సూఫీ తత్వము ను (Sufism) అరబ్బీలో ( تصوّف ) తసవ్వుఫ్ అని అందురు. ఇది ఇస్లాం మతము లో ఒక ఆధ్యాత్మిక ఆచారం. అరబీ భాషలో సుఫ్ అంటే ముతక ఉన్ని అని అర్థం. 'సూఫీ' అంటే 'కంబళి బట్ట' లేదా ముతక
ఉన్ని తో నేసిన బట్ట కట్టుకొనేవాడు అని అర్థం.సూఫీ తత్వవేత్తలు భౌతిక సౌఖ్యాలకు లోనుకాక,
నిరాడంబరమైన కంబళి బట్టలు ధరించడం వల్ల వీరికి 'సూఫీ' అని పేరొచ్చింది. ఇది ఇస్లాంలో నిరాడంబరతకు
చిహ్నం. సూఫీ పదానికి రెండు వెలకు పైగా నిర్వచనాలు ఉన్నాయంటారు ఆడంబరాలకూ
దూరంగా పవిత్రంగా యోగులుగా, సన్యాసులుగా, స్వాములుగా జీవితాన్ని గడిపే వ్యక్తులు 'సూఫీలు గా
పిలబడతారు 'సూఫీ' అంటే- పవిత్రతకు,
(భౌతికబంధాల నుంచి) స్వేచ్ఛకు సంకేతం! దేవుడ్ని ప్రేమించే మార్గమే
సూఫీ సారాంశం. అన్ని బంధనాల్ని వదులుకొని అన్నింటిలో దేవుడ్ని ప్రేమ మార్గంలో చూసే
పద్ధతి.
సూఫీలు అంతా మార్మికులు.
నిజానికి అన్ని మతాలు ప్రభోధించే మార్మిక అంశాలే సూఫీల బోధనలో కనిపిస్తుంది. సూఫీతత్తం
క్రీస్తుశకం 620-1100 మధ్య బలపడింది. దాని తర్వాత నేటి వరకు పరంపర
కొనసాగుతూనే ఉన్నది. భారతదేశంలోకి సూఫీ తత్వ ప్రవేశం పదమూడో శతాబ్దం నుంచి
మొదలైంది. ఖ్వాజా మొయినుద్దీన్
చిష్తి సూఫీ వాదాన్ని ప్రచారం
చేశాడు. ఆ తర్వాత ఎన్నో సూఫీ శాఖలు (సిల్‌సిలాలు) భారతదేశంలో ప్రవేశించాయి. భారతీయ
సూఫీ యోగుల్లో ఖ్వాజా మొయినుద్దీన్
చిష్తీ , షా హుస్సేన్ , సయ్యద్ అలీ హైదర్ , ఫర్ద్ ఫకీర్ , ఖలందర్
హజ్రత్ సాయి ఖుతబ్ అలీ షా , హజ్రత్ సాయి రోషన్
అలీ షా , హదీబక్ష్ లు ప్రముఖులు. సాంస్కృతిక సమైక్యతకు సూఫీలు
దోహద పడ్డారు.
సంప్రదాయక ముస్లింలు దీనిని ఒక 'గాలివాట
మార్గం' గా అభివర్ణిస్తారు.ముస్లిం మత ఉలేమాలు
దీనిని బిద్ అత్ అని కూడా వ్యవహరిస్తుంటారు.
సూఫీవాదం
–ముఖ్యాంశాలు:
·
ఇస్లాం
నుంచి ఆవిర్భవించి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సూఫీ తత్వం కేవలం ఒక మతం కాదు.
అది మత పరిధులను దాటి విశ్వచైతన్యాన్ని,
భగవత్తత్వాన్ని నింపుకొన్న విశాల మధురభక్తి సిద్ధాంతం
·
సూఫీ
తత్వం ప్రకారం స్వీయ ఆధ్యాత్మికా మార్గాన ఈశ్వర ప్రేమను పొందడం ధ్యేయం
- ధ్యాన దైవిక ప్రేమ భావనతోపరమాత్మ
లో లీనం కావడమే సూఫీ సిద్ధాంతం.
- ఆ భగవంతుడినే ప్రేమికుడిగా
భావిస్తూ నృత్యం, గానం, కవిత్వంతో ఆరాధన చేసే మతమే సూఫిజం. ఇది భగవంతునితో వ్యక్తిగత
ఆధ్యాత్మిక అనుభవాలకి ప్రాధాన్యత ఇస్తుంది. భగవంతుని ప్రేమను ఆస్వాదించేవాడే
సూఫీ. మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక అనుభవాన్ని గురించి సూఫీ తత్వం
మాట్లాడుతుంది. భగవంతుని పట్ల ప్రేమ మాత్రమే సూఫీ సన్యాసులకు సత్యం.
- సూఫీ యోగులు దేవుడిపై మధురమైన
భావన('ఇష్క్ హక్కికీ
)తో దైవ సాన్నిద్యం పొందాలని ప్రయత్నిస్తారు.
- డబ్బు
ముట్టుకోరాదు. పేదరికమే సుగుణం.సూఫీ యోగులందరూ భగవంతునిపై
ఆధారపడి జీవనం సాగించారు.నవాబులు, ప్రభువులు అందించిన
కానుకలను సున్నితంగా తిరస్కరించారు. ఆర్భాటాలకు తావివ్వకుండా, అహంకార రహితులై, నామసంకీర్తనం చేస్తూ భక్తులకు
సందేశాలు అందిస్తూ, సత్యాన్వేషణలో ఆత్మ
సాక్షాత్కారం చేసుకున్నారు.
సూఫీ వేదాంత సోపానాల్లో ఈ దశను 'ఫనా-ఫి-అల్లాహ్'
అంటారు.
- బ్రహ్మచర్యం తప్పనిసరి కాదు.ఆధ్యాత్మిక పురోగతికి,
కుటుంబ జీవితం ఆటంకం కాదు.ప్రపంచాన్ని త్యజించి
క్రియారాహిత్యంతో జీవించవద్దు. భౌతిక శ్రమ తో జీవనోపాధి కల్పించుకుంటూనే భగవంతుడిని
అన్వేషించాలి. రైతులుగా , నేతపని వారుగా, కసాయి పనివారుగానైనా సరే శ్రమించాలి.
- భగవంతుని పట్ల ప్రేమ, భక్తి ప్రపత్తులే మోక్షాన్ని
ప్రసాదిస్తాయి.జీవాత్మ పరమాత్మతో సమైక్యమవ్వాలి.(వహదతుల్ వజూద్ ).
- భగవంతునికి, మానవులకు మధ్య ప్రేమికుల సంబంధం కాకుండా యజమాని
- బానిసల సంబంధం ఉండాలి. (వహదతుల్ షుద్ ) -- నక్షబందీ శాఖకు చెందిన షేక్ అహ్మద్
సర్హిందీ
- మక్కా, గంగ మోక్షాన్ని ఇవ్వలేవు.అహాన్ని
పరిత్యజించడమే మోక్ష మార్గము.-- బుల్లేషా .
- హారతి
ని నిసర్ గా. దిష్టి
ని నజర్ గా సూఫీలు భావించారు .
- జీవాత్మ, పరమాత్మ ఐక్యమవ్వాలనే అద్వైత భావనను
సూఫీలు స్వీకరించారు.
·
సూఫీలు
బహుభార్యత్వాన్ని త్యజించి ఏకపత్నీవ్రతం అవలంబించారు.
సూఫీవాద పరిశోధకులలో ప్రముఖుడైన ఆర్.ఎ.
నికల్ సన్ ప్రకారం పాత రోజుల్లో సూఫీ అంటే పేరులేని ఆచరించిన సత్యం. ఇప్పుడది
పేరున్న ఆచరించని సత్యంగా మారిపోయింది
వీటిలో
తొలి శాఖ మరియు అత్యంత ప్రధానమైనది ‘చిష్టీ’ శాఖ షేక్ అబ్దుల్ చిష్టీచే స్థాపించబడిన ఈ
శాఖ షేక్ మొయినుద్దీన్‌చే భారతదేశంలో ప్రవేశపెట్టబడ్డది. మొయినుద్దీన్ ప్రధాన
శిష్యుడైన భక్తియార్ ఖాకి గొప్ప సంగీత విద్వాంసుడు మరియు లౌకికవాది. షేక్
నిజాముద్దీన్ సూఫీ యోగులలో సుప్రసిద్ధుడైనాడు. గొప్ప సంగీత విద్వాంసుడు మరియు మహా
పండితుడు అయిన అమీర్‌ఖుస్రో నిజాముద్దీన్ శిష్యుడిగా చిష్టీ శాఖను పాటించాడు.
చిష్తియా తరువాత సహర్ వర్దియా ,ఖాదరియా,నఖ్ష్ బందియా మరియు షాధిలియ్య, కుబ్రావియ్య ఇతర ముఖ్యమైన శాఖలు.
చిష్తియా తరువాత సహర్ వర్దియా ,ఖాదరియా,నఖ్ష్ బందియా మరియు షాధిలియ్య, కుబ్రావియ్య ఇతర ముఖ్యమైన శాఖలు.
సూఫీల
ప్రాముఖ్యత :
- రాజకీయ రంగంలోకి లౌకికవాదం
బలపడటానికి సూఫీలు కృషిచేశారు. మధ్య యుగాలలోని గొప్ప లౌకిక పాలకులైన ఇబ్రహీం
అదిల్‌షా, అక్బర్ మరియు
షాజహాన్ పెద్దకొడుకైన ధారాషికోలు సుఫీ మతంచే ప్రభావితులైనారు
- ధారాషికో పర్షియన్ భాషలోకి
ఉపనిషత్తులను తర్జుమాచేశాడు. అదే
విధంగా సూఫీ యోగుల జీవితచరిత్ర మరియు బోధనలు తెలియజేసే మక్తుబాత్ మరియు ముల్‌ఫజాత్
సాహిత్యమును ఫిరదౌసియా శాఖ స్థాపకుడైన షరాపుదీన్ రచించాడు.
- సూఫీలు సంస్కృతంలోని వైద్య
రచనలను ‘తిబ్ - ఎ -
సికిందరి’ పేరుతో పర్షియన్‌లోకి అనువదించారు.
- రసాయన శాస్త్ర పరిజ్ఞానాన్ని, ‘జిచ్’ అనే
క్యాలెండర్‌కు సంబంధించిన అంశాలను, ‘తాజిక్’ అని పిలిచే జ్యోతిష్య శాస్త్ర విభాగాన్నిఅబివృద్ధి చేశారు .
- బదౌని రామాయణాన్ని పర్షియన్‌లోకి అనువదించగా , మహాభారతాన్ని ‘రమ్జానామా’ పేరుతో పర్షియన్‌లోకి అనువదించారు.
- అమీర్ ఖుస్రో భారతదేశాన్ని తన మాతృభూమిగా భావిస్తూ
హిందీ భాషాభివృద్ధికి కృషి చేశాడు. కవిత్వంలో భారతీయ శైలి(సబక్ -ఇ - హింద్)ని
ప్రోత్సహించాడు.పర్షియన్ సంగీత సంప్రదాయాల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ
సంగీతం అభివృద్ధి
చెందింది. అమీర్ ఖుస్రో, జైపూర్ పాలకుడు హుసేన్ షా షర్కీ, పీర్‌బోదన్‌లు వంటి వారు సంగీత అభివృద్ధికి
కృషిచేశారు ఎన్నో కొత్త రాగాలను సృష్టించారు. మహావిధ్వాంసులైన అమీర్‌ఖుస్రో,. సనమ్, ఘోర మరియు ఐమన్ అనే కొత్త రాగాలనూ,
ఖవాలి అను భక్తి సంగీతాన్ని, తబల మరియు
సితార్ అను వాయిద్యములను ప్రవేశపెట్టాడు
- వాస్తు మరియు చిత్రలేఖనం వంటి
రంగాలలో హిందూ, ముస్లిం
సాంప్రదాయంతో కూడిన ఇండో ఇస్లామిక్ సంస్కృతి అభివృద్ధికి సూఫీలు తోడ్పడ్డారు.
భారతీయ వాస్తు కళలకు కమాన్, గుమ్మటం, మీనార్ (స్తంభాలు) లను జోడించారు. రంగురాళ్లను వినియోగించారు. ఉద్యాన
కళను అభివృద్ధి చేశారు.
- నిర్గుణ వాదుల్లో రామానందుడి
శిష్యుల్లో కబీర్
ప్రసిద్ధుడు. ఆయన భగవంతుడిని రామ్, రహీమ్,
అల్లా అన్నాడు..
- హిందువులు సూఫీ మహనీయుల సమాధులను
దర్శించి నేటికీ ఆరాధిస్తున్నారు.
- సూఫీలు అద్వైత భావనతో యోగ సాధన
చేశారు. ‘అమృతకుండ’
అనే హర్షయోగ గ్రంధాన్ని పర్షియన్‌లోకి అనువదించుకున్నారు.నిజాముద్దీన్
ఔలియా యోగ సాధన చేసి సిద్ధుడు అయ్యాడు.
సూఫీ కవిత్వం:
మౌలానా జలాలుద్దీన్ రూమీ, రబియా, హాఫిజ్ షీరాజీ. ఫరీదుద్దీన్ అత్తార్.సుప్రసిద్ద సూఫీ కవులు. సూఫీ
కవిత్వాన్ని చదివితే, సూఫీతత్వమూ తెలుస్తుంది.
రూమీ ఆఫ్ఘనిస్తాన్‌లో క్రీస్తుశకం 1207లో జన్మించారు. 1273లో కాలం చేశారు. ఫారసీ భాషలో కవిత్వం చెప్పారు. సూఫీ కవుల్లో
అగ్రగణ్యులుగా కీర్తింపబడ్డారు. వీరి 'మస్నవీ' కావ్యం గొప్ప పేరుప్రఖ్యాతులు పొందింది. ‘జలాలోద్దీన్
రూమి’ పారసీ భాషలో రచించిన అద్భుత మైన సూఫీ కవిత్వము నేడు
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడయ్యే సూఫీ కవిత్వంగా గుర్తించాలి. ఆయన ప్రేమ భక్తితో ఆయన రాసిన కవిత్వం
యావత్ ప్రపంచాన్నీ ఆకర్షించింది.
·
నీలో
ఉన్న ప్రతి భాగానికి ఒక రహస్య భాష వుంది. నీ చేతులు,
కాళ్లు నువ్వేం చేశావో చెబుతాయి.-- మౌలానా రూమీ
·
దిగుడుబావి
నుండి ఏతంతో నీళ్లను పైకి తోడినట్లు పరుపుతో నీ కళ్లను నీటితో ఉబికిపోనీ నీ హృదయపు
మాగాణి పొలంలో పచ్చటి చివురులు మొలకెత్తనీ కన్నీరు కావలిస్తే కన్నీరు కార్చేవాళ్లతో
దయగా వుండు దయ కావాలిస్తే నిస్సహాయుల పట్ల దయ చూపు -- మౌలానా రూమీ
·
ఉదయం
నిన్ను కీర్తించాను.. కానీ నాకా సంగతి తెలియదు...
రాత్రికి
నీతోనే ఉన్నాను.. అదీ తెలియదు..
నేనెప్పుడూ నన్ను నేనే అనుకున్నాను... కానీ నేనే నువ్వు..
నేనెప్పుడూ నన్ను నేనే అనుకున్నాను... కానీ నేనే నువ్వు..
కానీ
అది నాకెప్పుడూ తెలియలేదు....-రూమీ..
ఫరీవుద్దీన్ అత్తార్ మొదట్లో
వ్యాపారి. తరువాత ఫకీరు. కాలం 1136-1230.
·
సూఫీయోగి
ఈ క్షణానికి చెందిన వారు. 'రేపు' అనటం సుతరామూ గిట్టదు.... ఫరీదుద్దీన్ అత్తార్.
రబియా పైఇద్దరికంటే ముందు ఆమె. కాలం 710-780. ఈమెది ఇరాక్‌లోని
బస్రా నగరం. అరబీ భాషలో ఈ అమ్మ చెప్పిన కవితలు ఎక్కువ లేవుగాని, చెప్పినంతవరకు అవి గొప్పగా కీర్తింపబడుతున్నవి.
·
అల్లాను
ప్రేమిస్తున్నావా?' అంటే ఔను అహర్నిశలూ
మరి సైతాన్ని ద్వేషిస్తున్నావా? లేదు, అందుకు
సమయం ఎక్కడిది?—రబియా
·
దేవుడా!
నిన్ను నేను నరకానికి భయపడి
ప్రార్థిస్తుంటేనరకంలో పడేసి కాల్చు!
ప్రార్థిస్తుంటేనరకంలో పడేసి కాల్చు!
స్వర్గం
మీది ఆశతోప్రార్థిస్తుంటే
స్వర్గం నుంచి నన్ను దూరంగా నెట్టు!
స్వర్గం నుంచి నన్ను దూరంగా నెట్టు!
అలా
కాకుండా, నిన్ను నేను నీకోసమే
ప్రార్థిస్తుంటే
నీ అనంతమైన సౌందర్యాన్నుండి నన్ను వేరు చేయకు!- రాబియా
నీ అనంతమైన సౌందర్యాన్నుండి నన్ను వేరు చేయకు!- రాబియా
హాఫిజ్ 14వ శతాబ్దం మొదట్లో ఇరాన్ దేశంలో పుట్టి
అదే శతాబ్దం చివర్లో దేహం చాలించారు. ఫారసీ భాషలో రచనలు చేశారు. రూమీ అంతటివాడుగా
ప్రసిద్ధి పొందారు. భగవంతుడి కోసం పడే తపనే, ఆరటమే ఆయన
కవిత్వం.
·
పంచవన్నెల
పింఛమే నెమలికి శత్రువు/ చాలా మంది రాజులు తలలు పోగోట్టుకోటానికి కారణం/ వారు
తాల్చిన రత్నఖచిత కిరీటాలు
-- హాఫిజ్ షీరాజీ.
·
వైద్యుడికి
దగ్గరికి వెయ్యి మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాను
నా జబ్బేమిటో తెలుసుకుందామని
నెలలు తరబడి పరీక్షలు చేసినా అసలు కారణం దొరకలేదు
నా జబ్బేమిటో తెలుసుకుందామని
నెలలు తరబడి పరీక్షలు చేసినా అసలు కారణం దొరకలేదు
కాస్త
అర్థం అయ్యేట్టు అతను చె్ప్పిందేమంటే
నా చేతికున్న ఉంగరం రాయి నీలంగా వుందని
నా చేతికున్న ఉంగరం రాయి నీలంగా వుందని
తామంతా
సవ్యంగా ఆలోచిస్తామనుకునే వాళ్ళలొ
ఇంత అజ్ఞానం వుండటం నిజంగా సిగ్గుచేటు. –హఫీజ్ షీరాజీ
ఇంత అజ్ఞానం వుండటం నిజంగా సిగ్గుచేటు. –హఫీజ్ షీరాజీ
సూఫీ
తత్వ ఆచరణా విధానాలు (Sufi Practices)
- జికర్, హద్రా ఖవ్వాలి, సమా, ఖల్వా
ప్రముఖ సూఫీల జాబితా:
- రాబియా బస్రీ - బస్రా, ఇరాక్ (8వ శతాబ్దము)
- బహాఉద్దీన్ నఖ్ష్ బంద్ బుఖారి
14వ శతాబ్దం, ఉజ్బెకిస్తాన్
- అల్ ఖాకిమ్
అత్-తిర్మజి 8వ శతాబ్దం,
ఉజ్బెకిస్తాన్
- ఖ్వాజా అహ్మద్
యాసవి 12వ శతాబ్దం,
తుర్కెస్తాన్
- ఫరీదుద్దీన్
అత్తార్ పర్షియా
- అబూ సయ్యద్
అబుల్-ఖైర్ , పర్షియా
- ఇబ్న్ అరబి , 1165- 1240
- మహ్ మూద్
షబెస్తరి , పర్షియన్
(హిజ్రీ శకం 687 - 720)
- జునైద్ బగ్దాది పర్షియన్
- బాయజీద్ బుస్తామీ , పర్షియా
- మన్సూర్
అల్-హల్లాజ్ , పర్షియా
- అబ్దుల్ ఖాదిర్
జీలాని , సున్ని,
హంబలి, పర్షియన్, బాగ్దాద్
(ఇరాక్) లో సమాధి గలదు
- నజ్ముద్దీన్
కుబ్రా , పర్షియా
- జుల్-నూన్
మిస్రి , 9 వ శతాబ్దం,
నుబియా (ఈజిప్టు)
- జలాలుద్దీన్
ముహమ్మద్ రూమి - 1207, పర్షియా,
దర్వేషీ తరీఖా స్థాపకుడు
- అల్-సఖ్వి 831— 902
- ముల్లా
నస్రుద్దీన్ , పర్షియా
- గులామ్ ముస్తఫా ఖాన్ ముజద్దిద్
1912-2005, ఆసియా, పాకిస్తాన్
- అహ్మద్ రజా ఖాన్ 1856-1920, ఆసియా, బరేలీ
మదరసా స్థాపకుడు
- ముహమ్మద్ తాహిరుల్ ఖాద్రి
- సయ్యద్ ఫైజుల్
హసన్ షా
- హజరత్ జామి - 1414, పర్షియా
- సయ్యద్ ముహమ్మద్ నఖీబ్ అల్ అత్తాస్
- ముహమ్మద్
ఇలియాస్ - 1885
- ఖలందర్ బాబా
దక్కన్
భూభాగం లోని సూఫీదర్గాలు:
దక్షిణ భారత
దేశం లో ముఖ్యము గా దక్కను ప్రాంతంలోసూఫీ
సన్యాసుల, ఒలియాల దర్గాలు బాగా
పేరు గాంచినవి .ఈ దర్గాలను అన్ని మతాలవారు,అత్యంత భక్తి, శ్రద్ధలతో
దర్శించడం మనం గమనించవచ్చు. హైదరాబాద్‌లోని
హజ్రత్ యూసుఫ్ గూడా, పహాడి షరీఫ్‌లోని బాబాషర్పోద్దీన్
(ర.హ) దర్గా, నాంపల్లిలోని షాఖామాషి (ర.హ)
షరీఫ్ బాబాలు. వలిగొండలో హజ్రల్ లతీఫ్ ఉల్ షా ఖాద్రి (ర.హ) దర్గా, జాన్‌పహాడ్ దర్గాలు, నిజామాబాద్‌లో బడాపహాడ్ దర్గా,
వరంగల్లోని హజ్రత్ అఫ్జల్ బియాబాని దర్గా, హజ్రత్
మాషుక్ రబ్బాని దర్గా, భువనగిరిలోని హజ్రత్ జమాలె బహర్ (ర.హ)
దర్గా, హజ్రత్ బుద్హాద్దీన్ దర్గా, కరీంనగర్‌లోని
హజ్రత్ కరీముల్లాషా ఖాద్రీ (ర.హ). పెద కాకానిలోని బాజీ బాబా దర్గా, నెల్లూరు
జిల్లా లోని వేనాడు దర్గా
ముఖ్యమైనవి.ప్రతి
ఏడాది వీరి ఉర్సు ఉత్సవాలు హిందూ, ముస్లింలు సంప్రదాయబద్దంగా జరుపుకుంటారు. వారిని తలచుకుంటూ తన్మయత్వంలో
మైమరచిపోతుంటారు. సూఫీలు సర్వమత సమానత్వాన్ని చాటి చెప్పారు. కనుకనే హిందువులకు
కూడా సూఫీ యోగులు పూజ్యనీయులైనారు.
No comments:
Post a Comment