18 March 2020

మహమూద్ ఖాన్ బెంగుళూరి : భారతీయ కన్నడ స్వాతంత్ర సమర యోదుడు మరియు జాతీయవాద కవి. Mahmood Khan Bengaloori: AN Indian Freedom Fighter & Nationalist Poet


Top of Form

Image result for Mahmood Khan Bengaloori: AN Indian Freedom Fighter & Nationalist Poet


భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం అనేకమంది మహనీయులు పోరాటం చేసారు. కానీ చాలా తక్కువ మంది  స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటిష్ వారి శక్తికి వ్యతిరేకంగా తమదైన రీతిలో ధైర్యంగా నిలబడ్డారు మరియు దాని కోసం వారు భారీ వ్యక్తిగత మూల్యం చెల్లించారు.అటువంటి వారిలో మహమూద్ ఖాన్ బెంగళూరి ఒకడు. ఇతడు  కర్ణాటక లోని బెంగుళూరుకు చెందిన ఒక స్వాతంత్య్ర సమరయోధుడు మరియు అతను  బ్రిటిష్ వారితో పోరాడటానికి తన కలం ఉపయోగించాడు.

మొదటినుంచి మహమూద్ ఖాన్ తన జీవితం లో అనేక  పరీక్షలు మరియు కష్టాలలో గడిపాడు అయిన అతను  తన విశ్వాసాన్ని, ధైర్యాన్ని కోల్పోలేదు. మొదట్లో క్లరికల్ పోస్టులలో పనిచేసి తరువాత 1911 సంవత్సరంలో “ఖాసిమ్-ఉల్-అఖ్బర్” అనే ఉర్దూ వార్తాపత్రికకు సంపాదకుడిగా మాహమూద్ ఖాన్ పనిచేసాడు.

పత్రికా సంపాదకునిగా స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు ఇచ్చే శక్తివంతమైన వ్యాసాలు మరియు కవితలను నిరంతరం రాయడం ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వం మహమూద్ ఖాన్‌ను వార్తాపత్రిక సంపాదక పదవి నుండి తొలగించాలని ప్రచురణకర్తలను కోరింది. పర్యవసానంగా, మహమూద్ ఖాన్ తన జీవనోపాధిని కోల్పోయాడు మరియు ఆర్థిక సమస్యలతో సతమతయ్యాడు. అయిన బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా వివిధ నకిలీ పేర్లతో వ్యాసాలు రాసేవాడు.

అతను సీమాబ్ బెంగళూరి అనే పేరుతో బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా కవితలను రాసాడు. విషయం తెలిసిన కలెక్టర్ మహమూద్ ఖాన్‌ను బహిష్కరిస్తానని మరియు వార్తాపత్రికను నిషేధించాలని బెదిరించాడు.

మహమూద్ ఖాన్‌ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ వారి అపజయాలను,  తిరోగమనాలను తన రచనలలో ప్రముఖంగా  పేర్కొనేవాడు  పలితంగా అతనిపై ఒత్తిడి పెరిగింది మరియు చివరికి అతను అయిష్టంగానే బెంగళూరును విడిచిపెట్టాడు

జీవనోపాధి కోసం పోరాటం

మహమూద్ ఖాన్ అనంత్‌పూర్‌కు వెళ్లారు మరియు ఉత్తర అనంత్‌పూర్ బంగారు గనులలో టైమ్ కీపర్ / స్టోర్ కీపర్‌గా పనిచేశాడు. ఆ తరువాత, మహమూద్ ఖాన్ వివిధ వ్యాపారాలు చేయడం ద్వారా జీవనోపాధిని పొందటానికి ప్రయత్నించాడు, కాని అతను ఈ అన్ని కార్యక్రమాలలో విఫలమయ్యాడు మరియు భారీ ఆర్ధిక నష్టాలను చవిచూశాడు. పర్యవసానంగా, అతను ఉపాధి కోసం 1929 సంవత్సరంలో తిరిగి బెంగళూరుకు వచ్చాడు.

బెంగళూరులోని  డికెన్సన్ రోడ్ లో “అహ్ల్-ఎ-ఇస్లాం అనాథాశ్రమం”(ఇప్పుడు దానిని  ముస్లిం అనాథాశ్రమం అని పిలుస్తారు)  సూపరింటెండెంట్‌గా నియమించబడినాడు. అక్కడ పదకొండు సంవత్సరాలు సేవలందించాడు. డికెన్సన్ రోడ్‌లోని ముస్లిం అనాథాశ్రమం నుండి సంపాదకుడు-రచయిత కవి మహమూద్ ఖాన్ బెంగళూరితన శక్తివంతమైన స్వాతంత్ర్య అనుకూల కవితలు రాశారు మరియు అనేక సాంఘిక సేవ కార్యకలాపాలలో పాల్గొన్నారు.అనాధ పిల్లలకు స్వయం ఉపాధి నైపుణ్యాలను అందించడానికి తగు చర్యలు తీసుకొన్నాడు.  అతని చొరవతో, అనాథాశ్రమం ఒక పారిశ్రామిక పాఠశాలను కూడా ప్రారంభించింది. అతను పిల్లలను ఫుట్‌బాల్ వంటి క్రీడలకు పరిచయం చేశాడు. అనాథాశ్రమానికి ఆయన చేసిన సేవలు మరపురానివి.

విప్లవాత్మక ప్రచురణలు

మహమూద్ ఖాన్ అత్యంత ప్రసిద్ధ పుస్తకం సల్తానాత్-ఎ-ఖుదాద్ Saltanat-e-Khudad  (1939) ఉర్దూ భాషలో వ్రాయబడి ప్రచురించబడింది. ఈ పుస్తకం టిప్పు సుల్తాన్‌ను ఒక సంస్కరణవాదిగా  మరియు అభివృద్ధి పట్ల ఉత్సాహాన్ని కలిగిన రాజుగా  చిత్రికరించినది. టిప్పు సుల్తాన్‌ మత సహనం కలిగి తన రాజ్యం లోని  పౌరులందరినీ సమానంగా చూసుకున్నారు. టిప్పు సుల్తాన్‌ను ఆ కాలపు బ్రిటీష్ చరిత్రకారులు మతోన్మాద, నిరంకుశ మరియు దోపిడీదారుడిగా చిత్రీకరించడానికి ఇది పూర్తి విరుద్ధం.


సుల్తానాత్-ఎ-ఖుదాదాద్ (Sultanat-e-Khudadad) కాకుండా, మహమూద్ ఖాన్ బెంగళూరి మరో తొమ్మిది ఉర్దూ పుస్తకాలను రచించారు. వీటిలో హైదర్ అలీ (1938) ఒక చారిత్రక నవల మరియు సహీఫే టిప్పు సుల్తాన్ Saheefaye Tipu Sultan (1947)  అనేది విలియం కిర్క్ పాట్రిక్ పుస్తకం, సెలెక్టెడ్ లెటర్స్ ఆఫ్ టిప్పు సుల్తాన్” యొక్క ఉర్దూ అనువాదం. మహమూద్ ఖాన్ భారత  దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన భారతీయ  యువతకు ఈ పుస్తకాన్ని అంకితం చేశారు.

మహమూద్ ఖాన్  తన  జీవితంలో చివరి రోజులు తీవ్రమైన ఆర్థిక సమస్యలు మరియు ఆనారోగ్యం, బాధలు మరియు కష్టాలలో గడిపారు. అతను రాసిన పుస్తకాలకు విజయవంతం అయిన  ప్రచురణ కర్తల నుండి తగిన ప్రతిపలం పొందలేదు.

చివరి రోజులలో మహమూద్ ఖాన్ ప్రభుత్వం నుండి  నెలకు రూ .100 / - పెన్షన్ పొందగలిగాడు. అది కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే మంజూరు చేయబడింది. తరువాత జీవనం కష్టమై మహమూద్ ఖాన్ సంవత్సరాల నుండి చాలా కష్టపడి సేకరించిన విలువైన పర్సనల్ పుస్తకాలను అతి సల్ప ధరకు విక్రయిచిoనాడు.


మహమూద్ ఖాన్ బెంగళూరి 1958 అక్టోబర్ 1571 సంవత్సరాల వయసులో తనువు చాలించాడు. ఒక విప్లవాత్మక రచయిత, చరిత్రకారుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు అనామకునిగా మరణించారు. కానీ అతను వదిలిపెట్టిన వారసత్వం ప్రతి భారతీయుడు గర్వించేలా కొనసాగుతుంది.


No comments:

Post a Comment