ఢిల్లీ సుల్తానేట్
సుల్తాన్ సికందర్ ఖాన్ లోడి తల్లి బీబీ జరీనా సమాధి భారతదేశంలోని రాజస్థాన్‌లోని
ధోల్పూర్‌లో ఉంది. బీబీ జరీనా (c. 1433–1516) సమాధి ని 1885లో బ్రిటిష్ రాజ్
కాలంలో అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ గుర్తించారు.
సుల్తాన్ సికందర్
లోడి తల్లి బీబీ జరీనా తన పాలన చివరి సంవత్సరాల్లో తన కొడుకుతో నివసిస్తున్నప్పుడు
ధోల్పూర్‌లో మరణించారని స్థానిక నివాసితుల కధనం.. రాజస్థాన్‌లోని ఆగ్రా మరియు
గ్వాలియర్ మధ్య ఉన్న ధోల్‌పూర్ అనే చిన్న పట్టణం. దొల్ పూర్ లో బీబీ జరీనా సమాధి
ఉంది,
బీబీ జరీనా "లేడీ ఆఫ్ గోల్డ్" అని కూడా పిలువబడినది.
బీబీ జరీనా హిమా (లేదా "హేమా")
గా జన్మించిందని చెప్పబడింది, దీని అర్థం
సంస్కృతంలో "బంగారం" - స్వర్ణకారుడి కుమార్తె. కొంతమంది చరిత్రకారులు బహ్లూల్ లోడీ (1451 నుండి 1489 వరకు ఢిల్లీని
పాలించిన లోడీ రాజవంశ స్థాపకుడు) ని వివాహం చేసుకున్న తర్వాత,
ఆమె
"జరీనా " అనే బిరుదును పొందిందని అంటారు., పర్షియన్ భాషలో "జరీనా
" అంటే "బంగారం" అని అర్థం.
ఒక చారిత్రక
వృత్తాంతం (పదిహేడవ శతాబ్దపు తొలినాళ్లలోని తారీఖ్-ఇ షాహి) బహ్లూల్ ఆమెను
సిర్హింద్‌లో మొదటిసారి గమనించి , ఆమె అందానికి
ముగ్ధుడై చివరికి ఆమెను రాజ కుటుంబంలోకి ఎలా తీసుకువచ్చాడో వివరిస్తుంది. ఇతర చారిత్రిక
కధనాల ప్రకారం జరీనా ను "జిబా" అని కూడా అంటారు జిబా అంటే
"అందమైనది" లేదా "అలంకారమైనది" అని అర్ధం.
1489లో సికందర్ లోడి తండ్రి
మరణించినప్పుడు జరీనా తన కుమారుడు సింహాసనాన్ని అధిరోహించేలా చూసేందుకు పావులు
కదిపినది. ఒక ఇతివృత్తం ప్రకారం వారసత్వం పై లోడీ ప్రభువులు విభజించబడ్డారు.
కొందరు ఇతర హక్కుదారులకు మద్దతు ఇచ్చారు. మరికొందరు సికందర్‌ను "ఒక
స్వర్ణకారుడి కుమార్తె కుమారుడు" కాబట్టి అనర్హుడు అన్నారు. . బీబీ జరీనా రాజకీయ
వ్యూహం,రాజకీయ చతురత ప్రదర్శించి ముఖ్యులైన సైనికాధికారులను ఒప్పించి తన కొడుకు సికందర్
లోడీ ఇటావా వెలుపల కుష్క్-ఇ సుల్తాన్ ఫిరూజ్ అనే ప్రదేశంలో సింహాసనం అధిష్టి౦చేటట్లు
.చూసింది.
1500ల ప్రారంభంలో, సికందర్ లోడీ
గ్వాలియర్‌కు వ్యూహాత్మకంగా సమీపంలో ఉండటం వల్ల ధోల్‌పూర్‌లో పదే పదే బస చేసేవాడు.
ధోల్‌పూర్ నిరంతర సైనిక ఉద్రిక్తత ఉన్న ప్రాంతం. సికందర్ లోడీ ఆగ్రా నుండి ధోల్‌పూర్‌కు
వెళ్లే మార్గంలో తోటలు, రాజభవనాలు
మరియు రోడ్లను నిర్మించాడని చెబుతారు, ధోల్‌పూర్‌లో ఎక్కువ సమయం గడిపాడు. సీనియర్ రాజ మహిళగా, బీబీ జరీనా తన
కుమారుడు సికందర్ లోడీ తో పాటు ధోల్‌పూర్‌లో
ఎక్కువ కాలం గడిపింది. 922
AH (1516 CE)లో, బీబీ జరీనా ను ధోల్‌పూర్‌లో
ఖననం చేయడానికి ఇదే కారణం అని వివరిస్తుంది. SOAS బులెటిన్ ప్రకారం సుల్తాన్ సికందర్ లోడీ తల్లి బీబీ
జరీనా ను అత్యంత ప్రతిష్టాత్మకమైన ధోల్‌పూర్‌లోని
సమాధి-మసీదు లో ఖననం చేయడం జరిగింది.
బీబీ జరీనా సమాధి జాలీ (లాటిస్)
తెరలు మరియు సన్నని రాతి స్తంభాల ద్వారా సమాధి పై కాంతి మరియు నీడ పడుతుంది. సమాధి
పై కొద్దిగా ఎత్తైన స్తంభంపై ఉంది, ప్రతి వైపు చెక్కబడిన పారాపెట్‌లు, పైకప్పుపై చత్రిలు
(గోపురం కియోస్క్‌లు) మరియు రేఖాగణిత మరియు పూల నమూనాలతో అందమైన గుచ్చబడిన రాతి
ప్యానెల్‌లు ఉన్నాయి.
బీబీ జరీనా సమాధి యొక్క
"ట్రాబీటెడ్ నిర్మాణం" దూలాలు మరియు లింటెల్స్ కలిగి ఉంది. ప్రస్తతం బీబీ జరీనా సమాధి దశాబ్దాల
నిర్లక్ష్యం వలన శిదిలమైనది.
బీబీ జరీనా ఒక స్వర్ణకారుడి
కుమార్తె నుండి కింగ్ మేకర్ అయ్యే వరకు - మహిళలు రాజవంశ రాజకీయాలను ఎంత
శక్తివంతంగా రూపొందించగలరో చెబుతుంది.
No comments:
Post a Comment