అధ్యాత్మిక
గ్రంధాల అద్యయనము వలన శాంతి లబించుటయే గాక సరియైన జీవనాన్ని గడిపే మార్గం కూడా
తెలుస్తుంది. దివ్య కొరాన్ గ్రంధం లో ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉంది.
అర్ధశాస్త్రము, వాణిజ్య శాస్త్రము,ఖగోళ శాస్త్రము,మేనేజ్మెంట్,జీవశాస్త్రము,
భూగోళ శాస్త్రము, చరిత్ర, రాజనీతి
శాస్త్రము మొదలగు అన్నీ శాస్త్రాల వివరమైన జ్ఞానము మనకు దివ్య కొరాన్ లో లబించును.
దివ్య కొరాన్ ఆద్యాత్మిక గ్రంధామే కాదు, మానవాళి కి
మార్గదర్శనము చూపే గ్రంధము. ఈరోజు మనము అనుసరించే దివ్యా కొరాన్ లోని విషయములన్నియు, 1400 సం. పూర్వమే వివరించబడినవి.
ప్రస్తుత
సమయం లో మనము నిర్వహణను ఏవిధంగా మెరుగు పరచవలేనో, నిర్వహణా స్థాయిలో వచ్చేసమస్యలను ఎవిదంగా
ఎదుర్కొనవలయునో,
వాటికి సమాధానం దివ్య కొరాన్ లో లబించును. మనము చేయవలసినది వాటిని సరిగా
తెలుసుకొనుటయే. దివ్య కొరాన్ లో మేనేజ్ మెంట్ కు సంబందించిన సుమారు 300 ఆయతులు లేక
ప్రవచనాలు కలవు. వాటిద్వారా నిర్వహణ
సూత్రాలను మనము తెలుసుకొన వచ్చును. నాయకత్వ గుణాలను గురించి కూడా ఇస్లామిక్ మేనజ్
మెంట్ లో వివరించటము జరిగినది.
ఇస్లామిక్
మేనేజ్ మెంట్ సుగుణాలు
Ø ఉద్యోగుల మద్య మంచి సంబంధాలు
మరియు సమూహ ఏక మనస్తత్వం( టీమ్ స్పిరిట్) కలిగి ఉండవలయును.
Ø పరస్పర సంప్రదింపుల ద్వారానే
ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనవలయును.
Ø ప్రతి ఉద్యోగి కి తన మాట
విన్పించే స్వతంత్రం ఉండవలే.
Ø ఆర్థిక వికాసమే అంతిమ లక్ష్యం
కారాదు.
Ø ప్రతి ఉద్యోగి లో నిజాయితీ, సొంత వ్యక్తిత్వం, సంస్థ పట్ల అనురాగం, క్రమశిక్షణ, సంస్థ ప్రయోజనాలను కాపాడటం అందుకు కృషి చేయటం, వంటి
సుగుణాలు ఉండవలయును.
Ø ఏ సంధర్భంలోను నైతిక సూత్రాల
పతనం కారాదు.
Ø ఇతరులకు మేలు చేసే
స్వభావాన్ని కలిగి ఉండ వలయును.
పైన వివరించిన మేనేజ్ మెంట్
సుగుణాలన్నీ మనకు దివ్య కొరాన్ లో కంపించును.
No comments:
Post a Comment