22 December 2015

మీలాదే నబి

 మౌలిద్ (అరబ్బీ :مولد) లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామీయ కేలండర్ లోని మూడవ నెల 'రబీఉల్-అవ్వల్' 12వ తేదీన వస్తుంది.
మౌలిద్ అనునది సాధారణంగా జన్మదినోత్సవం కొరకు వాడుతారు. ఈజిప్టుదక్షిణాసియా లో ఇది సర్వసాధారణపదం.
మౌలిద్ అనేపదం అరబ్బీ మూల పదం' ولد ' ( వల్ద్ ), అనగా 'జన్మనిచ్చు' 'సృష్టించు'. సమకాలీన వ్యవహారంలో 'మౌలిద్' 'మీలాద్-ఉన్-నబి' కు ప్రతిరూపం.
'మీలాద్-ఉన్-నబి' కు ఇతరపేర్లు క్రింది విధంగానూ వున్నాయి :
·        మౌలిద్ అన్-నబి (బహువచనం. అల్-మౌలీద్) - ముహమ్మద్ ప్రవక్త జయంతి. (అరబ్బీ)
·        మీలాద్ అన్-నబి - మహమ్మద్ ప్రవక్త జయంతి (అరబ్బీ / ఉర్దూ)
·        మవ్ లిద్ షరీఫ్ - ఆశీర్వదించ బడ్డ జన్మ (టర్కిష్)
·        మౌలూద్ షరీఫ్ - ఆశీర్వదించ బడ్డ జన్మ (ఉర్దూ)
·        జద్రుజ్-ఎ పయంబర్-ఎ ఆజమ్ / మీలాద్-ఎ నబీ-ఎ అక్రమ్ - మహాప్రవక్త గారి జన్మదినం (పర్షియన్)
·        ఈద్ అల్-మౌలిద్ అన్-నబవి - ముహమ్మద్ జన్మదిన పర్వం (అరబ్బీ)
·        ఈద్-ఎ-మీలాద్-ఉన్-నబీ - ముహమ్మద్ గారి జన్మదిన పండుగ (ఉర్దూ)
·        మౌలిద్ ఎన్-నబౌవి - అల్జీరియన్ (ఉత్తర ఆఫ్రికా)
·        యౌమ్ అన్-నబీ - ప్రవక్త గారి దినం (అరబ్బీ)
·        మౌలీదుర్-రసూల్ - వార్తాహరులవారి (ముహమ్మద్ ప్రవక్త) జన్మదినం (బహాసా మలేషియా / మలయ్)

'మీలాద్-ఉన్-నబి' పండుగ ప్రారంభo- విశేషాలు:
అబ్బాసీయ ఖలీఫా హారూన్ అల్-రషీద్ తల్లి 'అల్-ఖైజురన్', తన కాలంలో ఇస్లామీయ ప్రవక్త యగు ముహమ్మద్ యొక్క జన్మతిథిని పునస్కరించుకొని, మౌలీద్ షరీఫ్ (ప్రవక్త జయంతి ఉత్సవాలు) ప్రారంభించింది. ముహమ్మద్ ప్రవక్త జన్మించిన ఇంటిని, ఖైజురన్, ఓ ప్రార్థనాలయంగా మార్పు చేసింది.  ముహమ్మద్ ప్రవక్త పరమదించిన నాలుగు శతాబ్దాలవరకూ, జన్మదినోత్సవాన్ని ఎవరూ జరుపుకున్నట్లు ఆధారాలు లభించలేదు. తరువాతనే ఇవి ఈజిప్టు లో ఆరంభమైనవి.  
ఫాతిమిద్ ఖలీఫాల కాలంలో, వీరు, ముహమ్మద్ ప్రవక్త కుమార్తె యగు ఫాతిమా జహ్రా వంశస్థులు, వీరు మొదట 'మీలాదె నబీ' ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు,సూఫీ తరీఖాలకు అనుగుణంగా వుండేవి.  ఈ ఉత్సవాలు, దిన సమయాన జరుపుకునేవారు. ఈ ఉత్సవాలలో అహలె బైత్ (ముహమ్మద్ ప్రవక్త వంశస్థులు) కు, ప్రధాన ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఖురాన్ ను పఠించేవారు, ఇతర సాంప్రదాయక కార్యక్రమాలు నిర్వహించేవారు.
వివిధ దేశాలలో'మీలాద్-ఉన్-నబి':
చరిత్రలో సున్నీ ముస్లిం లలో మొదటి ఉత్సవాలు 12వ శతాబ్దం సిరియా లో నూరుద్దీన్ ఆధ్వర్యంలో జరిగాయి. అదే విధంగా స్పెయిన్ మరియు మొరాకో లోనూ జరిగాయి.  1207 ఇరాక్ లోని మోసుల్ పట్టణంలో 'మౌలీద్' లేదా 'మీలాద్' ఉత్సవాలు ఆరంభమైనవి.  
ఈ ఉత్సవాలు ప్రపంచమంతటా వ్యాపించినవి. ఈజిప్టు లోని కైరో నగరానికీ వ్యాపించినవి. ఉస్మానియా ఖలీఫాయగు మురాద్ 3 కాలంలో ఉస్మానియా సామ్రాజ్యం లోకి ఇవి 1588 లో ప్రవేశించాయి. 1910, లో ఉస్మానియా సామ్రాజ్యంలో, జాతీయ పర్వంగా ప్రకటింపబడినది. అనేక దేశాలలో కూడా మీలాద్, అధికారికంగా గుర్తింపబడినది.
మలేషియా లోని ముస్లింలు మీలాదెనబి పర్వదినాన్ని "మౌలీద్-ఎ-రసూల్" గా జరుపుకుంటారు.
మీలాదె నబి పండుగ జరుపుకొనే విధానం:
మీలాదె నబి జరుపుకునే సాంప్రదాయం లో, మస్జిద్ లను అలంకరిస్తారు, మీలాద్ లను జరుపుకునే ప్రదేశాలను, మీలాద్ ఘర్ లనూ అలంకరిస్తారు. ముహమ్మద్ ప్రవక్త ప్రాశస్తాన్ని, జీవనగాధను, జీవనశైలి గురించి వర్ణిస్తారు. ఖసీదా బుర్దా (ముహమ్మద్ ప్రవక్త శ్లాఘన) లను పఠిస్తారు. దైవమార్గంలో ధనాన్ని ఇతరవస్తువులను ఖర్చు చేస్తారు. పిండి వంటకాలను తయారుచేసి పంచిపెడతారు. నాత్ క్వానీ (నాత్ లను పఠించడం లేదా రాగయుక్తంగా పాడడం) సర్వసాధారణంప్రపంచ నలుమూలలలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు 

మౌలిద్ పఠనాలు
జన్మదినోత్సవాన్ని మౌలీద్ అంటారు, అలాగే ముహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా, వీరి ప్రాశస్తాన్ని గాన రూపంలోనూ పాడతారు. ఈ పాటలనీ "మౌలీద్" అని అంటారు.  ఈ మౌలీద్ లలో ప్రవక్తగారి జీవనం గూర్చి విపులంగా వివరిస్తారు. అందులో క్రింది విషయాలు వుంటాయి:

·        ముహమ్మద్ ప్రవక్త పూర్వీకులు
·        ముహమ్మద్ ప్రవక్త
·        ముహమ్మద్ ప్రవక్త గారి జననం
·        హలీమా (దాయి) గురించి
·        బెదూయిన్ తెగల మధ్య ముహమ్మద్ ప్రవక్త గారి బాల్యం
·        అనాధగా ముహమ్మద్ ప్రవక్త
·        అబూతాలిబ్ యొక్క కారవాన్ లతో ముహమ్మద్
·        ఖదీజా తో వివాహం
·        హిరా గుహ మరియు ప్రథమ సందేశం
·        ఇస్లాంలో ప్రథమ ప్రవేశాలు
·        హిజ్రత్ లేదా మదీనాకు వలస
·        ప్రవక్త గారి మరణం

అలాగే అనేక రకాలుగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో అనేక ప్రాంతాలలో ఈ ఉత్సవాలు పలు రకాలుగా జరుపుకుంటారు. ఆయా ప్రాంతాలలోని సభ్యతా సంస్కృతుల రీతులు కానవస్తాయి.

No comments:

Post a Comment