1 January 2014

భారత పార్లమెంట్ లో స్త్రీల ప్రా తినిద్యం


 స్వంతంత్ర భారత దేశ రాజకీయాలను పరిశీలించిన దేశ జనాభాలో సగ భాగం ఐనా స్త్రీలు దేశ ఉన్నత స్థానాలను ఆక్రమించినారు .దేశ రాష్ట్రపతి,ప్రధానమంత్రి, లోక్ సభ స్పీకర్, లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలు, సుప్రీం కోర్ట్ న్యాయ మూర్తి, ప్రధాన ఎన్నికల కమిషనర్,రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్  వంటి అనేక స్థానాలను ఆక్రమించినారు. అయినప్పటికి దేశ సామాజిక రంగము, రాజకీయ రంగాలలో  స్త్రీల పరిస్థితి సంతృప్తి కరముగా లేదు.ప్రపంచమం లో స్త్రీలకు బద్రత తక్కువ ఉన్న దేశాలలో భారత దేశం 4వ స్థానం ఆక్రమించుచున్నది. స్త్రీ అబివృద్ధి లో 115 వ స్థానం పొందినంది.
ప్రపంచ శాసనసభలను పరిశీలించిన రువాండా దేశ పార్లమెంట్ లో స్త్రీల శాతం అత్యధికంగా 56% కలదు. సార్క్ దేశాలలో నేపాళ్ లో 33%, పాకిస్తాన్ లో 22.5% కలదు భారతదేశ పార్లమెంట్ లో స్త్రీల ప్రాతినిద్యం 10% కలదు. శాసనసభలలో స్త్రీల ప్రాతినిద్యం విషయం లో భారత దేశం 105 స్థానం లో కలదు.

          భారత దేశంలో 73,74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలలో స్త్రీలకు 33% స్థానాలు కేటాయించడము జరిగినది. (కొన్ని రాష్ట్రాలలో 50% స్థానాలు కేటాయించడము జరిగినది) మహిళా బిల్లు ద్వారా పార్లమెంట్ లో 33% స్థానాలు కేటాయించుటకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికి అవి ఇంకా సఫలము కాలేదు. శాసన సభలలోనూ, నిర్ణాయధికారం తిసుకొనే సంస్థలలో స్త్రీల ప్రాతినిద్యం మరింతగా మెరుగు పరచవలసిన ఆవశ్యకత ఉంది.
          స్వతంత్రం వచ్చి 60 సం. గడిచిన, 15 సాధారణ పార్లమెంట్ ఎన్నికలు గడిచిన, ప్రాతినిద్యం విషయం లో స్త్రీల పరిస్తితి సంతృప్తిగా లేదు. దేశ జనాభాలో సగం ఉన్న స్త్రీలు పార్లమెంట్ లోని లోక్ సభలో ఏనాడూ 10% మించి స్థానాలు పొందలేదు. ప్రస్తుత 15 వ లోక్ సభలో స్త్రీల సంఖ్య 59 కాగా అందులో 3గురు  స్త్రీలు ముస్లింలకు ప్రాతినిద్యం వహిస్తున్నారు.  లోక సభ లో ముస్లిం స్త్రీల ప్రాతినిద్యం ఏ నాడు 3 మించలేదు. ఇంతవరకు ఏర్పడిన 15 లోక్ సభ లలో మహిళా సబ్యుల మొత్తం సంఖ్య 549 కాగా అందులో ముస్లిం మహిళా సభ్యుల మొత్తం  సంఖ్య 18 మాత్రమే.
          15వ లోక్ సభ లో మొత్తం 59 మంధి మహిళలు ఎన్నిక కాగా వారిలో 23 మంది కాంగ్రెస్ కు, 13 మంది బి.జే.పి. కు చెందినవారు. వీరిలో 17 మండి మహిళా  సభ్యుల వయసు 40 సం. కు లోపు గానే ఉంది.ఉత్తర ప్రదేశ్ నుండి అత్యధికంగా  13 మంది  మహిళా లోక్ సభ సబ్యులు, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ నుండి 7గురు మహిళా సభ్యులు ఎన్నికైనారు. 1952 లో ఏర్పడిన మొదటి లోక్ సభలో స్త్రీల శాతం 4.4% ఉండగా, అతి తక్కువ శాతం స్త్రీలు ఎన్నికైనది  6వ లోక్ సభ (1977-80) 3.8% గా ఉంది. ప్రస్తుత రాజ్య సభ లో 26 మంధి మహిళా సభ్యులు కలరు. మొత్తం సబ్యులలో వారి శాతం10.6% కాగా వీరిలో ఇరువురు మాత్రమే ముస్లిం మహిళా సభ్యులు, వీరు   మోహిషినా కిద్వాయి (కాంగ్రెస్-ఐ) హెజ్మా నఫ్తుల్ల బి.జే.పి. కు చెందినవారు.
         భారత పార్లమెంట్ లో 33% స్థానాలు స్త్రీలకు కేటాయించిన రాజ్యసభలో 33% అనగా 83 స్థానాలు, లోక్  సభ లో181 స్థానాలను స్త్రీలకు కేటాయించవలసి ఉంటుంధి. దేశా జనాభాలో సగం మరియు వోటర్లలో సగం ఉన్న స్త్రీలకు ఈ స్థానాలు కేటాయించటము సమంజసము గానే ఉంటుంది. కానీ 1996 లోనె స్త్రీలకు పార్లమెంట్ లో 33% స్థానాలు కేటాయించే బిల్లును లోక సభలో ప్రవేశపెట్టినప్పటికి అది ఇంకా లోక్ సభ ఆమోదం పొందలేదు. 2011 మార్చ్ లో 108 వ రాజ్యంగా సవరణా బిల్లు గా రాజ్య సభ ఆమోదం పొందినది. అయితే ఈ బిల్లు ఉన్నత వర్గాలకు చెందిన స్త్రీలకు మాత్రమే ఉపయోగకరమని, దీనిలో తిరిగి ఓ‌బి‌సి, ముస్లిం స్త్రీలకు ప్రత్యేకం గా రిజర్వేషన్ కల్పించాలని ఎస్.పి.బి.ఎస్.పి.జే.డి.(యూ),ఆర్.జే.డి. పక్షాలకు చెందిన నాయకులు అబ్యంతరము తెలుపుతున్నారు. ప్రస్తుతం కేంద్రం లో అధి కారం లో ఉన్న యూ‌పి‌ఏ-2 ప్రభుత్వం త్వరలోనే ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టి సభ ఆమోదం పొందుతుందని, తద్వారా కోటానుకోట్ల స్త్రీల ఆకాంక్షలు తీరుతాయని ఆశించుదాము.      









       







.




    















No comments:

Post a Comment