2013 లో
జరిగిన 5 రాష్ట్రల (డిల్లీ,రాజస్తాన్,మద్యప్రదేశ్,ఛత్తీస్ ఘడ్ ,
మిజోరాం )ఎన్నికల ఫలితాలను పరిశీలించిన ముస్లిం ల పరిస్థితి ఆశాజనకం గా లేదు. ఈ 5
రాష్ట్రాలలో పూర్వపు శాసన సభలలో ఉన్న ముస్లిం సబ్యుల స్థానాల కన్నఈ సారి పరిస్థితి దిగజారింది.
2008
లో డిల్లీ శాసన సభలో ముస్లిం సబ్యుల సంఖ్య 5 కాగా 2013 లో ముస్లిం
శాసనసబ్యుల సంఖ్య 5 గానే మిగిలింది. ఈ సారి డిల్లీ శాసన సభలో ఎన్నికైన 5
గురు ముస్లిం శాసన సబ్యులలో 4గురు కాంగ్రెస్-ఐ కు చెందగా, ఒకరు జే.డి.యూ.(ఎస్) కు చెందినవారు. డిల్లీ మొత్తం వోటరులు 11.5
మిలియన్లు కాగా అందులో 11% మంది ముస్లిం ఓటర్లు. 2013 లో డిల్లీ నుంచి అన్నీ పార్టీల
తరుపున 108 మండి ముస్లింలు పోటీచేయగా కేవలం 5 గురు మాత్రమే ఎన్నిక అయినారు.
కాంగ్రెస్స్ తరుపున ఎన్నికైనవారు 8 మంది
కాగా వీరిలో 4 ముస్లింలు. జేడియూ(ఎస్) తరుపున 1 ముస్లిం ఎన్నికైనారు.
ముస్లిం వోట్లు కాంగ్రెస్-ఐ తో పాటు కొత్తగా స్టాపించిన ఏ.ఏ.పి. ఆమ్ ఆద్మీ పార్టీ, బి.జే.పి. లకు కూడా లబించటం విశేషం.
ఇక
రాజస్తాన్ విషయానికి వస్తే అక్కడి వోటరులలో 9-11% వరకు ముస్లింలు
ఉన్నారు. బి.జే.పి. తరుపున 4గురు, కాంగ్రెస్ తరుపున 17 మండి పోటీచేసినారు. కానీ ఇరువురు ముస్లిం అబ్యర్ధులు బి.జే.పి.
తరుపున ఎన్నికైనారు. పాత శాసనసభలో కాంగ్రెస్ తరుపున (2008లో) 5 ముస్లిం శాసన
సబ్యులు ఉండేవారు.
మద్య
ప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ వోటరులలో 7-8%
వోటరులు ముస్లింలు గా ఉన్నారు. కానీ
పూర్వం (2008)లాగానే ఇప్పుడుకూడా (2013) ఒకరు, అది కాంగ్రెస్ నుంచి మాత్రమే
ఎన్నికైనారు. బి.జే.పి. తరుపున మాజీ కేంద్ర మంత్రి
ఆరిఫ్ బేగ్ ఒక్కరే పోటీచేశారు కానీ ఓడిపోయారు. కానీ విచిత్రంగా బి.జే.పి. ముస్లిం
అదిక్యత ఉన్న ప్రాంతాలనుంచి కూడా 10 స్థానాలు గెలిచింది. దీన్ని బట్టి
సంప్రదాయకంగా కాంగ్రెస్స్ వోటు బ్యాంక్ గా పరిగణించబడే ముస్లిం లు ఈ సారి
ఎన్నికలలో తమ దృక్పదాని మార్చుకొని, బి.జే.పి.,ఏ.ఏ.పి. వంటి ఇతర పార్టీలను కూడా
ఆదరించినారు.
ఛత్తీస్ గఢ్,
మిజోరాం, నుంచి ఒక్కరూ కూడా ముస్లిం లు ఎన్నిక కాలేదు. ఛత్తీస్
ఘడ్ నుంచి ఇరువురు ముస్లింలు పోటీచేయగా ఇరువురు ఓడిపోయినారు.
ఇక 2014 లోక సభ ఎన్నికల వైపు మన దృష్టిని
వేసిన కొన్ని విషయాలను గ్రహించవచ్చు.
లోక సభ ఎన్నికలలో
మొత్తం 543 నియోజక వర్గాలలో
68 నియోజక వర్గాల ఓటర్లు లలో
ముస్లిం ఓటర్లు 30-35% వరకు ఉన్నారు.
ఇక రాష్ట్రాల వారీగా చూస్తే మొత్తం 10
రాష్ట్రాలలో మొత్తం వోటర్ల సంఖ్య లో
ముస్లిం వోటర్ల సంఖ్య 11% పైగా ఉంది.
ఇప్పటికన్నా
ముస్లింలు వాస్తవాలను గ్రహించి 2014 లో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో సెక్యులర్
శక్తులను , ముస్లిం ప్రయోజనాలను పరిరక్షించే వారిని
ఎన్నిక చేసుకోకపోతే వారి భవిషత్తు అంధకారంగా మారుతుంది.
No comments:
Post a Comment