5 March 2020

హకీమ్ అజ్మల్ ఖాన్ Hakim Ajmal Khan(1868 - 1927)



Image result for hakim ajmal khan images

హకీమ్ అజ్మల్ ఖాన్ అని పిలువబడే మొహమ్మద్ అజ్మల్ ఖాన్ (11 ఫిబ్రవరి 1868 - 29 డిసెంబర్ 1927) భారతదేశంలోని ప్రముఖ యునాని వైద్యుడు మరియు జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులలో ఒకరు. డిల్లి లోని కరోల్ బాగ్‌లో ఉన్న టిబ్బియా కాలేజీగా పిలువబడే ఆయుర్వేద మరియు యునాని టిబ్బియా కాలేజీ సంస్థాపకుడు. అతను 1920 లో జామియా మిలియా ఇస్లామీయ విశ్వవిద్యాలయం యొక్క మొదటి ఛాన్సలర్ అయ్యాడు మరియు 1927 లో మరణించే వరకు పదవిలో ఉన్నాడు.

అఖిల భారత ముస్లిం లీగ్ వ్యవస్థాపక సభ్యుడు మరియు అధ్యక్షుడు గా వ్యవరించాడు మరియు 1921 లో అహమదాబాద్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం  కు  అధ్యక్షుడు గా వ్యవరించాడు.  ఇతనికి  మాసిహ్ ఉల్ ముల్క్, హజిక్ ఉల్ ముల్క్ అను బిరుదులు కలవు మరియు ఇతను వృత్తి రీత్యా వైద్యుడు, రాజకీయవేత్త, ఆధ్యాత్మిక వైద్యుడు, సూఫీ మిస్టిక్, హెర్బలిస్ట్, కవి.


ఇతని పూర్వికులు మొఘల్ చక్రవర్తి బాబర్ పాలనలో భారతదేశానికి వచ్చిన వైద్యులు.  అతని కుటుంబం అంతా యునాని హకీమ్లు/ వైద్యులు. వారిని రైస్ ఆఫ్ డిల్లి అని కూడా పిలుస్తారు. అతని తాత హకీమ్ షరీఫ్ ఖాన్ మొఘల్ చక్రవర్తి షా ఆలం యొక్క వైద్యుడు మరియు యునాని మెడిసిన్ బోధించే హాస్పిటల్-కమ్-కాలేజీ షరీఫ్ మన్జిల్‌ను నిర్మించారు.

హకీమ్ అజ్మల్ ఖాన్ దివ్య ఖురాన్ ను కంఠత వచ్చు మరియు చిన్నతనంలో అరబిక్ మరియు పర్షియన్లతో సహా సాంప్రదాయ ఇస్లామిక్ జ్ఞానాన్ని అధ్యయనం చేశారు.  ప్రసిద్ధ వైద్యులు అయిన తన బంధువుల మార్గదర్శకత్వంలో యునాని మెడిసిన్ అబ్యసించారు. టిబ్-ఇ-యునాని లేదా యునాని మెడిసిన్ యొక్క అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి గాను   అతని తాత భారత ఉపఖండం లోనే పేద రోగులకు ఉత్తమ ఉచిత చికిత్స అందించే షరీఫ్ మన్జిల్ యునాని హాస్పిటల్-కమ్-కాలేజీని ఏర్పాటు చేశాడు. డిల్లి లోని సిద్దిఖీ దవాఖానాకు చెందిన హకీమ్ అబ్దుల్ జమీల్ ఆధ్వర్యంలో అతను తన యునాని విద్యను  ను పూర్తి చేశాడు.

1892 లో యునాని వైద్యునిగా అర్హత సాధించిన తరువాత, హకీమ్ అజ్మల్ ఖాన్ రాంపూర్ నవాబుకు ప్రధాన వైద్యుడు అయ్యాడు. "మాసిహా-ఎ-హింద్" (భారతదేశం యొక్క హీలేర్) మరియు "కిరీటం లేని రాజు" గా ప్రశంసించబడింది. హకీమ్ అజ్మల్ ఖాన్, తన తండ్రిలాగే, అద్భుతమైన వైద్య నివారణలను మరియు "మెడికల్ చెస్ట్ కలిగి ఉన్నాడు, ఒక వ్యక్తి ముఖాన్ని చూడటం ద్వారా అతని ఆనారోగ్యాన్ని  నిర్ధారించగల నేర్పు అతనిలో ఉందని చెప్పబడింది.

ఆ రోజులలోనే హకీమ్ అజ్మల్ ఖాన్ తన అవుట్ అఫ్ టౌన్ విజిట్స్ కు  1000 రూపాయలు చార్జ్ చేసేవారు మరియు  డిల్లీలో అయితే ఎటువంటి విచక్షణ లేకుండా రోగులకు ( ఆదాయం, ప్రాంతం, మతం తో సంభంధం లేకుడా) ఉచిత మెరుగైన  చికిత్స అందించేవాడు.

భారత స్వాతంత్ర్య ఉద్యమం లో చురుకుగా పాల్గొనటం మరియు  జాతీయ సమైక్యత, మత సామరస్యం పెంపొందించటం లో హకీమ్ అజ్మల్ ఖాన్ తన అత్యుత్తమ మరియు బహుముఖ వ్యక్తిత్వం ప్రదర్శించారు.

అతను యునాని సంప్రదాయ వైద్యం విస్తరణ మరియు అభివృద్ధిపై చాలా ఆసక్తిని కనబరిచాడు మరియు ఆ దిశగా మూడు ముఖ్యమైన సంస్థలను నిర్మించాడు. డిల్లి లోని సెంట్రల్ కాలేజ్, హిందూస్థానీ దవాఖానా మరియు ఆయుర్వేద మరియు యునాని టిబ్బియా కాలేజీ (టిబ్బియా కాలేజీ) నిర్మాణం లో ప్రముఖ పాత్ర వహించాడు ఈ రంగంలో పరిశోధన మరియు అభ్యాసాన్ని విస్తరించి మరియు యునాని సిస్టం ఆఫ్ మెడిసిన్ భారతదేశంలో బ్రిటిష్ పాలనలో అంతరించిపోకుండా కాపాడాడు. యునాని వ్యవస్థ పాశ్చాత్య భావనలను గ్రహించడాన్ని అజ్మల్ ఖాన్ ప్రతిపాదించాడు.

రసాయన శాస్త్రవేత్త డాక్టర్ సలీముజ్జామన్ సిద్దిఖీ అరిపిన మొక్కల ఔషదాల  పై పరిశోధనలను అజ్మల్ ఖాన్ ప్రోత్సహించాడు తరువాత అవి  తరువాత యునాని మెడిసిన్ కు కొత్త రూపును ఇచ్చినవి.

జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపకులలో ఒకరిగా, ఖాన్ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం యొక్క మొదటి ఛాన్సలర్‌గా 1920 నవంబర్ 22 న ఎన్నికయ్యారు, 1927 లో మరణించే వరకు ఈ పదవిలో ఉన్నారు. ఈ కాలంలో అతను జామియా విశ్వవిద్యాలయం ఆలీగర్ నుండి డిల్లి తరలింపులో  ప్రముఖ పాత్ర  వహించాడు. జామియా విశ్వవిద్యాలయం వివిధ సంక్షోభాలను అధిగమించడానికి సహాయం చేశాడు. అతను విశ్వవిద్యాలయం అభివృద్ధి కి తన సొంత నిధులను ఇచ్చినాడు.

హకీమ్ అజ్మల్ ఖాన్ తన కుటుంబం ప్రారంభించిన ఉర్దూ వారపత్రిక అక్మల్-ఉల్-అఖ్బర్ లో రాయడం ప్రారంభించిన తరువాత మెడిసిన్ నుండి రాజకీయాల వైపు దిశను మార్చాడు.

1906 లో సిమ్లాలో వైస్రాయ్ ఆఫ్ ఇండియాను కలిసిన ముస్లిం బృందానికి ఖాన్ నాయకత్వం వహించి, ప్రతినిధి బృందం రాసిన మెమోరాండంను ఆయనకు అందజేశారు.

1906 డిసెంబర్ 30డాకా లో జరిగిన  అఖిల భారత ముస్లిం లీగ్ యొక్క స్థాపనలో చురుకుగా పాల్గొన్నాడు. చాలా మంది ముస్లిం నాయకులు అరెస్టును ఎదుర్కొన్న సమయంలో, ఖాన్ 1917 లో సహాయం కోసం మహాత్మా గాంధీని సంప్రదించాడు, ఆ తరువాత అతనితో మరియు ఇతర ముస్లిం నాయకులైన మౌలానా ఆజాద్, మౌలానా మొహమ్మద్ అలీ జౌహర్ మరియు మౌలానా షౌకత్ అలీలతో కలిసి ఖిలాఫత్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ మరియు ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ అధ్యక్ష పదవికి ఎన్నికైన ఏకైక వ్యక్తి అజ్మల్ ఖాన్.

హకీమ్ అజ్మల్ ఖాన్ హ్రుదోగ సమస్యలతో 29 డిసెంబర్ 1927 న చనిపోయే ముందు, తన ప్రభుత్వ బిరుదులను (కైజార్-ఇ-హింద్, హజికుల్ ముల్క్ ) త్యజించాడు మరియు అతని భారతీయ అనుచరులు చాలామంది అతనికి మాసిహ్-ఉల్-ముల్క్ (హీలర్ ఆఫ్ ది నేషన్) బిరుదును ఇచ్చారు.
·        హకీమ్ అజ్మల్ ఖాన్ ప్రముఖ కవి. ఉర్దూ, పెర్షియన్ బాషలలో నిపుణుడు. అతని కలం పేరు షాదియ(shadia). అతడు రాసిన కవితా సంకలాలను పూర్వ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సిన్ దివాన్-షాదియా(Diwan-shadia) పేరుతో సంకలనం చేసారు.

·        హకీమ్ అజ్మల్ ఢిల్లీ నగరంలోని  పంచకులా రోడ్‌లోని హజ్రత్ రసూల్ నుమా కాంపౌండ్ లో సమాధి చేయబడినాడు.

·        అతని స్మారక చిహ్నాలు గా టిబ్బియా కళాశాల మరియు జామియా మిలియా విశ్వవిద్యాలయం పేర్కొనవచ్చును.

·        హజిక్ ను అతని గుర్తించదగిన రచనగా భావించవచ్చు.

·        అజ్మాలిన్Ajmaline, ఒక క్లాస్ లా  యాంటీఅర్రిథమిక్ (antiarrhythmic) ఏజెంట్ మరియు అజ్మలన్ పేరెంట్ హైడ్రైడ్ కు అతని పేరు పెట్టారు.

·        1987 భారత ప్రభుత్వం  హకీమ్ అజ్మల్ ఖాన్ పేరిట స్మారక  స్టాంప్ విడుదల చేసింది.

·        భారతదేశ విభజన తరువాత, ఖాన్ మనవడు హకీమ్ ముహమ్మద్ నబీ ఖాన్ పాకిస్తాన్ లాహోర్లో 'దవాఖానా హకీమ్ అజ్మల్ ఖాన్' ను ప్రారంభించాడు. అజ్మల్ ఖాన్ కుటుంబం యొక్క ఆశయం “అజల్-ఉల్-అల్లాహ్-ఖుదతుల్మల్”, అంటే “మానవత్వానికి సేవ చేయడం ఉత్తమ మార్గం”

·        న్యూ డిల్లి లోని లోని టిజ్బియా కాలేజీకి ఆనుకొని ఉన్న పార్క్ కు అజ్మల్ ఖాన్ పార్క్ అని పేరు పెట్టబడింది

·        • "నాన్-కొఆపరేషన్ ఉద్యమ   స్ఫూర్తి దేశమంతటా వ్యాపించింది మరియు స్వరాజ్ సాధించడానికి భారత దేశం లోని ప్రతి వ్యక్తి ఆత్మ ఉత్సాహం తో ఎదురు చూస్తుంది. – అజ్మల్ ఖాన్ అద్యక్ష ప్రసంగం నుండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 1921 సెషన్, అహ్మదాబాద్.

No comments:

Post a Comment