1 April 2014

ఎన్నికల వేళ భారత ప్రజాస్వామ్యం లో మతతత్వ-సెక్యులర్ శక్తుల మద్య చర్చ/పోరాటం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత ప్రజాస్వామ్యం లో సేక్యులర్ -మతతత్వ శక్తుల మద్య చర్చపోరాటం  ప్రారంభము అయినది. వామపక్షాలు,ప్రాంతీయ పార్టీలు,కాంగ్రెస్స్ లాంటి పక్షాలు మతతత్వ శక్తులను దూరంగా పెట్టమని, దేశ సెక్యులర్ లక్షణాన్ని కాపాడమని వోటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాయి. మరోకవైపు బి‌జే‌పి, సంఘ పరివార్ ముస్లింల బుజ్జగింపును ఆపమని,వోట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడవద్దని, అందరి అబివృద్ధి, అందరికీ విద్య,అందరికీ ఉపాధి పై దృష్టి పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాయి. అందరికీ న్యాయం, కొoదరికి బుజ్జగింపు వద్దు,లేదా “సబ్ కా సాత్-సబ్ కా వికాస్”అనే నినాదాలను ఇస్తున్నాయి.
సచార్ నివేదిక వెలుబడిన తరువాత ముస్లింలు దేశ ఆర్ధిక,విద్యా రంగాలలో వెనుకబడిఉన్నారని  కొన్ని సంధార్భాలలో దళితులకన్నా ముస్లింలు అనేక రంగాలలో వెనుకబడిఉన్నారన్న వాస్తవము ముందుకు వచ్చినది. దీనిని సమర్దించే అనేక గణాంకాలు కూడా వెలుబడినవి. ఇలాంటి పరిస్థితులలో ముస్లింలకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని వారిని ఓ‌బి‌సి క్యాటగిరి లో చేర్చి రిజర్వేషన్లను కల్పించాలనే(అవసరమైన  మతపరమైన రిజర్వేషన్లను కల్పించిఐనసరే) డిమాండ్ బలపడింది.రాజస్తాన్ లోని జాట్లను,రాజపుత్రలను ఓ‌బి‌సి లుగామరియు గుజ్జర్లనుఎస్‌టి లుగా పరిగణించాలనే డిమాండ్ బలంగా ఉన్నప్పుడూ దేశ జనాభా లో 15% ఉన్న ముస్లింలకు దేశ సంపదలో వారికి రావలసిన భాగాన్ని(రిజర్వేషన్లను)  నిరాకరించడం అవివేకం అవుతుంది.  ఒకవేళ మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగం ఆమోదించని యెడల సామాజిక పరిస్థితుల దృష్ట్యా ముస్లింలకు ప్రత్యేక అవకాశాలను కల్పించవలసిన అవసరంఎంతైనా ఉంది. కొన్ని సందర్భాలలో రాజ్యాంగ న్యాయం కన్నా సామాజిక న్యాయాన్ని కూడా లెక్కలోనికి తీసుకోవలసి ఉంటుంది.
మెరిట్,సమర్ధత, సమాన అవకాశాల సాధన కొరకే రిజర్వేషన్లను 50% కు పరిమితం చేయడం జరిగింది అంతే కానీ అంతకన్నా సహేతుకమైన భావన వేరే ఏమీలేదు.అదేవిధంగా ముస్లింలకే కాదు, ఎస్‌సి/ఎస్‌టి/ఓ‌బి‌సి లకు ప్రత్యేక అవకాశాలు వోట్ బ్యాంక్ రాజకీయాలకు మూలమన్న వాదన మొదటినుంచి ఉంది.  ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించడం మైనారిటీ లను బుజ్జగించడం అని ,ఎస్‌సి/ఎస్‌టి/ఓ‌బి‌సి లకు రిజర్వేషన్లను కల్పించడం కుల తత్వాన్ని పెంచుతుందని కొందరి భావన.
రిజర్వేషన్లు సమాజం లో విభజనకు కాక , ముందుగానే విభజింపబడిన సమాజంలోని కొన్ని వర్గాలకు రక్షణ కల్పించటానికి తోడ్పడును. ముస్లింలకు,దళితులకు రేజర్వేషన్లు కల్పించడం వోట్ బ్యాంక్ రాజకీయం అనడం  సమాజం లోని ఉన్నత వర్గాలవారు వ్యాప్తి చేస్తున్న ఒక నిరాధారభావన మాత్రమే. నిజానికి ఉన్నత కులాలు,వర్గాలవారే వోట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. లేని ఎడల బి‌జే‌పి పట్టణాలలోని ఉన్నత కులాల హిందువులలో ఏవిధంగా తన పట్టును సాధించగలుగు తుంది? మీరు గమనించిన ఉన్నత కులాల వారే తమ వొట్లను మూకుమ్ముడిగా  ఒకే అబ్యర్ధి కి/ఒకే పార్టీ కి  వేయటం జరుగుతుంది
సెక్యులర్-మతతత్వ శక్తుల మద్య వివాదం మనదేశానికే కాదు ఎల్లలను దాటి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించినది. యూరప్ లోని ఒక దేశం లో నివసించే బిన్న జాతి/సంస్కృతి కల ప్రజలు ముఖ్యంగా ముస్లింలు మెజారిటీ జాతి/సంస్కతి  పట్ల విధేయతను, మెజారిటీ సంస్కృతిని అలవర్చుకోవలసిఉంటుంధి. క్రమంగా యూరప్  బిన్న సంస్కృతుల మద్య చర్చలను ప్రోత్సహించటానికి బహుళ సంస్కృతి విధానం(multiculturalism) నుంచి బహుత్వం (pluralism) కు మారుతుంది. అదేవిదంగా భారత దేశం లో కూడా ముఖ్యం గా మత సంబంధమైన అల్పసంఖ్యాకులతో (ముస్లింలతో )చర్చలకు అనకూల వాతావరణము ఏర్పరచవలసి ఉంటుంది. వారి భావనలను ఆలకించవలసి ఉంటుంది.ముస్లింల సమస్యలతో పాటు సమాజం లోని బిన్న వర్గాల సమస్యలను మెజారిటీ వర్గం ఆలకించవలసి ఉంటుంది.
క్రమంగా భారత దేశంలోని మతశక్తులు తమ రూపురేఖలను మార్చుకొంటున్నాయి.కులతత్వం భాగా పెరిగిపోతుంది,కులము ఒక నిచ్చెన లాగా ఉంది పైన పీడితుడు క్రింద పీడితులు ఉంటున్నారు. కులతత్వం బాగా వృద్ధిచెంది నిచ్చెన లోని  కింద్రి మెట్ల పై ఉన్న పీడితులను ఇంకా పీడించడము జరుగుతుంది.ఆగ్ర కులాలవారు దళితులను అవకాశ వాదులుగాను ముస్లింలను ఇతరులుగా,బయటవారుగా,తీవ్రవాదులుగా  చిత్రీకరించడము జరుగు తుంది. బహాజన సమాజము నిర్మించడంలో విఫలము చెందడం భారత దేశ సెక్యులర్ తత్వానికి ఒక అడ్డంకి గా తయారు అయినది.ముస్లింలు కోరుకొనే వాంఛించే సమ న్యాయం అనే భావనను తిరిగి వారిపైకే ప్రయోగించి అందరి అబివృద్ధి, అందరికీ విద్య,అందరికీ ఉపాధి,అందరికీ న్యాయం, “సబ్ కా సాత్-సబ్ కా వికాస్”అనే నినాదాలను ఇస్తున్నారు. దీనిని లౌకిక శక్తులు గమనించాలి,జాగ్రత పడాలి.


























No comments:

Post a Comment