1 December 2013

భారత పార్లమెంట్, విభిన్న రాష్ట్రాల శాసన సభలలో ముస్లిం శాసన సభ్యుల అతి తక్కువ ప్రాతినిద్యం

         క్రిందటి వ్యాసం లో  లో భారత దేశం లోని విభిన్న రాష్ట్రాల మంత్రిమండలుల లోని ముస్లిం మంత్రులను గురించి తెలుసుకొన్నాము.. ప్రస్తుతం భారదేశం లోని విభిన్న రాష్ట్రాల ముస్లిం శాసన సబ్యుల వివరాలు పరిశీలించుదాము. 
   60 సం. పైబడిన స్వతంత్ర భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో దేశ జనాభాలో 15% పైగా ఉన్న ముస్లింలు తమ జనాభాకు తగిన నిష్పత్తిలో రాజకీయ ప్రాతినిద్యం అనగా పార్లమెంట్(లోక్ సభ-రాజ్య సభ), రాష్ట్రాల శాసన సభలలో(అసెంబ్లి-కౌన్సిల్) ప్రాతినిద్యం  పొందటంలో ఘోరంగా విఫలం చెందినారు.
         స్థానిక సంస్థలలో అనగా మునిసిపాలిటీ లు మరియు పంచాయతీ సంస్థలలో వీరి ప్రాతినిద్యం మరి దారుణం గా ఉంది.
         ఇంతవరకు భారత దేశ రాష్ట్ర పతులుగా చేసిన వారిలో ముగ్గురు మాత్రమే ముస్లింలు. అదేవిదంగా ఉప-రాష్ట్రపతులు గా ముగ్గురు ముస్లింలు పని చేసినారు.
          ఇటీవల రాష్ట్ర పతి ని ఎన్నుకొన్న  ఎలెక్ట్రోల్ కాలేజ్ లోని 4896 వోటర్లలో(776 ఎం.పి.లు అనగా రాజ్య సభ 233 ఎం.పి.లు మరియు లోక్ సభ కు చెందిన 534 ఎం.పి.లు మరియు 28 రాష్ట్రాలు, డిల్లీ ,పుదుచ్చేరి  కు చెందిన మొత్తం  4120 మంది ఎం.ఎల్.ఏ.లు  ) కేవలం 410 మాత్రమే ముస్లింలు.అది మొత్తం రాష్ట్ర పతి ని ఎన్నుకొనే ఎలెక్ట్రోల్ కాలేజ్ లోని 4896 వోటర్లలో 8.37% మాత్రమే.
         మొత్తం 776 మంది భారత  పార్లమెంట్ సభ్యులలో 53 మంది  మాత్రమే ముస్లింలు, వీరిలో రాజ్య సభ సబ్యుల సంఖ్య 24, లోక్ సభ సబ్యుల సంఖ్య 29 మంది  మాత్రమే.
         15 రాష్ట్రాల నుంచి ముస్లిం రాజ్య సభ సబ్యులు లేరు , అదేవిదంగాభారత దేశం లో ని 28 రాష్ట్రాలలో 20 రాష్ట్రాలనుంచి ముస్లిం లోక్ సభ సబ్యులు లేరు. 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో 6 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కూడా ముస్లిం లోక్ సభ సబ్యులు లేరు.   
          చత్తీస్ ఘడ్, గుజరాత్, హరియాణ, ఒరిస్సా, జార్ఖండ్, కర్ణాటక, మద్య ప్రదేశ్, మహారాస్త్ర, పంజాబ్,రాజస్తాన్ మొదలగు రాష్ట్రాలలో ముస్లిం లు తగినంతగా ఉన్నప్పటికి ఆ రాష్ట్రాలనుంచి ఒక్క లోక్ సభ సబ్యుడు కూడా ఎన్నిక కాలేదు. ఆంధ్ర ప్రదేశ్, అస్సామ్, బిహార్, కేరళ, ఉత్తర ప్రదేశ్ ల నుంచి ముస్లిం లోక్ సభ సబ్యులు ఎన్నికైనప్పటికి వారి సంఖ్య వారి జనాభా నిష్పత్తికి తగినట్లు గా లేదు. 

         దేశం మొత్తం మీద అన్నీ రాష్ట్రల అసెంబ్లి ల లో(2 కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లి సభ్యులతో కలిపి) 4120 సబ్యులు ఉండగా వీరిలో కేవలం 357 మంధి మాత్రమే ముస్లింలు. ఒరిస్సా అసెంబ్లి లో ఒక్క ముస్లిం శాసనసబ్యుడు కూడా లేదు. మద్య ప్రదేశ్ అసెంబ్లి లో ఒకే ఒక్క ముస్లిం శాసన సభ్యుడు కలడు.ఆంధ్ర ప్రదేశ్, బిహార్, ఛత్తీస్ గడ్, గుజరాత్,జార్ఖండ్,కర్నాటక,మద్య ప్రదేశ్,మహారాష్ట్ర, పంజాబ్, రాజస్తాన్,ఉత్తరాఖండ్,డిల్లీ లలో ముస్లిం శాసన సబ్యులు ఉన్నప్పటికి వారి సంఖ్య వారి జనాభా నిష్పత్తికి తగినట్లు గా లేదు.   

         అదే విధంగా జమ్ము-కాశ్మీర్ శాసన సభ  లో ఆదికమంది ముస్లిం శాసన సబ్యులు కలరు. అస్సామ్, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మొదలగు రాష్ట్రాలలో ముస్లిం శాసన సబ్యులు చెప్పుకోదగినంత సంఖ్యలో ఉన్నప్పటికి  అది వారి జనాభా నిష్పత్తికి తగినంతగా లేదు అని చెప్పా వచ్చును. ఏది ఏమైనా అసలు లేక పోవడం కన్నా ఎంతో కొంత ఉండటం మేలు కదా.

         ఇప్పటికైనా అందరూ ఒకే కంఠం తో ముస్లింల అల్ప ప్రాతినిద్యంను నిరసించి, వారి జన సంఖ్యకు తగినట్లుగా వారికి దేశ పార్లమెంట్ లేదా బిన్న రాష్ట్రాల శాసనసభలలో ప్రతినిద్యం కల్పించక పోయిన అది పార్లమెంట్ ప్రజాస్వామ్యం లో  అందరి అభివృద్ధి (inclusive growth)
అని పిలవ బడదు. ఇందుకు అవసరమైతే నైష్పత్తిక ప్రాతినిద్య విధానం అనుసరించ వలసి ఉంటుంది. అంధుకు అన్నీ రాజకీయ పక్షాలు తమ వంతు సహాయ-సహకారాలు అందించాలీ. 

No comments:

Post a Comment