12 July 2014

విబిన్న దేశాలలో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు



ఇస్లాం కాలెండర్ ప్రకారం  పవిత్ర మాసం,శుభకరమైన రమదాన్ మాసం లో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ మొత్తం ముఫ్హై రోజులు చేసిన ఉపవాసం యొక్క ముగింపు వేడుక గా ఈద్-ఉల్-ఫితర్ పండుగను  నిర్వహిస్తారు.  ఈద్ యొక్క మొదటిరోజు షావ్వల్ నెల మొదటిరోజున వస్తుంది. ఈద్-ఉల్-ఫితర్ (అరబ్బీ: عيد الفطر Īdu l-Fir), ను ఈద్ అని సంక్షిప్తముగా  పిలుస్తారు.ఈద్ అనేది ఒక అరబిక్ పదం, దీనర్థం "పండుగ", ఫితర్ అర్థం "ఉపవాసం యొక్క ముగింపు" అని అర్ధం. దివ్యఖురాన్‌లో దేవుడు చేసిన ఆదేశం ప్రకారం ముస్లింలు రమదాన్ యొక్క చివరి రోజున ఉపవాసంను ముగించాలి.ఈద్-ఉల్-ఫితర్ పుట్టింది. ఈ పండుగ యొక్క ఉద్దేశ్యం శాంతిని ప్రోత్సహించడం, సోదర భావనను బలోపేతం చేయడం.కొన్ని దేశాలలో ముస్లింలు మూడురోజుల సెలవుదినాలు పాటిస్తారు.  ఆగ్నేయ ఆసియా దేశాలలో, ఈద్-ఉల్-ఫితర్‌, "గొప్పది" గా భావించబడుతుంది మరియు అక్కడ ఉన్న ముస్లింలకు ఇది చాలా ముఖ్యమైన సంబంరంగా ఉంటుంది.
ఈద్ ఉల్ ఫితర్ దినాన విబిన్న దేశాలలోని ముస్లింలు అరబిక్ లో ఈద్ ముబారక్ ("ఆశ్వీరదించబడిన ఈద్") లేదా ఈద్ సాఈద్ ("ఆనందకరమైన ఈద్")అని, టర్కీలో “బయ్‌రామినిజ్ కుట్లు ఒల్సున్” లేదా "మీ బయ్‌రామ్ “– ఈద్ - సంతోషకరంగా ఉండుగాక" అని పరస్పరం అబినంధించుకొంటారు. ఆ సంవత్సర కాలంలో ఏర్పడిన వ్యత్యాసాలను లేదా శత్రుత్వాలను మరచిపోమని మరియు క్షమించమని కూడా ఆరోజు ముస్లింలు అబ్యర్ధించుకొంటారు.
ఈద్ ఉల్ ఫితర్ రోజు, ముస్లింలు సలాతుల్ ఫజ్ర్ (సూర్యోదయానికి ముందు ప్రార్థన) చేయటానికి సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు, మరియు సున్నా సంప్రదాయాలను నిర్వర్తిస్తూ దంతధావనాన్ని మిస్వాక్ లేదా టూత్‌బ్రష్ తో చేసుకుని, ఫజ్ర్ ప్రార్థనలు అయిన తరువాత స్నానం చేస్తారు(ఘుసుల్) , నూతన వస్త్రాలు ధరించి(లేదా ఉన్నవాటిలో మంచివి), అత్తరును పూసుకుంటారు.
ఈద్ రోజు ఉపవాసం ఉండడమనేది హరాం, లేదా నిషిద్ధమైనది. అందుచే ప్రత్యేకమైన ఈద్ ప్రార్థనకు హాజరయ్యేముందు తియ్యటి అల్పాహారంను, ముఖ్యంగా ఒక కర్జూరం పండును తినమని సిఫారుసు చేయబడింది మరియు ముస్లిం లు బీదలకు మరియు అవసరంలో ఉన్నవారికి జకత్ చెల్లించవలసిన మొత్తం ఈద్ ప్రార్థన ముందు చెల్లిస్తారు.ముస్లింలు ఈద్ ప్రార్థనకు వెళ్ళేటప్పుడు తక్బీర్‌ను చదువుతారు ప్రార్థనా మైదానాల (ఈద్-గా) నుండి మరియు అక్కడి వరకూ రెండు మార్గాలను ముస్లిం లు ఉపయోగించటం సున్నత్ గా భావించబడుతుంది. ప్రార్థనలు ముగిసిన తరువాత, ముస్లింలు వారి చుట్టాలు, స్నేహితులు మరియు పరిచయస్తుల గృహాలను సందర్శిస్తారు లేదా గృహాలలో, సామాజిక కేంద్రాలలో లేదా అద్దె సమావేశ మందిరాలలో పెద్ద సామాజిక వేడుకలు జరుపుతారు. ఈదిస్ (ఈద్ బహుమతులు)లను తరచుగా పిల్లలకు మరియు దగ్గరి బంధువులకు ఇస్తారు; కొన్ని సంస్కృతులలో చుట్టాలు లేదా స్నేహితులు, పిల్లలకు డబ్బులు(ఈదిస్) ఇవ్వటం అనే సంప్రదాయం ఉంది
విబిన్న దేశాలలో ఈద్-ఉల్-ఫితర్ ఉత్సవాలుఅమెరికా సంయుక్త రాష్ట్రాలు(USA),కెనడా
అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మరియు కెనడా లోని  ముస్లింలు ఈద్ రోజు  పని నుండి సెలవు తీసుకొని ప్రార్థన కొరకు పెద్ద నగరాలలో ఉన్న ఇస్లాంమత కేంద్రాలకు(Islamic centres), సమావేశ మందిరాలకు లేదా బహిరంగ ఉద్యానవనాలకు వెళతారు.కొన్ని నగరాలలో, ప్రార్థనలకు హాజరయ్యే పెద్ద సంఖ్యలోని వారి సౌకర్యం కొరకు అనేక సమయాలలో ప్రార్థనలు జరపబడతాయి. సామాన్యంగా, ముస్లింలు ఈద్ రోజున ఒకరి ఇంటికి ఒకరు వెళతారు లేదా పెద్ద విందు భోజనాలను మసీదులలో లేదా సమావేశ మందిరాలలో ఏర్పాటు చేస్తారు.
ఈద్ పార్టీలకు అనేక మంది ముస్లింలు హాజరవుతారు. పిల్లలు బహుమతులను పొందుతారు, అందరూ తీపిపదార్థాలు, కారంతో ఉన్న పదార్థాలను మరియు రుచికరమైన పదార్థాలను తిని ఆనందిస్తారు. అనేక మంది ముస్లింలు ధనాన్ని బీదలకు దానం చేస్తారు.
ట్రినిడాడ్ మరియు టొబాగో : వెస్ట్ ఇండీస్ దీవులైన ట్రినిడాడ్ మరియు టొబాగో లో ముస్లింలు ఉత్సాహంగా ఈద్-ఇల్-ఫితర్ ను జరుపుకొంటారు. పురుషులు ప్రార్ధనలకు హాజరగుదురు. ముస్లిం స్త్రీలు,పురుషులు,పెద్దలు,పిల్లలు నూతన వస్త్రాలు దరిస్తారు. మహిళలు తమ చేతులకు హెన్న (గోరింటాకు) దరిస్తారు,

యునైటెడ్ కింగ్‌డమ్:

ఈద్-ఉల్-ఫితర్ రోజు ఉదయం సమయంలో, దక్షిణ ఆసియా సంతతి పురుషులు తావబ్ , జుబ్బా మరియు షేర్వని , మరియు మహిళలు సల్వార్ కమీజ్  దరించి  ఈద్ ప్రార్థనల కొరకు స్థానిక మసీదులకు వెళతారు, దాని తరువాత ఒకరిని ఒకరు అభినందించుకుంటారు. కొంతమంది పురుషులు ఈద్ ప్రార్థనల తరువాత మరణించిన వారిని గుర్తు చేసుకోవటానికి మరియు వారి కొరకు ప్రార్థించటానికి స్థానిక శ్మశానానికి వెళతారు. వారు ఇంటికి తిరిగి వెళ్ళి వారి కుటుంబాన్ని మరియు ఇతర ముస్లింలను మరియు నగరంలోని చుట్టాలను సందర్శిస్తారు. మరియు వారి చుట్టాల కొరకు సంప్రదాయ ఆహారం మరియు స్వీట్లను వండుతారు. బెంగాలీ వంటకాలు మరియు పాకిస్తానీ వంటకాలు అయిన సమోసాలు, సేవియా, అన్నం మరియు హందేశ్, నూనోర్ బోరా, మరియు ఫులాబ్‌లు ప్రజాదరణ పొందాయి.
ఫ్రాన్స్:
ఫ్రాన్స్ లో ఈదుల్ ఫిటర్ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఫ్రాన్స్ లో ఈద్ మూడు రోజులు నిర్వహిస్తారు. 60 లక్షల వరకు ముస్లింలు ఉన్నారు.వీరు టర్కీ,ఉత్తర ఆఫ్రికా దేశాలకు చెందినవారు. ముస్లింలు పండుగా సంధర్భంగా వస్తువులను,బట్టలను ఖరీధు చేస్తారు మరియు సమూహ ప్రార్ధనలో పాల్గొంటారు. అరబిక్ లో,టర్కీ లో  అబినందనలు,శుభాకాంక్షలు తెల్పుకొంటారు. మసీదు మీనారు లను రంగు రంగు దిపాలతోనూ, రంగు రిబ్బన్లతోనూ అలంకరిస్తారు.
టర్కీ:
టర్కీలో, ఈద్-ఉల్-ఫితర్ ను సెకెర్ బయ్‌రామ్1 ("బయ్‌రామ్ ఆఫ్ స్వీట్స్") మరియు రంజాన్ బయ్‌రామ్ı ("రామదన్ బయ్‌రామ్")గాపిలుస్తారు . ముస్లిం లు ఒకరిని ఒకరు “బయరామినిజ్ కులు ఒసూన్”, “ముట్లు బే రాంలార్”, “బయరామినిజ్ ముబరేక్ ఒసూన్” అని శుభాకాంక్షలు తెల్పుకొంటారు ఇక్కడ పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా మూడు రోజులు వేడుకల కొరకు మూసివేయబడతాయి. ఇస్తాంబుల్‌లో నీలి మసీదు మినరేట్స్ కాంతి రూపంలో ఇస్తాంబుల్ మెట్రోపాలిటన్ మునిసిపాలిటీ, సంప్రదాయమైన బయ్‌రామ్(ఈద్-ఉల్-ఫితర్) "ప్రేమించు, ప్రేమించబడు" అని శుభాకాంక్షలు ప్రకటిస్తారు.
పండుగమొదటి రోజు  కుటుంబ సభ్యులు అందరూ తెల్లవారు జామునే లేస్తారు, పురుషులు దగ్గరలో ఉన్న స్థానిక మసీదులకు ప్రత్యేక బయ్‌రామ్ ప్రార్థన చేయటానికి వెళతారు.ప్రజలు ప్రార్థనా సేవలకు హాజరుకావటానికి, మంచి దుస్తులు ధరించతారు మరియు బంధువులు,స్నేహితులను సందర్శించడం చేస్తారు మరియు మరణించిన వారికి నివాళులు అర్పించటానికి శ్మశానానికి వెళ్ళడంచేస్తారు.
పెద్ద వయస్కులైన వారి కుడి చేతిని ముద్దు పెట్టుకోవటం మరియు వారి చేతిని బయ్‌రామ్ అభినందనలు అందించే సమయంలో నుదుటి మీద పెట్టుకోవడం అనేది వారిని గౌరవించటానికి చాలా ముఖ్యమైనదిగా భావించబడుతుంది. చిన్న పిల్లలు ప్రతి ఒక్కరికీ హ్యాపీ బయ్‌రామ్ అని అభినందనలు తెలుపుతారు మరియు క్యాండీ, చాక్లెట్లు, సంప్రదాయ తీపి వంటకాలు అలానే బక్లావ మరియు టర్కిష్ డిలైట్, చిన్న మొత్తంలో ధనాన్ని బహుమతులుగా పొందుతారు,దేశవ్యాప్తంగా ఉన్న పురపాలక సంఘాలు పేదవారి కొరకు నిధుల-సేకరణ కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
ఇరాన్:
ఇరాన్ లో ఈదే-ఫితర్ పండుగను ఘనంగా జరుపుతారు. దానాలు ఘనముగా చేస్తారు. ఉదయము ప్రార్ధనలతో గడుపుతారు ఆతరువాత కుటుంభ సబ్యులతో కలసి పెద్దలను,స్నేహితులను,బంధువులను దర్శిస్తారు. పేదవారికి అవసరము ఉన్న వారికి ఆహారం అందచేస్తారు. పిత్రా లేదా ఫిత్రే దానం చేయుట ప్రతి ముస్లిం విధిగా భావిస్తారు.
సౌదీ అరేబియా:
ఈద్-ఉల్-ఫితర్‌ను గొప్ప ఉత్సాహంతో సౌదీ అరేబియాలో జరుపుకుంటారు. సౌదీలు వారి గృహాలను అలంకరించుకుంటారు మరియు కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల కొరకు దివ్యమైన భోజనాన్ని తయారు చేస్తారు. సౌదీ కుటుంబాలు  ఈద్ ప్రార్థనల తరువాత. కుటుంబ సభ్యులకు,పిల్లలకు  బహుమతుల సంచులను అందిస్తారు. దుకాణాదారులు ఈద్ కొనుగోలుపై ఉచిత ఈద్ బహుమతులను అందిస్తారు.పెద్ద మొత్తాలలో బియ్యం మరియు ఇతర ముఖ్య ఆహార వస్తువులను బీదవారి ఇంటి వాకిళ్ళ ముందు అనామకంగా ఉంచటం కూడా సంప్రదాయంగా ఉంది.

ఈజిప్ట్:

ఈద్ ఎల్-ఫితర్ అనేది ఈజిప్ట్ లో   మూడు రోజుల సంబరం మరియు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మరియు రెస్టారంటులు మూసివేయబడతాయి.  ఈద్ రోజు అల్పాహారంతో మొదలవుతుంది, దాని తరువాత పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు ఈద్ ప్రార్థనలు చేస్తారు.ఇమామ్ ఈద్ సమయంలో మరియు సంవత్సరంలో చేయవలసిన మంచి కృత్యాలు మరియు పుణ్యాలను జ్ఞప్తి చేస్తారు.
తరువాత, చుట్టుప్రక్కలవారు, స్నేహితులు మరియు బంధువులు ఒకరిని ఒకరు "ఈద్ ముబారక్" (ఈద్ ఆశ్వీరదించబడింది) అని అభినందించుకొంటారు. ఈద్ మొదటిరోజున కుటుంబాలను సందర్శించటం చేస్తారు.మిగిలిన రెండు రోజులు పార్కులు, సినిమాలు, థియేటర్లు లేదా సముద్ర తీరాలకు వెళ్ళి ఆనందించుతారు. ఈద్ సమయంలో పిల్లలకు నూతన వస్త్రాలు ఇవ్వబడతాయి. మహిళలకు ముఖ్యంగా తల్లులు,భార్యలు, అక్కచెల్లెళ్ళు మరియు కూతుర్లకు ప్రత్యేకమైన బహుమతులను అందిస్తారు. పిల్లలు నూతన వస్త్రాలను ధరిస్తారు మరియు పెద్దలనుంచి ఈదియా పొందుతారు. ఈజిప్టియన్ కహ్క్అనే  రొట్టె తింటారు ఇది గింజలు,కుకీస్ మరియు చక్కెర పొడితో నిండి ఉంటుంది. . ఈజిప్టులో  ఈద్ రోజు TVలో వరుసగా చిత్రాలను వేయటం మరియు ఈద్ ఉత్సవాల ప్రత్యక్షప్రసారాల కార్యక్రమాలను ప్రసారం చేయడం జరుగుతుంది. ఈజిప్షియన్లు ఇతరులతో కలసి వేడుక చేసుకోవటం ఇష్టపడతారు, అందుచే ఈద్ యొక్క పగళ్ళు మరియు రాత్రివేళలలో ఈజిప్ట్ వీధులు రద్దీగా ఉంటాయి.
ఆఫ్ఘనిస్తాన్:
ఆఫ్ఘనిస్తాన్  లో, ఈద్ ను మూడు రోజులు జరుపుకుంటారు. పర్షియన్-మాట్లాడే ప్రాంతాలలో ఈద్‌ను "ఈద్-ఏ-రంజాన్" అని పిలుస్తారు మరియు పాష్టో-మాట్లాడే ప్రాంతాలలో దీనిని "కోచ్‌నై అఖ్తర్" అని పిలుస్తారు.ఆఫ్ఘనిస్తాన్‌లో, ఈద్ పండుగ కొరకు పది రోజుల ముందుగానే ఇళ్ళను శుభ్రపరుచుకోవటం ఆరంభిస్తారు. ఈ చర్యను పర్షియన్ లో ఖనా తకాని అంటారు. మార్కెట్లకు వెళ్ళి నూతన వస్త్రాలు, స్వీట్లను మరియు ఇతర తినుబండారాలు సేమ్యా, నాకోడ్ షోర్ వా టోండ్, కేక్ కా కోల్చను కొనుగోలు చేస్తారు.
ఈద్ రోజున, ఆఫ్ఘన్లు ఈద్ ప్రార్థనల తరువాత వారి కుటుంబాలతో కలసి ఒకరిని ఒకరు "ఈదెత్ ముబారక్ రోజా వా నమాజెత్ హాజీహా వా ఘజిహా" అభినందనలు చెప్పుకుంటారు, దీనర్థం "మీకు ఆనందకరమైన ఈద్ మరియు మీ ఉపవాసం మరియు ప్రార్థనలు భగవంతుడు ఆమోదించుగాక మరియు హజ్-తీర్థయాత్రకు వెళ్ళే వారిలో మీరు ఉండుగాక" అని ఉంది. కుటుంబ పెద్దలు పిల్లలకు ధనాన్ని ఇస్తారు. ఇతరుల కుటుంబాలను మరియు స్నేహితులను సందర్శించటం అనేది చాలా సాధారణ విషయం.

దక్షిణ ఆసియా(భారత ఉపఖండం లో)

పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ మరియు నేపాల్‌లో, ఈద్ ముందు రాత్రిని చాంద్ రాత్ “చంద్రుని రాత్రి." అని అంటారు. ఈ దేశాలలోని ముస్లింలు ఈద్ షాపింగ్ కొరకు బజార్లు మరియు షాపింగ్ మాల్స్‌కు తరచుగా వెళతారు. మహిళలు ముఖ్యంగా ఆడపిల్లలు సంప్రదాయ మెహందీ , లేదా గోరింటాకును వారి చేతులకు మరియు కాళ్ళకు పెట్టుకుంటారు మరియు రంగురంగుల గాజులను వేసుకుంటారు.
సంప్రదాయ ఈద్ అభినందన ఈద్ ముబారక్ , మరియు అభినందించుకున్న తరువాత మర్యాదప్రకారమైన ఆలింగనం తరచుగా చేయబడుతుంది. బహుమతులను ఇవ్వబడతాయినూతన వస్త్రాలు మరియు పిల్లలకు వారి పెద్దలు చిన్న మొత్తాలలో ధనాన్ని (ఈదీ ) ఇస్తారు. పిల్లలు సలాంను వారి తల్లితండ్రులకు మరియు పెద్దలయిన బంధువులకు తెలపటం సాధారణంగా జరుగుతుంది.ఈద్ ప్రార్థనల తరువాత, అనేక కుటుంబాలు శ్మశానాలకు వెళ్ళి చనిపోయిన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. ముస్లిమేతర వారు కూడా ఈద్ రోజున ముస్లిం స్నేహితుల ఇంటికి వెళ్ళి వారి శుభాభివందనలను అందిస్తారు. అనేక మంది ప్రజలు జకత్‌ను ఇస్తారు
పాకిస్తాన్, భారతదేశం, మరియు బంగ్లాదేశ్‌లోని పండుగ వంటలలో సెవయ్యా ఉంటుంది, ఈ రుచికల వంటకాన్ని వేయించిన సేమియా నూడల్స్, పాలు మరియు ఎండిన ద్రాక్షలతో చేయబడుతుంది. బంగ్లాదేశ్ లో, ఈ వంటకాన్ని షేమై ( బెంగాలీ: সেমাই ) అంటారు. బంగ్లాదేశ్‌లో, చోట్-పోటి అనే వంటకం కూడా ఈద్ సమయంలో ప్రముఖమైనది
ఇండోనేసియా, సింగపూర్, మలేషియా, మరియు బ్రునై
 ఇండోనేసియాలో ఈద్‌ను ఇదుల్ ఫిత్రి లేదా లేబరన్ ముదిక్ అని పిలుస్తారు ఇండోనేషియా లో ఇది జాతీయ సెలవుదినంగా ఉంది. చాలా బ్యాంకులు, ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలు లెబరన్ సంబరాల యొక్క సమయంలో మూసివేస్తారు ఇండోనేసియాలో ఇదుల్ ఫిత్రి న అందరు ఉద్యోగస్థలకు జీతం బోనస్‌ గా ఇవ్వబడుతుంది. దీనిని తుంజగన్ హరి రాయా అని పిలుస్తారు. ఇదుల్ ఫిత్రి యొక్క కొన్ని రోజుల ముందుగానే షాపింగ్ మాల్స్ మరియు బజార్లు ప్రజలతో నిండిపోతాయి, ఇండోనేషియాలో, ప్రజలు వారి బంధువులను సందర్శించటం,క్షమాపణలు కోరడం లేదా మొత్తం కుటుంబంతో ఈద్ జరుపుకోవటం అనేది సంప్రదాయంగా ఉంది.దీనిని  ముదిక్ , పులాంగ్ కమ్పుంగ్  అందురు. ఇండోనేషియా ఈద్ ముందు రోజు ముఖ్యంగా   పల్లెప్రాంతాలలో, పెలిట లేదా పంజుట్ లేదా లంపు కలోక్ అనే తైల దీపాలు, వెలిగిస్తారు ఇవి ఇంటి బయట మరియు చుట్టుప్రక్కల ఉంచుతారు. ప్రత్యేక వంటలు కేటుపాట్, డోడొల్, లెమాంగ్ (ఒక రకమైన జిగురువంటి అన్నం ముద్దను కర్రల మీద వండుతారు) మరియు ఇతర ఇండో-మాలే వంటలను ఆ రోజు ఆరగించడం జరుగుతుంది.
ప్రజలు ఒకరిని ఒకరు "సెలామత్ ఇదుల్ ఫిత్రి" లేదా "సలాం అయ్‌దిల్‌ఫిత్రి" లేదా అని అభినందనలు తెలుపుకుంటారు, దీనర్థం "హ్యాపీ ఈద్". ముస్లింలు ఒకరికి ఒకరు "మోహాన్ మాఫ్ లాహిర్ దాన్ బాతిన్" అని అభినందనలు తెలుపుకుంటారు. ముస్లిం-ఇండోనేషియన్లు సంప్రదాయ సాంస్కృతిక దుస్తులను ఈద్-ఉల్-ఫితర్ నాడు ధరించటం ఆచారంగా ఉంది.. ప్రార్థన ముగిసిన తరువాత, ఇండోనేషియా ముస్లింలు వారి ప్రియమైన వారి కొరకు శ్మశానంకు వెళతారు. అక్కడకు వెళ్ళినప్పుడు, వారు శ్మశానం శుభ్రం చేసి, యాసీన్ దువా చదువుతారు,
ఇండోనేషియాలో ముస్లిం-ఇండోనేషియన్లు కుటుంబంలోని, చుట్టుప్రక్కల ప్రాంతాలలో లేదా వారి పని వద్దనున్న పెద్దలను కలిసి మర్యాదను చూపించుకుంటారు దీనిని  హలాల్ బి-హలాల్ అందురు.ఇదుల్ ఫిత్రి రోజు పిల్లలకు పెద్దలు ధనాన్ని ఇస్తారు. వారు మెరియమ్ బాంబు రామదన్ అని పిలవబడే సంప్రదాయమైన వెదురు ఫిరంగి మందుగుండు సామానును కాలుస్తారు.
ఈద్‌ను హరి రాయ ఎయ్‌దిల్‌ఫిత్రి , హరి రాయ ఇదుల్ ఫిత్రి లేదా హరి రాయ పౌసా అని పిలవబడుతుంది. హరి రాయ కు సాహిత్యపరమైన అర్థం 'పండుగ దినం'. బ్రునై, మలేషియా మరియు సింగపూర్‌లో కూడా ఇది జాతీయ సెలవుదినంగా ఉంది.బంధువులను సందర్శించడం, వారిని క్షమాపణలు కోరడం, పెద్దల ఆశ్విర్వాదాలను పొందటం ను మలేషియన్‌లో బలిక్ కమ్పుంగ్ అని అందురు. మలేషియాలోని అనేక భాగాలలో ముఖ్యంగా పల్లెప్రాంతాలలో, పెలిట లేదా పంజుట్ లేదా లంపు కలోక్ అనగా తైల దీపాలు వెలిగిస్తారు మరియు ఇంటి బయట మరియు చుట్టుప్రక్కల ఉంచుతారు. ప్రత్యేక వంటలు కేటుపాట్, డోడొల్, లెమాంగ్,న్యోనా  మరియు ఇతర ఇండో-మాలే  వంటలను వండుతారు..
ప్రజలు ఒకరిని ఒకరు "సెలామత్ ఇదుల్ ఫిత్రి" లేదా "సలాం అయ్‌దిల్‌ఫిత్రి" లేదా "సెలామత్ హరి రాయ"(మలేషియాలో)అని అభినందనలు తెలుపుకుంటారు, దీనర్థం "హ్యాపీ ఈద్". ముస్లింలు ఒకరికి ఒకరు "మాఫ్ జహిర్ దాన్ బాతిన్" అని మలేషియాలో అభినందనలు తెలుపుకుంటారు. ముస్లిం-మలేషియన్లు సంప్రదాయ సాంస్కృతిక దుస్తులను ఈద్-ఉల్-ఫితర్ నాడు ధరించటం ఆచారంగా ఉంది.
ప్రార్థన ముగిసిన తరువాత, మలేషియా లో అనేక మంది ముస్లింలు వారి ప్రియమైన వారి కొరకు శ్మశానంకు వెళతారు. అక్కడకు వెళ్ళినప్పుడు, వారు శ్మశానం శుభ్రం చేసి, యా-సీన్ చదువుతారు, ఇదుల్ ఫిత్రి అనేది పిల్లలకు చాలా ఆనందకరమైన రోజు, ఎందుకంటే పెద్దలు వారికి ధనాన్ని ఇస్తారు. మలేషియాలో, పిల్లలకు డబ్బులను వారి తల్లితండ్రులు లేదా పెద్దల నుండి పొందుతారు, దీనిని "దూయిత్ రాయ" అంటారు.
మారిషస్:
మారిషస్ లో ముస్లింలు 15% ఉన్నారు. ఈద్ రోజు ప్రభుత్వ సెలవు ఇవ్వబడింది. ఉదయం పురుషులు ప్రార్ధనలకు హాజరగుదురు. ప్రార్ధనల అనంతరం బిర్యానీ తో కూడిన విందు భోజనం ఏర్పాటు చేయబడుతుంది. సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయబడును.    
బర్మా (మయన్మార్)
ఈద్-ఉల్-ఫితర్ ను  బర్మీస్ ముస్లింలలో ఒక రోజు జరుపుకొంటారు.వారు దీనిని ఈద్ నీ (నీ=రోజు) లేదా ఈద్ కా లే (కా లే=చిన్న) లేదా షై మై ఈద్ (షై మై= స్వీటు)అందురు.  బర్మీస్ ముస్లింలు ప్రధానంగా సున్నీ ఇస్లాంలోని హనాఫీ  న్యాయవిధానాన్ని అనుసరిస్తారు
ఈద్‌ సమయంలో, సంప్రదాయ అభినందనగా అస్సలాములైకుం  ఉంటుంది, మరియు ఈద్ ముబారక్  చెప్పబడుతుంది. బహుమతులు మరియు ఆహారం, బంధువులలో పెద్దవారికి మరియు ముస్లిమేతర యజమానులకు మరియు ప్రభుత్వ అధికారులకు తరచుగా ఇవ్వబడతాయి. నూతన వస్త్రాలు కుటుంబ సభ్యులకు మరియు సహచరులకు ఇవ్వబడతాయి, బర్మీస్ ముస్లింల పెద్దలు ఈదీ పురస్కారాలను పిల్లలకు ఇస్తారు.. ఈద్ సమయంలో, బర్మీస్ ముస్లింలు తల్లితండ్రులను మరియు పెద్దలను ఇంకా వారిని వారు క్షమాపణలు కోరతారు మరియు ఒకరితో ఒకరికి ఏర్పడిన అభిప్రాయభేధాలను క్షమించమని మరియు మర్చిపోవటానికి ప్రయత్నించమని కోరతారు.
బర్మీస్ ముస్లింలు విద్యుద్దీపాలు, ప్రమిదలు లేదా రంగురంగుల బల్బులతో ఇల్లు అలంకరించుకోవడం చేస్తారు. సేమ్యాను వేయించిన జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, ఎండుద్రాక్ష మరియు పాలతో బర్మీస్ ముస్లింలు ఈద్ సమయంలో తింటారు.

ఫిలిప్పీన్స్;

ఈద్-ఉల్-ఫితర్ ను "వాకస్ నగ్ రామదన్ " ("రామదన్ ముగింపు") గాలేదా  "రామదన్ "గాపిలుస్తారు.దీనిని ఫిలిపినో ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించినది. ఫిలిప్పీన్స్ లో బిన్న  మతాల మధ్య శాంతిని ప్రోత్సహించటానికి ఈద్-ఉల్-ఫితర్ తోడ్పడుతుంది. ఈద్ రోజు ముస్లిం సమాజం ప్రార్థనలు మరియు సంబరాలు చేసుకొంటారు.

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ మొత్తం 18 మిలియన్ల మంది ముస్లింలు  ఉన్నారు,. చైనాలో ఈద్ ఒకరోజు లేదా మూడు రోజుల సెలవుదినాలను కలిగిఉంది. పండుగా రోజున ప్రభుత్వ ఏజన్సీలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు లేదా వ్యాపారాలచే సంక్షేమ పథకంలో భాగంగా మాంసం, గొర్రెపిల్ల మరియు గొడ్డుమాంసంను సరఫరా చేయబడుతుంది.
యున్నన్ రాష్ట్రంలో, ముస్లిం ప్రజలు ఈద్-ఉల్-ఫితర్ రోజున, ప్రార్థనలు అయిన తరువాత సయ్యిద్ 'అజల్ యొక్క సమాధి వద్దకు వస్తారు. అక్కడ, వారు ఖురాన్ నుండి పంక్తులను చదువుతారు, తరువాత వారు గోరీని శుభ్రపరుస్తారు, ప్రస్తుతం చైనా లోని కొన్ని ప్రాంతాలలో రామాదాన్ ఉపవాసాలు నిర్వహించడం పై నిషేదాలు ఉన్నాయి.

టునీషియా

టునీషియాలో  మూడు లేదా నాలుగు రోజులు వేడుకలు జరుపుకొనబడతాయి. "బక్లావా" (బక్లావ) మరియు "కాక్" అనే  ప్రత్యేక బిస్కట్లను ఈ రోజున స్నేహితులు మరియు బంధువులకుపంచుతారు. మగవారు తెల్లవారు జామునే మసీదులకు వెళతారు పెద్దలు,పురుషులు,మహిళలు,పిల్లలు నూతన  వస్త్రాలు ధరిస్తారు.రు.ఇంటిలో భారీస్థాయిలో ఆహారాన్ని తయారుచేస్తారు. పగటిపూట, నృత్యాలు మరియు సంగీతంతో ఆనందిస్తారు. రోజంతా సంబరాలు కొనసాగుతాయి బహుమతులు ఇవ్వబడతాయి

దక్షిణాఫ్రికా

ఈద్-ఉల్-ఫితర్ పండుగ రోజు పురుషులు ఈద్ ప్రార్థన కొరకు పొద్దున్నే మసీదుకు వెళ్ళి జరుపుకుంటారు. దీని తరువాత బంధువులు మరియు ఇరుగుపొరుగు వారి వద్దకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజలు నూతన వస్త్రాలను ధరిస్తారు, బిస్కట్లు, కేకులు, సమోసాలు, బజ్జీలు మరియు పుల్లని పదార్థాలను సందర్శకులకు అందిస్తారు. పెద్ద కుటుంబ సమూహాలలో మధ్యాహ్న భోజనం వడ్డించబడుతుంది పిల్లలు కుటుంబ పెద్దలు, బంధువులు మరియు ఇరుగుపొరుగువారి నుండి బహుమతులను మరియు డబ్బును పొందుతారు..

నైజీరియా

నైజీరియా లౌకిక దేశము. ఈద్‌ను ప్రముఖంగా "స్మాల్ సల్లా" అని నైజీరియాలో పిలుస్తారు మరియు ప్రజలు ఒకరిని ఒకరు సంప్రదాయ అభినందనలతో అభినందనలు తెలుపుతారు: "బర్కా దా సల్లా," దీనర్థం హౌసా భాషలో "సల్లానాడు అభినందనలు" అని అంటారు. ప్రార్ధనల తరువాత ముస్లిం లు విందు భోజనము  చేస్తారు.
సోమాలియా:
సోమాలియా లో ముస్లింలు సంప్రదాయకంగా ఈదుల్ ఫిటర్ పండుగను జరుపుకొంటారు మరియు ఉదయం ప్రార్ధనల అనంతరం విందు  భోజనం ఏర్పాటు చేస్తారు అందులో ప్రత్యేకమైన వంటకాలు అల్వో లేదా హల్వా వడ్డిస్తారు

ఫిజి

ముస్లింలు ఫిజీ యొక్క మొత్తం జనాభాలో దాదపు 7% మంది ఉన్నారు,. ఇస్లాం సమాజంలో ప్రజలు అధికంగా భారతీయ మూలాన్ని కలిగి ఉన్నారు, ఫిజీలోని ముస్లింలు అధికంగా సున్నీలు, హనాఫీ పాఠశాల యొక్క న్యాయవిధానంను పాటించేవారు ఫిజీలో ఈద్-ఉల్-ఫితర్ రోజున ముస్లిం పురుషులు ఈద్ ప్రార్థన కొరకు మసీదుకు హాజరయ్యి పండుగను జరుపుకుంటారు. తరువాత చుట్టాల వద్దకు మరియు ఇరుగు పొరుగువారి వద్దకు వెళ్ళడం చేస్తారు. పిల్లలు బహుమతులను మరియు ధనాన్ని కుటుంబంలోని పెద్దలు, బంధువులు మరియు ఇరుగుపొరుగు వారిచే పొందుతారు. ముస్లింలు ఈ రోజున నూతన వస్త్రాలు ధరిస్తారు, మరియు సేమ్యాను అందరికీ అందిస్తారు, ఈ తీపి వంటకాన్ని వెర్మిసెల్లి నూడిల్స్‌ను వేడి పాలతో కలిపి చేస్తారు. దీనితోపాటు సమోసాలను, కోడిమాంసం మరియు గొడ్డుమాంసంను మరియు తీపి పదార్థాలను భారతీయ తినుబండారాలను భుజిస్తారు.  సంప్రదాయ ఈద్ అభినందన ఈద్ ముబారక్ , మరియు దీని తరువాత మర్యాద పూర్వకంగా ఆలింగనం చేసుకోవడం ఉంటుంది.
ఆస్ట్రేలియా:
ఆస్ట్రేలియా లో అక్కడి ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉదయాన్నే ఈదుల్-ఫితర్ ప్రార్ధనలకు హాజరుఅగుదురు. ప్రార్ధనలను స్టేడియంలు, లేదా పెద్ద క్రీడా స్థలాలలో నిర్వహించేదరు. ఆస్ట్రేలియా లోని అన్నీ నగరాలలో ప్రార్ధనలు నిర్వహించబడును.కుటుంబవాసులు,బంధువులు,స్నేహిహితులు  ఒకరినొకరు శుభాకాంక్షలు తెల్పుకొంటూ ఒకరినొకరు మన్నించమని క్షమాపనలు కోరుకకొందురు. పేదలకు,నిర్భాగ్యులకు ధనసహాయం,బియ్యం,గోధుమలు,రొట్టె  చేయుదురు. విందు భోజనానికి స్నేహితులను,ఇతరులను,పేదలను ఆహ్వానించేదరు. ముస్లింలు కొత్తబట్టలను దరించేదరు,ఇళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించేదారు.
జర్మనీ:
జర్మనీ లో నాలుగు మిలియన్ల ముస్లింలు ఉంటారు. పండుగ సంధర్భంగా ముస్లిం లు ఆహారపదార్ధాలను,బట్టలను కొనుగోలు చేస్తారు. పురుషులు ఉదయాన్నే పండుగ ప్రార్ధనలకు హాజరగుదురు. ఈద్ సంధర్భంగా ప్రత్యేక వంటకాలు, ఉత్సవాలు,టి‌వి ప్రోగ్రామ్స్ నిర్వహించబడును. ఇతర మతాలకు చెందిన స్నేహితులు, నాయకులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెల్పుతారు.





No comments:

Post a Comment