12 December 2013

దివ్య కొరాన్, హదీసుల వెలుగులో మిమ్మలి మీరు తెలుసుకోండి!


“తమలోని స్వార్ధాన్ని విడనాడినవారే నిజమైన  విజయులు”


         సజీవుడైన ప్రతి వ్యక్తి కి మనస్తత్వ శాస్త్ర అవశ్యత ఉంది. సాదరణంగా మనం మనస్తత్వశాస్త్రం ఏమంత  ఆవశ్యక మైనది కాదు, అది కేవలం కామన్సెన్స్(commonsense) మాత్రమే అని అనుకొంటాము.కానీ మనస్తత్వ శాస్త్ర పరిచయం మీ జీవితాన్నివిప్లవాత్మకంగా  మార్చును లేదా మంచి ఆరోగ్యకరమైన జీవితం గడపటానికి తోడ్పడును.  ఆత్మహత్య చేసుకోవాలని అనుకొన్న అనేక మంది, కొరాన్, హదీసుల వెలుగులలో ఆ భావనను వదిలి పూర్ణ జీవితాన్ని జీవించటానికి నిర్ణయించు చుకొన్నారు, అంతే కాదు ఆరోగ్యకరమైన మానసిక ప్రశాంతత కల్గిన అర్థవంతమైన జీవితాన్నిఅనుభవిస్తున్నారు.ఇస్లాం ఆత్మ హత్య ను వ్యతిరేకించును.  సమాజ వ్యతిరేకులుగా, విచ్చలవిడిగాతిరుగుతూ ,మత్తు పదార్దాలను సేవిస్తూ అనైతిక తిరుగుళ్ళు తిరిగిన అనేక మంది ఇస్లాం ప్రభావంచే తమ గత పాప చీకటి జీవితానికి స్వస్తి చెప్పి మంచి మనుషులుగా , నమాజీలుగా, దైవ ఆరాదకులుగా మారిన వైనం మనం ప్రత్యక్షం గా చూసాము అందుకు ముందు మనం  ఆ “అల్లహౌతాలా” కు కృతజ్నతలు తెలుపవలసి ఉంది.  అలహామ్దులిల్లా. ముందు నిన్ను నీవు తెలుసుకోవటం ద్వారా నీ జీవితం లోని అన్నీ రంగాలలో మార్పు తేవచ్చు. ఇతరులకు మరింత దగ్గిర అవవచ్చును. భార్యపిల్లలతో సంతోషం గా గడప వచ్చును,పిల్లలను మరింత బాగుగా పెంచవచ్చును, స్నేహేతుతలతో, ఇంటా-బయట అందరితో హాయిగా, ఆహ్లాదకరమైన జీవితం గడప వచ్చును.

         మనస్తత్వ శాస్త్రాన్ని తెలుసుకోవడము ద్వారా మనం మన జీవితపు   నూతన అంచులకు చేర వచ్చును. నీకు ఏది ప్రేరణ కల్పించును,ఏది భయాలను, ఫోబియాలను దూరంచేయును, ఏది నీకు భరోసా నిచ్చునో తెలుసు కొవడము ఎంత అందంగా ఉంటుంది? ఒక సారి ఆలోచించండి1 ఉదా: బాల్యం లో మనం నిద్రలోనో, చీకటిగా ఉన్నప్పుడో, లేదా ఒంటరిగా ఉన్నప్పుడో భయం గా ఉందంటే, మన తల్లి అల్లాహ్ ని తలచుకో భయం పోతుంది అంటుంది. అల్లాగే ఒక్కసారి మనం మన మనసు ఎవిదంగా పనిచేయునో తెలుసుకొన్న తరువాత  విజయానికి కావలసిన ప్రణాళికలను మనకు మనమే రూపొందించుకోవచ్చును. అల్లాహ్ యందు నమ్మక ముంచిన విజయము లబించును కాబట్టి నిర్ణయము తీసుకొని అల్లాహ్ అందు పరి పూర్ణ విశ్వాసము ఉంచిన తప్పని సరిగా విజయము లబించును.
 తన అందు విశ్వసముంచిన వారిని అల్లాహ్ ప్రేమించును”- దివ్య కొరాన్ 3:160

         ముందు నిన్ను నీవు తెలుసుకోవటం ద్వారా తరువాత   ఇతరులను తెలుసుకోవచ్చును. ఉదా: స్వయంగా  ప్రేరణ పొందటము , శరీర బరువును తగ్గిచుకోవడము, చెడు అలవాట్లను వదిలివేయడము, ఇతరులను క్షమించదము, కోపాన్ని జయించడము, ప్రణాళికా బద్దం గా జీవించడం లాంటి వాటిని సాదించడము ద్వారా ఇతరులకు నీ పట్ల గల ఆలోచన  మారును.
“తమ పరిస్థితులను తాము మార్చుకొని ప్రజలను అల్లాహ్ కూడా మార్చలేదు” దివ్య కొరాన్ 8:35 

        
మనస్తత్వ శాస్త్ర సహాయం తో స్వయం ప్రేరణతో పాటు, జీవిత సవాళ్లను కూడా ఎదుర్కోవడం నేర్చుకోవాలీ లేనియడల అనేక సార్లు వత్తిడితో గుండెపోటులను ఎదుర్కొన వలసి ఉంటుంది. నీలో ఉండే అంతరగిక పలుకులను(inner talk) ఆలకిస్తూ, నకారాత్మక ఆలోచనలను దూరం చేసుకొనవలి ఉంటుంది. సంతోషం ఇతరులనుంచి రాదు, మనలోనించే పుట్టాలి. నిన్ను నేవు ప్రేమించక పోతే ఇతరులు నిన్ను ఎందుకు ప్రేమిస్తారు? ముందు మనకు మనమే నాయకులం, ఆ తరువాతే ఇతరులకు నాయకులము. నిన్ను నీవు ప్రేమిస్తే, ఇతరులను కూడా ప్రేమించగలవు,వారితో సంతోషం గా కలిసి జీవించగలవు.
"అల్లాహ్ తను కోరిన వారికి దివ్యా జ్ఞానం ప్రసాదిస్తాడు. ఎవరికి దివ్యా జ్ఞానం లబించునో, వాస్తవంగా వారికి మహాభాగ్యం లబించినట్లే " దివ్యా కొరాన్ 2:269

         మనము సంతోషం గా ఉంటే దాన్ని మొదట గమనించేది మన కుటుంబము, మన స్నేహితులు. అప్పుడు వారితో నీ సంబంధ బాంధవ్యాలు మెరుగవును. మనలోని తప్పులను మనం గమనించి సరిదిద్దుకొన్న ఇతరులకు ఫిర్యాదు చేసే అవకాశమే లేదు. ఇతరుల దృష్టిలో మంచివానిగా, సహనశీలిగా,గౌరవనీయుడుగా పరిగణించబడతాము.ఇతరుల తప్పులను సహించటం అలవాటైన, మన ఆలోచనల లో సకారాత్మకమైన  మార్పు (positive thinking) వచ్చును. ఈ రకమైన మన ప్రవర్తన, మన స్నేహితులతో  , మన కుటుంబంతో  అత్యంత అవసరం. ఇతరులను మనస్ఫూర్తిగా ప్రేమించటం,ఇతరుల పట్ల  కరుణ చూపుటం , ఇతరుల తప్పులను క్షమించుటం  మంచితనమునకు, మంచి మాటలకు, తగాదాలను  దూరముచేయుటకు తోడ్పడును . నీ  కుటుంబ జీవితమును ఆహ్లాద పరుచును.
"దయతో కూడిన మాటలు, ఇతరుల తప్పులను క్షమించుట సదాకా (దానం) కన్నా మిన్న" -దివ్యా కొరాన్ 2:263
                   
          మనస్తత్వ శాస్త్ర సహాయం తో మన కుటుంబ  జీవితాన్ని మెరుగు పరచుకొన్నమనకు శాంతి, ప్రశాంతత, సంతోషం లబించి మన జీవితం సుఖంగా సాగును . అది  మన  కుటుంబ జీవితాన్ని కాపాడును. భార్యతో సత్సంభందాలు లేక పోవటం పిల్లలపై ప్రభావం కలుగ చేయును. వారి పెంపకం సరిగా సాగదూ. కాబట్టి మనము మనస్తత్వ శాస్త్ర సహాయాన్ని పొందుతూ, ప్రవక్త (స) జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని  మంచి తల్లి తండ్రులుగా మన బాద్యతలను నెరవేర్చవచ్చును. తన భార్యలతో, తన బిడ్డలతో, తన మనుమండ్ల లతో ప్రవక్త ఆదర్శ ప్రవర్తన మనకు సదా అనుసరణీయము.
"మీకు తెలియకపోతే జ్ఞాపిక కలవారిని అడగండి" -దివ్య కొరాన్ 16:43

         ఇస్లాం వెలుగులో, దివ్య కొరాన్ ప్రవచనాలతో,  ప్రవక్త భోదనలతో, మనస్తత్వ శాస్త్ర సహాయంతో మనం మంచి తల్లితండ్రులుగా మార వచ్చును. స్నేహితులతో, కుటుంబ వ్యక్తులతో సంబంధాలను మెరుగు పరచుకోవచ్చును.  ఇతరులకు చేరువ కావచ్చును, ఇతరులచే ప్రేమించబడ వచ్చును. చిన్న,చిన్న మెళుకువల ద్వారా, అల్లాహ్ యందు  సంపూర్ణ నమ్మకముంచుట ద్వారా పెద్ద విజయాలు సాదించ వచ్చును.  అమీన్.    
 




No comments:

Post a Comment