22 December 2013

భారత దేశం లో పరిశుబ్రత-వ్యక్తిగతశుబ్రత (sanitation and Hygiene) పరిస్థితి- నిరాశాజనకము


“53% మంధి భారతీయులు తమ కాలకృత్యాలు ఆరుబయట తీర్చుకొందురు-ఒక సర్వే నివేదిక”
         53% భారతీయులు లేదా దేశ జనాభాలో  60 కోట్ల మంది  ఆరుబయట మలవిసర్జన చేస్తారని ఇటీవల ప్రకటించిన ఒక సర్వే లో నిర్ధారణ అయినది. కేంద్ర మంత్రి జైరాం రమేశ్ అబిప్రాయం ప్రకారం దేశ జనాభాలో 64% మంది ఆరుబయట తమ కాలకృత్యాలు తీర్చుకొంటున్నారు. ఇది ఒక అంతర్జాతీయ రికార్డు. దీని వల్ల అనగా ముందేమరణించుట,రోగుల చికిస్థ,సమయ దురుపయోగం, ఉత్పత్తి లో నష్టము ,పర్యాటక ఆదాయం కోల్పోవటము మొదలగు కారణాలవల్ల  దేశానికి ప్రతి సం: 3,24, 000 కోట్ల నష్టము జరుగుచున్నది.
         సంతోషం కలిగించే విషయము విజ్ఞాన పరముగా భారతీయులు, చంద్ర యానము, మంగళ యానముల  ద్వారా ముందంజలో ఉన్నారు. కానీ పరిశుబ్రత,ఆరోగ్య రంగాలలో చాలా వెనుకబడి ఉన్నాము.
క్రిందివాస్తవాలు గమనించండి.    
పరిశుబ్రత(Sanitation):
§  64% భారతీయులు తమ  కాలకృత్యాలు ఆరుబయటతీర్చుకొంటారు. కానీ బంగ్లాదేశ్, బ్రజిల్ లాంటి దేశాలలో కేవలను 7% జనాభా తమ కాలకృత్యాలు ఆరుబయట తీర్చుకొందురు.
§  ప్రపంచవ్యాప్తం గా ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకొనేవారిలో 60% మన దేశంలోనే ఉన్నారు.
§  ఆరోగ్యం పై ఖర్చు వలన దేశ స్తూల జాతీయ ఆదాయం(GDP) తగ్గుచున్నది.
§  ఉత్పత్తి,పర్యాటక రంగాలలో  ఆదాయము  తగ్గుటవలన దేశ స్తూల జాతీయ ఆదాయం(GDP) తగ్గుచున్నది.
§  దేశ స్తూల జాతీయ ఆదాయం(GDP)లో 0,02% పరిశుబ్రత (sanitation) పై ఖర్చు పెట్టవలసి వస్తుంది.
§  సంపూర్ణ పరిశుబ్రత పధకం (TSC)క్రింద  గత పది సం.లలో 8.71 కోట్ల మరుగు దొడ్లు నిర్మించబడినవని తెలుస్తుంది. కానీ కుటుంబ లెక్కల సేకరణ ప్రకారం వీటి సంఖ్య 5.16 కోట్లు మాత్రమే.
§  గత 5 సం.లలో 45,000 కోట్ల రూపాయలను గ్రామీణ పరిశుబ్రత కొరకు ఖర్చు పెట్టటాము జరిగింది. 2017 వరకు అదనముగా ఇంకో 1.08 లక్షల కోట్ల ఖర్చు పెట్టదరు.   
వ్యక్తి గతశుబ్రత (Hygiene)
§  పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ లెక్కల ప్రకారం 53% మంది  కాలకృత్యాలు తీర్చు కొన్నతరువాత తమ చేతులను సబ్బు తో కడుగుకొనేదారు. 38% మండి భోజనము చేయుటకు ముందు, 30% మంది  ఆహారం తయారు చేయుటకు ముందు చేతులు కడుగుకొనేదరు.
§  గ్రామీణ భారతము లో 11% మంది పిల్లల మలమును రక్షితముగా పారవేయుడురు .
§  80% మందిపిల్లల మలమును అరక్షితముగా అనగా ఆరుబయట లేదా చెత్త లో పారవేయుడురు. 
§  కేవలం 6% గ్రామీణ పిల్లలు మరుగు దొడ్లను వాడుదురు.
§  చేతులు కడుగుకొనుట వలన డయోరియ (విరోచనములు) మరణాలు తగ్గును.
§  సబ్బు తో చేతులు కడుగుట వలన 44% మరణాలు,
§  మరగకాచిన నీరుత్రావుట వలన44%,
§  పరిశుబ్రత వలన 36%,
§  మంచి నీరు  త్రాగటం  వలన 23%,
§  నీటి  ఆధారాలను శుబ్రము చేయుట వలన 11%  డయోరియ (వీరోచనాల) ద్వారా సంభవించే మరణాలు తగ్గును.
కంపించకుండాపోయిన 3.5 కోట్ల మురుగు దొడ్లు
          భారతీయులలో ఆదిక శాతం ప్రజలకు ఆధునిక పరిశుబ్రత సౌకార్యాలు అందుబాటులో లేవు.UNICEF/WHO లెక్కల ప్రకారం  2008 నాటికి భారత దేశ  గ్రామీణ ప్రజలలో 21% మంధికి మాత్రమే పరిశుబ్రత (sanitation)సౌకర్యాలు లబించినవి. ఇది గ్రహించిన భారత ప్రభుత్వం(GOI) 1999నుంచి సంపూర్ణ గ్రామీణ పరిశుబ్రత పధకం (TSC)మరియు 2008 నుంచి జాతీయ సంపూర్ణ పట్టణ పరి శుబ్రత పాలసీ   (NUSP) ప్రారంభించినది. కానీ ప్రభుత్వం చెప్పుతున్న లెక్కలకు ,వాస్తవ గణాంకాలకు పొత్తన కుదురుట లేదు. ఉదా: సంపూర్ణ గ్రామీణ పరిశుబ్రతా పధకం క్రింద 2009 చివరి నాటికి గ్రామీణ జనాభాలో 80%మందికి 8.7 కోట్ల మరుగు దొడ్లు నిర్మించబడినవి. కానీ 2011 కుటుంబ గణాంకాల ప్రకారం కేవలం 5.16 కోట్ల మరుగు దొడ్లు వాస్తవముగా కలిగి ఉన్నారు. మిగతా 3.5 కోట్ల మరుగు దొడ్లు ఎమైనాయీ?
          పై సర్వే నివేధిక పరిశీలించిన పెద్ద మొత్తాలను కేటాయించటమే కాదు, వాటిని ప్రభావవంతముగా ఖర్చుపెట్టిన ఆశించిన ఫలితాలను అనగా మరణాల శాతమును మరియు పరిశుబ్రతతో సంభధము కలిగిన పైన వివరించిన  ఇతర ఫలితాలను అనగా రక్షిత త్రాగునీటి సమస్య,ప్రజాక్షేమం,తగ్గుతున్న పర్యటన ఆధాయము మొదలగు వాటిని నివారించ వచ్చును . 
పరిశుబ్రతా సౌకర్యాలు లేకపోవటం  అన్నీ సమస్యలకు కారణము:  
          సర్వే నివేదికను పరిశీలించిన అబివృద్ధి చెందుతున్న దేశాలలో ఆరుబయట మలవిసర్జన దేశ మానవశక్తి అభివృద్ధి  కి ప్రమాదకరము అని తెలియుచున్నది. పరిశుబ్రతా అబివృద్ధి ఫధకం అమలులో ఉన్న దేశాలలో ఆ పధక అమలు వలన చిన్న పిల్లలలో గ్రహణ శక్తి పెరుగును . ఉదా: భారత దేశం లో పరిశుబ్రతా  పధకం అమలులో ఉన్న ప్రాంతాలలోని 6స.లోపు పిల్లలు అక్షరాలు, అంకెలను ఇతరులకన్నా అనగా పధకం అమలు లోని ప్రాంతాల పిల్లల కన్నా త్వరితంగా నేర్చుకొన్నారు.
          స్కూళ్లలోనూ,పబ్లిక్ స్థలలలోను పరిశుబ్రత సౌకర్యాలు లేకపోవడం వలన అనేక అసౌకర్యాలు  సంభవించును. మగవారు ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేయగలరు, కానీ ఆడ వారికి అది
సాద్యపడదు.వారికి మరుగు కావలే, బజార్లు,షాపింగ్ స్థలాలు, ఇతర పబ్లిక్ స్థలలలో మరుగు దొడ్లు లేనియెడల అది స్త్రీలకు అసౌకర్యము కల్పించుటయే గాక వారి మూత్రాశయములపై ప్రభావము కల్పించును.
          స్కూళ్ళలో టాయలేట్ సౌకర్యము లేక పోవుట వలన  స్కూళ్ళలో బాలికల డ్రావ్ప్ఔట్ (dropout) పెరుగుచున్నది. యువతులకు తమ సానిటరీ నాప్కిన్స్ మార్చుకొనుటకు లేదా పారవేయుటకు , చేతులు కడుగుకొనుటకు ప్రత్యేకముగా వారికోసమే కేటాయించబడిన టాయాలేట్లు కావలెను. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో దళిత,బలహీనవర్గాల మహిళల కోసం ప్రత్యేకం గా కేటాయించబడిన టాయలెట్లు కావలెను .      
         మురికి వాడలలో నివసించే మహిళల పరిస్తీతి మరింత బాదాకారముగా ఉంది. వారు పగటిపూట కాలకృత్యాలు తీర్చుకొనుటకు అవకాశము లేక భాధపడుచున్నారు. తెల్లవారిగట్ల,లేదా చీకటి పడిన తరువాత కాలకృత్యాలు తీర్చుకొనుటలో అనేక ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. టాయలేట్ కు తరచూ   వెళ్లవలసిన పరిస్తితి వస్తుందని స్త్రీలు,బాలికలు శరీరానికి కావలసీన కనీస  నీటిని కూడా పగటి పూట త్రాగుట లేదు.
          టాయలేట్ సౌకర్యం లేక పోవటం వలన స్త్రీలు, బాలికలు పడుతున్న ఇబ్బందులను
మన మంతా గ్రహించి పబ్లిక్ స్థలాలలో పబ్లిక్ టాయలేట్లను ఏర్పాటుచేయాలి.  దీనిని కనీస ప్రజా అవసరముగా గుర్తించి   తీర్చవలసిన ఒక కనీస సహజ శారిరకవసముగా భావించి    ఒక దేశ వ్యాప్త అంధోళన రూపొందించ వలసి ఉంది.     

(యూనిసెఫ్ ఇండియా నివేదిక సహాయం తో వ్యాసము రూపొందింపబడినది).


No comments:

Post a Comment