లాటిన్లో అల్బోసెన్ Alboacen గా పిలువబడే అబూ అల్-హసన్ అలీ ఇబ్న్ ముసమ్మద్
ఇబ్న్ హబీబ్ అల్-మవర్ది Abu al-Hasan Ali ibn Muḥammad
ibn Habib al-Mawardi
أبو الحسن علي بن محمد بن حبيب البصري الماوردي(కాలం 972-1058 CE.) లేదా అల్-మవర్ది మధ్య యుగపు ప్రసిద్ధ చెందిన
రాజనీతి శాస్త్ర ఆలోచనాపరులలో ఒకరు.
అల్-మవర్ది 972బాస్రా, ఇరాక్లో ఒక కుర్ద్ కుటుంభం లో జన్మించాడు.అల్-మవర్ది అబూ
అల్-వాహిద్ అల్-సిమారి నుండి ఫిఖ్ (ఇస్లామిక్ న్యాయ శాస్త్రం) అబ్యసించాడు మరియు అకిదా, (ఇస్లామిక్ వేదాంతశాస్త్రం), తౌహిద్, ఇస్లామిక్ న్యాయ
శాస్త్రం Aqidah, (Islamic theology), Tawhid, Islamic
jurisprudence నందు ఆసక్తి కనపరిచాడు.
అల్-మవర్ది సున్ని-షాఫీ
ఇస్లామిక్ స్కూల్ యొక్క న్యాయశాస్త్రవేత్త,గొప్ప సామాజిక శాస్త్రవేత్త, మరియు మొహద్దిత్ mohaddith కూడా. అతను
బాగ్దాద్లో ప్రధాన న్యాయమూర్తిగా Chief Justice మరియు అనేక ముఖ్యమైన
మరియు శక్తివంతమైన ముస్లిం రాజ్యలకు అబ్బాసిద్ ఖలిఫా యొక్క రాయబారి ambassador గా పనిచేశాడు.
న్యాయశాస్త్రంపై రచించిన ‘అల్-హవి Al-Havi’’ పుస్తకానికి
అల్-మవార్ది చాలా ప్రసిద్ది చెందారు.
అబూ అల్-హసన్ అల్-మవర్ది
పొలిటికల్ సైన్స్ మరియు సోషియాలజీలో ఒరిజినల్ రచనలు చేశారు. ఈ రంగాలలో, అతను మూడు ప్రసిద్ద
రచనలు చేశాడు-కితాబ్ అల్-అహ్కం అల్-సుల్తానియా, ఖానున్ అల్-వజారా, మరియు కితాబ్
నాసిహాత్ అల్-ముల్క్. Kitab al-Ahkam al-Sultania, Qanun al-Wazarah, and
Kitab Nasihat al-Mulk.
రాజనీతి శాస్త్ర సూత్రాలను అల్-మవర్ది రూపొందించారు. అతని
పుస్తకాలు ఖలీఫా ఎన్నిక, అధికారాలు, ముఖ్యమంత్రి, క్యాబినెట్ యొక్క విధులు మరియు ప్రభుత్వం మరియు పౌరుల మధ్య ఉన్న సంబంధాన్ని
మరియు పౌరరుల విదులు వివరిస్తాయి. అల్-మవర్ది
రచనలు మతం, ప్రభుత్వం, కాలిఫేట్ మరియు
ప్రజా మరియు రాజ్యాంగ చట్టంపై ఆయన చేసిన కృషిని వివరిస్తాయి.
అబూ అల్-హసన్ అల్-మవర్ది శాంతి
మరియు యుద్ధ కాలం లో రాజ్య వ్యవహారాలను
చర్చించారు. ఖలీఫా ఎన్నికకు మార్గదర్శకాలు మరియు ఓటర్ల లక్షణాలను అనగా వోటర్
వ్యక్తిత్వ స్వచ్ఛత, మరియు మేధో సామర్ధ్యం
purity of character and intellectual capability గురించి
వివరించాడు.
రచనలుWorks:
·
అల్-అహ్కం అల్-సుల్తానియా వాల్-విలాయత్ అల్-దినియా (ది
ఆర్డినెన్సెస్ ఆఫ్ గవర్నమెంట్) Al-Ahkam
al-Sultania w'al-Wilayat al-Diniyya (The Ordinances of Government)
·
ఖానున్ అల్-వజారా (మంత్రులకు సంబంధించిన చట్టాలు)
Qanun al-Wazarah (Laws regarding the
Ministers)
·
కితాబ్ నాసిహాత్ అల్-ముల్క్ (ది బుక్ ఆఫ్ సిన్సియర్ అడ్వైజ్
టు రూలర్స్) Kitab Nasihat al-Mulk (The Book of Sincere
Advice to Rulers)
·
కితాబ్ ఆదాబ్ అల్-దునియా వాల్-దిన్ (ది ఎథిక్స్ ఆఫ్
రిలిజియన్ అండ్ ది వరల్డ్) Kitab
Aadab al-Dunya w'al-Din (The Ethics of Religion and of this
World)
• ప్రవక్త యొక్క వ్యక్తులు Personas of the Prophethood
అల్-మావర్ది "ప్రభుత్వ
ఆర్డినెన్సెస్" The Ordinances of the Government." అనే
గ్రంధం రచించాడు. అల్-మావర్ది 'సిద్ధాంతం యొక్క అవసరం'Doctrine of Necessity'' (దారురా durra) యొక్క కర్త మరియు
మద్దతుదారు. అతను ప్రాంతీయ గవర్నర్లకు అప్పగించే అపరిమిత అధికారాలకు వ్యతిరేకి.
అల్-మవార్ది ప్రభుత్వ
ఆర్డినెన్స్ పై రచించిన గ్రంధం treatise on Ordinances of the
Government కాలిఫేట్ అనేది “ఒక ముస్లిం సమాజంలోని పౌరుల జీవితాలను
నియంత్రించే మొత్తం రాజకీయ-మత వ్యవస్థను సూచిస్తుంది”. బ్యూయిడ్స్ మరియు అబ్బాసిడ్
ఖలీఫ్‌లు తరువాత సెల్‌జుక్‌లు కూడా సమర్దవంతమైన పాలన కోసం దీనిని అనుసరించారు. దీని
ద్వారా ఖలీఫ్‌ను అత్యున్నత ప్రభుత్వ అధిపతిగా గుర్తించడం జరిగింది.
అల్-మవార్ది పుస్తకాలు ‘అల్-అహ్కం
అల్-సుల్తానియా’ మరియు ‘ఖానున్ అల్-వజారా’‘Al-Ahkam al-Sultania’ and ‘Qanun al-Wazarah’ అనేక భాషలలోకి అనువదించబడ్డాయి. ‘కితాబ్ ఆదాబ్
అల్-దునియా వా అల్-దిన్’ Kitab Aadab al-Dunya wa al-Din’ నీతిశాస్త్రం/Ethicsలో అల్-మవార్ది మరొక ఉత్తమ రచన. ఇది ఇప్పటికీ
కొన్ని ఇస్లామిక్ దేశాలలో బాగా ప్రాచుర్యం పొందిన పుస్తకం.
1058 న అల్-మావర్ది బాగ్దాద్‌లో వృద్ధాప్యంలో
మరణించారు.
No comments:
Post a Comment