ప్రపంచానికి ఇస్లాం అందించిన అతి
విలువైన కానుక ఇస్లాం ను ప్రపంచానికి పరిచయం చేయడమే అని ఒక చరిత్ర కారుని అభి ప్రాయం(Ira Zepp) . 8నుంచి 13 శతాబ్ధాల మద్య కాలం లో
ముస్లిం సామ్రాజ్యం ఉత్తర ఆఫ్రికా, మద్య ప్రాచ్యం, మద్య ఆసియా,స్పెయిన్ నుంచి చైనా సరిహద్దులవరకు
విస్తరించినది. ఈ ప్రాంతలన్నీ ఇస్లాం చే ఏకీకృతం కాబడి,
ప్రేరణ పొంది, బిన్న జాతులు కలగలసిన ఒక నూతన ముస్లిం ప్రపంచాన్ని ఏర్పరిచినవి. అరబ్బులు,ఆఫ్ఘన్లు,ఆర్మీనియన్లు,బర్బరులు,ఈజిప్టు వారు,భారతీయులు,
పర్షియా వారు, స్పెయిన్ వారు, టర్కులు,క్రైస్తవులు,యూదులు,
అగ్నియారాధకులు అందరూ ఆ సమాజం లో సబ్యులే. బిన్న సంస్కృతులు కల గలసిన ఆ సమాజం
వర్ధిల్లి, అనేక రంగాలలో అద్భుత విజయాలను సాదించినది.
ఆధునిక కాలం లో ఆంగ్లము లాగా, మద్య యుగాలలో లాటిన్ లాగా మద్య యుగాలలో
అరబ్బీ ముస్లిం సామ్రాజ్య అధికార భాష అయినది. వర్తకము,వాణిజ్యము,దౌత్య సంబంధాలు,
విజ్ఞాన శాస్త్రాలు అన్నీ అరబ్బీబాష లోనే
నిర్వహించబడేవి. మద్య యుగ ముస్లిం ప్రపంచానికి,రాజధానిగా మరియు సాంస్కృతిక ప్రముఖ కేంద్రంగా, విద్యా కేంద్రం,గ్రంధాలయము,మ్యూజియం,ఖగోళ పరిశోదనా శాల,అనువాద కేంద్రం ఐనా
బైత్-అల్-హిక్మ్ (జ్ఞాన కేంద్రం ) గా బాగ్దాద్
విరాజిల్లినది. క్రీస్తుకు పూర్వం 3 వ శతాబ్దం లో స్థాపించబడిన ఈజిప్ట్ లోని అలెక్సాండ్రియా గ్రంధాలయము తరువాత క్రీస్తుశకం
830 లో విద్యావంతుడైన ఖలీఫా మమౌన్ చే
బాగ్దాద్ లో స్థాపంచబడిన బైత్-అల్-హిక్మ్ (జ్ఞాన కేంద్రం) అంత ప్రసిద్ది పొందినది.
ఉత్తర ఐరోపా, ముస్లిం మరియు అరబ్ ప్రపంచములోని ప్రముఖనగరాలైన, డెమాస్కుస్,అలెక్సాండ్రీయ,ఫేజ్,కార్దోభా,పాలేర్మో లోని లోని గ్రంధాలయాలు,యూనివర్సిటి
ల కన్నా బాగ్దాద్ లోని బైత్-అల్-హిక్మ్ (జ్ఞాన కేంద్రం )బాగా అభివృద్ధి చెందినది.
కార్ధోభా లోని 70 గ్రంధాలయాలలో దాదాపు 7లక్షల పుస్తకాలను సేకరించటము జరిగినది. (Arab World
Studies Notebook, page 273)
పాశ్చ్యాత్య సంస్కృతికి ముస్లింలు
లేదా అరబ్బులు చేసిన అతి గొప్ప సేవ ప్రాచీన జ్ఞాన సంపదను సేకరించి, బద్ర పరిచి దానిని పడమటి
దేశాలకు అందించటముగా చెప్ప వచ్చును. బాగ్దాద్ లోని బైత్-అల్-హిక్మ్ (జ్ఞాన కేంద్రం
)లో వందలాది ప్రాచీన గ్రీక్,పెర్సియన్,సంస్కృత,సిరియాక్ బాషలలోని గ్రంధాలను సేకరించి వాటన్నిటిని అరబ్బీ లోకి అనువదించడము జరిగినది . ఆ ప్రాచీన గ్రంధములను
సేకరించి, బద్రపరచక పోతే ప్రపంచము ఎంతో నష్ట పోయేది. (Phillip
Hitti, the History of the Arabs. N.Y.: St. Martin's Press) కొన్ని సంధర్భాలలో అరబిక్ అనువాదాలే మిగిలినివి ఉదా: గాలెన్ అనాటమికల్ ప్రొసీజర్స్ మరియు కొన్ని చోట్ల లాటిన్ మూలాల కన్నా
అరబ్బీ అనువాదాలే మిన్నగా ఉన్నాయి.
ఫ్రాక్,పశ్చిమ సంస్కృతులకు ఇస్లాం
అందించిన విలువైన కానుకలు :
Ø
ముస్లిం సామ్రాజ్యం లోని సారవంతమైన సేద్యపూ భూములలో
సేద్యానికి ముస్లిం రైతులు అనుసరించిన
నీటిపారుదల సౌకర్యాలను ఆతరువాత యూరోపియన్ రైతులు కూడా అనుసరించటం జరిగినది.
Ø
ప్రపంచము లో వివిద ప్రాంతాల మ్యాపుల చిత్రణలో
నిపుణులైన అరబ్బుల మ్యాపులు, యూరోపియన్ల మ్యాపుల(Maps) కన్నా ఖత్చితము గా ఉండేడివి.
Ø
యూరప్ కు కాగితంను పరిచయం చేసినది అరబ్బులే.
Ø
హనన్-ఇబ్న్-ఇశాక్ రచించిన కంటి పై 10
వ్యాసాలు (Book of the Ten Treatises on the
Eye by Hanayn ibn Ishāq), అనామిటికల్ ప్లేట్ ను
వివరించే 9 వ శతాబ్దపు పర్షియా కు చెందిన వైద్య గ్రంధం రచించినది ముస్లింలే .
Ø
గోతిక్ కట్టడాలలో కన్పించే పాయింటెడ్ ఆర్చ్ (pointed Arch)ను పరిచయం చేసినది అరబ్బులు మరియు ముస్లింలే.
Ø
ముస్లిం మసీదులు,భవనాలు, నిర్మాణాలలో కన్పించే వాల్టెడ్ సిలింగులు, ఫోల్డ్ కానీ ఆర్కేడ్లు, ఎంతో ఎత్తైన డోములు
ముస్లింల కళాకౌశల్యాన్ని చాటతాయి.
Ø
ఇస్లాం ప్రభావంతో అరబ్బులు ఆభరణాల తయారీలోను,దారువు(చెక్క)పై చెక్కడంలోను,నేతనేయడంలోను,దామాస్క్(DAMASK),ముద్రణలోను,చర్మకృతులతయారీలోను,లోహ పని లోను ప్రసిద్ది చెందినారు.
Ø
గడియారపు లోలకం రూపొందినలోను, అయస్కాంత కంపాసు తయారీలోను,అస్త్రలాబ్ (astrolabe) తయారీలోను ఖ్యాతి గడించారు
Ø
ప్రత్యేక బరువులు కొలిచే మరియు మూలకాల
గ్రావిటీలను అత్యంత ఖచ్చితంగా కొలిచే ప్రత్యేక పరికరాలను తయారు చేసినది అరబ్బులే.
Ø
20 వ శతాబ్ధం లో నిర్మించిన నైల్ నది పై ఆశ్వాన్ వద్ద ఆనకట్ట
కట్టడంను మద్య యుగాలలోనే పశ్చిమ దేశాల
వారిచే అల్హజెన్ గా పిలువబడే, ఇబ్నఅల్-హేతం (1039 లో మరణం)
సూచించినాడు. ఆప్టిక్స్(optics) పితామహునిగా అతనిని
పేర్కొంటము జరిగుతుంది.
Ø
హిందువుల నుంచి అరబ్బులు నేర్చుకొన్న సరళమైన, తేలికైన అరబిక్ అంకెలు లేక పోతే దశాంశ పద్దతి,
శూన్యస్థానము (zero)సాద్యపడేది కాదు,పశ్చిమ
దేశాల విజ్ఞాన శాస్త్రం ఇంతగా అబివృద్ధి చెండేది కాదు.
Ø
ఇరేషనల్ సంఖ్యలు, ఆల్జీబ్రా,అనలటికల్ జామెన్ట్రీ,సాధారణ మరియు స్ఫెరికల్ ట్రిజ్ఞామెంటరీ, కాలాన్ని
కొలిచే లెక్కలను అరబ్బులు, ముస్లిం లు సృష్టించిరి.
Ø తెలియని పరిమాణాన్ని సూచించే ఎక్స్ (X) ను సూచించినది ఆరబ్బులు
మరియు ముస్లింలే.
Ø అరబ్బీ లో అతిప్రాచీన అంతరిక్ష పట్టికలను,అర్థమేటిక్,ఆల్జీబ్రా ను తయారు చేసినది
పర్షియా దేశస్తుడు ముహమ్మద్ ఇబ్న్- మూసఅల్ –ఖవార్ రిజ్మీ (780-850)
Ø అల్ –ఖవార్ రిజ్మీపేరుమీదగానే అర్థమేటిక్, అల్-జబ్ర్
పేరుమీద ఆల్జీబ్రా (ఆరబ్బీ లో విరిగిన ముక్కలను అతికించుట అని అర్థము)రూపొందినవి.
Ø లాటిన్ అంకెల స్థానంలో లెక్కించటానికి
ఉపయోగ పడే హిందూ-అరబిక్ అంకెలను మొదట ప్రయోగించినది అల్ –ఖవార్ రిజ్మీ.
Ø 11 లేదా 12 శతాబ్ధంలో జరిగిన క్రూసేడులు యూరప్ కు గాయాలను మాన్పుటకు ఉపయోగపడే మందులను పరిచయం చేసినవి.వాటిని వారు
అరబ్బు హకీంల నుండి గ్రహించిరి.
Ø మానవ శరీర నిర్మాణాన్నిసరిగా అర్థం
చేసుకొని వైద్యాన్ని ఒక అద్భుత శాస్త్రం
గా రూపొందించిన జ్ఞాన వంతులు అరబ్ హకీంలు
(వైద్యులు)
ముస్లింలు క్రింధి వాటిలో ప్రధములు
Ø
గ్రామీణ ప్రాంతాలలో,కారాగారలలో,ఇంటివద్ద,
ఆసుపత్ర్లలో రోగులకు వైద్యం చేయటానికి డాక్టర్లను నియమించి పబ్లిక్ హెల్త్
సర్వీసులను మొదట ప్రారంబించినారు.
Ø
సర్జరీ లో మత్తుమందు ని మొదట
వినియోగించినారు.
Ø
గాయాలకు మొదట కుట్లు వేయడం ప్రారంబించివారు
ముస్లింలే
Ø
గాలి, అంటుకోవడం ద్వారా అంటురోగాలు
వ్యాపించునని తొలుత కనిపెట్టినారు.
Ø
కుష్టు రోగులకు, బడిరులకు, అంధులకు ప్రత్యేక వైద్యశాలలు
ప్రారంభించిరి.
Ø
జ్వరం అనునది శరీరం రోగాన్ని ఎదురుకోవటం కోసం చేసే
పోరాటం అని మొదట చెప్పినారు.
Ø
ఒంటెలపై సంచార వైద్యశాలలు ప్రారంభించినారు.
Ø
మెడిసన్ నుంచి ఔషద శాస్త్రాన్ని, మందుల చీటి వ్రాయుటను వేరు చేసినారు.
ముస్లింల
ముఖ్య ఫిజిషియన్ గా పిలవబడిన అబు బాకర్ మొహమాద్ అల్ రాజీ (865-925) మశూచికం తో సహ
100 కు పైగా వైద్య అంశాలపై శాస్త్రీయ
రచనలు చేసినాడు. అతని రచనల సంపుటము(సంపూర్ణ వైద్య విజ్ఞానము) 1279 లో అరబ్బి నుంచి
లాటిన్ లోనికి అనువదింపబడి 1542 లో అంటే అతను చని పోయినతరువాత సుమారు 700
సం.లకు వెన్నిసు లో ముద్రించబడినది.
పడమటి దేశాల వారిచే అవిసెన్నా గా
పిలవబడే తొలి సాంస్కృతియోద్యమ కాలానికి చెందిన అబూ అలీ అల్-హుసైన్ ఇబ్న్ సీనా
తత్వశాస్త్ర,కవిత్వం,దౌత్యనీతి,ఔషద శాస్త్రం, సహజ శాస్త్రాలలో ప్రముఖుడు. ఇతను 17
సం.ల వయస్సు లోనే వైద్యునిగా నియమించబడి యూరప్ మరియు అరబ్ ప్రపంచంలో అసమాన కీర్తి
ప్రతిష్టలను సాదించి, గ్రీక్,అరబిక్,హిందూ,పెర్షియా వైద్య పద్దతులపై అరబ్బీ లో ఒక
మెడికల్ ఎన్సైక్లోపీడియా ను రూపొందించినాడు.
ఇబ్న్-సీనా రచించిన “కనున్” గ్రంథము
అన్నీ శారీరిక,మానసిక రోగాలను, వాటిని నయం చేసే పద్దతులను, మందులను, అప్పట్లో ప్రచారంలో ఉన్న 700 రకాల ఔషదాలను
గురించి వివరించినది. కనున్ గ్రంధము
లాటిన్ బాష లో 30 సార్లు , హిబ్రూ లో అనేకసార్లు ముద్రించబడి500
సం. లకు పైగా పాచ్యాశ్చుల ప్రాధమిక వైద్య
పాట్యపుస్తకము గా ఉంది.
సాంస్కృతియోద్యమ కాలానికి చెందిన మరొక ప్రముఖుడు 12 వ శతాబ్ధానికి చెందిన అరబ్
ముస్లిం ఐన ఇబ్న్-రషీద్ (ఆవిర్రోస్) ప్రముఖ తత్వవేత్త,ఖగోళ పరిశోధకుడు,మరియు ఆస్థాన వైద్యుడు. ఇబ్న్-రషీద్
(ఆవిర్రోస్) క్రైస్తవ మతశాస్త్రాన్నిప్రభావితం చేసి,
ఇస్లామిక్ సంస్కృతి లో భాగమైన విశ్వాసము మరియు హేతువు ను క్రైస్తవం అంగీకరించేటట్లు చేసినాడు.
ఆధునిక చరిత్ర, సామాజిక శాస్త్రాలకు పితామహుడైన ఇబ్న్-ఖల్దున్(1332-1406) రాజనీతిశాస్త్రము, అర్థశాస్త్రము,మానవ శాస్త్రము లలో కూడా ప్రముఖుడు. ఇతడు అరిస్టాటల్ పద్దతులను ఉపయోగించి
ఘటనల యొక్క కారణములను,పద్ధతులను “అల్-మూకద్దమహ్” లో
వివరించినాడు, ఈ వివరణలో సమాజ ఉద్ధాన,పతనాలను
వివరించే సాంస్కృతి శాస్త్రాన్ని అబివృద్ది చేసినాడు. సామాజిక కట్టుబాట్లు,ఆహారం, వాతావరణము,ఆర్థిక పరిస్థితులు, మతము మొదలగు అనేక అంశాలపై ఆధారపడి సంఘటనలు జరుగునని వివిరించినాడు. ఇబ్న్-ఖల్దున్
సమాజ స్వభావం,శ్రామికుల పరిస్థితులు,విద్యా
పద్దతులపై సంపూర్ణంగా పరిశోధించినాడు.
ఖగోళ శాస్త్ర పరిశోధనలో ఉపకరించే కంపాసు,క్వాడ్రంట్,సెక్స్తంట్ మరియు అస్టోలబ్, జాగ్రఫీ లో ఉపయోగించే ముఖ్య మైన పటాలుఐనా అల్-ఇద్రీస్(1150సం.) యొక్క
యూరప్,ఆసియా, ఆఫ్రికా పటములు (maps), మరియు ప్రముఖ
పర్యటకుడు 30 సం.లలో 75,000 మైళ్లు పర్యటించిన ఐనా ఇబ్న్-బట్టుటా(1304-1337), ఆఫ్రికా పై నిపుణుడు గా యూరప్ లో ఖ్యాతిగడించి లియో-ఆఫ్రికానుస్ గా పిలవబడే హాసన్ అల్ వజ్జన్ వీరందరూ అరబ్ ముస్లింలే. వీరు కనిపెట్టిన
ఆస్ట్రోలాబే నేటికీ నిలిచి ఉంది.
పడమటి దేశాలకు అరబ్బులు ముస్లింలు పరిచయము
చేసిన ఆహార పదార్ధాలు-పండ్లు
ఆఫ్రికోట్స్,ఆర్టిచోకేస్(artichokes),ఆస్పరాగస్,అరటిపండ్లు,బక్వీట్(buckwheat),చెర్రీలు,ఖర్జూరాలు,ఎగ్ ప్లాంట్స్అల్లం,ద్రాక్ష,నిమ్మ,కమలాలు,బత్తాయి,దానిమ్మ,క్విన్సెస్(quinces),బియ్యం,స్పినాచ్,స్ట్రాబెర్రిలు,
పంచదార,ఫిగ్స్ మొదలగునవి.
అరబ్బీ నుంచి
ఇంగ్లీష్ లోకి ప్రవేశించిన పదాలు:
Admiral,
adobe, alchemy, alcove, alfalfa, algebra, algorism, alkali, almanac, arsenal,
atlas, average ,azure baroque ,barracks
, Caliber ,candy ,cane, carafe, check ,check-mate, cipher (sifr=zero) ,coffee cotton ,Crimson Damask, elixir, gauze, gypsum, hazard Jar, jasmine, lute Macabre, magazine, magnet, marzipan,
mattress, nadir Racquet, saffron, sash,
satin, sherbet, sugar, sumac Syrup,
tambourine, tariff, traffic, zenith, zero
అడ్మిరల్,అడోబ్,ఆల్కెమి,అల్కోవ్,అల్ఫాల్ఫా,ఆల్జీబ్రా,అల్గొరిసమ్,ఆల్కలి,అల్మానాక్,ఆర్సీనల్,అట్లాస్
యావరేజ్,అజుర్,బారోకు,బ్యారాక్స్,కాలిబార్,క్యాండి,కెన్,కారఫి,చీక్,చెక్మెట్,సైఫర్(సిఫర్ జీరో ) కాఫీ,కాటన్,క్రిమిసన్,దామాస్క్,ఎలిక్సర్,గేజ్,జిప్సం,యజర్డ్జార్.జాస్మిన్,మ్యాగజైన్,మ్యాగ్నెట్,మ్యాట్రెస్,ట్రాఫిక్,జీరో,షుగర్,జెనీత్, జీరో మొదలగునవి.
ఇస్లాం పై ప్రముఖ
ఆంగ్ల గ్రంధాలు:
1.
The Meaning of Holy Quran: Abdulah Yousaf
Ali
2.
The Glorious Quran: M. M.Picktal
3.
Dictionary of Islam: T.P.Hughes
4.
Islam a short History : Karen ArmStrong
5.
The Oxford History
of Islam: John L. Esposito (editor)
6.
Islam- The Straight
Path; John L. Esposito
7.
Understanding Islam.
An Introduction to the Muslim World: Thomas
W. Lippman
8.
The World of Islam:
Faith, People, Culture: Bernard Lewis (editor)
9.
A Concise
Encyclopedia of Islam: Cyril Glassé.
.
No comments:
Post a Comment