16 March 2024

తిరుచిరాపల్లి నతేర్వాలి దర్గా Tiruchirappalli Nathervali Dargah

 



తమిళనాడు లోని తిరుచిరాపల్లి (లేదా తిరుచ్చి) లో హజ్రత్ థేబుల్ ఆలం బాదుషా నతేర్వాలి దర్గా ఉంది. నతేర్వాలి దర్గా దక్షిణ భారతదేశంలో శతాబ్దాల నాటి ఇస్లామిక్ సంప్రదాయానికి మరియు ఆధ్యాత్మిక సాంత్వనకు నిదర్శనం.

దక్షిణ భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశం శాంతియుత మార్గాల ద్వారా జరిగింది. తిరుచ్చి లో ఇస్లాం వ్యాప్తి ప్రధానంగా 8 నుండి 10వ శతాబ్దాలలో కోరమాండల్ తీరానికి వచ్చిన అరబ్ వ్యాపారుల ద్వారా జరిగింది. అరబ్. వ్యాపారులు పట్టు మరియు సుగంధ ద్రవ్యాల వ్యాపారులు మాత్రమే కాకుండా ఇస్లాం మత మరియు సాంస్కృతిక ఆలోచనలను కలిగి ఉన్నారు.

చారిత్రిక కథల ప్రకారం, సుల్తాన్ ముతాహరుదీన్ నథర్వాలి టర్కీ-సిరియన్ వంశం లో  927 A.D.లో సుహార్‌వర్డిలో, (ప్రస్తుత సమర్‌కండ్ సమీపంలో) సుల్తాన్ ముతాహరుదీన్‌గా జన్మించాడు, సుల్తాన్ ముతాహరుదీన్ నథర్వాలి చాలా చిన్న వయస్సులోనే రాజరిక జీవితాన్ని త్యజించాడు మరియు 900 మంది అనుచరులను నడిపించే ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించాడు. సుల్తాన్ ముతాహరుదీన్ నథర్వాలి 10వ శతాబ్దం చివరలో భత్కల్ తీరానికి, చివరికి తిరుచ్చికి చేరుకున్నాడు.

సుహార్‌వర్ది నుండి ముతాహరుదీన్ నథర్వాలి ప్రయాణం దైవిక అన్వేషణ కోసం ప్రాపంచిక ఆనందాలను త్యజించడం కోసం ఆరంభించాడు.

2 ఎకరాలలో విస్తరించి ఉన్న నథర్వలి దర్గా భారతదేశంలోని పురాతన సూఫీ పుణ్యక్షేత్రాలలో ఒకటి. 10వ శతాబ్దంలో త్రిచీ దాని నిర్మాణ వైభవానికి మరియు విభిన్న సాంస్కృతిక ప్రభావాలను స్వాగతించే అభివృద్ధి చెందుతున్న వాణిజ్య కేంద్రం గా  ప్రసిద్ధి చెందింది.

దర్గాలో చెప్పబడిన కధనాల ప్రకారం, హజరత్ నాథేర్వలి, త్రిచీకి వచ్చిన తరువాత, రాక్‌ఫోర్ట్ (కొండ గుడి)లో కొంత కాలం బస చేసాడు, మరియు చోళ రాజు హజరత్ నాథేర్వలి ని ఒక స్థలాన్ని ఎంచుకుని దానిని తన నివాసంగా చేసుకోమని కోరినప్పుడు, హజరత్ నాథేర్వలి తన రక్షను విసిరాడు. అది రాక్‌ఫోర్ట్ నుండి ఒక దేవాలయంపై పడింది. అయిన చోళ రాజు దేవాలయ భూమిని  హజ్రత్‌ నాథేర్వలి అందించాడు, హజరత్ నాథేర్వలి ప్రస్తుతం ఉన్న ప్రదేశం దర్గాగా మారడానికి పునాదిని ఏర్పాటు చేశాడు.

దర్గా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా చోళ శకం యొక్క పరమత సహన తత్వానికి చిహ్నంగా కూడా మారింది.

ట్రిచీ చరిత్రలో చందా సాహిబ్ 18వ శతాబ్దానికి చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తిగా పేరుగాంచాడు.. చందా సాహిబ్ 1749 నుండి 1752 వరకు కర్నాటిక్ (ఆగ్నేయ భారతదేశం) యొక్క నవాబ్‌గాఉన్నాడు. చందా సాహిబ్ నాథర్‌వలి దర్గా మందిరం యొక్క 70 అడుగుల పెద్ద గోపురంనిర్మించాడు. ఇస్లామిక్ అభ్యాసం మరియు ఆధ్యాత్మికతకు కేంద్రంగా దర్గా యొక్క ప్రాముఖ్యత పొందినది.  నొక్కి చెబుతుంది

మదురై నాయక్ రాజవంశానికి చెందిన రాణి మంగమ్మాళ్ మరియు రాణి మీనాచి అమ్మయ్యర్ దర్గా యొక్క ఇతర ప్రసిద్ధ పోషకుల్లో కొందరు

. నాతేర్వాలి దర్గా- వార్షిక ఉర్స్

సుల్తాన్ ముతాహిరుద్దీన్ నాథర్‌వలి వర్ధంతి సందర్భంగా రంజాన్ మొదటి రోజున ప్రారంభమయ్యే ఉర్స్ సన్నాహాలు 14వ రోజు ముగింపుకు చేరుకుంటాయి. "సందనకూడు" ఉత్సవం కోసం ఉపయోగించిన గంధపు చెక్కల రాకతో వేడుకలు ప్రారంభమవుతాయి, ఇందులో సువాసనగల పేస్ట్ దర్గా లోని వివిధ పవిత్ర ప్రదేశాలకు పూయబడుతుంది.

నాథర్‌వలి దర్గా వార్షిక ఉర్స్ కు తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ అంతటా భక్తులు వస్తారు.  

బిర్యానీ తయారీ మరియు పంచడం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ."సందనకూడు" వేడుకకు ముందు రోజు మరియు రోజున 3,000 నుండి 5,000 కిలోల బరువుతో బిర్యానీని తయారు చేయడం మరియు పంచుకోవడం జరుగుతుంది.  

హజ్రత్ నాథర్‌వాలి గౌరవార్థం ఉర్స్ రోజు రాత్రంతా, శ్రావ్యమైన కవ్వాలీల గానం, జరుగుతుంది. నాథర్‌వాలి యొక్క ఉర్స్ శాశ్వతమైన ఆధ్యాత్మిక వారసత్వానికి మరియు ప్రేమ, సహనం మరియు ఐక్యత యొక్క విలువలను పరిరక్షించడానికి ఒక శక్తివంతమైన నిదర్శనంగా పనిచేస్తుంది.

 

No comments:

Post a Comment