భారత
దేశం లోని ముస్లిం లలో ఒక వర్గం కేంద్ర సివిల్ సర్వీసులలో ముస్లింల అల్ప
ప్రాతినిద్యం పై తరచూ అంధోళన చేస్తూనే ఉంది. పేదరికము, అల్ప విద్యా-స్థాయి,సచార్ కమిటీ సూచనలు మొదలగు
అంశాలను ఆధారంగా చూపుతూ విద్యా-ఉపాధి రంగాలలో ముస్లిం లకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించాలని అంధోళనను
చేస్తున్నారు.కానీ నిశితముగా,శాస్త్రీయం గా పరిశీలించిన కేంద్ర సర్వీసులలో ముస్లిం ల
అల్ప-ప్రాతినిద్యానికి , ముస్లింలు తక్కువ సంఖ్యలో కేంద్ర
సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరు కావడమే ప్రధాన కారణమని స్పష్టమగుచున్నది. పైగా
ముస్లిం యువతులు అతి-తక్కువగా కేంద్ర సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరుయగుచున్నారు.
భారత దేశం లోని ముస్లింల స్థితిగతులు, కేంద్ర సివిల్ సర్వీసులలో వారి ప్రాతినిద్యం గురించి తరచుగా వార్తలు
వింటూనే ఉంటాము. కేంద్ర రక్షణ దళాలలో ముస్లిం ల ప్రాతినిద్యం కొంతవరకు
పర్వాలేదనిపించిన ముఖ్యం గా సివిల్
సర్వీసులలో ముస్లింల ప్రాతినిద్యం ఆందోళన కలిగించే విషయం గా నే ఉంది.
సివిల్
సర్వీసు పరీక్షలు:
ఇటీవల వెలుపడిన 2012 కేంద్ర సివిల్
సర్వీసు అంతిమ ఫలితాలను పరిశీలించిన మొత్తం 998 అంతిమ అబ్యర్ధులలో 28 మంది ముస్లిం
లు మాత్రమే ఎన్నికైనారు.వారి ఉత్తీర్ణతా శాతం 2.8% గా ఉంది.ప్రతి సంవత్సరం ఇదే
పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంతిమం గా ఎన్నికైన ముస్లిం అబ్యర్ధులఉత్తీర్ణతా శాతం 3% కు ఏనాడూ మించడం లేదు. ఇందుకు కారణాలను పరిశీలించుదాము. కొందరి
వాదన ప్రకారం ఎన్నిక విధానం లో లోపాలు
ఉన్నాయి. మరికొందరి వాదన ప్రకారం అధికారం లో ఉన్న వ్యక్తులు కుట్ర తో దేశం లోని 2వ
అతి పెద్ద వర్గాన్ని అధికార వర్గ పరిది లోనికి
రాకుండా చేస్తున్నారు. ముస్లిం రాజకీయ నాయకులు పబ్లిక్ సర్వీసులలో అనగా
విద్యా-ఉపాధి రంగాలలో ముస్లింలకు
రిజర్వేషన్లను కోరుచున్నారు. పై విషయాలను పరిశీలించిన రెండు అంశాలు స్పష్టం
అగుచున్నవి. ఒకటి, వాస్తవాలను సరిగా శాస్త్రీయం
గా విశ్లేషించక పోవటం, రెండోవది సివిల్ సర్వీసు లలోముస్లిం
లు తగినంతగా ఎంపిక కాక పోవటం ను తప్పు గా అర్ధం చేసుకోవటం.
భారత దేశం లోని ఉద్యోగాల రిక్రూట్మెంట్ పద్దతులను పరిశీలించిన సివిల్
సర్వీసు పరీక్షల ఎంపికవిధానము దేశం లోనే
అత్యంత పారదర్శకత విధానము ను కలిగి ఉంది. ప్రాధమిక పరీక్షకు హజరు
అయ్యేవారిలో 95% వడపోయబడి,కేవలం 5% మందిమాత్రమే
“మెయిన్” కు చేరుతున్నారు. అందులో 87% మార్కులు వ్రాత పరీక్షకు,కేవలం 13% మార్కులు మాత్రమే ఇంటర్వ్యూ కు కేటాయించడం జరుగుతుంది.
విశ్లేషణ
- మేథడాలజీ:
యూపిఎస్‌సి వార్షిక నివేదికల
డేటా ఆధారం గా సివిల్ సర్వీసు పరీక్షలు
వ్రాసిన ముస్లింలను,పరీక్షలు వ్రాసిన ఇతర సామాజిక గ్రూపు లతో సరిపోల్చడం ఈ వ్యాసం ముఖ్య
ఉద్దేశం గా చెప్పవచ్చును.యూపిఎస్‌సి నివేదికలు ఎస్‌సి,ఎస్‌టి,ఓబిసి,జనరల్ కేటగిరీ విద్యార్ధుల వివరాలను
అందించిన, ముస్లిం అబ్యర్ధుల వివరాలు లభించుట లేదు. ఇందుకోసం
వేరే పద్దతిని అనుసరించడం జరిగింది.మెయిన్ పరీక్షకు హాజరైన అబ్యర్ధులు చదివిన యూనివర్సిటీలు, అంతిమంగా
ఎన్నికైన అబ్యర్ధులు చదివిన యూనివర్సిటీ
లను పరిగణలోనికి తీసుకోవడం జరిగింది.అదేవిదం గా అబ్యర్ధుల అత్యధిక విద్యార్హతలను
కూడా లెక్కలోనికి తీసుకోవడము జరిగింది.
పరిశీలన కోసం యూనివర్సిటీ లను రెండు
గ్రూపులుగా విభజించడము జరిగింది.గ్రూప్ ఏ లో ముస్లిం విద్యార్ధులు అధిక సంఖ్యలో చేరే
ఆలిగర్ ముస్లిం యునివర్సిటి,జామియా మిలియ ఇస్లామీయ, జే&కే యూనివర్సిటీ,కేరళ లోని కాలికట్ యూనివర్సిటి ని
చేర్చడం జరిగింది.గ్రూప్ బి లో అలహాబాద్ యూనివర్సిటి,లక్నో
యూనివర్సిటీ,బెనారస్ హిందూ యూనివర్సిటీ, జైపూర్ లోని యూనివర్సిటీ ఆఫ్
రాజస్తాన్ ను చేర్చటం జరిగింది. పై రెండు గ్రూప్ ల యూనివర్సిటీ విద్యార్ధుల ఫలితాలను సరిపోల్చడం
జరిగింది.ఇందుకు గాను గత 5 సంవత్సరాల కాలం (2006-2010) పరిగణలోనికి తీసుకోవడం
జరిగింది. ప్రతి యూనివర్శిటీ నుండి ఎన్నికైన
అబ్యర్ధుల సంఖ్య ఆ యూనివర్సిటీ నుండి హాజరైన విద్యార్ధుల సంఖ్య, వారి ఉత్తీర్ణతా శాతం అనే రెండు అంశాల ఆధారం గా గణించడము జరిగింది.
యూపిఎస్‌సి వార్షిక నివేదికలను
పరిశీలించిన ఉత్తీర్ణతా శాతం (success ratio) అనేది ముఖ్యమైనదిగా కన్పిస్తుంది. అబ్యర్ధుల
విజయావకాశాలు యూనివర్సిటీ,లింగం,సామాజిక
వర్గాలు, అత్యధిక విద్యార్హతలు మున్నగు వాటిపై
ఆధారపడిఉన్నాయని స్పష్టమగుచున్నది.ప్రతి యూనివర్సిటీ
నుంచి ప్రతి సంవత్సరము హాజరైన మొత్తం విద్యార్ధులనుండి అంతిమ పరీక్ష “మెయిన్” కు ఎన్నికవుతున్నఅబ్యర్ధుల శాతం ను లెక్కించడమైనది. ప్రతి యూనివర్సిటీ
ఉత్తీర్ణతా శాతం తులనాత్మకంగా క్రింద టేబల్ 1 లో ఇవ్వబడినది.
టేబల్
1 సివిల్ సర్వీసు పరీక్షలలో ఉత్తీర్ణతా శాతం %
యూనివర్సిటీ
|
2006
|
2007
|
2008
|
2009
|
20010
|
సరాసరి
2006-10
|
గ్రూప్ -ఏ
|
|
|
|
|
|
|
అలీగఢ్
|
5.9
|
16.7
|
7.1
|
10.3
|
7.7
|
9.3
|
జామియా మిలియా
|
-
|
18.5
|
7.3
|
06.9
|
5.4
|
8.8
|
J&K,శ్రీనగర్
|
50.0
|
-
|
9.1
|
08.2
|
8.3
|
9.5
|
కాలికట్ ,కేరళ
|
5.9
|
7.7
|
13.5
|
14.3
|
16.2
|
12.5
|
|
|
గ్రూప్ సరాసరి
|
|
|
|
10.2
|
గ్రూప్ –బి
|
|
|
|
|
|
|
అలహాబాద్
|
2.1
|
2.2
|
2.4
|
2.8
|
2.5
|
2.5
|
లక్నో
|
3.9
|
7.0
|
7.1
|
7.4
|
4.4
|
6.0
|
బెనారస్ హిందూ
|
2.1
|
4.0
|
1.7
|
2.9
|
3.7
|
2.9
|
రాజస్తాన్ యూనివర్సిటీ
|
4.2
|
5.7
|
14.4
|
7.8
|
6.2
|
6.0
|
|
|
గ్రూప్ సరాసరి
|
|
|
|
4.3
|
దేశ సరాసరి
|
6.3
|
7.2
|
7.0
|
7.6
|
7.8
|
7.2
|
ముస్లిం విద్యార్ధులు అధికంగా చేరే గ్రూప్-ఏ
యూనివర్సిటి ల ఉత్తీర్ణతా శాతం 2006-10 మద్య 10.2% ఉండగా గ్రూప్-బి లో ఎంపిక
చేయబడిన నాలుగు ఇతర యునివర్సిటిల ఉత్తీర్ణతా
శాతం 4.3% మాత్రమే ఉంది. దేశం లోని అన్నీ యూనివర్సిటీ ల సరాసరి శాతం 7.2%
గా ఉంది.
గ్రూప్ – ఏ లోని యూనివర్శిటీ ల
ఉత్తీర్ణతా శాతం సరాసరి 2006-2010 మద్య 10.2 % ఉంది ఇది దేశం లోని అన్నీ సామాజిక
వర్గాల ఉత్తీర్ణతా శాతం కన్నా అధికంగానే ఉంది. ఉదా: కు టేబల్ 2 ను పరిశీలించుదాము.
టేబల్
– 2, 2006-10 మద్య దేశం లోని
విబిన్న సామాజిక వర్గాల సరాసరి ఉత్తీర్ణతా
శాతం: %
సామాజిక వర్గాలు
|
ఎస్‌సి
|
ఎస్‌టి
|
ఓబిసి
|
జనరల్
|
అందరు
|
గ్రూప్ – ఏ యూనివర్సిటీస్
|
ఉత్తీర్ణతా శాతం
|
7.6
|
7.5
|
5.9
|
8.0
|
7.2
|
10.2
|
ఉత్తీర్ణతా శాతం అధికం గా ఉన్నంతమాత్రాన
ఎక్కువ సంఖ్య లో అబ్యర్ధులు ఆయా యూనివర్సిటీ ల నుండి ఎంపిక అవుతారన్న గ్యారంటీ
లేదు. ప్రిలిమనరీ పరీక్ష తరువాత ‘మెయిన్’ కు ఎంతమంది అబ్యర్ధులు ఎంపిక అవుతారు అనేది ప్రధానము. గ్రూప్ –ఏ యూనివర్సిటీ ల నుండి గత 5
సంవత్సరాల నుండి మెయిన్ కు హాజరైన
విద్యార్ధుల సరాసరి పట్టిక పరిశీలించిన గత 5 సంవత్సరాల సగటు హాజరు శాతము కేవలము 24.6% గా ఉంది.
అదే మెయిన్ కు గ్రూప్-బి యూనివర్సిటీ
విద్యార్ధుల సరాసరి హాజరు శాతం 444% గా ఉంది. అనగా గ్రూప్-ఏ యూనివర్సిటీ లనుండి
కెవలము కొద్ది మంది క్రిమి లేయర్ విద్యార్ధులే మెయిన్ పరీక్షకు హాజరగుచున్నారు
అన్నీ తెలియుచున్నది. .దీనికి సంబంధించిన టేబల్ 3 క్రింద ఇవ్వబడినది.
టేబల్
-3, 2006-10 మద్య మెయిన్ కు
హాజరైన విద్యార్ధుల సంఖ్య : %
యూనివర్సిటీ
|
2006
|
2007
|
2008
|
2009
|
2010
|
సరాసరి
2006-2010
|
గ్రూప్ - ఏ
|
|
|
|
|
|
|
ఆలిగర్
|
17
|
18
|
28
|
29
|
26
|
23.6
|
జామియా మిలియా
|
-
|
27
|
41
|
43
|
37
|
29.6
|
J&K,శ్రీనగర్
|
02
|
-
|
11
|
49
|
12
|
14.8
|
కాలికట్,కేరళ
|
17
|
26
|
37
|
35
|
37
|
30.4
|
|
|
|
గ్రూప్ సరాసరి
|
|
|
24.6
|
గ్రూప్ – బి
|
|
|
|
|
|
|
అలహాబాద్
|
741
|
779
|
1059
|
878
|
837
|
859
|
లక్నో
|
255
|
243
|
323
|
296
|
247
|
273
|
బెనారస్ హిందూ
|
139
|
150
|
236
|
205
|
214
|
188.8
|
రాజస్తాన్
|
420
|
4571
|
166
|
611
|
615
|
533
|
|
|
|
గ్రూప్ సరాసరి
|
|
|
444.2
|
ముస్లింల
అల్ప ప్రాతినిద్యానికి కారణాలు:
సివిల్ మరియు ఇతర పబ్లిక్ సర్వీస్
పరీక్షలలో ముస్లింల వెనుకుబాటుతనము కు ప్రధానం గా విద్య లో వారి వెనుకుబాటుతనం కారణం గా చెప్పబడుతుంది.ఇక్కడ
మనం” వెనుకబాటుతనం”మరియు “శ్రేష్టత లేమి” (lack of excellence) ల మద్య తేడాను గుర్తించాలి.ఇందులో
మొదటిది డ్రాపౌట్ రేట్, గ్రాడ్యుయేషన్ ముందు చదువు ముగించుట
పై ఆధార పడిన రెండవది ప్రేరణ లేమి, కాంపిటీటివ్ స్పిరిట్ లేక పోవటం, విద్య
లో సులువైన అంశాలను ఎన్నుకోటం పై ఆధార పడి ఉండును. సాధారణం గా ముస్లిం లు పై
లక్షణాలను కలిగి ఉంటారు. పేదరికము కూడా చదువులో వెనుకబాటుతనమునకు ఒక ముఖ్య కారణం
అవవచ్చును. కానీ దేశ ప్రజలలో !/3 మండి బిపిఎల్ రేఖ కు క్రింద ఉన్నారు. ఇతర
సామాజిక వర్గాలకు కూడా ఇదే సమస్య ఉందని గుర్తించాలి. పైగా టార్గెట్ గ్రూప్ గా
ఎంపిక చేయబడిన గ్రూప్ –ఏ యూనివర్సిటీ లలో చదివేముస్లిం విద్యార్ధులకు పేదరికం ఒక సమస్య కాదని
గుర్తించాలి. మెయిన్ మరియు ఇతర పబ్లిక్
సర్వీసు పరీక్షలలో హాజరయ్యే ముస్లిం విద్యార్ధుల అతి తక్కువ హాజరు శాతం కు
వాస్తవ కారణాలను పరిశోధించి వాటికి పరిష్కార మార్గాలను చూపి సివిల్ సర్వీసు
పరీక్షలలో ముస్లిం విద్యార్ధులఉత్తీర్ణతా
శాతం పెరిగేటట్లు చూడవలయును.
సరియైన
ప్రణాళిక లేక పోవడం
:
ఆలిగర్ ముస్లిం యూనివర్సిటీ
విద్యార్ధులలో తెలివిగలవారు ,అకడమిక్ గా
బ్రిలియంట్ విద్యార్ధులు మెడిసన్, ఇంజినెరింగ్,మేనేజ్మెంట్ మొదలగు కోర్సులు అబ్యసించుచున్నారు,
మిగతావారు మాత్రమే సివిల్ సర్వీసులకు హాజరు అగుచున్నారు. అన్నీ యూనివర్సిటీ ల లోనూ
ఇదే పరిస్థితి కొనసాగు చున్నది. వృతి విద్య లో డిగ్రీ సాధించినతరువాత యువకులు
పశ్చిమ ఆసియా దేశాలలో,లేదా విదేశాలలో లాభదాయకమైన ఉద్యోగాలలోనో ,దేశం
లోని ప్రవేటే కంపనీ లలోనో చెరుచున్నారు కానీ సివిల్ సర్వీసు పరీక్షలు వ్రాయటం లేదు
.
యూపిఎస్‌సి వార్షిక నివేదికలలో
ఉత్తీర్ణతాశాతం తో పాటు అబ్యర్ధి విధ్యార్హతలు అనగా ఉన్నత విద్యార్హతలను కూడా లెక్క లోనికి
తీసుకోవడం జరుగుతుంది.టేబల్ -4, లో దీనిని
చూపడం జరిగింది. సివిల్ సర్వీసు పరీక్షలలో మెరుగైన ప్రదర్శన వృతి విద్యా డిగ్రీ
లేదా ఎండి లేదా ఎంబిబిఎస్ చదివిన విద్యార్ధులు ప్రదర్శించడం
గమనించేదము.2006-10 లో వృతి విద్యా డిగ్రీ ఉన్న విద్యార్ధుల ఉత్తీర్ణతా శాతం 10%
కు పైగా ఉండగా కేవలం ఎంఏ/ఎంఎస్‌సి ఉన్న విద్యార్ధుల
ఉత్తీర్ణత శాతం 5.8% మాత్రమే ఉంది. జాతీయ సరాసరి 7.2% మాత్రమే ఉంది. పై అంశాలను
దృస్త్తి లో పెట్టుకొని సివిల్ సెర్వీసు పరీక్షల తయారీకి కు ఒక పకడ్బంధి వ్యూహం
రచించవలయును. మొదట వృతి విద్యలో డిగ్రీ
సాదించి ఆ తరువాత సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరు కావలయును.
టేబుల్-4, 2006-2010 మద్య విద్యార్హతల ఆధారంగా సివిల్ సర్వీసు లో ఉత్తీర్ణతా శాతం-
%
విద్యార్హత
|
2006
|
2007
|
2008
|
2009
|
2010
|
సరాసరి 2006-10
|
ఎండి
|
30
|
16.7
|
11.1
|
18.8
|
13.8
|
18
|
ఎంబిబిఎస్
|
18
|
14.2
|
14.6
|
18.3
|
13.1
|
15.6
|
ఎం.టెక్
|
12.8
|
14.1
|
13.1
|
8.4
|
9.3
|
11.5
|
బి.టెక్
|
10
|
9.7
|
9.8
|
11.3
|
11.3
|
10.4
|
ఎంబిఏ/ఎంసిఏ
|
9.3
|
12.4
|
8.2
|
10
|
10.7
|
10.1
|
ఎంఏ/ఎంఎస్‌సి
|
4.5
|
6.1
|
5.9
|
6.2
|
6.1
|
5.8
|
ఆల్-ఇండియా
|
6.3
|
7.2
|
7.0
|
7.6
|
7.8
|
7.2
|
ముస్లిం
-స్త్రీల అతి తక్కువ ప్రాతినిద్యం
భారత దేశ స్వాతంత్రనంతరము ముస్లిం
స్త్రీ లు ఉన్నత విద్యరంగం అనగా మెడిసిన్,కంప్యూటర్ సైన్సు,ఇంజనీరింగ్,
లా మొదలగు రంగాలలో మరియు ఇతర వృతి విద్యా రహిత కోర్సులలో రాణించటము
ప్రారంబించినారు. కానీ సివిల్ సర్వీసు రంగం లో ప్రవేశించలేదు. 2012 సివిల్ సర్వీసు
పరీక్షలలో మొదటి 25 స్థానాలలో 12 స్థానాలు స్త్రీలు సంపాదించినారు. టేబల్ 5 లో చూపినట్లు 2010 సివిల్ సర్వీసు
ఫలితాలలోఅన్నీ సామాజిక వర్గాలలో స్త్రీ ల
ఉత్తీర్ణతా శాతం14.3% ఉండగా, పురుషుల ఉత్తీర్ణతా శాతం 6.8% గా ఉంది.ముస్లిం స్త్రీలు ఈ ఆదిక
ఉత్తీర్ణతా శాతం సంపాదించక పోవటానికి కారణం వారు అధిక సంఖ్యలో ఈ పరీక్షలకు హాజరు
కాకపోవటమే కారణమని చెప్పవచ్చును.
టేబల్ -5, 2010 లో సివిల్ సర్వీసులలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన స్త్రీ/పురుష
అబ్యర్ధుల ఉత్తీర్ణతా శాతం -%
సామాజిక
వర్గము
|
పురుషుడు
|
స్త్రీ
|
మొత్తం
|
ఎస్.సి.
|
6.7
|
15.0
|
7.8
|
ఎస్.టి
|
7.0
|
13.0
|
7.8
|
ఓబిసి
|
6.1
|
11.5
|
6.6
|
జెనరల్
|
7.6
|
15.6
|
8.7
|
మొత్తం
|
6.8
|
14.3
|
7.8
|
రక్షణ, ఇతర
అవసరాల దృష్ట్యా ముస్లిం లు అందరూ పెద్ద,చిన్న నగరాలలో ఒకేచోట (ghettoes) నివశించవలసి ఉంటుంది. ఈ ప్రాంతాలలో విద్యకు అనుకూలమైన వాతావరణము కనిపించదు.ఈ
ప్రాంతాలలోని నివాసదారులలో చిన్న,పెద్ద వ్యాపారాలు చేసుకొనే
వారు, చేతి వృత్తుల
పనివారు,నైపుణ్యం ఉన్న నైపుణ్యం లేని పనివారు
ఎక్కువగా ఉండి వారు ఉమ్మడి కుటుంబాలను
కలిగి ఉంటారు.ఎక్కువమంది విద్యా లేమి(poor education) కలిగి ఉంటారు.ఈ పరిస్థితులలో ప్రభుత్వం గాని,
స్వచ్చంద సేవ సంస్థలు గాని మార్పు తేలేక పోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కొంతమంది
క్రిమి లేయర్ ముస్లింలకు మాత్రమే మంచి విద్యావకాశాలు (quality education) లబించుచున్నవి.
ముస్లిం
నాయకత్వం –పాత్ర
ముస్లింలకు విద్యా-ఉపాధి రంగాలలో
రిజర్వేషన్లను కల్పించడం అనేక చట్టపరమైన,రాజ్యాంగ
పరమైన అవాంతరాలను ఎదురుకొంటున్నది. ముస్లిం రిజర్వేషన్ల కొరకు పోరాటం చేయడం రాజకీయ నాయకులకు ఒక ఆటగా మారినది. కానీ
గమనించవలసినది ఏమిటంటే విద్యా రంగంలో రాశి కన్నా వాసి పై ఎక్కువ ప్రాధాన్యత
ఇవ్వవలయును. ముస్లిం ఎన్‌జిఓ లచే నడపబడే విద్యాసంస్థలు పట్టణ ప్రాంతాలలో తామరతంపరులుగా
పెరిగినాయి గాని నాణ్యతా కలిగిన విద్య, కాంపిటీటివే స్పిరిట్, కెరియర్ ప్లానింగ్ మొదలగు విషయాలను అశ్రద్ద చేసినాయి.
పబ్లిక్ సర్వీసులలో ముస్లిం ల తక్కువ
ప్రాతినిద్య౦ చూపే డాటా(data)ను అసలు కారణాలను విశ్లేషించకుండా నమ్మడం జరుగుతుంది.
సచార్ కమిటీ విద్యా పై చేసిన సూచనలను ప్రభుత్వం
అమలుచేయడం లేదని అనేకులు
విమర్శించుచున్నారు.కానీ వాస్తవానికి
విద్యా విషయంలో సచార్ కమిటీ రిపోర్ట్
వాస్తవాల నిర్ధారణే కానీ రికమండేషన్లు కాదు. సచార్ కమిటీ నివేదికలోని అనేక
అంశాలు ఉదా:కు ఐఐఎం,ఐఐటి,జవాహర్
నవోదయ విద్యాలయాలలో ముస్లింల అతి తక్కువ ప్రాతినిద్యం వెలుగు లోనికి రాలేదు.
ముగింపు:
సివిల్ సర్వీసు పరీక్షలలో ముస్లిం
విద్యార్ధుల తక్కువ హాజరు శాతం ఆ సర్వీసులలో వారి అతి తక్కువ ఎంపికకు,తక్కువ ప్రాతినిద్యానికి కారణమగుచున్నది.ఈ విషయం లో ముస్లిం సమాజం తనంత
తాను మార్చుకోవటానికి ప్రయత్నించ వలసి ఉంటుంది .విద్యా రంగంలో అదనపు సౌకర్యాల కల్పన
కన్నా ఉన్న సదుపాయాలను సమర్ధవంతం గా
ఉపయోగించుకొనవలయు. 26 వేల మంది విద్యార్ధులు కలిగిన ఆలిగర్ ముస్లిం యునివర్సిటి,మంచి నాణ్యత కలిగిన భోధనను కల్పిస్తూ , సివిల్
సర్వీసు విద్యార్ధులకు ప్రత్యేక వసతి
సౌకర్యాలు కలిగిన గైడెన్స్ సెంటర్ లను, పబ్లిక్ సర్వీసు
పరీక్షలకు ఉచిత భోధన , ఉన్నతమైన మంచి లైబ్రరి సౌకర్యం,అధిక అర్హతలు కలిగిన భోధన సిబ్బంది,సుమారు 100 వరకు
విబిన్న డిపార్ట్ మెంట్ లను కలిగి ఉంది కానీ 2006-10 మద్య ప్రతి సంవత్సరం సరాసరి
24-25 మంది విద్యార్ధులు మాత్రమే సివిల్ సర్వీసు(మెయిన్) పరీక్షలకు ఆ
యూనివర్శిటీ తరుఫున హాజరు అవుతున్నారు.ఇది చాలా శోచనీయమైన అబ్యoతకరమైన విషయము.
అన్నీ స్థాయిలలో నాణ్యతతో కూడిన విద్య, ఉత్తీర్ణతకు కు సరియైన ప్రణాళిక,మంచి కెరియర్
ప్లానింగ్, అధిక
సంఖ్యలో స్త్రీల హాజరు, , పాజిటివే మనస్తత్వం, హేతుబద్దమైన దృష్ఠి కలిగిన ముస్లిం నాయకత్వం సహకరించిన సివిల్ సర్వీసు
పరీక్షలలో ముస్లిం యువత అధిక సంఖ్యలో పాల్గొని, అధిక
ఉత్తీర్ణతా శాతం సాధించ గలదు . ఇందుకు గాను సరియైన నివారణా చర్యలు చేపట్టక పోయిన, సివిల్ సర్వీసు పరీక్షలలో అడ్డంకిగా ఉన్న 3% ను అధిరోహించుట కలగానే
మిగిలి పోతుంది.