22 December 2013

“ప్రవక్త ప్రవచనాల వెలుగులో నేటి సమస్యల పరిష్కారం


          మానవ జీవితం ఎల్లప్పుడు సమస్యలు, ప్రశ్నలతో నిండిఉంటుంధి. మానవులు తమ కాలపు సమస్యలను ప్రత్యేకమైనవిగా,గత కాలపు సమస్యలకన్నా బిన్నమైనవిగా, భావిస్తుంటారు. వారిదృష్టిలో వర్తమానం గతం, కన్నా సంక్లిష్టమైనది. ఈ భావన సహజమైనదిగా అనిపించిన అది నిజం కాదు,అది  బ్రమ మాత్రమే. దైవ ప్రవక్తలలో చివరివారైనా మహమ్మద్ ప్రవక్త(స) సమస్త మానవాళికి భోదకులు,మార్గదర్శకులు.వారి మార్గ దర్శకత్వం లో,వారి ప్రవచనాల సహాయంతో ప్రస్తుత ప్రపంచంలోని సమస్యల పరిష్కారానికి మనమందరము  ప్రయత్నించవలసి ఉంటుంది.

          ప్రస్తుత మానవ సమాజం అనేక సమస్యలతో నిండి ఉంది, వాటి పరిష్కార మార్గాలను కోరుకొంటున్నది. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను 1.అనిశ్చిత(uncertainty) 2.విశ్వ సమాజ ఆవశ్యకత(need for a global society) 3.అందని శాంతి(elusive peace) 4.ప్రకృతితో విరోధం(conflict with nature) 5.వనరుల పున: పంపిణీ (distribution of resources) గా వర్గీకరించ వచ్చును. ప్రవక్త(స) ప్రవచనాల(ఇస్లాం) వెలుగులో ఈ సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తున్నాము.

అనిశ్చిత యుగము:
          పునర్జీవనోద్యమము పలితంగా పాశ్చాత్య సంస్కృతి, శాస్త్రీయ పద్దతిలో సత్యాన్ని (truth) కనుగొన్నానని తలంచుచున్నది. ప్రకృతి,విశ్వం యొక్క రహస్యాలను, శాస్త్రీయ పద్దతిలో ఆద్యయనము చేయడం జరిగినది.అన్నీ సామాజిక సమస్యలకు మానవ మేధస్సుతో పరిష్కారాలు సాదించుటకు  ప్రయత్నాలు ప్రారంభమైనవి.ఇది చాలా గోప్ప విజయము. కానీ 400 స. లు గడిచినా మానవుని సామాజిక ప్రవర్తనను శాస్త్రీయంగా అర్థం చేసుకొనుటలో విఫలం చెందాము.ఉత్తర ఆధునికతత్వం (post modernism) లో ఈ భావనను వ్యక్తం చేయడం జరిగింధి, అనగా వస్తువులలో అనిశ్చితత,పూర్తిగా నిజాలు లేకపోవడం అని అర్థం.

          అనిశ్చితత నిరాశ,నిస్పృహలకు,అశాంతికి దారితీయును.నిరాశ, నిస్పృహలు అధికంగా ఉన్న సమాజాలలో ప్రవక్త(స) ఉపదేశాలు కొత్త ద్వారాలను తెరుచుచున్నవి.ప్రవక్త ప్రకారం దైవ సందేశం (కొరాన్) మానవులకు సంపూర్ణ జ్ఞానాన్ని,విశ్వాసాన్ని కలుగ చేయును. మానవ జీవితం లోని అనిశ్చితతను తొలగించుటయే ప్రవక్త (స) ప్రదాన ఆశయము. ప్రవక్త (స) నోటి ద్వారా అవతరించిన దివ్య కొరాన్ ప్రారంభం లో “ఇది అల్లాహ్ గ్రంథము, అల్లాహ్ భీతి కలవారికి ఈ గ్రంధము మార్గదర్శకం”  2:2 అని స్పష్టం చేయడం జరిగింది. అదేవిదంగా మహమ్మద్ ప్రవక్త(స) “తాను అల్లాహ్ చే పంపబడిన చిట్టచివరి ప్రవక్తనని, ఈ విషయం లో ఎటువంటి అసత్యం లేదని” స్పష్టపరిచిరి.

ప్రవక్త స్వయంగా దైవ గ్రంధం (కొరాన్) అన్నీ విషయాలను విశిదపరచును అన్నప్పుడు, మనం ప్రవక్తను (స) ఎందుకు అనుసరించవలే?అనే ప్రశ్న తలెత్తును? ఈ ప్రశ్నకు జవాబు గా ఐదు సమాధానములను ఇవ్వవచ్చును.

§  ప్రవక్త విశిష్ట నడవడిక కలవారు, సత్య సంధులు. అసమాన తెలివితేటలు,సునిశితమైన సుబుద్ధి కలవారు. కాబట్టి మనం వారి మాటలను విశ్వసించవచ్చును.
§  ప్రవక్త తన కోసం ఏది కోరుకో లేదు. స్వలాభం కోసం పనిచేయలేదు. నిస్వార్ధంగా,సాదారణమైన, నిరాడంబరమైన జీవితాన్ని గడిపినారు.
§  అందరూ ప్రవక్తలు ఒకే సందేశం తెచ్చారు.సందేశం లో తేడాలు ఉన్న అందరూ ఒకే సందేశం ఏవిధంగా తెగలరు?
§  ప్రవక్త సందేశం సరిఐనదని, ప్రజలు తమ జ్ఞానము, హేతువును ఉపయోగించి రుజువు చేసుకొన్నారు.
§  ప్రవక్త సందేశం పాటించిన మానవ జీవితం పునీతమై, శాంతి వెలుగులతో కూడి, మనలను దైవ మార్గములోనికి మరల్చును. అందుకే దివ్య కొరాన్ “మానవులను అల్లాహ్ వైపుకు మరలండి” అని కోరింది.

విశ్వ సమాజము (Global society)
          సాంకేతికత,వేగవంతమైన ప్రయాణం, కమ్యూనికేషన్ సౌకర్యాలు ప్రస్తుత సమాజాన్ని విశ్వ సమాజంగా (global society) మార్చినవి. విశ్వ సమాజం లో మానవులందరికి సమానంగా వర్తించే విశ్వ న్యాయ సూత్రాలు కావాలి. ఒకే ప్రాంతానికి వర్తించే సూత్రాలు,విలువలు వెంకబడినాయి. ఈ సంధర్భం గా ప్రవక్త (స)సూత్రాలను లేదా ఉపదేశాలను పరిశీలించిన అవి ఒక ప్రాంతానికి కాక విశ్వ సమాజానికి వర్తించేటట్లు ఉన్నాయి. కాబట్టి ఇవి మానవులందరిని ఏకం చేసే, అందరిచే ఆచరింపదగిన సూత్రాలుగా భావించవచ్చును.

ప్రవక్త దృష్టి లో సార్వత్రిక ప్రపంచం క్రింది విధంగా ఉండ వలయును.
§  సృష్టికర్త ఒకరే అనే భావనను కలిగి ఉండుట.
§  విశ్వంలో ఐక్యత మరియు సంతులిత ఉండవలయును.
§  ఆదామ్-హవ్వ నుంచి జనించిన మానవ జాతి అంతా ఒకటి గానే ఉండవలయును

ఈ సంధర్భం గా ప్రవక్త ప్రవచనలను క్రింది విధం గా ప్రవచించ వచ్చును.
§  న్యాయ మరియు నైతిక విశిష్టత                                 (adl  and ihsan)
§  తల్లితండ్రులను ఆదరించుట                                     (sidq and amanah)
§  సామాజిక,రాజకీయ విషయములలో సంప్రదింపులు        (shura)
§  వ్యక్తి మరియు సమాజ సమగ్ర అబివృద్ధి                       (tazkiyah)
§  నైతికంగా సమర్ధనియమైనదానిని పాటించుట (maroof) మరియు పునీత మానవ స్వభావమును కలుషితం చేయూదానిని వదిలివేయుట (munkar)

          పైన వివరించిన భావనలు విశ్వ వ్యాప్తమైనవి. అవి అందరూ మానవులకు సమానం గా అనగా రంగు,వర్గ,ప్రాంత,జాతి భేదాలు లేకుండా వర్తించును. మానవ ప్రవర్తన విశ్వవ్యాప్తం గా ఒకే విధం గా ఉండవలెనని ఆశింపవచ్చును.

ప్రవక్త (స)భోదించిన ఉన్నత నైతిక ప్రవర్తనలోని ముఖ్యాంశాలు :
1.    అల్లాహ్ తప్పితే వేరే దైవం లేడు. (నిరాకార,ఏకేశ్వరోపాసన)
2.   తల్లి-తండ్రులను ఆదరించుట.
3.   పొరుగు వారి పట్ల ఆదరణ చూపుట.
4.   వ్యక్తి ప్రవర్తన, చేతలలో విధేయత,పరిశుద్దత  కలిగిఉండుట  (Haya)
5.   వ్యక్తిగత,పరిసరాల పరిశుబ్రత పాటించుట
6.   జూదం, లాటరీ వంటి వాటిపై నిషేదం
7.   వ్యక్తిగత, సమూహా లావాదేవీలలో వడ్డీ (రిబా )నిషేదించుట
8.   ఆదాయాన్ని నిల్వ చేయక దానిని పున: పంపిణీ చేయుట (జకాత్)
9.   సరియైన, పూర్తి సమాచారము తో ప్రజోపకరమైన పద్దతులను రూపొందించుట (formulation of public policies)
10. చేసుకొన్న అన్నీ ఒప్పందాలను,ఒడంబడికలను, వాగ్ధానాలను నెరవేర్చుట.
11.  అసహాయులు,బలహీనులకు పూర్తి రక్షణ,విలువ,ఆధారం కల్పించుట.

విశ్వ శాంతి :
          మానవ స్వభావము ఎల్లప్పుడు శాంతిని కోరును. యుద్దములను వ్యతిరేకించును. అణ్వాస్త్రాలు,జీవ రసాయినిక ఆయుధాలు ఉన్న ప్రస్తుత ప్రపంచంలో ప్రపంచ శాంతి భావన ఆదికమైనది. యుద్ధాన్ని,నివారించుటకు మూడు సూత్రాలు అవసరము.

1.    ప్రపంచం లోని అన్నీ ప్రభుత్వాలు ఆదరించే అంతర్జాతీయ న్యాయ సూత్రాల అమలు.
2.   వివిధ దేశాల మద్య సంబంధాలను క్రమబద్దం చేయుట.
3.   అంతర్జాతీయ రాజకీయ,ఆర్ధిక సమానత్వ సాధన. – అసమానత్వం ఉన్నపుడు ఘర్షణ,అంధోళన, వ్యతిరేకత ఉండును.
        
  పై మూడు రంగాలలో అబివృద్ధికి ప్రవక్త (స) సందేశాలు  ఉపకరించును. వాస్తవంగా అందరికన్నా ముందు ప్రవక్త ప్రవచనాల వెలుగులో ముస్లిం మేధావులు, విద్యా వేత్తలు,న్యాయవేత్తలు,అంతర్జాతీయ న్యాయ సూత్రాలను క్రోడీకరించిరి. ఆ తరువాతే పశ్చిమ దేశాల వారు ఈ రంగం లో ప్రవేశించినారు. ఒప్పందాలు, ప్రకటనలు వెలుగులోనికి వచ్చినాయి. ప్రస్తుత ప్రపంచానికి ప్రవక్త(స) భోదనల మీద ఆధారపడిన న్యాయసూత్రాలు ఎంతైనా అవసరము  ఉన్నాయి. అందరినీ ఒప్పించి,అందరినీ క్రమబద్ధం చేసే అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఈనాడు ఎంతో ఆవశ్యకం.

          ప్రపంచ శాంతిని కాపాడే ఐక్య రాజ్య సమితి తన నిర్మాణ లోపాలతో అన్నీ సబ్య దేశాల విశ్వాసంను పొందటంలో విఫలమైనది. అది తన న్యాయమైన,సరియైన తీర్మానాలను ఆమోదింపచేసుకోలేని, లేదా అమలు పరచలేని స్థితి లో ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రభావాత్మక,నిర్ణయాత్మక అంతర్జాతీయ సంస్థ అవశ్యకత ఈనాడు  ఎంతైనా ఉంది. ఈ విషయం లో అన్నీ ముస్లిం దేశాలు స్పందించవలసిన అవసరం ఉంది. రాజకీయ, ఆర్థిక, న్యాయాలను, జాతీయ-అంతర్జాతీయ దృష్టి కోణం నుంచి పరిశీలించవలయును.

           “ఇతరులమీద అధికారం చలాయించే వారు ముందు తమ  భాద్యతలను తెలుసుకోవాలి. పాలకుడు తన చేతలకు బాద్యత వహించవలయును. న్యాయాన్ని ప్రసాదించటం, న్యాయాన్ని సంరక్షించటం పాలకుని ప్రధాన విధి” అని ప్రవక్త (స)  పేర్కొన్నారు.

ప్రకృతి తో పోరాటం :
          ప్రకృతి-మానవుల మద్య సరియైన సమతౌల్యము ఉండవలయును. ప్రకృతిపై మానవుడు తాను  విజయం సాదించాను అని అనుకొంటాడు కానీ అది సరిఐనాది కాదు. దివ్య సందేశం ప్రకారం ప్రకృతి-మానవుల మద్య సరియైన సమతౌల్యం ఉండవలయును. రెండు దేవునిచే సృష్టించబడినవి. ప్రకృతి మానవుని అవసరాలను తీర్చుటకు రూపొందించబడినవి. మానవుడు దానిని అర్థం చేసుకొని సరియైన మార్గం లో ప్రకృతి ని ఉపయోగించుకోనవలయును. ప్రకృతి-మానవుని మద్య సరియైన సమతౌల్య సంబంధాన్ని(taskheer) ప్రవక్త(స)మానవాళికి సరియైన రూపం లో ఉపదేశించేను.

వనరుల పున: పంపిణీ
          దివ్య కొరాన్, హదీసుల వెలుగులో ప్రపంచంలోని వనరులను, ప్రపంచ మానవులందరి  మద్య సరిగా పంపిణీ చేయవలెనని ప్రవక్త(స) ఆదేశించేను. సమాజం లోని పేద,బలహీన వర్గాలకు ఉన్నత వర్గాల వారి సహకారం(జకాత్) లబించవలయును.అంతిమంగా ప్రపంచ సంపదను పున:పంపిణి చేసి, అందరికీ సమానంగా పంపిణీ జరిగే ఒక నూతన వ్యవస్థను స్థాపించి, మానవ శక్తి ని సంపూర్ణంగా అబివృద్ధి చేయవలే. ప్రవక్త (స) మక్కా నుండి మదీనా కు తరలినప్పుడు అనేక ముస్లింలు వారితో పాటు మదీనాకు విచ్చేసిరి. వారు మదీనాకు కొత్తవారు. ప్రవక్త సౌబ్రాతృత్వం (mawakhat)ను వారి మద్య పెంచేను. ఒక మదీనా వాసునికి , ఒక మక్కా వాసునితో సంభందం కలిపి ఇరువురిని సోదరులుగా కలిపిరి. ఇది ఆధాయ పున: పంపిణీకి ఒక చక్కని నిదర్శనము.

          ప్రస్తుత ప్రపంచం లోని సమస్యలను ప్రవక్త (స) ప్రవచనాల వెలుగు లో సమీక్షించిన,అన్నీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు లబించును. మానవ మహోపకారి, మహా ప్రవక్త (స) ఆధునిక సమాజానికి అసమాన మార్గదర్శకులుగా నిలిచిరి. అమీన్.    

No comments:

Post a Comment