4 April 2025

హైదర్‌గఢ్ బసోడా: మధ్య భారతదేశంలో రెండు శతాబ్దాలుగా మనుగడ సాగించిన రాచరిక రాజ్యం Haidargarh Basoda: The princely state that survived for two centuries in Central India

 


భోపాల్:

ఒకప్పుడు రెండు శతాబ్దాలుగా ఉనికిలో ఉన్న  రాచరిక రాజ్యమైన హైదర్‌గర్-బసోదా నేడు మధ్యప్రదేశ్ లో అంతర్భాగం.

నవాబ్ బసోడా అని కూడా పిలువబడే  హైదర్‌గర్-బసోదా దాని ప్రత్యేక చరిత్రకు ప్రసిద్ధి చెందింది. స్వాతంత్ర్యం తర్వాత బసోదా పట్టణ హోదాకు పరిమితం అయినది.   

నవాబ్ దిలేర్ ఖాన్, హైదర్‌గర్-బసోదా రాజ్య స్థాపకుడు. హైదర్‌గర్-బసోదా రాచరిక రాజ్య౦ క్రీ.శ. 1713లో ఉనికిలోకి వచ్చింది.

 *హైదర్‌గర్-బసోడా తరువాత హైదర్‌గర్ బసోదా, కుర్వాయి మరియు ముహమ్మద్‌ఘర్  గా విభజించబడింది..

ఔరంగజేబు ముని మనవడు ఫరూఖ్‌సియార్ చక్రవర్తి పాలనలోనే నవాబ్ దిలేర్ ఖాన్ హైదర్‌గర్-బసోదా రాజ్యాన్ని స్థాపించినాడు.. 1732 సంవత్సరంలో నవాబ్ దిలేర్ ఖాన్ మరణం తరువాత కుమారుడు నవాబ్ ఇజ్జత్ ఖాన్ వారసుడు అయ్యాడు.

నవాబ్ ఇజ్జత్ ఖాన్ మరియు అతని తమ్ముడు అహ్సాన్ ఉల్లా ఖాన్ హైదర్‌గర్-బసోదా రాజ్య భూభాగాన్ని విభజించారు. తరువాతి, నవాబ్ అహ్సాన్ ఉల్లా ఖాన్ కూడా తన రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించారు, వాటిలో ఒకటి హైదర్ ఘర్ బసోదా లేదా నవాబ్ బసోడా అని పిలువబడింది. బసోదా రాజ్యం 1750ల ప్రారంభంలో ఏర్పడింది.

1790లో నవాబ్ అహ్సాన్ ఉల్లా ఖాన్ మరణం తర్వాత, అతని కుమారుడు నవాబ్ వకౌల్లా ఖాన్ అధిపతిగా కొనసాగాడు, కానీ నవాబ్ వకౌల్లా ఖాన్ ఐదు సంవత్సరాల తరువాత మరణించాడు. నవాబ్ వకౌల్లా ఖాన్ భార్య రాజప్రతినిధిగా మరియు మైనర్ కుమారుడు నవాబ్ అసుద్ అలీ ఖాన్ సరైన వయస్సు వచ్చినప్పుడు పాలకుడు అయ్యాడు. ఈ కాలంలోనే మొదటి స్వాతంత్ర్య యుద్ధం లేదా తిరుగుబాటు  జరిగింది.

నవాబ్ అసూద్ అలీ ఖాన్ 1864లో మరణించాడు. నవాబ్ అసూద్ అలీ ఖాన్ తర్వాత అతని కుమారుడు నవాబ్ ఒమర్ అలీ ఖాన్ వచ్చాడు, నవాబ్ ఒమర్ అలీ ఖాన్ రచయిత మరియు ప్రయాణికుడు. నవాబ్ ఒమర్ అలీ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా పర్యటించి తన సందర్శనల గురించి రాశాడు. నవాబ్ ఒమర్ అలీ ఖాన్ 1895లో మరణించాడు. నవాబ్ ఒమర్ అలీ ఖాన్ తర్వాత అతని కుమారుడు నవాబ్ మొహమ్మద్ హైదర్ అలీ ఖాన్ అధికారం లోకి వచ్చాడు.

ఈ కాలంలోనే రాజ్యం హైదర్‌గర్ అని పిలువబడింది. తరువాత, నవాబ్ మసూద్ అలీ ఖాన్ నవాబ్ అయ్యాడు మరియు మూడు సంవత్సరాల పాలన తర్వాత, భారతదేశం స్వతంత్రమైనప్పుడు హైదర్‌గర్ రాజ్యం భారత్ లో విలీనం చేయబడింది. ఆ బిరుదు అలాగే ఉంది. 1971 తర్వాత, ప్రివీ పర్సులు రద్దు చేయబడ్డాయి. నవాబ్ మసూద్ అలీ ఖాన్ 1976లో మరణించాడు.

నవాబ్ మసూద్ అలీ ఖాన్ తర్వాత, అతని కుమారుడు నవాబ్ కిస్వర్ అలీ ఖాన్ వచ్చాడు

హైదర్‌గర్ బసోదా రాజ్యం [ఇప్పుడు హైదర్‌గర్] భోపాల్‌కు ఆనుకుని ఉన్న విదిషా జిల్లాలోని గ్యారస్‌పూర్ పట్టణానికి సమీపంలో ఉంది. ఇప్పుడు హైదర్‌గర్ బసోదా అని పిలువబడే హైదర్‌గర్ ఒక చిన్న మునిసిపాలిటి. 

[*మొదట నవాబ్ దిలేర్ ఖాన్ 1713 ADలో ఒక రాజ్యాన్ని స్థాపించాడు, తరువాత అది మూడు ప్రత్యేక రాజ్యాలు గా విభజించారు మరియు బసోదా 1753లో ఉనికిలోకి వచ్చింది]

No comments:

Post a Comment