22 December 2013

“స్త్రీ విముక్తి ప్రదాత లేదా స్త్రీ గౌరవ రక్షకులు మహమ్మద్ ప్రవక్త (స)”

 పవిత్ర కొరాన్ ప్రకారం అల్లాహ్ స్త్రీ,పురుషులు ఇరువురిని ఒకే ప్రాణి నుండి సృష్టించినాడు. మానవపరంగా వారిరువురి మద్య ఎటువంటి భేదము లేదు. నిజానికి అల్లాహ్ పట్ల అత్యంత భయబక్తులు, విశ్వాసము కలవరే అతనికి ఆప్తులు.
 “ మానవులారా! మేము మిమ్మల్లి ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. యదార్ధానికి మీలో అందరికన్నా ఎకువగా బయబక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో అందరికన్నా ఎక్కువగా ఆదరణీయుడు” దివ్య కొరాన్ 49:13.
          అల్లాహ్ పురుషులు కన్నా స్త్రీలు తక్కువ అన్నవారిని నిందించినాడు -దివ్య కొరాన్ 16:57-59,
           స్త్రీ పురుషులను సమానంగా చూడమని ఆదేశించినాడు దివ్య కొరాన్ - 2:228,231, 4:19.

          అల్లాహ్ పవిత్ర కొరాన్ తో పాటు అంతిమ ప్రవక్త ఐనా మహమ్మద్ ప్రవక్త(స) ను ప్రజలకు మార్గదర్శకం చూపమని పంపినాడు. ఉన్నతమైన నైతిక సుగుణాలు, సత్యసంధులు,ఐనా మహమ్మద్ ప్రవక్త (స)గారి  ఆదర్శ జీవితము, దివ్య కొరాన్ లోని భోదనలను అనుసరించుటకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చును.అంతిమ ప్రవక్త ఐనా మహమ్మద్ ప్రవక్త (స) ప్రవచనాలు సర్వాకాలాలకు, సర్వ దేశాల మానవాళి కి సదా అనుసరనీయాలు.

          శతాబ్దాల తరబడి అణిచివేతకు,దోపిడీకి,బానిసత్వానికి, పురుష ఆహంకారానికి,గురిఐన స్త్రీ జాతి సముద్దరణకు మహాప్రవక్త(స) ఉదయించినారు.స్త్రీ స్వతంత్రవాది,సంస్కరణవాది,రక్షకుడు,విముక్తి ప్రధాతగా మహమ్మద్ ప్రవక్త (స) అవతరించేను. వారి ప్రవచనాల వెలుగు లో ఆనాటి అరబ్బులు పాటించే అనేక క్రూరపద్దతులు,ముదాచారాలు,సమూలంగా నిర్మూలించబడినవి. వీరి ప్రవచనాల పలితముగా స్త్రీ-పురుష సమానత,స్త్రీలకు గల హక్కులు, స్త్రీ స్థానం మొదలగునవి ఆ నాటి సమాజం చే గుర్తించబడి గౌరవింపబడినవి.

స్త్రీ-రక్షణ:
          ఇస్లాం అబివృద్ధి చెందుటకు పూర్వము అరబియా లో స్త్రీ లకు రక్షణ,విలువ లేదు. వారు కేవలం వ్యాపార వస్తువులుగా,జంతువులకన్నా హీనముగా పరిగణిపబడే వారు. ఆ స్థితి నుంచి స్త్రీలను కాపాడి,వారికి సమున్నత గౌరవం, స్థానము కల్పించిన ఘనత మహమ్మద్ ప్రవక్తకు (స) దక్కుతుంది. సర్వత్ర అణిచివేత,నిరంతరము దూషణలకు గురిఐన స్త్రీలకు ప్రవక్త రక్షణ కల్పించేను. ఆ రోజులలో ఆడ శిశువులను పాతివేయటం సర్వసాదారణము. ఆడశిశువు తండ్రిగా పిలువబడటం అవమానకరం గా నాటి అరబ్ సమాజం భావించేడిది. ప్రవక్త తన బోధనలచే ఆడశిశువుల హత్యలను,ఆడపిల్లలను కలిగిఉండటం అవమానకరం గా భావించడాన్ని వ్యతిరేకించేను. తాను స్వయంగా నలుగురు కుమార్తెలను కలిగి, వారికి అమిత ప్రేమానురాగాలు పంచి, కుమార్తెలను కలిగి ఉండటం  గౌరవానికి చిహ్నంగా ప్రజలు భావించేటట్లు చేసెను.

          ప్రయాణం చేసి వచ్చినతరువాత ప్రవక్త(స) తన  ఇంటికి వీళ్ళక, స్వయంగా కుమార్తె ఫాతిమా(ర)ఇంటికి వెళ్ళి ఆమెను ప్రేమతో పలకరించే వారు. ప్రవక్త ఆగమనము తరువాత  అరేబియా లో బాలికల  సంఖ్య పెరిగినది.ఇస్లాం ఆగమనమునకు ముందు అరేబియా లో విదవలకు పునర్వివాహ హక్కు లేదు, వారు తమ మారుటి కుమారుల లేదా తమ భర్త సోదరుల  ఆస్తులుగా భావించబడే వారు. ప్రవక్త (స) విధవలకు పునర్వివాహ హక్కు ను, గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు ను, కల్పించిరి. తాను స్వయంగా అనేక మంది  విధవలను,విడాకులు పొందిన స్త్రీలను వివాహమాడి సమాజంలో  వారికి గౌరవ ప్రదమైన స్థానం కల్పించిరి.

స్త్రీల హక్కులు :
          స్త్రీ పై అదిక్యత కాక స్త్రీ పై భాద్యత  పురుషునికి ఇవ్వబడినది.స్త్రీని పరిపూర్ణముగా పోషించవలసిన బాద్యత పురుషునిది. భార్య గా భర్త నుండి, తల్లి గా కుమారుడినుంచి, కుమార్తె గా తండ్రినుంచి,సోదరిగా సోదరుడినుంచి, పోషణ పొందుటకు స్త్రీకి పూర్తి హక్కు కలదు. ప్రవక్త (స) కాలములో  ఒక వ్యక్తి తన ఆర్థిక స్థాయికి తగినట్లు తన భార్య-పిల్లలను పోషించక పోయిన, ఆమె ఆర్థిక అవసరములను తీర్చుటకు గాను ఆమెకు  రాజ్య ఖజానా(state treasury) నుంచి తగిన ధనము ఇవ్వబదేది. ఆదే సంధర్భం లో తన స్థాయికి మించి ఖర్చు చేయమని భర్తను బలవంత పెట్టరాడు, అదేవిదంగా స్థాయికి మించిన కోర్కెలు కోరే హక్కు భార్యకు లేదు. ఒక హదీసు ప్రకారం “పిసినారి ఐనా తన భర్త తన ఆర్థిక స్థాయికి తగినట్లు తమ ( భార్య పిల్లల)  కనీసావసరాలు తీర్చుటలేదని, అబుసుఫియన్ భార్య అబుసుఫియన్ పై ఫిర్యాదు చేసినది మరియు  అతనికి తెలియకుండా అతని ధనము లోంచి  కొంత తీసుకోవచ్చునా” అని ప్రవక్త ను ప్రశ్నించేను. ఆమె అవసరాలకు తగినంత తీసుకొమ్మన్ని ప్రవక్త (స) అనుమతి ఇచ్చిరి.

          కుటుంబ ఆర్ధికావసారాలను తీర్చవలసిన భాద్యత ముస్లిం స్త్రీ కు లేదు,అది పురుషుని భాద్యత . ఆస్తిని సంపాదించుటకు,తన పేర ఉంచుటకు, వారసత్వంగా పొందుటకు, న్యాయపరమైన  లావాదేవిలు చేయుటకు, తన ఆస్తులను తానే స్వయంగా సంరక్షించుకొనే అధికారం ముస్లిం స్త్రీ కు కలదు. ఆమె సంపాదన పై స్వయంగా భర్త కు కూడా హక్కు లేదు. సామాజిక,రాజకీయ, సైనిక రంగాలలో పాల్గొనే హక్కు స్త్రీలకు కలదు.

          ఇస్లాం కు పూర్వం స్త్రీలకు ఆస్తిని వారసత్వంగా  పొందుటకు, అనుభవించుటకు, చివరికి వ్యాపారం చేసే హక్కు కూడా లేదు. కానీ ఖదిజా(ర) ఒక వ్యాపార వేత్త మరియు ఆమె వ్యాపార నిర్వహణ లో ప్రవక్త(స)ఆమెకు  సహకరించేవారు . ప్రవక్త కాలములో స్త్రీలు యుద్ద రంగములో గాయపడిన వారికి కట్లు కట్టుట, నీరు త్రాగించుట, మొదలగు పనులలో సైనికులకు సహాయం చేస్తుండేవారు.సైదా జనాబ్(syeda janab) ఆ కాలపు ప్రముఖ ఉపన్యాసకురాలు మరియు సైనికురాలు.నుసైబా(Nusayba) ఆకాలపు ప్రముఖ సైనికురాలు. ఖలీఫా ఎన్నికలో స్త్రీ,పురుషులు ఇరువురు పాల్గొనేవారు. ఉస్మాన్ బిన్ ఆఫ్ఫాన్ ఖలీఫా గా ఎనికైనా సందర్భంలో అబ్దుర్ రహ్మాన్ బిన్ ఔఫ్ అనేక మంధి స్త్రీలను సంప్రదించిరి. విడాకులు ఇచ్చే హక్కు పురుషులతోపాటు స్త్రీలకు కూడా ఖులా రూపం లో కలదు.

సమానత్వం:
          ఇస్లాం లో స్త్రీ కి సముచిత స్థానం కల్పించబడినది. స్త్రీ-పురుషులు ఇరువురు సమవర్తులే కాని పోటీదారులు కారు. కొన్ని పనులు స్త్రీలు మరికొన్ని పనులు పురుషులు చేయగలరు. పోషించుట,సమర్ధించుట,రక్షణ మరియు భార్య-పిల్లలకు  విద్యను ప్రసాదించుట పురుషుల పని. కుటుంబమును నడుపుట మరియు  భర్తకు సహాయపడుట స్త్రీ విది. పిల్లలను కనుట, పెంచుట,భోధించుట శిక్షణ ఇచ్చుట స్త్రీ ప్రధాన విది. కుటుంబ విధులు నిర్వహించిన తదుపరి తగిన నైపుణ్యమున్న ఆమె బయట పనిచేయవచ్చును. ఒప్పంద మరియు వ్యాపార స్వేచ్చ ముస్లిం స్త్రీ కి కలదు. వివాహమైనతరువాత కూడా ఆమె తన సంపాదన పై పూర్తి హక్కు కలిగి ఉంది.ఇవి అన్నియు మహా ప్రవక్త (స) భోదనల పలితముగా స్త్రీలకు లబించినవి
.
          ఇస్లాం లో జ్ఞానవంతులకు ఆదిక్యత లబించును మరియు స్త్రీపురుషులు ఇరువురికీ జ్ఞానమును పొందు హక్కు కలదు. జ్ఞానమును ఆర్జించుట ప్రతి ముస్లిం స్త్రీ-పురుషుల తప్పక నెరవేర్చవలసిన  విది.
మీలో కొరాన్ ను అబ్యసించి ఇతరులకు భోదించేవారే ఉత్తములు”
ఓ ప్రభూ! నాకు మరింత జ్ఞానము ప్రసాదించు.”20:114

          ప్రవక్త (స) తన కుమార్తెలను, భార్యలను ,ఇతర ముస్లిం స్త్రీలను విద్యావంతులను చేసెను. స్త్రీలు ప్రవక్త ప్రవచనములను శ్రద్దగా అలకించే వారు, అర్థం కాక పోయిన మరొక మారు ప్రవక్త వారికి భోదించేవారు. ఈ విదముగా స్త్రీవిద్యను,స్త్రీ జ్ఞానము పొందుటను ప్రవక్త సమర్ధించిరి. ప్రవక్త (స) మరణాంతరము ఆయెషా(ర) హదీసుల ముఖ్యఆధారముగా పరిగణింపబడిరి. ఆమె 2210 హదీసులను గుర్తు ఉంచుకొని వాటిని ప్రముఖ హదీసు విద్యావేత్తలకు  భోదించేవారు. ఆమె జ్ఞానులకు,జ్ఞానిగా పేరొందినది.

భావ ప్రకటనా స్వేచ్చా:
          స్త్రీపట్ల దయ,అనురాగములను ప్రవక్త (స) ప్రదర్శించేవారు. ముస్లిం సమాజములో స్త్రీలకు,పురుషునితో సమానమైన గౌరవము,స్థానము కల్పించబడినది. సమాజములో స్త్రీల హక్కులను తన ప్రవచనములు,కార్యముల(సున్నత్)  ద్వారా స్థాపించిరి. తన భార్యలతో జరిపే  చర్చలలో ప్రవక్త (స)  స్త్రీ స్థానం ద్వితీయమైనది కాదు,అంతటిలో ఒక భాగము అని పేర్కొనేవారు. ప్రవక్త (స) తన భార్యలతో సలహా సంప్రదింపులు జరిపేవారు. ఖదీజా(ర) ప్రవక్త మత  వ్యవహారములలో ప్రముఖ పాత్ర వహించిరి.మొదటిసారి “వహి” అవతరించినపుడు ప్రవక్తను స్వాంతన  పరిచిరి మరియు ఇస్లాం లోకి మారిన మొదటి వ్యక్తి ఖదీజా(ర).         
          ప్రవక్త(స) తన భార్యలకు భావప్రకటనా స్వాతంత్రమును ప్రసాదించిరి. హుదైబియా ఒప్పంద సమయంలో బలి జంతువులను వధించమనే ప్రవక్త ఆదేశాలను వారి అనుచరులు పాటించని సమయంలో భార్య ఉమ్మసల్మా సలహామేరకు ప్రవక్త  స్వయంగా తన బలిజంతువును వధించగా, ఆపై  అనుచరులందరు ప్రవక్త (స) ఆదేశాలను పాటించి తమ బలిజంతువులను వదించిరి. ప్రవక్త (స) సమక్షం లో స్త్రీలు,ఇతర ప్రముఖ ముస్లిం నాయకులతో పాటు  తమ భావాలను స్వేచ్చగా వెల్లడించటమే గాక, ముఖ్య మైన చర్చలలో పాల్గొనేవారు.

          వివాహము,కట్నము మొదలగు విషయాలలో స్వయానా తండ్రితో సహా ఎవరు స్త్రీని బలవంత పెట్టలేరు.పెళ్లి విషయంలో తల్లి-తండ్రులు సలహా మరియు సహాయము మాత్రమే చేయగలరు అంతియేకాని ఆమెను బలవంత పెట్టలేరు. మేనల్లుడు అలీ తన కుమార్తెను వివాహాము చేసుకోదలచినప్పుడు,కుమార్తె  ఫాతిమా అబిప్రాయంను తెలుసుకొన్న తరవాత మాత్రమే ప్రవక్త (స)ఆ వివాహమునకు  అంగీకరించిరి. ఇబ్న్ అబ్బాస్ ప్రకారం “తన అంగీకారము లేనిదే తన తండ్రి తన వివాహము చేయు చున్నాడని ఒక స్త్రీ ప్రవక్త (స) తో ఫిర్యాదు చేయగా వివాహమును అంగీకరించు లేదా తిరస్కరించు అధికారము ఆమెకు కలదని ప్రవక్త (స) బదులు ఇచ్చిరి. ఇంకొందరి ప్రకారం” ఆ స్త్రీ తనకు వివాహము అంగీకారమే కానీ తమ అబిప్రాయాన్ని నాపై రుద్దే హక్కు నా తల్లి తండ్రులకు లేదని స్పష్టం చేయాలి” అని అనెను.

          ప్రవక్త తన భోదనలతో స్త్రీల హక్కులను అబివృద్ధి చేయుటయేకాక , స్త్రీలు తమ హక్కుల కోసం పోరాడేటట్లు చేసినారు. స్త్రీ కి లబించే కట్నం (మెహ్ర్ ) పై పరిమితి లేదు. కట్నం(మెహ్ర్) ను పరిమితం చేయుటకు ఖలీఫా ఉమర్ ప్రయత్నించగా ఒక వృద్ధ స్త్రీ తన అబ్యoతరమును   తెలియచేయగా, ఆమె అబ్యoతరమును దివ్యకురాన్ వెలుగులో పరిశీలించిన ఖలీఫా ఉమర్ తన అబిప్రాయమును మార్చుకొని ఆమె అబిప్రాయం సరిఐనదని మెచ్చుకొనిరీ.

గౌరవము,హౌదా కల్పించుట  మరియు స్త్రీల పట్ల  దయగల ప్రవర్తన:
          స్త్రీల హక్కులు ముఖ్యమైనవి   మరియు వారి పట్ల దయతో ప్రవర్తించ వలసి ఉంటుంది. “తమ స్త్రీల పట్ల ఆదరణీయ మైన ప్రవర్తన కలవారే నిజమైన ముస్లింలు” అని ప్రవక్త మహమ్మద్ (స) అబిప్రాయ పడిరి.ప్రవక్త స్వయం గా దయకల, ప్రేమపాత్రులైన భర్త గా వ్యవరించిరి. ఇంటి పనులను భార్యలతో కుడి చేసేడివారు,ప్రయానములలో తనతోపాటు భార్యలను తీసుకువెళ్ళేవారు ,వ్యాపారము  మరియు అన్నివిషయములలో సంప్రదించేవారు.కొన్ని సందర్భాలలో వారు ప్రవక్తతో (స) బిగ్గరగా మాట్లాడేవారు మరియు వాగ్వివాదమునకు దిగేవారు. ప్రవక్త (స) ఎల్లపుడూ వారిపై ఆదిక్యత ప్రదర్శించేవారు కారు. ప్రతి మానవజీవి గౌరవము, హూదాకు తగిన వారని ప్రవక్త తన భోదనలద్వారా తెలిపినారు.
          తల్లి పాదాల చెంత స్వర్గం ఉన్నదని ప్రవక్త(స) తెలిపినారు. అల్లాహ్ దృష్ఠి లో తల్లి స్థానము ఉన్నతమైనది.
          వస్త్రాలను దరించుటలో హిజబ్ ను పాటించుట స్త్రీ గౌరవాన్ని,రక్షణను పెంచును. స్త్రీ లతో పాటు పురుషులను కూడా తమ చూపులను మరల్చుకోమని, క్రిందకు దించమని అల్లాహ్ దివ్య కొరాన్ లో ఆదేశించినారు. పోకిరిలు, స్త్రీలను వేదించకుండా స్త్రీలు తమ బాహ్య దుస్తులను శరీరం పై నిండుగా కప్పుకొనమని అల్లాహ్ ఆదేశించినాడు.శరీరము కన్పించే వస్త్రధారణ పట్ల ప్రవక్త(స) అసంతృప్తి వెలిబుచ్చిరి.

          ప్రవక్త పదవిని పొందినతరువత గడిపిన తన 23 ఏళ్ల జీవితం లో ప్రవక్త(స)తన భోధనల ద్వారా  స్త్రీలపై ఆనాటి ముస్లిం సమాజ భావాలను పూర్తిగా మార్చుటలో సఫలము చెందినారు. హితునిగా,సమర్ధకుని గా, తమ ప్రగతి ప్రోత్సాహకునిగా మరియు తమ సంక్షేమ కర్తగా ప్రవక్త మహమ్మద్ ను (స) స్త్రీ జాతి పొగడును. స్త్రీల సామాజిక,రాజకీయ, ఆర్థిక, నైతిక జీవితము మరియు దినసరి జీవితము  పై ప్రవక్త(స) భోదనల ప్రభావము విశేషముగా కలదు. తమ జీవితమును తీర్చిదిద్దిన ప్రవక్త (స) జీవితము లోని విబ్బిన్న సంఘటనలు ఆదర్శమైనవిగా,అనుసరించదగినవిగా  సమకాలీన స్త్రీ సమాజము భావించినది. ఆమీన్.
   
  
   



No comments:

Post a Comment