16 December 2015

Muslims are an Asset to America -ముస్లిం లు అమెరికా కు సంపద కాని నష్టం కాదు.








ముస్లింల పట్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వైఖరి 2 వ ప్రపంచ యుద్ధం లో  మానవ జాతి చరిత్ర లో అత్యంత బాధాకరమైన విషాదాలలో  ఒకటి అయిన  యూదుల పట్ల  నాజీలు అనుసరించిన   అసహ్యకరమైన  వైఖరిని గుర్తుకు తెస్తుంది.  ముస్లింలు ఎల్లప్పుడు అమెరికన్ సమాజంలో అంతర్భాగంగా ఉన్నారు. కాని  అమెరికా లోనికి   ముస్లింల ప్రవేశం పై  నిషేధం విధించాలని  సూచిస్తూ చేసిన  డోనాల్డ్ ట్రంప్ యొక్క ప్రకటన చాలా వేధించేది మరియు అర్థంలేనిది.  ముస్లిం దేశాలతో అమెరికా యొక్క అపారమైన వాణిజ్య మరియు సంబందాలు మరువ లేనివి.  అంతకంటే అటువంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన డోనాల్డ్ ప్రకటన  స్వయంగా అమెరికా ప్రజలను  ను  బాధించినది.

అమెరికా కు మొదటి నుంచి ఇస్లాం తో సత్సంభoదాలు కలవు. కొలoబస్ కన్నా ముందే అమెరికాను కనుగొన్నవారు ముస్లింలు. అమెరికా స్వతంత్ర యుద్దంలో ముస్లింలు పాల్గొన్నారు:  అమెరికా ను గుర్తించిన మొదటి దేశం మొరాకో. మొదటినుండి అమెరికా లో ముస్లిం లకు మతస్వాతంత్రం ప్రసాదించబడినది.1805 లోనే అమెరికా ప్రెసిడెంట్ థామస్ జఫర్ సన్ అద్యక్ష భవనం వైట్ హౌస్ లో ఇఫ్తార్ విందు ఇచ్చినారు.

వాస్తవానికి అమెరికా మొదటినుంచి ఇస్లాం ను ఆదరించినది. అమెరికా అద్యక్షుడు థామస్ జఫర్సన్ స్వయంగా అరబ్బీ నేర్చుకొని దివ్య ఖురాన్ చదివే వాడు. జాన్ ఆడం ప్రవక్త మహమ్మద్ () ను గొప్ప సత్యాన్వేషకునిగాభావించాడు. బెంజమిన్ రూష్ బైబిల్ తో పాటు కన్ఫిషియస్,మహమ్మద్ ప్రవక్త భోదనలను యువకులు/విద్యార్ధులు  అద్యయనం చేయాలని అనేవాడు.జార్జ్ వాషింగ్టన్ మౌంట్ వెర్నోన్ లో తనతో కలసి పనిచేయమని ముస్లింలను స్వయంగా ఆహ్వానించినాడు. 1797 ట్రిపోలి సంధిలో అమెరికా తాను ముస్లింల చట్టాలు,మతం, శాంతి కి వ్యతిరేకం కాదని స్పష్టం చేసినది.

అమెరికా స్వాతంత్ర్య ప్రకటన మరియు అమెరికా రాజ్యాంగం పై దివ్య ఖురాన్ ప్రభావం కలదు.ఆదర్శ మదీనా రాజ్యా౦గం లోని కొన్ని భాగాలు  అమెరికా స్వాతంత్ర ప్రకటన లోను, అమెరికా రాజ్యాoగం లోను కనిపిస్తాయి. థామస్ జఫర్సన్ మదీనా రాజ్యాంగం ప్రబావం తో అమెరికా స్వాతంత్ర ప్రకటనలో జీవిత, స్వేచ్ఛ, మరియు ఆనందం పోoదే  హక్కులను చేర్చినాడు.అమెరికా పూర్వపు అద్యక్షులు థామస్ జఫర్సన్ మరియు జాన్ ఆడమ్ లకు ఇస్లామిక్ జ్ఞానము దివ్య ఖురాన్ తో పరిచయం కలదు. నేటి అమెరికా అద్యక్షుడు బారక్ హుస్సియన్ ఒబామా తండ్రి కీన్యా దేశ ముస్లిం మతస్తుడు.బారక్ అనగా ఆశ్విరదింప బడిన వాడు  అని అరబిక్ లో అర్ధం.హుస్సియన్ అనగా ప్రవక్త (స) మనుమని పేరు.ఒబామా అనగా నేను మీతో ఉన్నానని పార్శి లో అర్ధం.

నిజానికి 1960 మధ్యకాలం నుంచి బాగా విద్యావంతులు మరియు శిక్షణ పొందిన ఔత్సాహిక ముస్లింలు  చాలా పెద్ద సంఖ్యలో దక్షిణాసియా దేశాల (భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్) నుండి అమెరికా వెళ్ళారు. అత్యంత నైపుణ్యం ముస్లిం ఫిజీషియన్స్ చాలా పెద్ద సంఖ్యలో ఆస్పత్రులు, క్లినిక్లు తెరిచి మరియు వైద్య సౌకర్యాలు కల్పించి చాలా మంది అమెరికన్లకు  వైద్య సేవలు అందించినారు.

విజ్ఞానశాస్త్రం, సాంకేతికత మరియు వ్యాపార రంగాలలో   బాగా విద్యావంతులు అయిన ముస్లిం ఆచార్యులు(ప్రొఫెసర్స్) పెద్ద సంఖ్యలో అమెరికా అంతట కళాశాల లలో పనిచేసి   పెద్ద సంఖ్యలో అమెరికన్ యువత కు  విద్య మరియు శిక్షణ అందించినారు.  అదేవిధంగా సైన్స్, టెక్నాలజీ, పరిశ్రమల అన్ని రంగాల్లో దక్షిణాసియా నుంచి వచ్చిన అత్యంత నైపుణ్యం మరియు విద్యాధిక ముస్లిం  వలసదారులు  భారీ సంఖ్యలో కార్పొరేషన్లు, పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు, తయారీ కేంద్రాలు మొదలైనవాటి అందు  పనిచేస్తూ  ఉన్నారు.

సిలికాన్ వ్యాలీ సందర్శించండి. అక్కడ గత యాభై సంవత్సరాలలో అమెరికా వలస వెళ్ళిన దక్షిణాసియా ముస్లిo మతస్తులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం లో నిపుణులుగా భారీ సంఖ్యలో ప్రధాన సంస్థలకు మరియు వారి వినూత్న ఉత్పత్తుల కీలకమైన అభివృద్ధికి  సహాయపడినారు. అమెరికా వెళ్లడానికి ముందు వారి స్వదేశంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన ఈ విద్యావంతులు, ముస్లిం నిపుణుల విద్యపై అమెరికా దాదాపు ఏమీ ఖర్చు చేయక పెద్ద లబ్దిదారునిగా  ఉంది. ముస్లిం నోబెల్ విజేతలు అబ్దుస్ సలాం,  అహ్మద్ జెవైల్ మరియు అజీజ్ సంకార్ తమ దేశాల నుంచి అమెరికా వలస వచ్చి అబ్దుతమైన శాస్త్రీయ పరిశోదనలు చేసి మరియు అమెరికన్ ప్రముఖ విశ్వ విద్యాలయాలలో విద్యనూ భోదించి అమెరికాకు వన్నె తెచ్చారు.

అమెరికా దేశ జనాభాలో ముస్లింల శాతం  3% కన్నా తక్కువగానే ఉంది. అమెరికా లో దాదాపు 8 లక్షల ముస్లిం లు కలరు. అమెరికా లోని రాష్ట్రాలలో మిచిగాన్ రాష్ట్రం లో ముస్లిం లు అధిక సంఖ్యలో కలరు.న్యూ యార్క్ సిటి లో ముస్లిం లు అధికంగా నివసిస్తున్నారు, అమెరికాలో 2011 నాటికి 2106 మసీదులు కలవు. 2005 నాటికి అమెరికా రక్షణ దళాలలో దాదాపు 15000 మంది  ముస్లిం లు పని చేస్తున్నారు. అనేక అమెరికా విమానాశ్రయాలలో ముస్లిం ల సౌకర్యార్ధం వజూఖానాలు, ప్రార్ధన మందిరాలు నిర్మించబడినవి.

వివిధ రంగాలలో ప్రముఖ అమెరికన్ ముస్లింలు
ఆర్ట్:
శిరీన్ నేషత్:                    ఇరానియన్-అమెరికన్ విజివల్ ఆర్టిస్ట్,ఫిల్మ్ డైరెక్టర్.
షాజియా సికందర్:            పాకిస్తానీ అమెరికన్ ఆర్టిస్ట్, జీనియస్ అవార్డ్ విజేత

బిజినెస్:
మహమ్మద్ ఆ ఎల్ ఎరియన్ :       PIMCO కంపనీ CEO మరియు $ ట్రిలియన్ విలువైన గ్లోబల్ ఆస్తుల                                            మేనేజర్
జావేద్ కరీం:                             యు ట్యూబ్ సహ వ్యవస్థాపకుడు
మ్యూజిక్ :
అహమద్ జమాల్:             జాజ్ పియనిస్ట్
ఐస్ క్యూబ్ :                    నిర్మాత, రాపర్
జెర్మైనే జాక్సన్ :               గాయని,బాస్ గిటారిస్ట్
యూసుఫ్ లతీఫ్ :             జాజ్ మ్యూజిషియన్ అండ్ గ్రామీ అవార్డ్ విజేత
క్యాట్ స్టీవెన్స్  :                పాప్ గాయకుడు
మెఃమెట్ ఒజ్ :                 టాక్ షో హోస్ట్,
సూపర్ మోడల్:
ఈమాన్:               సూపర్ మోడల్
రీమా ఫైక్ :            మిస్ యూ‌ఎస్‌ఏ 2010
రాజకీయాలు:
కీత్ ఎలిసొన్:          తొలి ముస్లిం కాంగ్రెస్ మన్ (మిన్నసోటా రాష్ట్రం)
ఆంద్రె కార్సన్:                  ఇండియానా కాంగ్రెస్ మన్
సి.జాక్ ఎల్లిస్:         మాకోన్ (జార్జియా) మాజీ మేయర్
జాల్మయ్ ఖలీల్ జాద్ :       ఐక్య రాజ్య సమితి లో మాజీ అమెరికా రాయబారి, ఇరాక్ మరియు అఫ్ఘానిస్తాన్ లో  మాజీ అమెరికా రాయబారి.
ఫరా పండిత్:          ముస్లిం విషయాలలో ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కు సలహాదారు.
జేమ్స్ యీ:            అమెరికా ఆర్మీ లో కేప్టైన్ ర్యాంక్ కలిగిన మాజీ ఆర్మీ మత చాప్లిన్
మత ప్రచారకులు:
షుఐబ్ వెబ్ :                   ముస్లిం ఉపన్యాసకుడు
వారిత్ దీన్ మహమ్మద్:      అమెరికన్ సొసైటి ఆఫ్ ముస్లింస్ నాయకుడు
యూసుఫ్ ఎస్టేస్:              ముస్లిం మత  ప్రచారకుడు.
ఖాలిద్ లతీఫ్                   న్యూ యార్క్ యూనివర్సిటీ ముస్లిం చాప్లిన్
సైన్స్:
ఫజ్లుర్ ఖాన్:                    స్ట్రక్చరల్ ఇంజినిర్ , సేయర్ టవర్, జాన్ హాన్ కాక్ సెంటర్ డిజైనర్
అయూబ్ కే ఒమ్మయ;                న్యూరో సర్జన్
అహ్మెద్ జేవైల్:                         రసాయనిక శాస్త్రం లో నోబుల్ ప్రైజ్ విజేత

స్పొర్ట్స్:
మహమ్మద్ అలీ,హాసిమ్ రహ్మాన్, మైక్ టైసన్ :             బాక్సింగ్,
కరీం అబ్దుల్ జబ్బార్,మహమ్మద్ అబ్దుల్ రవూఫ్;          బాస్కెట్ బాల్                 
హమ్జా అబ్దుల్లా,హుసైన్ అబ్దుల్లా:                     నేషనల్ పుట్ బాల్ లీగ్

డోనాల్డ్ ట్రంప్ వాఖ్యాల సందర్భం లో మెజారిటీ అమెరికన్ ప్రజల అబిప్రాయాలు ఎ విధంగా ఉన్నాయో తెలుసు కొందాము.

NBC మరియు వాల్ స్ట్రీట్ జర్నల్ చేపట్టిన సర్వే లో 57% అమెరికన్లు, ముస్లిం లకు అమెరికా లో ప్రవేశం నిరాకరించమని వివాదాస్పద వాఖ్యలు చేసిన, వచ్చే ఎన్నికలలో  రిపబ్లికాన్ పార్టీ నామినేషన్ ఆశిస్తున్న డోనాల్డ్ ట్రంప్ అబ్యoతకర వాఖ్యలను తిరస్కరించారు. డోనాల్డ్ ట్రంప్ రాడికల్ ముస్లిం లు పాల్పడుతున్న టెర్రరిస్ట్ చర్యలను అమెరికన్  అధికారులు నివారించేటoత వరకు వారి ప్రవేశం పై తాత్కాలిక నిషేధం విధించాలని వివాదాస్పద ప్రకటన చేసారు. డోనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటనను సాన్ బెర్నర్దినో, సౌత్ కరోలిన లో టెర్రరిస్టులు చేసిన మారణహోమం లో 12 మంది మరణం 21 మంది గాయాల పాలు అవటం మీద చేసినారు.

రిపబ్లికాన్ పార్టి సమర్ధకులలో 42% డోనాల్డ్ ట్రంప్ ప్రకటనను సమర్ధించగా, 36% వ్యతిరేకిoచి నారు, 22% మంది తటస్థంగా ఉన్నారు.  డెమోక్రాటిక్ పార్టి సమర్ధకులలో 75% మంది ఆ ప్రకటనను వ్యతిరేకించగా, 11% మంది సమర్దిన్చినారు, 14% మంది తటస్థంగా ఉన్నారు.
మొత్తం మీద 59% అమెరికన్లకు ముస్లిం లపై సదభిప్రాయం ఉండగా, 29% మంది వ్యతిరేక అబిప్రాయం కలిగి ఉన్నారు.  41% మంది అమెరికన్ లు డోనాల్డ్ ట్రంప్ రాజకీయ ప్రచారం విద్వేష పూరితంగా ఉందని తప్పుడు అబిప్రాయాలతో కూడినదని అభిప్రాయ పడినారు.

అమెరికా లోని న్యూ జెర్సీ, ఫ్లోరిడా గవరర్ను అతని వాఖ్యాలను వ్యతిరేకించగా, పూర్వ అమెరికా ఉపాధ్యక్షుడు  డిక్ చేని అవి అమెరికా స్వాతంత్ర ఆదర్శాలకు వ్యతిరేకం అని అన్నాడు.

మాజీ ప్రపంచ హెవీ వెయిట్  ఛాంపియన్ మొహమ్మద్ అలీ డోనాల్డ్ ట్రంప్ ప్రకటనను తీవ్రముగా ఖండించినాడు. ముస్లిం లు అమాయక ప్రజలని,  ఇస్లాం శాంతి కి మారుపేరు అని పేర్కొన్నాడు. వైట్ హౌస్ ఈ ప్రకటనను తిరస్కరించినది.

 ట్రoప్ ప్రకటన రిపబ్లికన్ పార్టి  లో చీలిక తెచ్చింది మరియు అతని వ్యతిరేకులు దానిని   తోoదరపాటు తనం తో కూడినదిగా వర్ణిస్తే అమెరిక దిగివ సభ స్పీకర్ అతని ప్రకటన ఆచరణ సాధ్యం కానిదిగా వర్ణించారు.

డోనాల్డ్ ట్రంప్ ప్రకటన రిప్లబ్లికన్ పార్టి లో చీలిక తెచ్చిదిగా ఉంది, తనను ఎన్నికలలో రిప్లబ్లికన్ పార్టి అబ్యర్ధిగా నామినేట్ చేయక పోతే తను పార్టికి రాజీనామా చేసి ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటి చేస్తాను అని అన్నాడు. దీనిపై పార్టిలోని సినియర్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ అలా జరిగితే డెమోక్రాటిక్ పార్టి చేతికి అద్యక్ష పదవిని (హిల్లరీ క్లింటన్ ) అప్పగించేనట్లని అభిప్రాయ పడుతున్నారు.

రిపబ్లికన్ పార్టి నామినేషన్ కోసం ట్రంప్ తో పోటిచేస్తున్న నెడ్ క్రూజ్ ట్రంప్ వాఖ్యాలను ఖండించారు. పోరాటం రాడికల్ ముస్లిం లతో చేయాలి గాని సాధారణ ముస్లింలతో కాదు అన్నారు
.
సెనేటర్ లిండ్సే గ్రహం ట్రంప్ వాఖ్యలు ఇసిస్ కు విజయం అన్నారు.
మాజీ న్యూ యార్క్ గవర్నర్ జార్జ్ పటాకి ట్రంప్ వాఖ్యలు రాజ్యంగ విరుద్దం మరియు తప్పు అన్నారు. సెనేటర్ రిక్ సాటొరo ట్రంప్  భావనలను సరిఅయినవి కావు అన్నారు. మాజీ అర్కంస్ గవర్నర్ మైక్ హుక్కబి ఉద్దేశం లో అవి ఆచరణ యోగ్యం కావు.

పేస్ బుక్ అధినేత మార్క్ జుకేంబుర్గ్ పేస్ బుక్ తలుపులు ముస్లింల కొరకు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని అన్నారు.

గూగుల్ CEO సుందర్ పిచై ముస్లింలను సమర్దిస్తూ బహిరంగ లేఖ రాసినాడు.

మాన్ హట్టన్ లోని డోనాల్డ్ ట్రంప్ కనస్ట్రక్షన్ కంపెని ట్రంప్ టవర్స్  వెబ్-సైట్ కొంత సేపు గుర్తుతెలియని వ్యక్తులచే హ్యాక్ చేయబడినది.  

ది కౌన్సిల్ అఫ్  అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ (CAIR) అమెరిక ఎన్నికలలో పోటీచేసే రిపబ్లికన్ పార్టి అబ్యర్ది జారీచేసిన  ప్రకటనను ఖండించినది

డోనాల్డ్ ట్రంప్  వాఖ్యాల పై ప్రపంచ ప్రజల అభిప్రాయం:
ఇస్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతన్యహు “ఇస్రాయిల్ అన్ని మతాలను గౌరవిస్తుందని అందరు పౌరుల హక్కులకు రక్షణ కల్పిoచునని ” అబిప్రాయ పడినారు. గతం లో నిర్ణయిoచిన షేడ్యుల్ ప్రకారం డోనాల్డ్ ట్రాంప్ ను కలుస్తాను కాని అతని వాఖ్యలను సమర్దించను అని  ఇస్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతన్యహు అన్నారు.

ఇస్రాయిల్ ప్రతిపక్ష నాయకులు డోనాల్డ్ ట్రంప్ ఇస్రాయిల్ ప్రవేశం పై నిషేధం విదించమని కోరినారు. డోనాల్డ్ ట్రంప్ ఇస్రాయిల్ ప్రవేశం పై నిషేధం విదించమని ఇస్రాయిల్ పార్లమెంట్ సబ్యులు 37 మంది ఒక ప్రకటన ద్వార ఆదేశ హోం మంత్రిని కోరినారు.

బ్రిటిష్ ప్రధాని కామెరూన్ డోనాల్డ్ ట్రంప్  ప్రకటన “విభజన, ఉపయోగం లేనిది మరియు తప్పు ("divisive, unhelpful and quite simply wrong.") అని వాఖ్యనిoచగా లండన్ మేయర్ బోరిస్ జాన్సన్ ఆ ప్రకటనను నాన్సెన్స్ అని వాఖ్యానించారు.

 కెనడా విదేశంగ మంత్రి కెనడా లో ఇది సాధ్యపడదు అని ట్రంప్ ప్రకటనను ఖండించారు.
ఫ్రెంచ్ ప్రధాని వ్యతిరేకతను, గందరగోళoను ఈ ప్రకటన చాటతుందని అభిప్రాయపడగా, నేథర్లాండ్స్  ప్రధాని దీనిని వివక్షత తో కూడినది మరియు ఉపయోగరహితమైనదని  అభిప్రాయ పడ్డారు.
ఇప్పటివరకు  6,00,000 మంది బ్రిటిష్ ప్రజలు డోనాల్డ్ ట్రంప్ బ్రిటన్ ప్రవేశం ను నిషేదిoచ వలసినదిగా బ్రిటన్ పార్లమెంట్ ను ఒక విజ్ఞాపన ద్వారా కోరినారు. 1,00,000 ప్రజలు కోరిన విజ్ఞప్తిని బ్రిటిష్ పార్లమెంట్ పరిశిలించక తప్పదు.

స్కాట్లాండ్ ప్రబుత్వం డోనాల్డ్ ట్రంప్ ను తన బిజినెస్స్ అంబాసిడర్ గౌరవ పదవి నుంచి తొలగించగా, స్కాట్లాండ్ లోని యూనివేర్సిటి  అతనికి ప్రసాదించిన గౌరవ డిగ్రీ ని ఉప సంహరించుకోంది.

ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ తరుఫున ఐక్య రాజ్య సమితి అధికార ప్రతినిది డోనాల్డ్ ట్రంప్ ప్రకటన ఇస్లామి ఫోబియా తో చేసినది అని అబిప్రాయ పడినాడు. డోనాల్డ్ ట్రంప్ ను ఇసిస్ (ISSI) ప్రచార కర్త అని కొందరు విమర్శించినారు.

బ్రిటన్ కు చెందిన గార్డియన్ పత్రిక వ్రాసిన వ్యాసం లో ముస్లింలు అమెరిక కు చేసిన సేవలు మరియు వారు లేక పోతే అమెరికా చాలా నష్ట పోతుందని వివరించినది. బ్రెయిన్ సర్జేన్స్ నుండి రాప్పేర్స్ వరకు డిప్లోమసి నుంచి క్రీడల వరకు  లో అమెరికన్ ముస్లింలు నిర్వహించిన పాత్రను ఆ వ్యాసం లో కొనియాడినారు.

దుబాయ్ లోని ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ కు, గోల్ఫ్ కోర్స్ కు పెట్టిన డోనాల్డ్ ట్రంప్ పేరు మరియు అతని చిత్తరవు తొలగించడమైనది.

ఇస్తాన్ బుల్  లోని ట్రంప్ టవర్స్ వెనుక ఉన్న అతని కంపెని డిల్స్ కొన్ని వెనుకబడినవి. సౌదీ అరేబియా రాజ కుటుంబానికి చెందిన prince అల్-వలీద్-బిన్-తలాల్ అవమానకరం అని ట్వీట్ చేసారు.
ఇరాన్ అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరును ప్రస్తావించకుండా కొందరు వ్యక్తులు ముస్లిం ల రాకను వ్యతిరేకిoచు చున్నారు. వారిని మేము ఖండిస్తున్నాము అని అన్నారు.

నోబుల్ బహుమతి గ్రహీత మాలాల యూసఫ్  డోనాల్డ్ ట్రంప్ ముస్లింలకు వ్యతిరేకoగా చేసిన వ్యాఖాలను ఖండించారు.

జాత్యహంకర ప్రకటనలు చేయడం డోనాల్డ్ ట్రాంప్ కు ఇది మొదటిసారి కాదు. గతం లో అమెరికా లో చట్టవిరుద్దం గా ప్రవేశిoచే మెక్సికన్ లను రేపిస్త్స్(rapists) అని అభివర్ణించినాడు. గతం లో అమెరికా అద్యక్ష పదవికి పోటి చేసిన జాన్ మెక్కైన్ వార్ హీరో కాదు అని పలికినాడు.. గతం లో డోనాల్డ్ ట్రంప్ అమెరికాలోని మసీదులను మూసివేసి అమెరికన్ ముస్లిం లకొరకు ప్రత్యేకమైన ఐ.డి. లు, డేటా బేస్ తయారు చేయాలన్నాడు. అతని అద్యక్ష ప్రచారం ను కవర్ చేసే మహిళా రిపోర్టర్ పట్ల అబ్యoతకర వాఖ్యలు చేసినాడు


.




No comments:

Post a Comment