20 July 2014

మైనారిటీ ల సంక్షేమం -అబివృద్ధికి నూతన ఎన్‌డి‌ఏ ప్రభుత్వ పధకాలు



భారత మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి నజ్మా హెఫ్తుల్ల రాజ్య సభ లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ భారతదేశములోని  ఆరు నిర్ధారిత  మైనారిటీ వర్గాల సంక్షేమం మరియు వికాసానికి రూపొందించిన ప్రణాళికలను ప్రకటించారు.  ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్‌డి‌ఏ ప్రభుత్వం ఆరు మైనారిటీ వర్గాల సంక్షేమానికి  పూర్వపు ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలనే  వేగవంతం చేయడానికి నిర్ణాయించినదని ప్రకటించినారు. మైనారిటీ యువకుల నైపుణ్యాలను మెరుగు పరచడానికి మరియు వారి సాంప్రదాయక వృత్తులను, కళలను రక్షించి, అబివృద్ధి చేయడం ద్వారా వారి ఉపాధి సౌకర్యాలను మెరుగు పరచడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ఉద్దేశాలకు  అనుగుణముగా మైనారిటీ ల అబివృద్ధి పధకాలను మెరుగు పరచడం జరుగుతుందని అన్నారు. 
మైనారిటీ ల అబివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన నూతన పధకాలను గురించిన వివరాలను అందచేసినారు.
అవి 1. ఉస్తాద్: మైనారిటి ల సాంప్రదాయక వృత్తుల పరిరక్షణ, శిక్షణ, అధివృద్ధికి రూపొందించిన పధకం.
2. హమారి దరోహర్: భారతీయ సంస్కృతి లో భాగంగా గొప్ప వారసత్వం కలిగిన మైనారిటీల సంస్కృతి పరిరక్షణ.
3. ఖ్వాజా గరీబ్ నవాజ్ సీనియర్ సెకండరీ స్కూల్ స్థాపన: మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆద్వర్యం లో ఖ్వాజా గరీబ్ నవాజ్ సేనియర్ సెకండరీ స్కూల్ ను ఆజ్మీర్ లో స్థాపించుట.
4. నై మంజిల్: మదరసా విద్యను అబ్యశించిన విద్యార్ధులు సాదారణ విద్యాలయము లో చేరుటకు అవసరమైన సాధారణ విద్య మరియు నైపుణ్యాన్ని అందించే బ్రిడ్జ్ కోర్స్ ఏర్పాటు.
5.రాష్ట్ర వక్ఫ్ బోర్డు ల పటిష్టత: రాష్ట్రా ల వక్ఫ్ బోర్డు ల నిర్వహణ కు అవసరమైన శిక్షణ, పరిపాలక ధనాన్ని అందించుట ,వక్ఫ్ ఆక్రమణలను తొలగించుట మరియు వక్ఫ్ బోర్డు ల జోనల్/రిజినల్ ఆఫీసులను ఏర్పాటు చేయుట. 
మైనారిటీ ల అబివృద్ధికి పాత ప్రభుత్వం చే రూపొందించబడి ప్రస్తుతం కూడా  కొనసాగుతున్న ఇతర పధకాలు:
మల్టీ సెక్తోరల్ దవలప్మెంట్ ప్రోగ్రాం(MSDP): మైనారిటీ లు అధికంగా ఉన్న జిల్లాల లోని ప్రాంత వాసుల అబివృద్ధికి ,అసమానతలు తగ్గించడానికి ఈ పధకం ఉద్దేశించబడినది. ఆ ప్రాంతం లో స్కూళ్ళు,పారిశుద్యం,పక్క ఇళ్ళు,త్రాగు నీరు మరియు విద్యుత్ సౌకర్యం తో పాటు ఇతర అబివృద్ధి పధకాలు  కల్పించబడును. ఈ పధకం మైనారిటీ లు అధికంగా ఉన్న 90 జిల్లాలలోని గ్రామీణ మరియు సెమీ గ్రామీణ ప్రాంతాలకు ఉద్దేశించబడినది.
12వ ప్రణాళిక లో పధకం లో మార్పు చేసి జిల్లా స్థానం లో బ్లాక్ లేదా మైనారిటీ లు అధికంగా ఉన్న కొన్ని గ్రామాలను కలిపి ఒక యూనిట్ గా తీసుకోవడం జరిగింది. దేశం మొత్తం మీది 26 రాష్ట్రాలలోని 196 జిల్లాలలో 710 మైనారిటీ లు అధికంగా ఉన్న బ్లాక్ లు(MCB) మరియు 66 మైనారిటీ లు అధికంగా ఉన్న పట్టణాలను(MCT) ఈ పధకం క్రింద ఎన్నికచేయడం జరిగింది.
పధక ప్రారంభం నుండి 31-03-14 వరకు 6310.61 కోట్ల రూపాయలను కేటాయించడం  జరిగింది ఇందులో 4534.25 కోట్ల రూపాయలను వినియోగించడం జరిగింది. 1092 స్కూల్ భవనాలు,20756 అదనపు తరగతి గధులు,645 హస్టల్స్,3645 ఆరోగ్య కేంద్రాలు,34533 అంగన్వాడీ కేంద్రాలు,117 ఐ‌టి‌ఐ లు,44 పాలిటెక్నిక్ కేంద్రాలు, 40799 మంచి నీటి సప్లై పధకాలు, ఇందిరా ఆవాస్ యోజన పధకం క్రింద 335743 ఇళ్లనిర్మాణానికి  అనుమతి ఇవ్వడం జరిగింది.
ప్రీ -మెట్రిక్ స్కాలర్ షిప్ పధకం క్రింద 10వ తరగతి వరకు చదివే మరియు  సంవత్సరానికి లక్ష లోపు ఆధాయము కల కుటుంబానికి చెందిన విద్యార్ధికి ప్రీ -మెట్రిక్ స్కాలర్ షిప్ అందించడం జరుగుతుంది ఇందులో 30% సీట్లు బాలికలకు కేటాయించడం జరుగుతుంది ఈ పధకం క్రింద 2013-14 సంవత్సరంలో 963.79 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది.
పోస్ట్ - మెట్రిక్ స్కాలర్ షిప్ పధకం క్రింద 12వ తరగతి పైన చదివే మరియు  సంవత్సరానికి రెండు లక్షల  లోపు ఆధాయము కల కుటుంబానికి చెందిన విద్యార్ధికి పోస్ట్ - మెట్రిక్ స్కాలర్ షిప్ అందించడం జరుగుతుంది ఇందులో 30% సీట్లు బాలికలకు కేటాయించడం జరుగుతుంది ఈ పధకం క్రింద 2013-14 సంవత్సరం లో 515.76 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది.
మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలో షిప్ ఫర్ మైనారిటీ స్టూడెంట్స్:
యూ‌జి‌సి గుర్తింపు పొందిన ఉన్నతవిద్యా సంస్థలలో ఉన్నత విద్యను అనగా ఎంఫిల్,పి‌హెచ్‌డి అబ్యశిస్తున్న మైనారిటీ విద్యార్ధులకు చేసే ఆర్ధిక సహాయ పధకం లో భాగంగా మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ఫర్ మైనారిటీ స్టూడెంట్స్ పధకంను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 30% సీట్లను యువతులకు కేటాయించడం జరిగింది. 2013-14 సంవత్సరంలో ఈ పధకం క్రింద 50 కోట్లను విడుదల చేయడం జరిగింది.
మెరిట్ కం మీన్స్ బెసేడ్ స్కాలర్ షిప్ :
అత్యంత ప్రతిభా కలిగి, పేదరికంతో బాదపడుతూ వృతి విద్య లో గ్రాడ్యుయట్,పోస్ట్-గ్రాడ్యుయట్ విద్యను అబ్యశిస్తున్న విద్యార్ధుల కోసం ఏర్పాటు చేయబడినది. ఇందులో 30% సీట్లను స్త్రీ అబ్యర్ధులకు కేటాయించడం జరుగు తుంది.
ఫ్రీ కోచింగ్ అండ్ అలైడ్ స్కీమ్:
ప్రభుత్వ/ప్రవేట్ శిక్షణ సంస్థలలో పోటీపరీక్షలకు మరియు ఐ‌టి ఇతర ఉద్యోగాలకోసం శిక్షణ పొందుతున్న విద్యార్ధులకు ఈ పధకం క్రింద  ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుంది. 30% స్థానాలను స్త్రీ అబ్యర్ధులకు కేటాయించడం జరుగుతుంది. 2013-14 సంవత్సరం లో ఈ పధకం క్రింద 23కోట్ల 66 లక్షలు ఖర్చు చేయడం జరిగింది.
నేషనల్ మైనారిటీ దవలప్మెంట్ & ఫీనాన్స్ కార్పొరేషన్(NMDFC):
ప్రభుత్వం చే మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్  కార్పస్ ఫండ్ క్రింద గ్రాంట్స్-ఇన్-ఆయిడ్ అందించడం జరుగుతుంది. 11వ,12వ తరగతి చదివే మైనారిటీ బాలికలు మరియు మైనారిటీ విద్యా సంస్థలకు సంస్థాగత అబివృద్ధి మరియు స్కాలర్ షిప్ మొత్తం ను విడుదల చేయుటకు ఈ గ్రాంట్ ను మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వినియోగించును. మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్  కార్పస్ ఫండ్ క్రింద ఇంతవరకు 910 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 
మౌలానా ఆజాద్ సెహత్ స్కీమ్:
ఈ పధకం మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ క్రింద ఆర్ధిక సహాయం పొందుతున్న సంస్థలలోని విధ్యార్ధులకు సాంవత్సరీక హెల్త్-చెక్ ఉప్ చేయుటకు ఉద్దేశించబడినది. మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ క్రింద ఆర్ధిక సహాయం పొందుతున్న సంస్థలలో చదువుతున్న విధ్యార్ధులు తీవ్రమైన అనారోగ్యానికి గురిఐన ఆ విధ్యార్ధికి వైద్యఖర్చుల నిమిత్తం 2లక్షల వరకు అందించడం జరుగుతుంది.
వక్ఫ్ స్థలాల కంప్యూతికరణ:
వక్ఫ్ స్థలాల రికార్డులను సరిగా నిర్వహించుటకు, పారదర్శకత,సోషల్ ఆడిట్ సాదించుటకు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ల  విధులను  కంప్యూటికరించుటకు మరియు వెబ్ ఆధారిత ఒకె ఒక కేంద్రీకుత దరఖాస్తును ను  రూపొందించుటకు కేంద్రము చే  ఆర్ధిక సహాయటం అందించటం జరుగుతుంది. ఇందులకు గాను రాష్ట్రాల వక్ఫ్ బోర్డులకు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కు, నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ కు ఇప్పటివరకు 16.18 కోట్ల రూపాయలను అంధించటం జరుగుతుంది. 27 రాష్ట్రాల వక్ఫ్ బోర్డు లలో కేంద్రీకుత కంప్యూటింగ్ ఫెసిలిటీ స్థాపించబడి మరియు వక్ఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా (WAMSI) మాడ్యూల్స్ నిర్వహించబడుచున్నవి మరియు 11588 వక్ఫ్ స్థలాలవివరాలను పొందుపరచడము జరిగింది మరియు లీజు కివ్వబడిన 2725 వక్ఫ్ భూముల వివరాలను, లిటిగేషన్ లో ఉన్న 5062 వక్ఫ్ స్థలాల వివరాలను కూడా పొందు పరచడం జరిగింది.
నేషనల్ వక్ఫ్ డవలప్మెంట్ కార్పొరేషన్:
భారతదేశం లోని వక్ఫ్ స్థలాలను అబివృద్ధి పరుచుటకు నేషనల్ వక్ఫ్ దవలప్మెంట్ కార్పొరేషన్ (NWDC) స్థాపించబడినది.  
నై రోషని:
మైనారిటీ స్త్రీలలో సాధికారికత, ఆత్మ విశ్వాసం వంటి  నాయకత్వ లక్షణాల అబివృద్ధి కోసం మరియు ప్రభుత్వాధికారులతో,బ్యాంక్ అధికారులతో, మద్యవర్తులతో సంప్రదించుటకు కావలసిన నైపుణ్యం, పద్దతులను,విధానాలను నేర్చుకొనుటకుగాను  నై రోషణి పధకం ప్రభుత్వేతర సహాయ సంస్థల  ద్వారా  ను ప్రారంబించడం జరిగింది. 2012-13 లో 12 రాష్ట్రాలలో 10.45 కోట్ల రూపాయలతో 36950 స్త్రీలను  , 2013-14 లో  24 రాష్ట్రాలలో 11.96 కోట్ల రూపాయలను 60,875 స్త్రీల శిక్షణ కోసం కేటాయించడం జరిగింది.
సీఖో ఔర్ కమావో:
2013 సెప్టెంబర్ లో 100% సెంట్రల్ నిధులతో మైనారిటీల స్కిల్ దవలప్మెంట్ కోసం ప్రవేట్ వృతి శిక్షణా అభివృద్ధి సంస్థలు/కంపెనీలచే  సెఖో ఔర్ కామోవో పధకం ప్రారంబించబడినది. శిక్షణ పొందిన వారిలో 75% మందికి మరియు అందులో 50% మందికి ఆర్గనైజేడ్ సెక్టార్ లో తప్పనిసరిగా ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఈ స్కీమ్ లో 33% స్త్రీలకు ప్రవేశం కల్పించడం జరుగుతుంది. 2013-14 లో 20164 మండి మైనారిటీ యువకులకు ఈ పధకం క్రింద వృతి శిక్షణ కు గాను 17 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 
జియో పార్సి:
భారత దేశం లో నానాటికీ తగ్గిపోతున్న పార్శీ జన సంఖ్యను స్థిరీకరించుటకుగాను 2013-14 లో జియో పార్సి పధకం ప్రారంబించడం జరిగింది.2013-14 లో ఈ పధకం క్రింద 0.41 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది.
నలందా ప్రాజెక్ట్:
మైనారిటీ డిగ్రీ కాలేజీ లు,మైనారిటీలు అధికం గా ఉన్న ప్రాంతాలలోని ఉన్నత విద్యాలయాలు  మరియు మైనారిటీ విశ్వవిద్యాలయాలలో పనిచేసే అద్యాపకులు తమ అర్హతలను మెరుగు పరుచుకోవటానికి నలందా ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అలీగర్ యూనివర్సిటీ ని నోడల్ స్టాఫ్ కాలేజీ గా యూ‌జి‌సి  మార్చ్ 2014 నుంచి ఏర్పాటు చేసినది.
మైనారిటీ సైబర్ గ్రామ్:
2014 సెప్టెంబర్ లో రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లా లోని చందౌలి గ్రామంలో పబ్లిక్ ప్రవేట్ భాగస్వాయము లో  మైనారిటీలు డిజిటల్ అక్షరాస్యతను సాదించుటకు గాను మైనారిటీ సైబర్ గ్రామ్ పధకమును ప్రారంబించడం జరిగింది. 2600 గ్రామాలలో  ఈ పధకం క్రింద పైలట్ ప్రాజెక్ట్ ప్రారంబించబడును.
మైనారిటీ టుడె మ్యాగ్ జైన్:
మైనారిటీ ప్రజలతో  సత్సంబంధాలు నెలకొల్పుకొటానికి మరియు వారితో  అవగాహన సత్సంబంధాల వ్యాప్తికి హింది,ఇంగ్లిష్, ఉర్దూ భాషలలో 2014 జనవరి నుంచి మైనారిటీ త్రైమాసిక పత్రికను ప్రారంబించడం జరుగుతుంది.    
యూ‌పి‌ఎస్‌సి/ఎస్‌పి‌ఎస్‌సి/ఎస్‌ఎస్‌సి నిర్వహించే పరీక్షలలో ప్రిలిమినరీ పూర్తి చేసిన విద్యార్ధులకు ఆర్ధిక సహాయం:
దేశ వ్యాప్తంగా యూ‌పి‌ఎస్‌సి/ఎస్‌పి‌ఎస్‌సి/ఎస్‌ఎస్‌సి నిర్వహించే పరీక్షలలో ప్రిలిమినరీ పూర్తి చేసిన మైనారిటీ అబ్యర్ధులు ఫైనల్ పరీక్షలకు కావలసిన సుశిక్షణ పొందుటకుగాను ఈ పధకం క్రింద ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుంది. 2013-14 సంవత్సరములో 274 అబ్యర్ధులకు 95.25 లక్షల రూపాయలను ఆర్ధిక సహాయం క్రింద అందించడం జరిగింది.
ప్రధాన మంత్రి 15 సూత్రాల మైనారిటీ అబివృద్ధి పధకం:
11 కేంద్ర ప్రభుత్వ శాఖలు/డిపార్ట్ మెంట్  లకు చెందిన 7 స్కీములను ఈ పధకం క్రింద తేవడం జరిగింది. మైనారిటీ లు అధికంగా లేదా తగినంతగా ఉన్న జిల్లా లలోవివిధ ప్రభుత్వ శాఖలు/డెపార్ట్ మెంట్ లకు చెందిన నిధులలో 15% నిధులను  మైనారిటీలకు కేటాయించడం జరుగుతుంది.  


No comments:

Post a Comment