24 March 2020

సూరా అల్ ఇస్రా వెలుగులో షబ్-ఎ-మిరాజ్ (వాకియా మిరాజ్) Shab-e-Miraj (Waqia Miraj) in the Light of Surah Al Isra




షబె -ఎ-మిరాజ్  దృగ్విషయం పవిత్ర ఖురాన్లో వివరంగా వివరించబడింది. ఇస్రా మరియు మీరాజ్ ఒక రాత్రి ప్రయాణం యొక్క రెండు దశలు. ఇస్లామిక్ చరిత్రలో షబ్-ఎ-మిరాజ్ ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంది.

Image result for isra the journey


షబ్-ఎ- మిరాజ్:
621 సంవత్సరం రజబ్  మాస 27వ తేదిన  ప్రవక్త ముహమ్మద్ (స) (అల్-కుద్స్) లోని అల్ అక్సా మసీదుకు  తరువాత మిరాజ్కు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దయతో ప్రయాణించారు. ప్రవక్త ముహమ్మద్ (స) బురాక్ అనే రెక్కల తెల్ల గుర్రంపై ప్రయాణించారు. మిరాజ్ అద్భుత వివరాలు మరియు దాని ప్రాముఖ్యతను అనేక ఇస్లామిక్ గ్రంధాలు  వివరిస్తాయి.

అల్-ఖురాన్ వెలుగులో షబె-ఎ-మిరాజ్

·        "కొన్ని నిదర్శనాలను చూపటానికి తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిదె హారమ్ నుండి, దూరంగా ఉన్న మసీదు  వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్దుడు. ఆ మసీదు పరిసరాలను ఆయన శుభవంతం చేసాడు. నిజానికి ఆయనే అన్ని వినేవాడు, అన్ని చూసేవాడును.-(ఖురాన్ 17: 1)

మిరాజ్ ((Ascension) సందర్భంగా ఈ సూరా వెలుబడినది., పవిత్ర ప్రవక్త(స) జీవితంపై రాయబడిన పుస్తకాల(సీరత్) ప్రకారం, హజ్రః కు ఒక సంవత్సరం ముందు మీరాజ్ జరిగింది. ఈ సూరా మక్కాలో ప్రవక్త(స) చివరి దశలో వెల్లడైంది.

ఈ సూరా ద్వారా  అల్లాహ్ SWT స్వర్గం మరియు నరకం యొక్క దృశ్యాలను ప్రవక్త ముహమ్మద్ (స) గారికి ఎలా చూపించారో, అలాగే మంచి చేసినవారికి లభించే ప్రతిఫలాలతో పాటు పాపులకు శిక్షలు ఎలా ఉంటాయో కూడా ప్రస్తావించారు.

హదీసు వెలుగులో షబె-ఎ-మిరాజ్
అదేవిధంగా వేర్వేరు హదీసులు మిరాజ్ రాత్రి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. హదీసులలో ఒకటి ఈ విధంగా ప్రస్తావించింది:

అయేషా (ర)ప్రకారం :

·        "ప్రవక్త (స) ను రాత్రిపూట అద్భుతంగా యెరూషలేములోని మసీదుకు తీసుకెళ్ళిన తరువాత అయన  మేల్కొని దాని గురించి ప్రజలకు చెప్పారు. దీనితో వారిలో కొందరికి  ఆయనపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసo పోయింది.
వారు అబూబకర్ను ఆశ్రయించారు మరియు వారు, "మీ స్నేహితుడు రాత్రిపూట పవిత్ర ఇంటికి తీసుకువెళ్ళాడని హించాడు, ఇది  మీరు విన్నారా?" అనగా దానికి అబూ బకర్, “ఆయన  అలా చెప్పారా?” అని అన్నాడు. వారు అవును అని అన్నారు.
అబూ బకర్, "ఆయన ఆ విధంగా  చెప్పినట్లయితే, వారు నిజమె  మాట్లాడారు” అని అన్నారు." దానికి వారు, "ఆయన  రాత్రి పవిత్ర ఇంటికి వెళ్లి ఉదయం కంటే ముందు తిరిగి వచ్చాడని మీరు నమ్ముతున్నారా?" అనగా, 
అబూ బకర్, “అవును. నిశ్చయంగా, నేను నమ్ముతున్నాను. అయన  చేసే ప్రతి పనికి ఆయనకు స్వర్గం నుండి సందేశాలు వచ్చాయని నేను నమ్ముతున్నాను.
ఈ కారణంగానే  అబూబకర్ కు   సత్యవంతుడు, అల్-సిద్దిక్ అని పేరు కలదు.
మూలం: దలీల్ అల్-నుబువా 680. అల్-అల్బానీ ప్రకారం సాహిహ్ (ప్రామాణికమైనది)

షబె-ఎ-మిరాజ్ యొక్క అవలోకనం
మిరాజ్ సమయంలో జరిగిన సంఘటనల గురించి వివిధ పుస్తకాలు పేర్కొన్నాయి. కొన్ని పుస్తకాలలో ఒకదానికొకటి సారూప్య అంశాలు ఉన్నాయి.

ముహమ్మద్ (స) ఆశీర్వదింపబడిన  దేవదూత జిబ్రాయిల్‌తో కలసి స్వర్గంలోకి వెళ్లారు మరియు స్వర్గం యొక్క ఏడు అంతస్తులలో ప్రతి దాని వద్ద వివిధ ప్రవక్తలను కలుసుకున్నారు. వారు  మొదట ఆదం (AS), యాహ్యా మరియు ఈసా, యూసఫ్, ఇద్రిస్, అహరోను, ముసా మరియు చివరికి ఇబ్రహీం తో కలిసారు..

ప్రవక్తలందరితో సమావేశమైన తరువాత, ముహమ్మద్ (స) జిబ్రాయిల్ లేకుండా అల్లాహ్ ను కలుసుకొబోయారు. జిబ్రాయిల్ దేవదూత ఈ నిర్దిష్ట స్థానం నుండి నేను ముందుకు వెళితే నా రెక్కలు కాలిపోతాయని అని పేర్కొన్నారు. ఈ రాత్రి, అల్లాహ్ (SWT) ముహమ్మద్ (స) కు ఇచ్చే గొప్ప బహుమతులలో ఒకటి ప్రార్థనలు.

ముహమ్మద్ (స) అనుచరులకు ప్రార్థనల బహుమతి

ఈ రాత్రి, అల్లాహ్ ముహమ్మద్ (స) తో వారి  అనుచరులు ప్రతిరోజూ 50 సార్లు నమాజ్ చేయవలసి ఉంటుందని వెల్లడించారు. ముహమ్మద్ (స) తిరిగి భూమికి వచ్చినప్పుడు, వారు ముసాను కలుసుకున్నారు.  ముసా ముహమ్మద్ (స) ను అల్లాహ్ వద్దకు తిరిగి వెళ్ళమని సలహా ఇస్తారు మరియు ప్రార్థనలను తగ్గించమని అభ్యర్థన చేస్తారు, ఎందుకంటే అనుచరులు రోజుకు 50 సార్లు ప్రార్థనలు చేయడం కష్టం.

ప్రతిరోజూ ఐదు ప్రార్థనలకు తగ్గే వరకు ముహమ్మద్ (స) ముసా మరియు అల్లాహ్ మధ్య చాలాసార్లు వెళ్ళారు. అల్లాహ్ (SWT) ఈ ప్రార్థనలకు పదిరెట్లు బహుమతి ఇవ్వడం గురించి ప్రస్తావించారు. ప్రవక్త ముహమ్మద్ (స) 5 సార్లు ప్రార్థనలు చేసినందుకు అనుమతించినందుకు అల్లాహ్ (ఎస్.డబ్ల్యు.టి) కు కృతజ్ఞతలు తెలిపారు.

మిరాజ్ రాత్రి, అల్లాహ్ (SWT) మానవ మనస్సులో ఉన్న అపారమైన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ముహమ్మద్ ప్రవక్త (స) ఎటువంటి కష్టం లేకుండా స్వర్గానికి, నరకానికి ప్రయాణించారు.

దివ్య ఖురాన్ మరియు ఇతర సంకేతాలతో సహా మిరాజ్ యొక్క అద్భుతం మరియు ఇతర అన్ని అద్భుతాలు షబె-ఎ-మిరాజ్లో జరిగాయి. ఈ అద్భుతమైన రాత్రి, అల్లాహ్ (SWT) అవిశ్వాసులకు అలాగే సత్యాన్ని ఆలోచించడానికి మరియు కనుగొనటానికి సంకేతాలను చూపించాడు.








No comments:

Post a Comment