ఇస్లామిక్ చరిత్రలో హజ్రత్ ఆయేషా /ఈషా (ర) పేరు ప్రముఖమైనది. ఆమె హజ్రత్ అబూబకర్ సిద్దిక్ (ర) కుమార్తె. హజ్రత్ అబూబకర్ సిద్దిక్ (ర) ప్రవక్త (స) కు అత్యంత సన్నిహితుడు, ప్రియమైన సహచరుడు మరియు ఇస్లామిక్ రాజ్య మొదటి ఖలీఫా.
హజ్రత్ ఈషా (ర) ప్రగతిశీల మహిళ మరియు ఇస్లాం వివక్షను నిషేధిస్తుందని మరియు స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఇస్తుందనే దానికి
ఆమె జీవితం ఒక ఉదాహరణ. హజ్రత్ ఆయేషా (ర)భార్య, రాజనీతిజ్ఞుడు, పండితుడు మరియు గొప్ప ఆలోచనాపరురాలు వంటి గొప్ప పాత్రలు పోషించిన మహిళ, ఆమె అద్భుతమైన, ఉన్నత
నైతిక లక్షణాలను ప్రదర్శించింది. ఇస్లామిక్
సమాజం లో ప్రజలకు మార్గనిర్దేశం చేసిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఆమె ఒకరు.
హజ్రత్ ఖాదీజా (ర) మరణం ప్రవక్త (స) ను చాలా బాధపెట్టింది మరియు కొంతకాలం ఎవరినీ వివాహం చేసుకోవడానికి వారు ఇష్టపడలేదు. అయినప్పటికీ, ఒక సమయంలో వారు ఒక కలను చూశారు. ఆ
కలలో ఒక దేవదూత పట్టుతో చుట్టబడిన దానిని వారికి బహుమతిగా ఇచ్చాడు. పట్టు కవరులో హజ్రత్ ఈషా (ర) ని ప్రవక్త
(స)చూశారు. కలలో ప్రవక్త ముహమ్మద్ (స) కు రెండు జీవితాలలో(ఇహా-పరాలలో) ఆమె(అయేషా(ర)) వారి భార్య అని చెప్పబడింది..
హజ్రత్ ఖౌలా బింట్ హకీమ్ ప్రవక్త
(స)గారిని ఈషా (ర) ను వివాహం చేసుకోవాలని సిఫారసు చేసారు మరియు అల్లాహ్ యొక్క దూత (స) దీనిని అల్లాహ్ సంకేతంగా భావించి ఖౌలాను ఈషా (ర) ఇంటి వద్ద నిఖా ఆహ్వానం పంపమని కోరారు. హజ్రత్ ఈషా (ర) ప్రవక్త (స) ను వివాహం చేసుకున్నారు.
హజ్రత్ ఈషా (ర) ప్రవక్త ముహమ్మద్ (స) ను వివాహం చేసుకున్నప్పుడు వారి వయస్సు పై బిన్న అభిప్రాయలు కలవు.
·
హిషాం వివరించిన ఒక హదీసు ప్రకారం హజ్రత్ ఈషా (ర) కు వివాహం సమయంలో తొమ్మిది సంవత్సరాలు.
·
“ ఆమె వయస్సు ఖచ్చితంగా తొమ్మిది సంవత్సరాలు”.-(నూర్-ఉల్-ఖురాన్, నం 2, రుహానీ ఖాజైన్, వాల్యూమ్ 9, పేజీలు 377-378)
·
హజ్రత్ మీర్జా బషీర్ అహ్మద్ “ది లైఫ్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ది సీల్ ఆఫ్ ది ప్రొఫెట్స్” లో ఆమెకు (ఈషా రా) 12 సంవత్సరాల వయస్సు ఉండవచ్చునని పేర్కొన్నారు.
ఆమె వ్యక్తిత్వం
అనేక ఆశీర్వాదాల నిధి.
·
ప్రవక్త (స) తన భార్యలందరిలో, ఆమె నివాసంలో
మాత్రమే అతనికి వహి లభించిందని చెప్పేవారు.-( అల్-బుఖారీ, హదీసు నం. 3775)
ప్రవక్త ముహమ్మద్
(స) మరియు ఈషా (ర) ల యొక్క వివాహం దైవిక
ప్రేరణ మరియు దేవదూతలు ఆమెకు సలాములు తెలియజేసారు.
·
హజ్రత్ అబూ సలామా ప్రకారం ప్రవక్త (స) ఈషా (ర) తో ఇలా అన్నారు:"ఈషా, జిబ్రఎల్ తన
సలాంను మీకు తెలియజేస్తాడు" దానికి ఆమె తన శుభాకాంక్షలు తిరిగి తెలియజేసింది..-( అల్-బుఖారీ, హదీసు నం. 3217) ” ( అల్-బుఖారీ, హదీసు నం. 3218)
·
ప్రవక్త(స) ఇలా చెప్పేవారు:“మిగతా భార్యలపై ఆయేషా యొక్క గొప్పతనం తారీద్ thareed లాంటిది”, అనగా మాంసం కు సాధారణ
ఆహారం కంటే ఉన్న ఆధిపత్యం.-(సహిహ్ అల్-బుఖారీ, హదీసు నం. 3769)
హజ్రత్ ఈషా (ర) ప్రవక్త ముహమ్మద్
(స) యొక్క ఇతర భార్యలపై ఆశీర్వాదం మరియు ప్రత్యేకమైన వ్యత్యాసాన్ని కలిగి ఉన్నారు. ప్రవక్త (స) తన చివరి రోజులు, గంటలు ఈషా (ర) ఇంట్లో గడిపారు. దీనిని ప్రవక్త ముహమ్మద్ (స)గారి ఇతర భార్యలు అంగీకరించారు, ఎందుకంటే ఈషా(ర) ఇంట్లో చివరి రోజులు గడపటం ప్రవక్త (స) గారికి ఇష్టం
ప్రవక్త (స) గారి
యొక్క చివరి మాటలు:
తన ప్రియమైన
భార్య ఈషా (ర) యొక్క హృదయం పై ప్రవక్త
(స)తన తల ఆనించి విశ్రాంతి తీసుకొంటు అన్న
చివరి మాటలు“నేను ఇప్పుడు అల్లాహ్ వద్దకు వెళ్తాను”-(సహిహ్ అల్-బుఖారీ, హదీసు నం. 4463)
ప్రవక్త(స) నుండి
పొందిన జ్ఞానాన్ని వివరించడం లో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆమె వద్ద 2,200 కంటే ఎక్కువ
ప్రామాణిక హదీసులు కలవు. ఇస్లామిక్ మేధో
చరిత్ర యొక్క ప్రధాన స్రవంతిలో ఈషా (ర) వ్యక్తిత్వం అత్యంత ఆకర్షణీయమైనది. ఆమె తన జీవితకాలం
అంతా, సంక్లిష్టమైన
సమస్యలను పరిష్కరించడంలో ప్రవక్త (స) సహచరులకు సహాయం చేసింది. ప్రవక్త ముహమ్మద్
(స) విశ్వాసులు ఆమె నుండి మతపరమైన జ్ఞానంలో సగం నేర్చుకోవాలని అన్నారు.
·
ఆమె మేనల్లుడు
హజ్రత్ ఉర్వారా బిన్ జుబైర్ ఇలా అన్నారు:“ఖురాన్, మతం, ఫిఖ్, కవిత్వం, ఔషధం, అరేబియా చరిత్ర మరియు వంశావళి యొక్క ప్రాథమిక సూత్రాలు
మొదలగు వాటిలో హజ్రత్ ఈషాను అధిగమించిన వారిని
నేను ఎప్పుడూ కలవలేదు.. ”
·
ఇస్లామిక్ న్యాయ
శాస్త్రంలో నాలుగవ వంతు ఆమె జ్ఞానం మీద ఆధారపడినది అని పండితులు ధృవీకరిస్తున్నారు.
హజ్రత్ ఈషా (ర) క్రీ.శ 678 లో కన్నుమూశారు. ఆమె కోరిక ప్రకారం, ఆమెను ప్రవక్త (స) యొక్క ఇతర భార్యలతో పాటు జన్నత్-ఉల్-బాకీ Jannat-ul-Baqi లో ఖననం చేసారు.
·
హజ్రత్ అమర్ బిన్
అల్ ‘అస్ (ర) వివరించిన
హదీసులో:“నేను ప్రవక్త (స) వద్దకు వచ్చి,‘ మీకు ఎవరు అత్యంత ప్రియమైనవారు? ’అని అడిగాను,‘ ఈషా ’అని ఆయన సమాధానం
ఇచ్చారు.‘ మరియు మనుష్యులలో
ఎవరు? ’ అని అడిగాను. ‘ఆమె తండ్రి.’అన్నారు.-(సహిహ్ అల్ బుఖారీ, హదీసు నం. 3662)
.
No comments:
Post a Comment