ఆగ్నేయ ఆసియాలో 240 మిలియన్ల మంది
ముస్లింలు ఉన్నారు. వీరు మొత్తం ఆగ్నేయ ఆసియా
జనాభాలో 42% ఉన్నారు. మొత్తం ప్రపంచ
ముస్లిం జనాభా 1.6 బిలియన్స్ ఉండగా అందులో ఆగ్నేయ ఆసియా ముస్లిమ్స్ 25% ఉంటారని అంచనా వేయబడింది. ఆగ్నేయాసియా లోని
ముస్లింలు అధిక సంఖ్యలో సున్నీలు మరియు వీరు
షాఫి న్యాయ సంప్రదాయాన్ని అనుసరిస్తారు.
థాయ్లాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, బర్మా, లావోస్, కంబోడియా మరియు
వియత్నాంలలో ముస్లింలు మైనారిటి సంఖ్యలో ఉండగా మూడు ఆగ్నేయాసియా దేశాలు-ఇండోనేషియా, మలేషియా మరియు
బ్రూనై ముస్లిం-మెజారిటీ జనాభాను కలిగి ఉన్నవి.
ఇస్లాం మలేషియా మరియు
బ్రూనైలో అధికారిక మతంగా గుర్తింపబడగా ఇండోనేషియా, థాయిలాండ్ మరియు ఫిలిప్పీన్స్ లో అధికారికంగా
గుర్తించబడిన మతాలలో ఇస్లాం ఒకటి. బహస ఇండోనేషియా, మలయ్, జావనీస్, మరానా, మగైందినా, టాసుగ్, థాయ్, చైనీస్ మరియు బర్మీస్ (Bahasa Indonesia,
Malay, Javanese, Maranao, Maguindanao, Tausug, Thai, Chinese and Burmese) వంటి వివిధ
భాషలను మాట్లాడే అనేక జాతుల సమూహాల నుండి ఆగ్నేయ ఆసియా ముస్లింలు వచ్చారు. మధ్య
ప్రాచ్యం లోని ముస్లింలు, యూదులు మరియు
క్రైస్తవుల మధ్య సంబంధాలు మతపరంగా ఉండగా ఆగ్నేయ ఆసియాలోని ఇస్లాం, బౌద్ధo మరియు క్రైస్తవo మధ్య సంబంధాలు జాతి పరంగా
ఉన్నవి. ఇక్కడ ఇండోనేషియన్ మరియు మలేయ్ వాసులు ముస్లింలు; థాయ్/లావోటియన్/కంబోడియన్
వాసులు బౌద్ధులు; ఫిలిపినో వాసులు క్రైస్తవులు మరియు చైనీయులు టావోయిస్ట్/కన్ఫ్యూషియనిస్ట్
లేదా క్రైస్తవులు గా ఉన్నారు. ప్రతి దేశంలో మతపరమైన మెజారిటీ మరియు మైనారిటీల మధ్య
సామాజిక సంబంధాలను కూడా జాతి గుర్తింపులు నిర్ణయిస్తాయి.
12 వ శతాబ్దంలో ఆగ్నేయ ఆసియా లో ఇస్లాం హిందూ
మహాసముద్రపు జలాలలో, మలక్కా, గల్ఫ్ ఆఫ్ సియామ్, మరియు దక్షిణ
చైనా సముద్రం యొక్క జలాలలో ప్రయాణించే భారత దేశం లోని గుజరాతి వ్యాపారులు మరియు మత
ప్రచారకుల ద్వారా ప్రవేశించినది. 13 వ శతాబ్దంలో సుమత్రాలోని పసాయి (Pasai) లో మొదటి ఇస్లామిక్ రాజ్యం స్థాపించబడింది. ఇస్లాం అభివృద్దికి ఇస్లాం ధర్మం
లోని ప్రేమ మరియు కరుణ,
మానవీయ ధోరణులను ప్రచారం చేసే సూఫీలు బాగా తోడ్పడినారు. ఇక్కడ ఇస్లాం అభివృద్ధి హిందూ, బౌద్ధ విశ్వాసాలు
మరియు కర్మ పద్ధతులు మరియు ఇస్లాం బోధనల ఎకీకరణం (syncretic) తో జరిగినది.
సోఫనుక్రమ అమరికలో,
జావానీస్
ఉన్నతవర్గాలు (Javanese) తమను ముస్లింలు, హిందువులు మరియు బౌద్ధులుగా ఒకేసారి పరిగణించారు. 15వ మరియు 16వ శతాబ్దాలలో ఇస్లాం ధర్మం
భారతీయ మరియు చైనీస్ మూలాలు కలిగిన వాలిసోంగో
(Walisongo) అని పిలవబడే తొమ్మిది
మంది ఇండోనేషియా ముస్లిం ఫకిర్ల రచనల ద్వారా విస్తరించింది. వీరితో బాటు హంజా ఫన్సురి Hamza Fansuri 1590) షామ్స్ అల్ - దిన్ పసాయి (Shams al-Din of Pasai 1630) వంటి మార్మిక వాదులు మరియు గుజరాత్లోని రాందర్ కు చెందిన అల్-రనిరి (al-Raniri 1658) సంప్రదాయ ఇస్లాం ధర్మ ప్రచారంలో పాల్గొన్నారు.
పోర్చుగీసు వారు వచ్చే
సమయానికి, ఇస్లాం
ఆగ్నేయాసియా తీర ప్రాంతం లో దృడంగా విస్తరించినది. 17 వ శతాబ్దంలో హద్రామావ్ట్/యెమెన్ (Hadramawt/Yemen) నుండి అరబ్ వ్యాపారులు మరియు పండితులు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. వారు ముహమ్మద్
ప్రవక్త (స)యొక్క వారసులుగా ఈ నాటి వరకు, కొన్ని
ప్రాంతాలలో ఎంతోగా గౌరవించబడతారు.
ఈ ప్రాతం లోని ముస్లింల
హజ్ ప్రయాణాన్ని స్టీమ్ షిప్‌ల రాక మరింత సులభతరం చేసింది. చాలా మంది ఆగ్నేయాసియా
ముస్లింలు అరేబియాకు మతపరమైన అధ్యయనాలను కోసం
వెళ్ళడం ప్రారంభించారు. వారి మాతృభూమికి తిరిగి వచ్చిన తరువాత అరబిక్ గ్రంధాలను ప్రాంతీయ
భాషల్లో భాషలో అనువదించే ఉద్యమం ప్రారంభించారు.
ఈ ఉద్యమం ఆగ్నేయాసియా ఇస్లామిక్ ప్రధాన స్రవంతి లో సనాతన ఇస్లాం మరియు అరేబియన్ జీవనశైలి మరియు సంస్కృతిని మేళవించినది. ఫలితంగా ఈ ప్రాంతంలో రెండు రకాల
ఇస్లాం ఉద్భవించింది.
మొదటిది జావనీస్ అబాన్గన్ (abangan) , లేదా మలే లో కున్ తు (kaum tua) మరియు థాయ్లో కానా కావు(khana kau ). రెండోవది సాంప్రదాయ ఇస్లాం నుండి భిన్న ఇస్లాం కు ఎకికరణం చెంది బహాస ఇండోనేషియా(Bahasa Indonesia) లో సాన్త్రి (santri), లేదా మలే లో కామ్ ముడా (kaum muda ) మరియు థాయ్లో ఖానా మాయి (khana mai) అని పిలుస్తారు. రెండు
రకాలు నేటికీ పక్కపక్కనే ఉన్నాయి. అంతేకాకుండా
18 వ శతాబ్దపు
ఆగ్నేయాసియా పై సౌది అరబియా కు చెందిన వాహాబిజం (Wahhabism) మరియు జమాలుద్దిన్
అల్-ఆఫ్ఘానీ మరియు ముహమ్మద్ అబ్దుహ్ (Jamaluddin al-Afghani
and Muhammad Abduh) ప్రచారం చేసిన చెందిన ఆధునిక ఇస్లాం ప్రభావం కలదు.