాంకాలను  తీసుకుంటే, కోటా పూర్తిగా ముస్లింలకు వెళ్లాల్సి ఉంటుంది.
Top of Form
Bottom of Form


రాజ్య సభ కూడా జనరల్ కేటగిరీ రిజర్వేషన్ బిల్లును పేద అగ్రకులాల కోసం  ఆమోదించింది, కోటా బిల్లు చట్టంగా మారడానికి ఇక అధ్యక్షుడి ఆమోదం మాత్రమే వేచి వుంది.
ముస్లింలు మరియు ఇతర మైనారిటీ మతస్తులతో సహా ప్రస్తుతం ఉన్న కోటాలు లేని అన్ని గ్రూపులకు 10% జనరల్ కేటగిరి రిజర్వేషన్లు వర్తించునని  ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎన్నికల ముందు అగ్ర కులాల కోసం ఈ రిజర్వేషన్లు తాయిలం అని అనిపించినప్పటికీ  ప్రభుత్వం అర్హులైన పేదల గణాంకాల వివరాలను స్వికరించినట్లేతే ఈ రిజర్వేషన్లు దాదాపు పూర్తిగా ముస్లింలకు వెళ్లాలి.అయితే, అర్హత ప్రమాణాలు విస్తృతంగా రుపొందిoచ బడినవి, దాదాపు దేశంలోని ప్రతి ఒక్కరూ అర్హత సాధించారు.

సంవత్సరానికి 8 లక్షల గృహ ఆదాయం అర్హతగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఐదు ఎకరాల పైన ఉన్న వ్యవసాయ భూమి, ఒక నోటిఫైడ్ మునిసిపల్ ప్రాంతంలో 1,000 చదరపు అడుగులు లేదా 100 గజాలు పైన ఉన్న ఇల్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న కుటుంబాలు, నొటిఫైడ్ కాని పురపాలక ప్రాంతాలలో 200 చదరపు యార్డ్ ప్లాట్లు కలిగి ఉన్న కుటుంబాలు అర్హతను  కలిగి ఉండవు.


2011-12 భారతదేశ మానవాభివృద్ధి సర్వే (IHDS), జాతీయ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ మరియు మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం తో కలసి సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం, సరాసరి సంవత్సారానికి 8 లక్షల గృహ ఆదాయం కేవలం దేశంలోని 1% కంటే అధిక కుటుంబాలకు మాత్రమె   ఉంది అనగా 99% కుటుంబాల సరాసరి తలసరి అదాయం 8లక్షల  లోపుగానే ఉంది.

 


కానీ ప్రస్తుతం రిజర్వేషన్లు లేని వర్గాలలో ముస్లింలు నిస్సందేహంగా పేదలుగా ఉన్నారు. 2011-12 నాటికి భారత దేశంలోని సగటు వార్షిక కుటుంబ ఆదాయం 1.13 లక్షలు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలవారు దానికoటే తక్కువగా సంపాదించగా, వారి తరువాత ముస్లింలు మరియు ఇతర వెనుకబడిన వర్గాలు (OBC లు) వస్తారు.
భారత దేశం లో ఉన్నత కులాలు వారు  సంపన్నులు. వారి  గృహ ఆదాయం, భారత దేశంలోని సగటు గృహ ఆధాయం కన్నా దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. అలాగే, 2011-12 నాటికి, ఐదు గ్రామీణ గృహాలలో 5 ఎకరాల భూమి కన్నా ఎక్కువ ఉన్న వారు 3 శాతం కన్నా తక్కువ ఉన్నారు. ముస్లింలలో ఈ నిష్పత్తి కేవలం 1 శాతం మాత్రమేనని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ తెలిపింది.

 

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ ఎఫ్హెచ్ఎస్) సంపద సూచి నుంచి పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్  విద్యార్థి డాక్టర్ నితిన్ కుమార్ భారతి సేకరించిన వివరాల ప్రకారం 2005-06 నాటికి వెనుకబడిన కులాలతో పాటు, ముస్లింలు నిరుపేద ప్రజలలో  గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నారు.  వారు భారతదేశం లోని నిరుపేదలలో  20% ఉన్నారు. అగ్ర కులాలు అరుదుగా  ఈ సమూహంలో  ఉన్నాయి.

NFHS 2015-16 సమాచార విశ్లేషణ ప్రకారం పది సంవత్సరాల తరువాత కూడా , ముస్లింలు సంపన్నులలో  తక్కువగా ప్రాతినిధ్యం వహించగా, అగ్ర కులాలు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించాయి.
 


సంపద పరంగా, ముస్లింలు OBC లతో సమానంగా ఉన్నట్లు గుర్తించారు కాని ఉన్నత విద్యా పరంగా, ముస్లింలు OBC ల కన్నా వెనుకబడి ఉన్నారు.

అంతేకాక, ముస్లింల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. 1950 ల మధ్యకాలం నాటికి ఇంటర్ జనరేషనల్ మొబిలిటీ /అంతర్ తరాల  చలనశీలత intergenerational mobility-  తన తండ్రి కన్నా జీవితంలో ఉత్తమంగా ఎదగాలనే అవకాశం –- షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల పిల్లల కోసం  అభివృద్ధి చెందింది, కానీ ముస్లింలకు కాదు..

ఆర్ధికవేత్తలు సామ్ యాషెర్, పాల్ నోవోసడ్, మరియు ప్రపంచ బ్యాంకు యొక్క చార్లీ రఫ్కిన్, డార్ట్మౌత్ మరియు MIT ఆర్ధిక వేత్తలు వరుసగా మొత్తం చైతన్యం for overall mobility కోసం విద్యా ఫలితాలను ఉపయోగించారు మరియు ముస్లిం పిల్లల విద్యా రాంక్  గత 20 సంవత్సరాలలో గణనీయంగా పడిపోయింది మరియు ఇంటర్ జనరేషనల్ మొబిలిటీ /అంతర్ తరాల  చలనశీలత intergenerational mobility-  ఎస్సీ, ఎస్టీలతో పోలిస్తే ఇప్పుడు ముస్లింలు కడు దిగువ స్థితి లో ఉన్నారు.. "అగ్ర కుల సమూహాలు స్థిరంగా మరియు అధిక ఊర్ధ చలన స్థితిని  high upward mobility అనుభవించాయి.


కోటాలు విద్య ఫలితాలను మెరుగుపర్చగలవని సూచించడానికి ఆధారాలు ఉన్నాయి. బెల్జియంలోని నాముర్ విశ్వవిద్యాలయంలో ఆర్థికవేత్త గుల్హెం  కాస్సన్ Guilhem Cassan, 1976 లో జరిగిన ఒక సహజ ప్రయోగాన్ని ఉదాహరణగా తీసుకొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత  భారత దేశం లోని వివిధ రాష్ట్రాలలో తాజా ఎస్.సి. హోదాను ఇవ్వడం కోసం 250,000 మందితో  జాబితా రూపొందించారు. ..

గుల్హెం కాస్సన్ Guilhem Cassan, స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఎస్సీ హోదాలో  ఉన్న వారి విద్యా స్థాయిలను మరియు 1976 లో స్కూల్ కు పోయే వయస్సులో ఎస్సీ హోదా పొందిన  వారి విద్యా స్థాయిలను తులనాత్మకంగా అధ్యయనం చేయగా తరువాతి సంవత్సరాలలో కొత్తగా ఎస్.సి.హోదా ప్రాప్తి, పాఠశాలలు, అక్షరాస్యత మరియు సంఖ్యా స్థాయిలు మెరుగుపడటానికి దారితీసింది.
అందరికి అర్హత ప్రమాణాన్ని సృష్టించడం ద్వారా, మోడీ ప్రభుత్వం దాదాపు అందరు భారతీయులకు అనగా సగం దేశంలోని వారికి  కొత్త కోటాను తెరిచింది.
 
కాలేజీ విద్య,, ఉద్యోగాల రిజర్వేషన్ కోసం ముస్లింలు అగ్రకుల హిందువులతో పోటిపడితే  ముస్లింలు చివరగా ఎంపిక కావచ్చు.
కాని వారి వెనుకబాటుతనం వలన  ముస్లింలు కొత్త నిశ్చయాత్మక చర్యలకు అనగా 10%  రిజర్వేషన్లకు మొట్టమొదటి అర్హత ఉన్న వారు గా పరిగణింప బడుదురు.
.

No comments:

Post a Comment