20 March 2024

ఖురాన్ వివిధ మతాల ప్రజలను అవమానం చేయడాన్ని నిషేధిస్తుంది Quran forbids abuse of people of different religions

 




ఇస్లాం అనేది భారతదేశం, ఆసియా మరియు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆచరించే మతం. మొదటి నుండి, ఇస్లాం వివిధ మతాలు, మరియు విశ్వాసాలను ఎదుర్కొంది. ఇస్లాంకు ఇతర మతాల పట్ల తన వైఖరిని నిర్వచించడం తప్పనిసరి అయింది. ఇస్లాం ప్రవక్త(స) మదీనాకు వలస వచ్చినప్పుడు, అక్కడ యూదు మరియు క్రైస్తవ సంఘాలు తమ విశ్వాస  పద్దతులను   ఆచరిస్తున్నారు.

ఖురాన్ 2వ అధ్యాయం, 62వ ఆయాతు ఒక స్పష్టమైన ద్యోతకం తెలిపింది.:

·       "నిశ్చయంగా విశ్వసించిన వారు, యూదులు, మరియు క్రైస్తవులు, మరియు సబియన్లు-వారిలో ఎవరైనా సరే అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించి మంచి చేసే వారికి వారి ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంటుంది.”.

మోక్షం అనేది ఏ మతం యొక్క గుత్తాధిపత్యం కాదని, ముస్లింలకు మాత్రమే కాకుండా, భగవంతునిపై విశ్వాసం ఉంచి మంచి పనులకు చేసేవారికి తలుపు త్వరితగతిన ప్రతి ఒక్కరికీ తెరిచి ఉందని దివ్య ఖురాన్ తెలిపింది

ఇస్లాం ఇతర మతాల పట్ల సహనాన్ని ప్రబోధిస్తుంది. ఇస్లాం మతం ఇతర మతాల పట్ల గౌరవాన్ని బోధిస్తుంది,

దేవుని సందేశాన్ని ప్రసారం చేయడానికి దేవుడు వివిధ యుగాలలో వివిధ సమాజాలకు వివిధ ప్రవక్తలను పంపాడని ఇస్లాం బోధిస్తుంది. ఈ ప్రవక్తలు ప్రజలకు దైవిక ఐక్యత, మానవ జవాబుదారీతనంపై విశ్వాసం మరియు విశ్వ నైతిక చట్టం ఉనికిని బోధించారు. దేవుని ప్రవక్తలు మరియు దూతలు ప్రజలను ధర్మం వైపు పిలిచారు మరియు చెడు, అవమానకరమైన మరియు అనైతికతను నిషేధించారు.

ప్రపంచ మతాలు ఒక గొప్ప సత్యం యొక్క శాఖలు మరియు రెమ్మలు వంటివి, ఇస్లాం ఇతర మతాల పట్ల గొప్ప గౌరవం చూపుతుంది 

మరొక మతాన్ని అగౌరవపరచడం ఖురాన్‌లో స్పష్టంగా ఖండించబడింది;

·       "అల్లాహ్‌తో పాటు వారు ఆరాధించే వారిని దుర్భాషలాడకండి" (6:109).

ఇస్లాం మోక్షాన్ని ఏదైనా నిర్దిష్ట మతంతో ముడిపెట్టదు.

·       "నిజమైన దైవభక్తి మీ ముఖాలను తూర్పు లేదా పడమర వైపు తిప్పుకోవడంలో ఉండదు. సత్కార్యం అంటే  మనిషి దైవాన్ని, అంతిమ దినాన్ని ,దేవదూతలను, ద్యోతకం, మరియు ప్రవక్తలలను విశ్వసించడం దైవ ప్రసన్నత నిమిత్తం, బంధువులకు  అనాథలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించే వారికి దానాన్ని ఇవ్వటం. బానిసల విముక్తికై ధనం వ్యయం చేయడం. ఇంకా నమాజును స్థాపించాలి. జకాత్ చెల్లించాలి. చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. లేమిలో, భాధలలో, పోరాట సమయంలో సహన స్థాయిర్ధాలను ప్రదర్శించాలి. ఇలాంటివారు సత్య సంధులు. ఇలాంటివారే దైవాభీతిపరులు.. " ( 2:177).

మోక్షం మతంలో కాదు, కర్మలో ఉందని ఇస్లాం నమ్ముతుంది. ఇస్లాం మతపరమైన మతోన్మాదం బదులుగా ప్రజలను సమతావాదం మరియు బహుత్వ మార్గం వైపుకు నడిపిస్తుంది.

దివ్య ఖురాన్ ఇలా వివరిస్తుంది:

·       అల్లాహ్ సంకల్పించినట్లయితే, అతను మిమ్మల్ని ఒకే జాతిగా ఉంచేవాడు. అయితే ఆయన తలచుకోన్నవారిని తన కారుణ్యంలో చేర్చుకొంటాడు.  దుర్మార్గులకు ఆశ్రయం ఇచ్చేవాడు, సహాయపడేవాడు ఎవడు ఉండడు. " (42:8).

అల్లాహ్ మనలను విభిన్న విశ్వాసాలు మరియు వివిధ మత సంప్రదాయాలలో సృష్టించాడు. దీనర్థం నా మతమే దేవునికి ఏకైక మార్గం అని కాదు. మోక్షం ఈ మతానికి లేదా ఆ విశ్వాసానికి చెందినదని భావించే కాలంలో ప్రపంచంలోని అన్ని గ్రంధాలు మరియు ఖురాన్ ప్రత్యేకించి అన్ని మతాలు ఒకే గమ్యానికి దారితీసే విభిన్న మార్గాల వంటివని నిర్దేశిస్తున్నవి..

ఇతర మతాలు మన మతాల వలె నిజమైనవి మరియు విముక్తి కలిగించేవిగా ఉన్నాయని అంగీకరించినప్పుడు, ఆ భావన ఇతర మతాలకు చెందిన ఇతర వ్యక్తులను ప్రేమించడానికి మరియు గౌరవించడానికి ప్రేరేపిస్తుంది.

ఇమామ్ అలీ ప్రకారం

·       "ప్రజలు రెండు రకాలు అని తెలుసుకోండి: వారు మతంలో మీ సోదరులు లేదా సృష్టిలో మీ సమానులు."

ముస్లిం ఆధ్యాత్మికవేత్తలు మరియు సూఫీలు మతపరమైన బహుళత్వం మరియు వివిధ మతాల పట్ల గౌరవం కోసం ప్రబోధించారు. సూఫీలు వివిధ మతాలు ఒకే దివ్యత్వం నుండి వెలువడే వివిధ కాంతి కిరణాల వంటివారని భావించారు..

 

No comments:

Post a Comment