11 August 2015

వై-ఫై (Wi-Fi) గురించిన 10 బయంకరమైన ఆరోగ్య వాస్తవాలు.



Top of Form
Bottom of Form


వై-ఫై వలన ఉపయోగం ఉంది కాని అందులో మనకు కనిపించని శక్తుల వలన మన భద్రతకు సంబంధించి అనేక సందేహాలు వ్యక్తం అయినాయి. 1997 లో Wi-Fi ఆగమనంతో పరిశోధకులు విషయం తెలుసుకోవడానికి డజన్ల కొద్దీ అధ్యయనాలుచేసారు. ఫలితాలు స్పష్టంగా మరియు ఆశ్చర్యకరమైనవిగా ఉన్నాయి.  వై-ఫై మొత్తం  శరీర  ఆరోగ్యo  మరియు మెదడు ఆరోగ్యo ను  ముఖ్యంగా పిల్లలలో ప్రభావితం చేయవచ్చు ఈ సమాచారం కొత్తది లేదా వివాదాస్పదo అయినది  కాదు. Wi-Fi సౌకర్యవంతంగా ఉంటుంది కానీ 2008 లో బాగా ప్రసిద్ధి చెందిన ప్రచురణ సంస్థ సైంటిఫిక్ అమెరికన్ Wi-Fi పై "సెల్ ఫోన్ ద్వారా మైండ్ కంట్రోల్" అనే వార్త ప్రచురించినది. అందులో మానవ మెదడు మీద వై-ఫై ప్రమాదం ను వివరించినది.
Wi-Fi ద్వార 10 నిజాలు క్రింద అంశాల ద్వార   తెలుసుకొందాము.

1.     నిద్రలేమి .

మీరు ఎప్పుడైనా Wi-Fi ఉపయోగించిన తర్వాత మరింత మేలుకొని ఉన్నారా లేదా రాత్రి నిద్ర రాక ఇబ్బందిపడ్డారా ? విషయాలపై  నివేదికలు చాలా  ఉండి 2007 సంవత్సరం లో దీనిపై అధ్యయనానికి ప్రేరేపించాయి. తక్కువ-పౌనఃపున్య మాడ్యులేషన్ గల సెల్ ఫోన్లు వలన నిద్ర పై వాటి ప్రభావం అంచనా వేసారు.ప్రయోగాత్మకంగా  నిజ ఫోన్స్ నుండి తక్కువ-పౌనఃపున్య మాడ్యులేషన్ కు కొందరిని గురిచేసారు లేదా  నకిలీ ఫోన్ల నుండి కొందరిని సిగ్నల్స్ కు గురిచేయలేదు. విద్యుదయస్కాంత వికిరణం బహిర్గతం అయిన సమయం లో నిద్రలోకి పోవటం కష్టం అయినది  మరియు బ్రెయిన్ తరంగ  నమూనాల్లో మార్పులు గావించబడ్డాయి..

ఇంట్లో వై-ఫై ఉన్న ఫోన్ పక్కన పండుకోవడం లేదా  ఒక అపార్ట్మెంట్ భవనం లో అనేక వై-ఫై సిగ్నల్స్ ఉండుట వలన  దీర్ఘకాల నిద్ర సమస్యలు రావచ్చు. వై-ఫై కాలుష్యం వలన, నిద్ర లేమి మరియు నిద్ర లో సమస్యలు  వస్తాయి.దానివలన డిప్రెషన్,  మరియు రక్తపోటు సరిపోని నిద్ర కలుగ వచ్చు.
2. పిల్లల పెరుగుదల లో తరుగుదల.
Wi-Fi మరియు సెల్యులార్ ఫోన్లు నుండి నాన్ థర్మల్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ బహిర్గతం అయి సాధారణ కణాల అభివృద్ధి, ముఖ్యంగా పిండం అభివృద్ధి కి అంతరాయంకలుగ వచ్చు. 2004 లో జరిగిన జంతువుల  అధ్యయనములో మూత్రపిండాల అభివృద్ధి లో  ఆలస్యం గమనించారు. ఈ పరిశోధనలకు   2009లో జరిగిన  ఆస్ట్రియన్ అధ్యయనం మద్దతు తెలిపింది. నిజానికి, ప్రోటీన్ సంశ్లేషణ అంతరాయంను  రచయితలు ప్రత్యేకంగా గుర్తించారు సెల్ కణాలు  ముఖ్యంగా పిల్లలు మరియు యువత లో, అంటే పెరుగుతున్న కణజాలం లో ప్రభావం కలిగిస్తాయి. తత్ఫలితంగా ఈ జనాభా సమూహాల పై ప్రభావo  ఎక్కువ ఉంటుంది.
3. కణజాల  పెరుగుదల ప్రభావితం అగును.
తొమ్మిదవ గ్రేడ్  చదివే ఒక డానిష్  బృందం వారి సెల్ ఫోన్ల తో నిద్రిస్తున్న తర్వాత వారికి ఏకాగ్రత చూపటం   కష్టం అయినది. అలాగే  వారు వైర్లెస్ Wi-Fi రూటర్లు ప్రభావం తోట లో పెరిగే ఓ మొక్క మీద పరీక్షించడానికి ఒక ప్రయోగం చేసారు. కొన్ని  మొక్కలు వైర్లెస్ వికిరణం లేని గది లో ఉంచారు ఇంకో  మొక్కల గుంపును  ఒక సెల్ ఫోన్ రేడియేషన్ విడుదల చేసే రెండు రూటర్లు  పక్కన ఉంచారు.  ఫలితo చూస్తే  రేడియేషన్ సమీప మొక్కలు పెరగలేదు.

4. బ్రెయిన్ ఫంక్షన్ లో తగ్గుదల:
డానిష్ హై స్కూలు విద్యార్ధులకు ఏకాగ్రత తో వచ్చిన సమస్యలు గమనించి శాస్త్రవేత్తలు మెదడు పనితీరు పై 4G రేడియేషన్ ప్రభావం పరిక్షిoచినారు. MRI సాంకేతికత ఉపయోగించి, పరిశోధనలు కేవలం ఒక సంవత్సరం పాటు తీసుకొన్నారు. 4G రేడియో ధార్మికత బారినపడ్డ వ్యక్తుల మెదడు చర్య తగ్గింది అని  కనుగొన్నారు.
5. మహిళల  మెదడు చర్యలు  తగ్గిస్తుంది
30 ఆరోగ్యవంతులైన వాలంటీర్లలో, 15 పురుషులు మరియు 15 మహిళల సమూహం కు ఒక సులభమైన మెమరీ పరీక్ష ఇవ్వబడింది.  మొదట మొత్తం సమూహం Wi-Fi రేడియేషన్ కు గురి కాకుండా పరీక్షించారు. ఆ తరువాత వారు సుమారు 45 నిమిషాల పాటు  ఒక వైర్లెస్ యాక్సెస్ పాయింట్ నుండి 2.4 GHz Wi-Fi పరిక్షిoచారు. పరీక్ష యొక్క సమయంలో, మెదడు చర్య కొలిచారు  మరియు మహిళల మెదడు చర్య మరియు శక్తి స్థాయిల్లో ఒక గమనించతగ్గ మార్పు వచ్చింది.

6.స్పెర్మ్ ను  తటస్థీకరిస్తుంది
మనకు ల్యాప్-టాప్ ల వలన ఉత్పన్నమైన  వేడి స్పెర్మ్ ను చంపుతుంది తెలుసు. ఇప్పుడు రీసెర్చ్ ద్వారా  Wi-Fi ఫ్రీక్వెన్సీల స్పందన స్పెర్మ్ కదలికను తగ్గించడానికి మరియు DNA ఫ్రాగ్మెంటేషన్ కారణం అని తెలిసింది. మానవ మరియు జంతువుల మీద చేసిన పరీక్షలు  స్పెర్మ్ ను  ప్రభావితం చేస్తాయి అని ధ్రువీకరించాయి.
7. ఫెర్టిలిటీ  లో తగ్గుదల.
కేవలం స్పెర్మ్ నే కాదు  జంతువుల  అధ్యయనములో కొన్ని వైర్ లెస్ పౌనఃపున్యాలు  మహిళలలో అండం అమరికను  నిరోధించవచ్చు అని సూచించారు. అధ్యయనం సమయంలో ఎలుకలు 45 రోజులు, రోజుకు 2 గంటల ఎక్స్పోజరు ద్వార  వాటిలో గణనీయంగా ఆక్సీకరణ ఒత్తిడి స్థాయిలు  పెరిగినవి. కణ నష్టాన్ని నుండి DNA నిర్మాణం వరకు  ప్రభావం అసాధారణ గర్భం లేదా పలదికరణ లో  అండం  యొక్క వైఫల్యం కు ఒక బలమైన అవకాశం ఉంది.
స్వీడన్ లోని కరోలిన్స్కా (Karolinska) ఇన్స్టిట్యూట్ 2011 లో ఒక హెచ్చరిక విడుదల చేసింది.
గర్భిణీ స్త్రీలు వైర్లెస్ పరికరాలను ఉపయోగించ రాదు మరియు ఇతర వినియోగదారుల నుండి దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ప్రస్తుత అమెరికా [మరియు కెనడా] ల యొక్క వైర్లెస్ టెక్నాలజీ,రేడియో ఫ్రీక్వెన్సీ మరియు మైక్రోవేవ్ రేడియేషన్ ప్రమాణాలు  పూర్తిగా సరిపోవు.
అభివృద్ధి చెందుతున్న పిండం విషయం లో అమలులో ఉన్న భద్రత ప్రమాణాలు కుడా సరిపోవు.
8.  హృదయo పై అధిక  ఒత్తిడి ప్రేరేపించబడును.
వైర్లెస్ నెట్వర్క్లు లేదా 3G లేదా LTE సెల్ ఫోన్లు చుట్టూ ఉన్నప్పుడు మీ గుండె వేగంగా పనిచేస్తుంది  అనుకుంటే, అదినిజం అవ్వవచ్చు.69 విభిన్నవ్యక్తులు పాల్గొన్న   ఒక అధ్యయనంలో విద్యుదయస్కాంత పౌనఃపున్యలకు  నిజమైన భౌతిక స్పందన అనుభవంలోకి వచ్చింది. భౌతిక స్పందన అంటే ఏమిటి? పెరిగిన గుండె రేటు అనగా  వత్తిడి కి లోను అయిన ఒక వ్యక్తి యొక్క గుండె రేటును  పోలి  ఉంటుంది.
9.  క్యాన్సర్ రావటానికి అవకాశాలు ఎక్కువ.
చాలా జంతువుల నమూనాలు విద్యుదయస్కాంత వికిరణం వలన కణితి అభివృద్ధి అయ్యే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి! మానవ అధ్యయనాలు, నివేదికలు మరియు కేస్ స్టడీస్ చాల ఉన్నాయి. అలాంటి ఒక కేసులో  రొమ్ము క్యాన్సర్ వచ్చిన ఒక యువ 21 ఏళ్ల మహిళ ఉంది. ఆమె కుటుంబం లో ఎవరికీ రొమ్ము కాన్సర్ లేదు. ఆమె కుడి బ్రా లో సెల్ ఫోన్ మోస్తున్నచోట  కణితి అభివృద్ధి చెందినది.

10. మిమ్మల్లి మీరు కాపాడుకొండి!
 పరిశోధకులు ఒక స్థాయి రక్షణ అందించే అనేక పద్ధతులను గుర్తించారు. మొదటిది తగ్గిన మెలటోనిన్ స్పందన బహిర్గతం(exposure)కు దారితీస్తుంది. అందువలన, సప్లిమేoట్స్ (భర్తీ) ద్వారా తగ్గుతున్న మెలటోనిన్ ప్రభావాలు కొన్నిoటిని తగ్గించడం లో సహాయపడవచ్చు. జంతువుల  పరీక్షల్లో, (L-Carnitine) 2.4 GHz రేడియేషన్ ను  తగ్గించి అంటి-అక్సిడేoట్స్ ద్వారా ప్రభావిత పోషకాలకు   మద్దతు అందిస్తుంది.
తక్కువ బహిర్గతం (exposure) ఎక్కువ ఆరోగ్య రక్షణ
మెలటోనిన్ మరియు ఎల్-కర్నితిన్( L-Carnitine ) మంచి పోషక రక్షణ అందిస్తు  న్నప్పటికీ, అవి బహిర్గతం  ను పూర్తిగా ఆపలేవు. సెల్ ఫోన్ సంస్థల కవరేజ్ లేదా మీ స్మార్ట్ ఫోన్ ఎన్ని Wi-Fi నెట్వర్క్ల కలిగి ఉందొ గమనించoడి. మన చుట్టూ విద్యుదయస్కాంత వికిరణం చాల ఎక్కువ ఉన్నదేమో గమనించండి. ఎక్స్పోజరు ను బ్లాకింగ్ చెయడo కష్టం కానీ మీరు కొన్ని చిన్న చిన్న జాగర్తలు తీసుకోవచ్చు. ఇందుకోసం మీ శరీరంనకు  దగ్గరగా సెల్ ఫోన్లు, ల్యాప్-టాప్ లు, టాబ్లెట్స్ ఉంచకండి. వాటిని   ఉపయోగిoచక పోతే వాటిని ఆపి వేయండి, (మీ వైర్లెస్ రూటర్)తో సహా. విద్యుదయస్కాంత పౌనఃపున్యం ను  ఎదుర్కొనడానికి అనేక పరికరాలు ఇప్పుడు  అందుబాటులోనికి వచ్చాయి.ల్యాప్-టాప్ రేడియేషన్ మరియు సెల్ ఫోన్ రేడియేషన్ నుండి మిమ్మల్ని మీరు రక్షించడానికి ఈ మార్గాలను కనుగొనండి.






.


]


No comments:

Post a Comment