8 March 2024

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఖాక్సర్ మహిళలు The Khaksar Women who fought for our freedom

 

 

అల్లామా మష్రికీ స్త్రీ సాధికారతకు మద్దతు పలికారు.

నాసిమ్ యూసఫ్ ద్వారా  “ అనేక శతాబ్దాల తర్వాత, ప్రతి ముస్లిం స్త్రీకి మళ్లీ విన్నవిస్తున్నాము. మానవజాతి ఉనికి మరియు పెంపకం మీ వల్లనే... అలాగే ఒక దేశం మరియు ఉమ్మా జీవితం కూడా మీ ఆజ్ఞపై ఆధారపడి ఉంది…”

అల్లామా మష్రికీ (క్వోల్-ఎ-ఫైసల్”, 1935)

 

అల్లామా మష్రికీ నేతృత్వంలోని ఖాక్సర్ ఉద్యమంలో  యూనిఫాం ధరించిన ఖాక్సర్ ముస్లిం మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తూ భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనను సవాలు చేస్తూ ఒక బలీయమైన శక్తిగా నిలిచారు. బ్రిటీష్ రాజ్ పతనాన్ని నిర్ణయించడం లో ఖాక్సర్ ముస్లిం మహిళలు పోషించిన కీలక పాత్ర చారిత్రక కథనాలలో విస్మరించబడింది. అక్కడక్కడ కొన్ని పంక్తులలో క్లుప్తంగా మాత్రమే ప్రస్తావించబడతాయి. ఈ చారిత్రక లోటును సరిద్దిద్దడానికి "ది ఖాక్సర్ ఉమెన్: వారియర్స్ ఫర్ ఇండిపెండెన్స్" పేరుతో ఒక పుస్తకం వెలుబడింది.

 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు మార్చి 19, 1940న ఖక్సర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఖాక్సర్ మహిళల త్యాగాలను గౌరవించడం, వారి కార్యకలాపాలపై వెలుగులు నింపడం మరియు మార్చి 19ఖక్సర్ అమరవీరుల దినోత్సవం కొరకు "ది ఖాక్సర్ ఉమెన్: వారియర్స్ ఫర్ ఇండిపెండెన్స్" పుస్తకం అంకితం చేయబడింది. స్వాతంత్ర్యం కోసం లాహోర్‌లో తమ ప్రాణాలను అర్పించిన ఖక్సర్ అమరవీరుల ధైర్యాన్ని స్మరించుకోవడం "ది ఖాక్సర్ ఉమెన్: వారియర్స్ ఫర్ ఇండిపెండెన్స్" పుస్తకం వ్రాయడానికి మరొక కారణం.

భారత ఉపఖండంలో, పురుష-ఆధిపత్య సమాజంలో మహిళలు ఎక్కువగా గృహ పాత్రలకు పరిమితం చేయబడ్డారు. మహిళల విధులు ప్రధానంగా గృహాలను నిర్వహించడం మరియు కుటుంబాన్ని చూసుకోవడం కు పరిమితం అయ్యాయి.

అల్లామా మష్రికీ విద్యావంతులైన కుటుంబంలో జన్మించాడు; మష్రికీ కుటుంబంలోని పురుషులే కాకుండా, తల్లి మరియు సోదరీమణులు కూడా చదువుకున్నారు. మహిళల సాధికారత యొక్క ఆవశ్యక అవసరాన్ని గుర్తించి, మష్రికీ ఒక మార్గదర్శక ముస్లిం నాయకుడిగా అవతరించారు, మష్రికీ సామాజిక పురోగతిని ముందుకు తీసుకెళ్లడంలో మాత్రమే కాకుండా బ్రిటిష్ పాలన యొక్క సంకెళ్ల నుండి భారతదేశాన్ని విముక్తి చేయడంలో మహిళా సాధికారత యొక్క కీలక పాత్రను గుర్తించాడు.

 మష్రిఖీ ఖాక్సర్ ఉద్యమాన్ని స్థాపించిన తర్వాత, మష్రిఖీ మొదటి భార్య విలాయత్ బేగం కూడా దాని ప్రారంభంలో ముఖ్యమైన పాత్ర పోషించింది, మష్రికీ యొక్క పుస్తకం ఇషారాత్మరియు ఆగస్ట్ 12, 1938 నాటి అల్-ఇస్లాహ్అనే పత్రికలో ఇది నమోదు చేయబడింది. 1935లో, మష్రికీ తన సంచలనాత్మక మరియు విప్లవాత్మక రచన "క్వోల్-ఇ-ఫైసల్" ద్వారా స్త్రీవాద ఉద్యమాన్ని, స్త్రీ విముక్తి మరియు సాధికారతను సమర్ధించినాడు.

భారతదేశం అంతటా ఖాక్సర్ ఉద్యమంలో మహిళలు పెద్ద సంఖ్యలో చేరారు. వారిలో మష్రికీ కుమార్తెలు, ఖాక్సర్ల భార్యలు, సోదరీమణులు, వారి కుమార్తెలు మరియు ఇతర బంధువులు ఉన్నారు. ఈ మహిళలు సగర్వంగా ఖాక్సర్ ఖాకీ యూనిఫారాన్ని ధరించారు, "అఖువత్" (అంటే సోదరభావం) అనే శాసనం ఉన్న భుజం బ్యాండ్‌తో అలంకరించబడింది. మహిళలు ఉత్సాహంగా ఖాక్సర్ శిబిరాలకు హాజరయ్యారు, సైనిక శిక్షణ, కసరత్తులు మరియు కవాతులు చేసారు. భారతదేశంలోని ఖాక్సర్ మహిళలు పోరాట శిక్షణ, వీధి కవాతులు వేలాది మందిని ఆకర్షించినవి.

పురుషుల ఖక్సర్లతో పాటు పదివేల మంది ఖాక్సర్ మహిళలలో ముఖ్యురాలు అయిన సయీదా బానో 1943 బెంగాల్ కరువు సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించడంలో, అవసరమైన సహాయం అందించడంలో మరియు పునరావాసంలో సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

ఖాక్సర్ మహిళలు బ్రిటిష్ పాలన వ్యతిరేక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా  ఖాక్సర్ సాహిత్యాన్ని పంపిణీ చేశారు మరియు మష్రికీ సందేశాన్ని ప్రచారం చేయడానికి మహిళల సమావేశాలను నిర్వహించారు.

1939లో, యునైటెడ్ ప్రావిన్సెస్ (U.P) ప్రభుత్వాన్ని స్తంభింపజేయడంలో ఖాక్సర్ మహిళల కీలక పాత్ర పోషించారు, పలితంగా U.P యొక్క బ్రిటిష్ గవర్నర్‌ మష్రికీ నిబంధనల ప్రకారం  శాంతి ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. ఈ ఒప్పందాన్ని అనుసరించి, మష్రికీ ఒక సమాంతర ప్రభుత్వాన్ని స్థాపించాడు మరియు ఖాక్సర్ గవర్నర్‌లను నియమించాడు, ఖాక్సర్ గవర్నర్‌లకు సహాయం చేయడానికి సభ్యులుగా పంజాబ్ మరియు యునైటెడ్ ప్రావిన్స్‌లకు కొందరు మహిళలు నియమితులయ్యారు.

మార్చి 19న లాహోర్‌లో ఖక్సర్ల క్రూరమైన హత్యల తరువాత, ఖాక్సర్ మహిళలు నిరసనలలో పాల్గొన్నారు మరియు శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఖాక్సర్ మహిళలు తమ ఖాక్సర్ సోదరులతో నిరసన లో చేరారు. ఖాక్సర్ మహిళలను  నియంత్రించడానికి బ్రిటీష్ ప్రభుత్వo మహిళా పోలీసులను నియమించవలసి వచ్చింది, ఇది బ్రిటిష్ ఇండియా చరిత్రలో మొదటిసారి.

ఖాక్సర్ మహిళలు మార్చి 22 నుండి 24, 1940 వరకు లాహోర్‌లో జరిగిన చారిత్రాత్మక ఆల్-ఇండియా ముస్లిం లీగ్ సెషన్‌కు హాజరయ్యారు, అక్కడ పాకిస్తాన్ తీర్మానం మరియు ఖక్సర్ తీర్మానం ఆమోదించబడింది. సెషన్‌లో, మగ ఖాక్సర్‌లతో పాటు, ఖాక్సర్ మహిళలు, అల్లామా మష్రికీ మరియు ఖాక్సర్‌లను విడుదల చేయాలని మరియు ఖాక్సర్ ఉద్యమంపై నిషేధాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.

మే 31, 1940, మష్రికీ కుమారుడు, ఎహ్సానుల్లా ఖాన్ అస్లాం, మార్చి 19, 1940న జరిగిన బ్రిటిష్ పోలీసుల క్రూరత్వం కారణంగా మరణించాడు. యూనిఫాంలో ఉన్న 50,000 మంది ఖాక్సర్ మహిళలు అస్లాం మృతదేహమును  ఊరేగించారు మరియు వారిలో కొందరు బురఖాలో ఉన్నారు. ఇది భారీ అంత్యక్రియల ఊరేగింపు

ఖాక్సర్ మహిళలు గూఢచారులుగా కూడా వ్యవరించారు. మష్రికీ మరియు ఇతర  ఖాక్సర్ నాయకులకు మధ్య రహస్య సందేశాలను, రహస్య సమావేశాలను నిర్వహించడం చేసారు.  ఖాక్సర్ మహిళల బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాల ఫలితంగా, అనేకమంది బెదిరించబడ్డారు, వేధించబడ్డారు మరియు కొట్టబడ్డారు.

ఢిల్లీకి చెందిన సయీదా బానో అనే పదేళ్ల బాలిక స్వాతంత్య్ర ఉద్యమంలో అద్భుతమైన పాత్ర పోషించింది. సయీదా బానో ధైర్యవంతురాలు మరియు అనర్గళంగా మాట్లాడేది. సయీదా బానో అనేక మహిళల కవాతులు మరియు నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించేది. ఈ బహిరంగ ప్రదర్శనల సమయంలో, వారు "బ్రిటీష్ రాజ్ ముర్దాబాద్" మరియు "హుకుమత్-ఎ-బర్తానియా ముర్దాబాద్" వంటి బ్రిటిష్ పాలన వ్యతిరేక నినాదాలను లేవనెత్తారు.

జూన్ 18, 1940, సయీదా బానో, పురుషులు మరియు మహిళా ఖాక్సర్‌లతో కలసి, యూనిఫారం మరియు బెల్చాతో పంజాబ్ ప్రీమియర్ సర్ సికందర్ హయత్ ఖాన్ కు ఒక లేఖను అందజేసారు; అయితే, బానోతో పాటు మరికొందరిని అరెస్టు చేశారు.

ఆగష్టు 19, 1940, మేజిస్ట్రేట్ మైనర్ అయిన బానోను విడుదల చేశాడు. ఆగస్ట్ 30, 1940 నాటి ది ట్రిబ్యూన్ ప్రకారం, మేజిస్ట్రేట్ ఇతర మహిళలను కూడా కొన్ని నిబంధనల ప్రకారం విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేశాడు.

ఖాక్సర్ మహిళల ప్రభావంతో  సుభాష్ చంద్రబోస్ 1940ల ప్రారంభంలో తన ఇండియన్ నేషనల్ ఆర్మీలో మహిళలను కూడా చేర్చుకున్నారు. మహమ్మద్ అలీ జిన్నా యొక్క ఆల్-ఇండియన్ ముస్లిం లీగ్ 1944లో ఉమెన్స్ నేషనల్ గార్డ్‌ ను స్థాపించింది.

"ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా, 1946 A.C“The Constitution of Free India, 1946 A.C.” " అని పిలువబడే రాజ్యాంగాన్ని రూపొందించడంలో కొందరు ప్రతిభావంతులైన ఖాక్సర్ మహిళలను మష్రికీ చేర్చుకున్నారు. 1940ల మధ్యకాలంలో. భారతదేశ ఐక్యతను కాపాడేందుకు ముస్లింలు మరియు ముస్లిమేతరుల హక్కులను కాపాడినందున మష్రికీ యొక్క రాజ్యాంగాలు ప్రజలలో ఆదరణ పొందాయి.

. "ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా, 1946 A.C“The Constitution of Free India, 1946 A.C.” " పత్రానికి మద్దతుగా  1945-1946 ఎన్నికలలో, ఖక్సర్ అభ్యర్థుల కోసం పురుషులు మరియు మహిళలు ఇద్దరూ తీవ్రంగా ప్రచారం చేశారు. బ్రిటిష్ వారు తమ విధానంలో భాగంగా, ఖాక్సర్లు విజయం సాధించకుండా చూసుకున్నారు.

అఖిల భారత ముస్లిం లీగ్ విజయాన్ని సాధించడానికి బ్రిటిష్ వారు చాలా కష్టపడ్డారు. మష్రికీ, ఖాక్సర్ పురుషులు మరియు మహిళలతో సహా ఇతర నాయకులతో కలిసి ఎన్నికల రిగ్గింగ్‌కు వ్యతిరేకంగా తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.

1947లో, ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ 1948లోపు భారతీయులకు అధికారాన్ని బదిలీ చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు, ముస్లింలు, హిందువులు మరియు సిక్కులపై మత కల్లోలాలను ప్రారంభించడానికి సమయం సంపాదించడానికి ఇది బ్రిటిష్ వారి ఒక ఎత్తుగడ అని మష్రికీ భావించారు. నిజానకి బ్రిటీష్ వారికి భారతదేశాన్ని విడిచిపెట్టే ఆలోచన ఇంకా చాలా సంవత్సరాలు లేదని అందరికీ తెలుసు.

బ్రిటీష్ ఉద్దేశాల గురించి తెలుసుకున్న మష్రికీ 300,000 మంది ఖక్సర్లను జూన్ 30, 1947న ఢిల్లీకి చేరుకోవాలని ఆదేశించాడు. ఈ చర్య బ్రిటిష్ వారిని అప్రమత్తం చేసింది మరియు లార్డ్ మౌంట్ బాటన్ త్వరత్వరగా విభజన ప్రణాళికను ప్రకటించి, ఖాక్సర్ల సభ ముందు దానిని ఆమోదించాడు.

జూన్‌,1947లో, కఠినమైన ఆంక్షలు మరియు సెక్షన్ 144 అమలులో ఉన్నప్పటికీ, 100,000 ఖాక్సర్ లు  (బ్రిటీష్ ఇండియాలోని మీడియా 70,000 నుండి 80,000 వరకు నివేదించబడింది) ఖాక్సర్ మహిళలతో సహా ఢిల్లీకి చేరుకున్నారు. అల్లర్ల సమయంలో, ఖక్సర్ మహిళలు జీవితాలను రక్షించడానికి పగలు మరియు రాత్రి పని చేయడం లేదా ముస్లింలు మరియు ముస్లిమేతరుల పునరావాసం కోసం శరణార్థి శిబిరాల్లో పని చేయడం చేసారు.

ముగింపు:

ఖాక్సర్ ముస్లిం మహిళలు వలసరాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో దృఢంగా నిలిచారు, ఖాక్సర్ మహిళలు ఖక్సర్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అసాధారణమైన విశ్వాసం, వ్యక్తిత్వం మరియు గర్వాన్ని ప్రదర్శించారు.

1930వ దశకంలో, తూర్పు మరియు పశ్చిమ దేశాలలో సమాన హక్కులు లేని కాలంలో మష్రికీ మహిళలకు సాధికారత కల్పించారు. మష్రికీ తన సమయానికి ముందు ఉన్నాడు మరియు ఖాక్సర్ మహిళా ఉద్యమం సాయుధ దళాలతో సహా వివిధ రంగాలలోకి చేర్చిన ప్రపంచ ఉద్యమానికి పునాది వేసింది.

అల్లామా మష్రికీ యొక్క ఖక్సర్ ఉద్యమం, ఐదు మిలియన్లకు పైగా పురుష మరియు స్త్రీ సభ్యులతో సైన్యాన్ని స్థాపించగలిగినది. అనేక విదేశీలలో ఉద్యమం యొక్క శాఖలను స్థాపించగలిగినది.

స్వాతంత్ర్య సమరయోధుడు అల్లామా మష్రికీ మనవడు యూసఫ్ మష్రికీ 18 పుస్తకాలను రచించాడు మరియు 19 అరుదైన రచనలను డిజిటలైజ్ చేశాడు, ఇందులో అల్లామా మష్రికీ చారిత్రాత్మక జర్నల్ అల్. – ఇస్లాహ్ కలదు..

 

No comments:

Post a Comment