3 March 2024

ఈడిత్ బోర్డ్‌మాన్ 1857

 


ఈడిత్ అడెలా బోర్డ్‌మాన్ లేదా ఈడిత్ అడెలా బిల్‌గ్రామీ (జ.1857) హైదరాబాదుకు చెందిన ఆంగ్లో ఇండియన్ వైద్యురాలు. హైదరాబాదు వైద్య కళాశాల నుండి వైద్య పట్టా (హకీం) పొందిన తొలి మహిళ. ఈడిత్ అడెలా ఆంగ్లంలో నవల వ్రాసిన తొలి భారతీయ మహిళ. తాజ్ అనే కలంపేరుతో జోరా అనే నవలను ప్రచురించింది. నిజాం ప్రభుత్య స్కాలర్‌షిప్పు పొంది ఇంగ్లాండులో వైద్య శిక్షణ పొందింది. హైదరాబాదు తిరిగివచ్చిన తర్వాత నిజాం కొలువులో చేరి జనానా ఆసుపత్రిలో వైద్యసేవ ప్రారంభించింది.

ఈడిత్ అడెలా, 1857లో హైదరాబాదులోని ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించింది. తండ్రి కెప్టెన్ జాన్ వాకర్ బోర్డ్‌మాన్ హైదరాబాదు సైన్యంలో పనిచేశాడు. తల్లి కారోలైన్ ఓలీరీ. ఈ దంపతుల ఎనిమిదిమంది సంతానంలో, ఈడిత్ చివరిది. ఈడిత్ అడెలా కు నలుగురు అన్నలు, ముగ్గురు అక్కలు.

ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ 1888 నుండి తన రాజ్యంలోని ప్రజలెవరైనా, ఉన్నత విద్య అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళాలనుకుంటే వార్షిక గ్రాంటుల రూపంలో ఆర్ధిక సహాయం చేసేవాడు. అలాంటి సహాయం పొందిన తొలి యువతుల్లో ఈడిత్ అడెలా ఒకర్తె. ఇంగ్లాండులో సర్జరీ, మెడిసిన్లో ఉన్నత పట్టా పొంది, 1890లో హైదరాబాదు వైద్య సేవలో చేరింది. అప్పట్లో జనానా (రాణీవాసం)లో పనిచేసేందుకు వైద్యురాళ్ల కొరత ఉండేది.

ఈడిత్ అడెలా 1910లో ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీని వివాహం చేసుకున్నది

అమీర్‌పేట్ లోని ఒక ప్రైవేట్ స్మశానవాటికలో 1926లో డాక్టర్ ఎడిత్ బోర్డ్‌మన్  తన భర్త సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీకి సమాధి నిర్మించినది.

ఎడిత్, తన జీవితాంతం హైదరాబాద్‌లోనే ఉంది. ఎడిత్ కోరిక మేరకు, ఎడిత్ కూడా అదే శ్మశానవాటికలో ఖననం చేయబడింది.

 

No comments:

Post a Comment