2014 నాటికి ప్రపంచ
జనాభా 715 కోట్లు ఉంది
.
ఇందులో
క్రైస్తవులు 31.6% ముస్లింలు 23%హిందువులు 15% బౌద్ధులు 7%ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా
క్రైస్తవులు దాదాపు 210 కోట్లమంది,ముస్లింలు
160 కోట్ల మంది , హిందువులు 100 కోట్లమంది,బౌద్దులు 37 కోట్ల మందిఉన్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 830 కోట్ల నుంచి 1090 కోట్ల కు చేరవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా
దాదాపు అన్నీ దేశాలలోనూ,అన్నిఖండాలలోనూ విస్తరించి ఉన్న ముస్లింల గురించి వారి ఆచారాలు,అలవాట్లు,సాంప్రదాయాలను గురించి అనేక దురభిప్రాయాలు/అపోహలు/అపార్ధాలు/అపనమ్మకాలు సమాజం లో
ఉన్నాయి.
ఈ మద్య పశ్చిమ
దేశాలకు సంబందించిన ఒక సాoప్రదాయకవాది మాట్లాడుతూ ప్రపంచ ముస్లింలలో పది శాతం మంది తీవ్రవాదులే
అన్నాడు. ఇది ఎంత హాస్యాస్పదం,అనాలోచిత ప్రకటన! ఒక వేళ
ముస్లింలలో 10% మండి తీవ్రవాదులు అయితే, ప్రపంచవ్యాప్తం
గా వారి జనాభా దాదాపు 16 కోట్లు ఉంటుంది? ఇంతమంది తీవ్రవాదులను ప్రపంచం
భరించగలుగుతుందా!
ఈ లాంటి భాద్యత రహిత,అవాస్తవ ప్రకటనలను అందరూ ఖండించాలి. అసలు తీవ్ర వాదానికి మతంతో
సంబంధంలేదు. ఏమతం తీవ్రవాదాన్ని ప్రోత్సహించదు. ఇస్లాం అనగా శాంతి అని అర్ధం.
శాంతి, కరుణా,పరమత సహనంలను
ప్రోత్సహించేదే ఇస్లాం.
ఇస్లాం పై
గల అపోహలు –వాటి కి వివరణలు
ఒక అపోహ
ముస్లిం స్త్రీలందరు బుర్ఖా (VEIL)/హిజాబ్ ధరిస్తారు.
పశ్చిమ దేశాల వారికి ముస్లిం స్త్రీ అనగానే భూర్ఖా ధరించిన స్త్రీ
గుర్తుకు వస్తుంది. ఇస్లాం లో భూరఖా ధారణ తప్పనిసరి కాదు అది ఒక సంప్రధాయము/అలవాటు/ఆచారం మాత్రమే.అది ప్రాంతాన్నిబట్టి,పరిపాలన
బట్టి ఉంటుంది. ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు భారఖా ధారణను తప్పని సరి చేశాయి కానీ ప్రపంచ
ముస్లిం జనాభాలో ఈ దేశాల ముస్లిం జనాభా 5% మాత్రమే.చాలా ముస్లిం దేశాలలో భూరఖా
దరించే వారి కన్నా దరించని వారే ఎక్కువ. ఈ మద్య ఫ్రాన్స్ లో భూరఖా ను
నిషేదించినట్లు వార్తలు వచ్చాయి నిజానికి ఫ్రాన్స్ లో ముస్లిం జనాభా 37 లక్షల మంది
ఉండగా వారిలో భూరఖా దరించేవారు ఫ్రెంచ్ పోలీసుల లెక్కల ప్రకారం 367 మాత్రమే .బెల్జియం లో 5లక్షల మండి ముస్లింలు ఉండగా వారిలో కొన్ని డజన్ల మంది
మాత్రమే భూరఖా దరిస్తారు. అలాగే భారత దేశం లోని/భారత ఉపఖండం లోని స్త్రీలలో అధికులు మతం తో సంబంధం లేకుండా తలపై కొంగు కప్పు కొంటారు. అది అక్కడి ఆచారం. ఇంకొక
విషయం ప్రపంచం లో ముస్లింలు అధికంగా ఉన్న 5 దేశాలలో 4 దేశాలలో స్త్రీలు
దేశాద్యక్షురాలు/ప్రధాని పదవిని అదిష్టించినారు. (ఇండోనేషియా,పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ,కొసోవో,కిర్గిస్థాన్, సెనెగల్
)
ఇంకొక అపోహ
అమెరికన్లు మొదటి నుంచి ముస్లింలను ద్వేషిస్తారు.
ఇది ఒక తప్పుడు అబిప్రాయం,అవాస్తవము. వాస్తవానికి అమెరికా మొదటినుంచి ఇస్లాం
ను ఆదరించినది. అమెరికా అద్యక్షుడు ఐనా థామస్ జఫర్సన్ స్వయంగా అరబ్బీ నేర్చుకొని
దివ్య ఖురాన్ చదివే వాడు. వైట్ హౌస్ లో రమాదాన్ ఇఫ్త్తార్ విందు ఇచ్చినాడు.
జఫర్సన్ ప్రపంచంలోని అన్నీ మతాల పండుగలను ఆదరించేవాడు. జాన్ ఆడం ప్రవక్త మహమ్మద్
(స) ను “గొప్ప సత్యాన్వేషకునిగా” భావించాడు. క్రైస్తవభిమాని ఐనా బెంజమిన్ రూష్
బైబిల్ తో పాటు కన్ఫిషియస్,మహమ్మద్ ప్రవక్త భోదనలను
యువకులు/విద్యార్ధులు అద్యయనం చేయాలని
అనేవాడు.జార్జ్ వాషింగ్టన్ మౌంట్ వెర్నోన్ లో తనతో కలసి పనిచేయమని ముస్లింలను
స్వయంగా ఆహ్వానించినాడు. అమెరికా అంతర్యుద్ధం లో సలీం పూర్ లాంటి అనేకమంది
ముస్లింలు పాల్గొన్నారు. 1777 లో అమెరికా స్వాతంత్రం పొందినప్పుడు దానిని మొదట
గుర్తించినది మొరాకో సుల్తాన్. 1797 ట్రిపోలి సంధిలో అమెరికా తాను ముస్లింల
చట్టాలు,మతం, శాంతి కి వ్యతిరేకం కాదని
స్పష్టం చేసినది.
ఇంకొక అపోహ ముస్లిం లు అనగా అరబ్బులు, ముస్లింలు అధికం గా మద్య
ప్రాచ్యం(middle east) లో నివశిస్తారు.
ఇది
నిజం కాదు. ప్రపంచ ముస్లిం జనాభాలో కేవలం 20% మంది మాత్రమే అరబ్ లేదా నార్త్
ఆఫ్రికా లో నివసిస్తారు. ప్రపంచంలోని ముస్లిం లలో 62% మంది ఆసియా-పసిఫిక్
ప్రాంతంలో ఉన్నారు. ఇండోనేషియా లో 20 కోట్ల మంధి, భారత ఉపఖండం లో 50 కోట్లకు పైగా ముస్లింలు
నివసిస్తున్నారు. పైగా అరబ్ దేశాల జనాభాలో 10% మంది అరబ్ క్రైస్తవులు కూడా ఉన్నారు
.
ఇంకొక అపోహ ఇస్లాం కత్తి పై (బలవంతంగా/హింస ద్వారా)వ్యాప్తి
చెందినది.
ఇది
నిజం కాదు. క్రైస్తవ మతం రోమ్ సామ్రాజ్యం
లో అధికార మతం గా రూపొందటానికి 400 సంవత్సరాలు పట్టింది. కానీ ఇస్లాం కేవలం 100
సంవత్సరాలలోపే మద్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా లో విస్తరించినది. కత్తి తో అనగా బలం తో ఇంత విశాల భూభాగం
లో విస్తరించడం సాద్యమగునా! పర్షియాను జయించడం ప్రాచీన రోమన్లకు సాద్యంకాలేదు, కానీ కేవలం 100 సంవత్సరాల లోపే పర్షియా ఎటువంటి యుద్దం తో సంబంధంలేకుండా
ఇస్లాం కు పాదాక్రాంతం అయినది.
క్రైస్తవులు
క్రుసేడ్ యుద్దలలో అమానవీయం గా ప్రవర్తించేవారు. అనేక లక్షల సాధారణ పౌరులను, స్త్రీలను -పిల్లలను కరుణ,జాలి లేకుండా సంహరించేవారు. కానీ
ఇస్లాం ఎల్లప్పుడు అమానవీయ మారణ కాండకు పాల్పడలేదు. నాగరిక యుద్ద నియమాలను
పాటించేది.ముస్లింలు పరమత సహనం పాటించినారు.
మహమ్మద్
ప్రవక్త (స) మానవీయ,పురోగాత్మక యుద్ద నీతిని /నియమాలను ని రూపొంధించినారు.
ఇస్లాం
ప్రకారం
·
స్త్రీలను,పిల్లలను, అమాయకులను సంహరించరాదు- శాంతియుతం గా ప్రవర్తించే,నిరాయుధులు
ఐనా ఇతర మతాల సన్యాసులను,మత పెద్దలను,మత
నాయకులను యుద్దం లో సంహరించరాదు.
·
పశు,పక్ష్యాదులను
అకారణముగా సంహరించరాదు.
·
వృక్షాలను,తోటలను
నాశనము చేయరాదు.
·
మంచి నీటి భావులను,సెలయేరులను, నీటి ప్రవాహాలను
కలుషితం చేయరాదు.
క్రుసేడ్
యుద్దాలలో విజయం పొందిన క్రైస్తవ సేనలు ఓడిన ముస్లిం సైనికుల తలలు నరకగా, గెల్చిన ముస్లింలు ఓడి బందీలు ఐనా
క్రైస్తవ సైనికులకు అన్నపానీయాలు ప్రసాదించినారు.
మద్య
యుగాలలో క్రైస్తవులు సాగించిన హింసాకాండ, క్రుసేడ్ లలో వారి యుద్దనీతి/నియమాలను గమనించిన
శాంతి కి ,మానవీయ,పురోగామ యుద్ద నియమాలకు ప్రతినిధులమని చెప్పు కొనే
ఆధునిక పశ్చిమ దేశాల వారు సిగ్గు పడ వలసి
ఉంటుంది. ముస్లింలు ఎల్లప్పుడు విద్వ౦సానికి పాల్పడలేదు,
పెద్దపెద్ద భవంతులను, కట్టడాలను నిర్మించి వాస్తు సంపదకు, వాస్తు కళకు ప్రతినిధులుగా నిలిచారు.
మరొక అపోహ ఇస్లాం శాస్త్రీయ/అధునాతన భావాలను ప్రోత్సహించదు,వెనుకబడిన మతము.
ఈ భావన కూడా నిజం కాదు. ఇస్లాం శాస్త్రీయతను, శాస్త్ర విజ్ఞానాన్నిఅధునాతన
భావాలను ప్రోత్సహించింది. దివ్య ఖురాన్ లో
విశ్వవతరణ,మానవ పరిణామాక్రమం గురించిన ప్రస్తావనలు కలవు,వాటిని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఆమోదించుచున్నారు. అసలు ఇస్లాం లేకుండా
గా గణితము,సైన్సు అబివృద్ధి చెందివికాదు. ఇస్లాం చరిత్రలో
7-12 శతాబ్దాలు స్వర్ణ యుగం గా పేర్కొనవచ్చును. ఈ కాలం లో మానవ మెదస్సు
వికసించినది. అల్గిబ్రా, భూగోళశాస్త్రము,కళలు,సారస్వతము, ఫీలాసఫీ, ఆర్ట్స్,ఆర్కిటెక్చర్,
మెడిసన్, ఆరోగ్యం,రసాయనిక
శాస్త్రం పట్టణాభివృద్ధి,సుపరిపాలన మొదలగు అనేక రంగాలలో
ముస్లిం వైజ్ఞానికులు ప్రపంచానికి సేవలు చేశారు. శాస్త్ర-విజ్ఞానాన్ని ముందుకు
తీసుకు వెళ్లారు.ముస్లిం లు తాము జయించిన ప్రాంతాలలో విద్యాలయాలు,గ్రంధాలయాలు, ప్రజోపయోగమైన పనులు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినారు. వారి నుంచే పడమటి దేశాల వారు
విజ్ఞానాన్ని గ్రహించి ఆ తరువాత అబివృద్ధి చేశారు. ఇది చారిత్రిక వాస్తవము.
No comments:
Post a Comment