23 January 2014

1964 కమ్యూనిస్ట్ ఉద్యమం లో చీలిక – తెనాలి సమావేశం విశేషాలు


చీలికకు పూర్వ రంగం:
          భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ లోని రష్యా సమర్ధకులకు(right), చైనా సమర్ధకులకు(లెఫ్ట్) మద్య సిద్ధాంత పరమైన విబేదాలు  ఆరంభమైన తరుణంలో 1962 లో శ్రీ శ్రీపాద డాంగే భారత కమ్యూనిస్ట్ పార్టీ తొలి ఛైర్మన్ గా  (first chairman of the CPI) మరియు నంబుద్రిపాద్ సెక్రెటరీ జనరల్ గా  నియమింప బడినారు. 1963 లో నంబుద్రిపాడ్ తన పదవికి రాజీనామా చేసెను.గతం లో   డాంగే రాసిన ఉత్తరాలు1964 లో పార్టీ లో(1924 లో డాంగే కాన్పూర్ కుట్ర కేసులో  జైల్ లో ఉంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి సహకారము అందించుతానని వాగ్ధానం చేస్తూ  వ్రాసిన ఉత్తరాలు) తీవ్ర సంక్షోబాన్ని సృస్టించినాయి. డాంగే వాటిని ఫోర్జరీ అంటూ ఖండించిన విభేదాలు తొలగలేదు. చివరికి ఈ విభేధాలు కమ్యూనిస్ట్ పార్టీ లో(1964 అక్టోబర్ లో)  చీలికకు దారితీసినాయి.

          కమ్యూనిస్ట్ పార్టీ లోని చైనా సమర్ధకులు(లెఫ్ట్) పార్టీ ప్రోగ్రాం ను తయారుచేయుటకు కాన్ఫరెన్స్ ను ఏర్పాటుచేసిరి. 1964 ఏప్రిల్ 11న నంబుద్రిపాడ్,జ్యోతిబసు మరియు 30 మంది ఇతర పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ నుంచి వాకౌట్ చేసిరి.పార్టీ లో డాంగే మరియు అతని సమర్ధకులు అనుసరిస్తున్నపార్టీ విచ్చిన్నకర  పద్ధతులను, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను(anti unity and anti communist policies) వీరు ఖండించిరి. డాంగే ను ఛైర్మన్ పదవి నుంచి తొలగించమని అఖిల భారత కమ్యూనిస్టులను కొరిరి. దీనికి ప్రతిగా పార్టీ నేషనల్ కౌన్సిల్ ఈ 32 మంది సబ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినది.

          1964 లో జరిగిన పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ నుంచి వాకౌట్ చేసిన 32 మండి సబ్యులలో ఒకరైన జ్యోతి బసు ,ఆ తరువాత  కమ్యూనిస్ట్ పార్టీ లో చీలిక వచ్చి పార్టీ రెండుగా విడిపోయినప్పుడు CPIM మొదటి పాలిట్ బ్యూరో సబ్యునిగా ఎన్నికోబడినారు. పార్టీ తొలి 9మంది పాలిట్ బ్యూరో (నవరత్నాలు) సబ్యులలో జ్యోతి బసు ఒకరు.


తెనాలి సమావేశం ప్రాధాన్యత:

          కమ్యూనిస్ట్ పార్టీ నుండి సస్పెండ్ చేయబడిన 32 మంది నేషనల్ కౌన్సిల్ సబ్యులు ,ఇతరులు  (left)(చైనా సమర్ధకులు)వేరే ప్రత్యేక జాతీయ సమావేశంను తెనాలి లో జులై 7-11,1964 మద్య  నిర్వహించిరి.తెనాలి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కమ్మునిస్ట్ పార్టీ సమర్ధకులు అనేకులు కలరు. ఈ సమావేశం లో పార్టీలో ఉన్న  అంతర్గత విభేదాలపై చర్చ జరిగింది.లక్ష మంది  సి‌పి‌ఐ సబ్యులకు ప్రాతినిద్యం వహించే 146 మంది డెలిగట్లు ఈ సమావేశం లో పాల్గొన్నారు.

          తెనాలి సమావేశం లో పార్టీ లోని చైనా సమర్ధకులు తమ వాదనను బలంగా వినిపించిరి. తెనాలి సమావేశంలో బెంగాల్ కు చెందిన చైనా సమర్ధకులు ముఖ్యంగా  పార్టీ లోని  తీవ్ర రాడికల్ వర్గానికి చెందిన సబ్యులు తమ సొంత డ్రాఫ్ట్ ప్రోగ్రాం ను రూపొందించిరి. వీరు మాకినేని బసవపున్నయ్య రూపొందించిన డ్రాఫ్ట్ ప్రోగ్రాం వర్గ పోరాటమును తక్కువగా చూపినదని మరియు CPSU-CPC మద్య ఉన్నసైద్ధాంతిక విభేదాలలో చైనా అనుకూల ధోరణిని ప్రదర్శించలేదని తీవ్రంగా  విమర్శించిరి. తెనాలి సమావేశం లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ నేత మావోసేటుంగ్ నిలువెత్తు చిత్రపటాలను ప్రదర్శించిరి.తెనాలి సమావేశం తరువాత (లెఫ్ట్ )(చైనా సమర్ధకులు) పార్టీ జిల్లా,రాష్ట్ర సమావేశాలను నిర్వహించిరి. కలకత్తా లో పార్టీ 7వ జాతీయ   కాంగ్రెస్ ను నిర్వహించడానికి తెనాలి సమావేశం లో నిర్ణయించడమైనది.

          తెనాలి పట్టణానికి శ్రీ జ్యోతి బసు కు మద్య తీవ్ర మైన అనుబంధం ఉంది. తెనాలి సమావేశం లోనే జ్యోతిబసు నాయకత్వం లోని తీవ్రవాద భావాలు కలిగిన యువ బెంగాలీ కమ్యూనిస్ట్ సబ్యులు తమ సొంత డ్రాఫ్ట్ ప్రోగ్రాం ను రూపొందించుకొని తీవ్ర  చైనా అనుకూల దొరణిని ప్రదర్శించిరి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఛైర్మన్ మావో నిలువెత్తు చిత్రపటాలను తెనాలి సమావేశంలో ప్రదర్శించిరి. 1964 లో కమ్యూనిస్ట్ పార్టీ చీలికకు పునాది తెనాలి సమావేశంలోని ఏర్పడింది. తొలి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పొలిట్ బ్యూరో సబ్యునిగా జ్యోతి బసు ఆతరువాత ఎన్నికైనారు.
 
          31 అక్టోబర్-7 నవంబర్,1964 మద్య  కలకత్తా కాంగ్రెస్ జరిగింది. అదేసమయం లో డాంగే నాయకత్వం లోని కమ్యూనిస్ట్ పార్టీ బాంబే లో పార్టీ కాంగ్రెస్స్ ను నిర్వహించినది.దీనితో పూర్తిగా పార్టీ లో చీలిక వచ్చినది.కలకత్తా ల్లో సమావేశమైన లెఫ్ట్ గ్రూప్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్  ఇండియా మార్క్సిస్ట్ అనే పేరును పెట్టుకొని  సొంత రాజకీయ ప్రోగ్రాం ను ఏర్పర్చుకోంది. పి.సుందరయ్య సి‌పి‌ఐ(ఎం) జనరల్ సెక్రెటరీ గా ఎన్నికైనారు.


No comments:

Post a Comment