28 March 2020

ప్రముఖ భారత స్వాతంత్ర సమర యోధుడు. - టిటుమిర్ Titumir1782-1831



titumir hashtag on Twitter 
సయ్యద్ మీర్ నిసార్ అలీ టిటుమిర్ (27 జనవరి 1782 - 19 నవంబర్ 1831) 19 వ శతాబ్దంలో భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన స్వాతంత్ర్య సమరయోధుడు. సయ్యద్ మీర్ నిసార్ అలీ టిటుమిర్, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని చంద్పూర్ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి సయ్యద్ మీర్ హసన్ అలీ మరియు తల్లి అబిదా రుకయ్య ఖతున్.

టిటుమిర్ పూర్వీకుడు సయ్యద్ షాహదత్ అలీ ఇస్లాం బోధించడానికి అరేబియా నుండి బెంగాల్ వచ్చారు. షాహదత్ అలీ కుమారుడు సయ్యద్ అబ్దుల్లాను జాఫర్పూర్ చీఫ్ ఖాజీగా డిల్లి చక్రవర్తి  నియమించారు మరియు "మీర్ ఇన్సాఫ్" బిరుదు ప్రధానం చేసారు.  వారు ఇస్లాం యొక్క నాల్గవ ఖలీఫా  అలీ వారసులు అని అంటారు. షాహదత్ అలీ యొక్క వారసులు 'సయ్యద్' మరియు 'మీర్' అనే వంశపారంపర్య నామాలను ఉపయోగించారు

టైటుమిర్ ప్రారంభ విద్య గ్రామ పాఠశాలలో మరియు స్థానిక మదర్సా లో జరిగింది.  అతను 18 సంవత్సరాల వయస్సులో ఖురాన్ యొక్క హఫీజ్ మరియు హదీసులు మరియు ముస్లిం సంప్రదాయాల పండితుడు అయ్యాడు. అతను బెంగాలీ, అరబిక్ మరియు పెర్షియన్ భాషలపై  కూడా పట్టు సాధించాడు. అతను ఇస్లామిక్ వేదాంతశాస్త్రం, న్యాయ శాస్త్రం, తత్వశాస్త్రం, తసావ్వాఫ్ (ఇస్లామిక్ ఆధ్యాత్మికత) మరియు మాంటిక్ లో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. మదర్సాలో విద్యార్ధిగా ఉన్నప్పుడు టిటు మీర్ మంచి జిమ్నాస్ట్ మరియు ప్రఖ్యాత రెజ్లర్ (పహ్ల్వాన్).

1822 లో, అతను హజ్ తీర్థయాత్ర కోసం మక్కాను సందర్శించాడు, అక్కడ అతను గొప్ప ఇస్లామిక్ సంస్కర్త మరియు బరేలీకి చెందిన విప్లవాత్మక నాయకుడు సయ్యద్ అహ్మద్‌ బరెల్విని కలుసుకున్నాడు మరియు తారికా-ఇ-ముహమ్మదియా ఉద్యమంతో సంభందం కల వహాబీ ఇస్లామిక్ బోధకుడిగా తిరిగి వచ్చాడు.

1827 లో మక్కా నుండి తిరిగి వచ్చిన తరువాత, టైటుమిర్ 24 పరగణాలు మరియు నాడియా ప్రాంతానికి చెందిన ముస్లింలలో బోధించడం ప్రారంభించాడు. అతను ముస్లింలు షిర్క్ సంప్రదాయాలను (కొవ్వొత్తులను వెలిగించడం లేదా దర్గాను ఆరాధించడం వంటివి) మరియు బిదా లో పాల్గొనడానికి వ్యతిరేకంగా బోధించాడు. అతను ఇస్లామిక్ పద్దతులను మరియు వేష-ధారణను అనుసరించమని అక్కడి స్త్రీ-పురుషులకు ముఖ్యంగా నేతపనివారిని  మరియు రైతులను ప్రేరేపించాడు

టైటుమిర్ ఆ సమయంలో అమలులో ఉన్న అనేక వివక్షత చర్యలను అనగా  మసీదులపై మరియు గడ్డం ధరించడం పై పన్నుల విధింపును  వ్యతిరేకించాడు. అతను స్థానిక గ్రామ ప్రజల సహాయం తో అక్కడి  భూస్వాములకు లేదా జమీందార్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించడం ప్రారంభించాడు.

స్థానిక జమీందార్ల అణచివేత అణిచివేత చర్యలకు వ్యతిరేకంగా టిటుమిర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫిర్యాదు చేసాడు, కాని ఫలితం లేదు. ఇది అతనికి  పూర్హాకు చెందిన జమీందార్లు కృష్ణదేవ రాయ్, గోబర్దంగాకు చెందిన కలిప్రసన్న ముఖోపాధ్యాయ, తారాగోనియాకు చెందిన రాజ్‌నారాయణ, నాగ్‌పూర్‌కు చెందిన గౌరీ ప్రసాద్ చౌదరి, గోబ్రా-గోవింద్‌పూర్‌కు చెందిన దేవనాథ్ రాయ్‌లతో వివాదానికి దారి తీసింది.

టిటుమిర్ స్వయంగా "పయాడా" లేదా యుద్ధ కుటుంబానికి చెందినవాడు. టిటు మీర్ లాఠీలతో కూడిన  ఒక ముజాహిద్ దళాన్ని ఏర్పాటు చేసి లాఠీ (వెదురు కర్ర) మరియు ఇతర దేశీయ ఆయుధాలలో వారికి శిక్షణ ఇచ్చాడు.. అతని శిష్యుడు మరియు మేనల్లుడు గులాం రసూల్ ను దళానికి కమాండర్‌గా చేశాడు. టిటుమిర్ యొక్క పెరుగుతున్న బలం బ్రిటిష్ వారి సహాయం తో టైటుమిర్ కు  వ్యతిరేకంగా బ్రిటిష్ వారి సహాయం పొందుటకు  ప్రయత్నిస్తున్న  జమీందార్లను భయపెట్టింది.

అతను స్థానిక జమీందార్‌ కృష్ణ దేవ్ రాయ్ పై పోరాడాడు. టిటుమిర్ అనుచరులపై దాడి చేయడానికి కృష్ణ దేవ్ రాయ్, బ్రిటిష్ వారి సహాయం కోరినాడు గోబర్దంగా జమీందార్ చేత ప్రేరేపించబడిన, మొల్లాహతి యొక్క ఆంగ్ల అధికారి/కుటియల్ డేవిస్ ని  టైటుమిర్కు తన శక్తితో తరిమికొట్టాడు.

టిటు మీర్‌తో వివాదంలో గోబ్రా-గోవింద్‌పూర్ జమీందార్ చంపబడ్డాడు. బరాసత్ కలెక్టర్ అయిన అలెగ్జాండర్, బషీర్హాట్ యొక్క దరోగాతో టిటు మీర్కు వ్యతిరేకంగా ముందుకు సాగాడు మరియు టిటు మీర్ చేతిలో తీవ్రమైన ఓటమిని చవిచూశాడు.

టిటు మీర్ అక్టోబర్ 1831 లో నార్కెల్బేరియాలో అనుచరుల/ముజాహిదులు  సాయుధ పోరాటానికి సైనిక శిక్షణ పొందారు. క్రమంగా టైటుమిర్ యొక్క అనుచరుల/ముజాహిద్ల సంఖ్య15,000 కు పెరిగింది. మరియు బరాసత్ పట్టణానికి సమీపంలో ఉన్న నరికెల్బారియా వద్ద వెదురు స్తంభాలతో ఒక బలమైన కోటను (బెంగాలీలో బాషర్ కెల్లా) నిర్మించారు, ఇది బెంగాలీ జానపద గాధలలో ప్రసిద్ది కెక్కినది నిర్మించారు. కోట చుట్టూ మట్టి మరియు కాల్చిన ఇటుకలతో నిర్మించబడిన  ఎత్తైన వెదురు కొయ్యల డబుల్ కర్టెన్ గోడ ఉంది.

సైనిక సన్నాహాలను  పూర్తి చేసిన టైటుమిర్ బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం ప్రకటించాడు మరియు తనను తాను బాద్షా (రాజు) గా ప్రకటించుకున్నాడు మరియు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జిహాద్ (పవిత్ర యుద్ధంలో) పాల్గొనమని ప్రజలను కోరారు. అతను త్వరలోనే 24 పరగణాలు, నాడియా మరియు ఫరీద్‌పూర్ జిల్లాలపై తన నియంత్రణను ఏర్పరచుకున్నాడు.

టిటు మీర్ ఆంగ్లేయుల రక్షణను కోరిన టాకీ మరియు గోబర్‌దంగా జమీందార్ల నుండి పన్ను డిమాండ్ చేశాడు. మీర్ ను నియంత్రించడానికి కలకత్తా నుండి ఒక ఆంగ్ల బృందం పంపబడింది. కానీ జమీందార్ల మరియు ఆంగ్లేయుల సంయుక్త దళాలు ముజాహిద్ (దళాలు) చేతిలో తీవ్రమైన ఓటమిని చవిచూశాయి. అతని దాడి మరియు తిరోగమన గెరిల్లా వ్యూహాల ఫలితంగా జమీందార్ల ప్రైవేట్ సైన్యాలు మరియు బ్రిటిష్ దళాలు అతని మనుషుల చేతిలో వరుస పరాజయాలను ఎదుర్కొన్నాయి.

తదనంతరం, బెంగాల్ గవర్నర్ లార్డ్ విల్లియం బెంటింక్ టిటు మీర్‌పై లెఫ్టినెంట్ కల్నల్ స్టీవర్ట్ ఆధ్వర్యంలో 100 అశ్వికదళాలు, 300 స్థానిక పదాతిదళాలు మరియు రెండు ఫిరంగులతో కూడిన  ఫిరంగిదళాలను పంపాడు.

బ్రిటిష్ దళాలు 1931 నవంబర్ 14న ముజాహిద్‌లపై దాడి చేశారు. సాంప్రదాయ ఆయుధాలతో ఉన్న ముజాహిద్‌లు ఆధునిక ఆయుధాలతో కూడిన ఆంగ్ల సైన్యాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారు మరియు వెదురు కోట లోపల ఆశ్రయం పొందారు. ఆంగ్లేయులు కాల్పులు జరిపి కోటను పూర్తిగా ధ్వంసం చేశారు. ముజాహిద్ల వైపు భారీ ప్రాణనష్టం జరిగింది. 49 సంవత్సరాల వయస్సు లో టైటుమిర్ గాయాలతో 1831 నవంబర్ 19 న మరణించాడు మరియు అతని అనేక అనుచరులు  చంపబడ్డారు.వారి కమాండర్ గులాం మసుమ్‌తో సహా 350 మంది ముజాహిద్‌లు పట్టుబడ్డారు. సుదీర్ఘ విచారణ అనంతరం టైటుమిర్ మేనల్లుడు మరియు రెండవ కమాండర్ ఘులాం  మసుమ్‌ ను ఈస్ట్-ఇండియా కంపెనీ అధికారులు  ఉరితీశారు మరియు మరో 350 మంది అతని అనుచరులకు జీవిత ఖైదు విధించారు.

బ్రిటీష్ దళాల కమాండింగ్ ఆఫీసర్ తన ప్రత్యర్థి ధైర్యన్ని ప్రశంసించాడు. వెదురు గోడతో కూడిన కోటను  కూల్చడానికి ఫిరంగిదళానికి చాల సమయం పట్టింది.

టిటుమీర్ -ఖ్యాతి/లెగసీ:

·        టైటుమిర్ బంగ్లాదేశ్ విముక్తి పోరాటం లో ప్రజలకు కి ప్రేరణగా నిలిచాడు.
·        2004 లో, బిబిసి యొక్క “గ్రేటెస్ట్ బెంగాలీ పోల్‌”లో టైటుమిర్ 11 వ స్థానంలో నిలిచాడు.
·        బంగ్లాదేశ్ లోని డాకా లో జిన్నా కాలేజీకి 1971 లో బంగ్లాదేశ్ ప్రభుత్వo టైటుమిర్ కాలేజీగా పేరు మార్చారు.
·        టిటు మీర్ హాల్ డాకా యొక్క బంగ్లాదేశ్ యూనివర్శిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ యొక్క వసతిగృహం.
·        ఖుల్నాలో బంగ్లాదేశ్ నావికాదళానికి ప్రధాన స్థావరం ఉంది. దాని పేరును 'బిఎన్ఎస్ టైటుమిర్' అని పిలుస్తారు.
·        టైట్‌మిర్ ఎక్స్‌ప్రెస్ అనే ఇంటర్‌సిటీ రైలు రాజ్‌షాహి మరియు చిలహతి మధ్య నడుస్తుంది.
·        నవంబర్ 19, 1992, బంగ్లాదేశ్ ప్రభుత్వం టైటుమిర్ మరణించిన 161 వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన గౌరవార్ధం  స్మారక ముద్రను విడుదల చేసింది.

·        ప్రఖ్యాత బెంగాలీ రచయిత్రి మహాస్వేతా దేవి తిటుమిర్ అనే నవల రాశారు.
·        టిటు మీర్-ఎర్ బషర్ కెల్లా అనే నాటకం బంగ్లాదేశ్‌ టీవీ కోసం రూపొందించబడింది.














































No comments:

Post a Comment