31 August 2020

ముస్లిం గణిత శాస్త్రవేత్తలు Muslim Founders of Mathematics


7 నుండి 13 వ శతాబ్దం ముస్లిం స్వర్ణయుగం గా పిలవబడుతుoది.గణితంలో ముస్లింలు ప్రస్తుత అంకగణిత దశాంశ వ్యవస్థను మరియు దానితో అనుసంధానించబడిన వ్యవకలనం, గుణకారం, విభజన, ఘాతాంకం మరియు మూలాన్ని సంగ్రహించడం (addition, subtraction, multiplication, division, exponentiation, and extracting the root) ను అభివృద్ది  చేసారు. వారు జీరో/సున్నా భావనను ప్రపంచానికి పరిచయం చేశారు.

ఆ కాలం నాటి కొందరు సుప్రసిద్ధ ఇస్లామిక్ గణిత శాస్త్రవేత్తలు:

 

1.అల్-ఖ్వారిజ్మి AL-KHWARIZMI (780 – 850 CE):

 

బీజగణితం యొక్క పితామహుడు అని పిలువబడే ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-ఖ్వారిజ్మి ప్రసిద్ద గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త. ఖోర్జెన్ ఒయాసిస్లో కాథ్ పట్టణంలో క్రీ.శ 780 లో అల్-ఖ్వారిజ్మి జన్మించాడని అందురు. అల్-ఖ్వరిజ్మిని ఖలీఫా అల్-మామున్ బాగ్దాద్కు పిలిపించి ఆస్థాన ఖగోళ శాస్త్రవేత్తగా నియమించారు. అతని రచన “హిసాబ్ అల్-జబర్ వాల్ ముగబాలా (బుక్ ఆఫ్ కాలిక్యులేషన్స్, రిస్టోరేషన్ అండ్ రిడక్షన్) నుండి  ఆల్జీబ్రా (అల్-జబ్ర్) దాని పేరును పొందింది.

 

1857 లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో ముస్లిం అంకగణిత రచన యొక్క లాటిన్ అనువాదం ‘అల్గోరిటిమి డి న్యూమెరో ఇండోరంపేరుతో కనుగొనబడింది. ఇది అల్-ఖౌరిజ్మి యొక్క అంకగణిత రచన యొక్క లాటిన్ కాపీ అని నమ్ముతారు. దీనిని  పన్నెండవ శతాబ్దంలో ఒక ఆంగ్ల పండితుడు లాటిన్లోకి అనువదించాడు. అల్-ఖోవారిజ్మి తన పేరును గణిత చరిత్రకు అల్గోరిజం రూపంలో వదిలివేసాడు (అంకగణితానికి పాత పేరు).

 

వారసత్వం, , విభజన, వ్యాజ్యాలు మరియు వాణిజ్యం వంటి విషయాల గురించి ప్రజల ఆచరణాత్మక అవసరాలను తీర్చడానికి తన బీజగణిత పుస్తకాన్ని రాశానని అల్-ఖౌరిజ్మి చెప్పారు.

పన్నెండవ శతాబ్దంలో జెరార్డ్ ఆఫ్ క్రెమోనా మరియు రాబర్ట్స్ ఆఫ్ చెస్టర్ అల్-ఖోవారిజ్మి యొక్క బీజగణితాన్ని లాటిన్లోకి అనువదించారు. గణిత శాస్త్రవేత్తలు దీనిని పదహారవ శతాబ్దం వరకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించారు.

 

2.అల్-కిండి (801-873 CE)AL-KINDI (801-873 CE):

అబూ యూసుఫ్ యాకుబ్ ఇబ్న్ ఇషాక్ అల్-కిండి కుఫాలో క్రీ.శ 801 లో జన్మించాడు. ఇంటిపేరు యెమని  మూలానికి చెందిన కిందా రాజ కుటుంభ వంశపారంపర్యతను సూచిస్తుంది. తన కాలం నాటి ప్రజలకు అతను ఇస్లాంలో మొదటి వ్యక్తి ఫయలాసుఫ్ అల్-అరబ్ Faylasuf Al-Arab (అరబ్బుల తత్వవేత్త) గా ప్రసిద్ది చెందాడు.

అంకగణితానికి arithmetic సంభందించి అల్-కిండి సంఖ్యలు మరియు సంఖ్యా విశ్లేషణలపై పదకొండు గ్రంథాలను రాశారు.

 

3. అల్-కరాజి AL-KARAJI:

 

అబూ బకర్ ఇబ్న్ హుస్సేన్ బాగ్దాద్ శివారు ఖార్ఖ్లో జన్మించాడు. అతను  అంకగణితం, బీజగణితం మరియు జ్యామితి లో రచనలు చేసాడు.. అతని పుస్తకం అల్-కాఫీ ఫీ అల్-హిసాబ్ Al-Kafi fi Al-Hisab’’ (ఎస్సెన్షియల్స్ ఆఫ్ అర్థమేటిక్స్) గణన నియమాలను వివరిస్తుంది. అతని రెండవ పుస్తకం, ‘అల్-ఫఖ్రీదాని పేరును అల్-ఖార్కి స్నేహితుడు, బాగ్దాద్ యొక్క గ్రాండ్ విజియర్ నుండి పొందింది.

 

5.అల్-బట్టాని (850-929 CE)Al-BATTANI (850-929 CE):

త్రికోణమితి trigonometry పితామహుడు గా పిలుబడే  ముహమ్మద్ ఇబ్న్ జాబీర్ ఇబ్న్ సినాన్ అబూ అబ్దుల్లా మెసొపొటేమియాలోని బట్టన్‌లో జన్మించాడు మరియు క్రీ.శ 929 లో డమాస్కస్‌లో మరణించాడు.

అతను అరబ్ యువరాజు మరియు సిరియా గవర్నర్ మరియు అతను గొప్ప ముస్లిం ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్తగా పరిగణించబడ్డాడు.

అల్-బటాని త్రికోణమితిని ఉన్నత స్థాయికి పెంచినాడు మరియు కోటాంజెంట్ల cotangents మొదటి పట్టిక table ను రుపొందిచినాడు..

 

6.అల్-బెరుని (973-1050 CE)AL-BIRUNI (973-1050 CE):

ఆధునిక త్రికోణమితికి పునాది వేసిన వారిలో అల్-బిరుని కూడా ఉన్నారు. అతను ఒక తత్వవేత్త, భూగోళ శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త. గెలీలియోకు ఆరు వందల సంవత్సరాల ముందు, అల్-బిరుని భూమి దాని స్వంత అక్షం చుట్టూ తిరిగే సిద్ధాంతాన్ని చర్చించినాడు.

అల్-బెరుని జియోడెసిక్ geodesic కొలతలను వేసినాడు మరియు భూమి యొక్క చుట్టుకొలతను నిర్ణయించినాడు. గణిత శాస్త్ర సహాయంతో, అతను ప్రపంచంలోని ఎక్కడి నుండైనా కిబ్లా దిశను నిర్ణయించుటను కనుగొన్నాడు.  

 

త్రికోణమితి యొక్క డొమైన్లో, ఫంక్షన్ల సిద్ధాంతం; సైన్, కొసైన్ మరియు టాంజెంట్‌ను పదవ శతాబ్దపు ముస్లిం పండితులు అభివృద్ధి చేశారు. సాధారణ మరియు గోళాకార త్రికోణమితి plane and spherical trigonometry అభివృద్ధిలో ముస్లిం పండితులు పనిచేశారు. ముస్లింల త్రికోణమితి టోలెమి సిద్ధాంతంపై ఆధారపడింది, కానీ ఇది రెండు ముఖ్యమైన అంశాలలో ఉన్నతమైనది: ఇది టోలెమి chord ఉపయోగించిన చోట  సైన్‌ను ఉపయోగిస్తుంది మరియు రేఖాగణిత రూపానికి బదులుగా బీజగణితంలో algebraic instead of geometric form.ఉంటుంది. 

No comments:

Post a Comment