2015 వ సంవత్సరపు
నోబుల్ బహుమతిని వ్యక్తి/సంస్థ లకు గాక ఉమ్మడిగా నాలుగు ట్యునీషియా
సంస్థలకు ప్రధానం చేసారు. 2015 నోబుల్
శాంతి బహుమతి ని ట్యునీషియా జాతీయ సంభాషణ చతుష్టయం(National Dialogue Quartet) కు
ప్రదానం చేసారు.ఈ నాలుగు సంస్థలకు
ఉత్తర ఆఫ్రికన్ దేశం ట్యునీషియా లో ప్రజాస్వామ్య పరివర్తన లో
సహయపడినండుకుగాను నోబెల్ శాంతి బహుమతి లభించింది. ట్యునీషియా జాతీయ సంభాషణ చతుష్టయం(National Dialogue Quartet) అక్టోబర్ 9, 2013 లో ఏర్పడింది మరియు
త్వరలోనే 2015 నోబుల్ బహుమతి ని సాదించినది.
“కార్మిక సంఘాల నాయకులు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు మరియు మానవ హక్కుల కార్యకర్తలు కలసిన చతుష్టయానికి (క్వార్టెట్) నోబుల్ బహుమతి దక్కింది. నోబెల్ కమిటీ ప్రకారం 2011 జాస్మిన్ విప్లవం నేపథ్యంలో ట్యునీషియా లో ఒక బహుళ ప్రజాస్వామ్య భావన నిర్మాణం లో దాని(క్వార్టెట్) నిర్ణయాత్మక సహకారం కు నోబెల్ శాంతి బహుమతి లబించినది”.
ట్యునీషియా లో సుదీర్ఘకాల నిరంకుశ అధ్యక్షుడు విఫలమవ్వడం,
ఒక రాజకీయ భూకంపం ట్యునీషియా ను తాకడం, ఒక
నిరుద్యోగ వీధి విక్రేత స్వయంగా అగ్ని కి ఆహుతి అవడం దాని ప్రతి ధ్వని మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా అంతటా
ప్రతిధ్వనించుచున్న సమయం లో 5 సంవత్సరాల తరువాత ట్యునీషియ నేషనల్ సంభాషణ
క్వార్టెట్ కు(Arabic:
رباعية
الحوار الوطني التونسي,
rubāʿiyyat al-ḥiwār al-waṭanī at-tūnisī),
ఈ ఏటి నోబుల్ శాంతి బహుమతి లబించినది.
అరబ్
స్ప్రింగ్ మరియు ఆ తరువాత పరిణామాల మద్య - లిబియా, సిరియా మరియు యెమెన్ లో కూలిపోయిన ప్రభుత్వాలు ; ఈజిప్ట్ లో సైన్యం బలపరిచిన పాలన తిరిగిరావడం మరియు సిరియా మరియు ఇరాక్ లో మత
ఇస్లామిక్ రాష్ట్రం యొక్క పెరుగుదల – లాంటి పరిస్థితులలో ట్యునీషియా
లో ప్రజాస్వామ్యా పరివర్తనా విజయం ఒక
చిన్నఆశ గా ఉంది.
చతుష్టయం (quartet) లో నలుగురు సభ్యులుగా ఉన్నారు. వారు 1. ట్యునీషియ జనరల్ లేబర్ యూనియన్; 2. ట్యునీషియన్ కాన్ఫెడరేషన్ అఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ హస్తకళలు 3. ట్యునీషియా మానవ
హక్కుల లీగ్; 4.ట్యునీషియా ఆర్డర్ అఫ్ లాయర్స్.
నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ బహుమతిని నాలుగు
వ్యక్తిగత సంస్థలకు గాక , ఈ చతుష్టయం కు ఉమ్మడిగా ప్రదానం చేస్తాను అని ఉద్ఘాటించింది.
"అరబ్ స్ప్రింగ్ 2010 మరియు 2011 లో ట్యునీషియా లో
ప్రారంభమైంది, కాని అది త్వరగా ఉత్తర ఆఫ్రికా మరియు
మధ్య తూర్పు ఇతర దేశాలలో వ్యాపించింది,అని ఓస్లో లో బహుమతి ప్రకటించింన కమిటీ చైర్మన్ అన్నారు. "ఈ దేశాలలో
ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కుల కోసం పోరాటం నిలిచిపోయింది అయితే అయితే
ట్యునీషియా లో ప్రాథమిక మానవ హక్కులను గౌరవించడం కోసం డిమాండ్లతో
కూడిన ఒక శక్తివంతమైన పౌర సమాజం
ఆధారంగా ప్రజాస్వామ్యo మార్పు చూసింది.”
ట్యునీషియా విజేతలు ఉప్పొంగినారు. "ట్యునీషియా
కు అభినందనలు, చతుష్టయం మరియు చతుష్టయం పని సులభతరం
చేసిన అన్ని పార్టీలకు" అని శ్రామిక
యూనియన్ ప్రధాన కార్యదర్శి, హౌసినే అబ్బాస్సి రేడియో మొసైక్యు FM లో చెప్పారు. "మా దేశంలో ఇప్పటికీ
వివిధ భద్రతా సవాళ్లను అధిగమించే సమయంలో ఈ
బహుమతి, సరైన సమయంలో వచ్చింది." అని అయన
అన్నారు.
మానవ హక్కుల లీగ్ అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ బెన్ మౌసా, " ఒక సంక్షోభం
పరిష్కరించడానికి ఏకైక మార్గం
సంభాషణలు ప్రధానం కాని ఆయుధాలు కాదు అని ఈ బహుమతి నిరూపిస్తుంది అని రేడియో స్టేషన్ ఇంటర్వ్యూ లో చెప్పారు.
ఒక పేస్ బుక్ వీడియో లో, అధ్యక్షుడు బేజి సైడ్ ఎస్సేబ్సి (Beji Caid Essebs) అవార్డు హింస పై సంభాషణల యొక్క విజయం అని అన్నారు. "ట్యునీషియాలో ఏ సమస్య పరిష్కారం కోసం అయిన సంభాషణ ఉంది," అని చెప్పారు. "మేము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యుద్ధం ఎదుర్కొంటున్నాము మరియు మేము కలిసి ఉంటే తప్ప మేము గెలవలేము అని అన్నారు."
ఎడమనుంచి జనవరిలో
ట్యూనిస్ లో అధ్యక్షుడు బేజి సైడ్ ఎస్సేబ్సి తో సమావేశం ముందు మహోమ్మాద్ ఫదేల్
మహ్ఫౌద్ (Mohamed Fadhel Mahfoudh), విదేడ్ బౌచమఔయి(Wided Bouchamaoui), అబ్దుల్ సత్తార్ మౌస్సా మరియు హౌసినే అబ్బాస్సి. వారు నేషనల్ సంభాషణ క్వార్టెట్ నాలుగు గ్రూపుల నాయుకులు.
ట్యునీషియా, 1956 లో స్వాతంత్ర్యము పొందింది ఒక మాజీ ఫ్రెంచ్ కాలనీ.
డిసెంబర్ 17, 2010 న వీధి విక్రేత, మొహమ్మద్ బౌఅజిజి స్వయంగా అగ్నికి ఆహుతి
అయిన సంఘటన తరువాత ట్యునీషియా లో ప్రబుత్వ వ్యతిరేక భారీ ప్రదర్శనలు జరిగి , చిరస్మరణీయ మార్పులకు దారి తీసాయి.
ఇస్లామిస్ట్ పార్టీ, ఎన్నఃడా (Ennahda), ట్యునీషియా లో జరిగిన మొట్టమొదటి
స్వేచ్చా పార్లమెంటరీ ఎన్నికల్లో
అధిక ఓట్లను పొందారు కానీ అది చేసిన పురుషుల
తో సమానంగా మహిళల స్థితి ని నిర్వీర్యం చేసే
ఒక కొత్త రాజ్యాంగం ప్రతిపాదన, పట్ల విస్తారమైన నిరసనలకు దారితీసింది. 2013 లో, రెండు ప్రతిపక్ష రాజకీయనాయకుల హత్య అనంతరం ఎన్నఃడా (Ennahda )నేతృత్వంలోని ప్రభుత్వ పదవీవిరమణనికి
పిలుపులు వచ్చాయి, మరియు ఇస్లామిస్ట్ నేతృత్వంలోని
ప్రభుత్వం సంవత్సరం చివరిలో ప్రజాస్వామ్య పరివర్తన కోసం ఒక ప్రణాళిక తేవటానికి
ఒప్పుకున్నారు. అది అరబ్ స్ప్రింగ్
సమయంలో ఇష్టపూర్వకంగా శక్తిని వదులు కొన్న ప్రభుత్వం అయినది.
విశేషాలు:
1.1901 నుండి ప్రదానంచేస్తున్న 96వ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది ట్యునీషియా లోని జాతీయ. సంభాషణల చతుష్టయం
1.1901 నుండి ప్రదానంచేస్తున్న 96వ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది ట్యునీషియా లోని జాతీయ. సంభాషణల చతుష్టయం
2.ఇంతవరకు 103 వ్యక్తులు మరియు 22 సంస్థలు నోబుల్ శాంతి బహుమతి ని
గెల్చుకొన్నాయి. (రెడ్ క్రాస్ రెండుసార్లు, అంతర్జాతీయ సమితి యునైటెడ్ నేషన్స్ లో
శరణార్ధుల హై కమిషనర్ కార్యాలయం మూడు సార్లు గెలిచింది.)
3.చతుష్టయం (quartet) లో నలుగురు సభ్యులుగా ఉన్నారు. వారు 1. ట్యునీషియ జనరల్ లేబర్ యూనియన్; 2. ట్యునీషియన్ కాన్ఫెడరేషన్ అఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ హస్తకళలు 3. ట్యునీషియా మానవ హక్కుల లీగ్; 4.ట్యునీషియా ఆర్డర్ అఫ్ లాయర్స్
3.చతుష్టయం (quartet) లో నలుగురు సభ్యులుగా ఉన్నారు. వారు 1. ట్యునీషియ జనరల్ లేబర్ యూనియన్; 2. ట్యునీషియన్ కాన్ఫెడరేషన్ అఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ హస్తకళలు 3. ట్యునీషియా మానవ హక్కుల లీగ్; 4.ట్యునీషియా ఆర్డర్ అఫ్ లాయర్స్
4. రెండు ప్రతిపక్ష నాయకులు హత్యకు గురిఅయిన తరువాత పెద్ద ఎత్తున నిరసనలు
జరిగి ఇస్లామిస్ట్ ఎన్నఃడా (Ennahda) పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం దిగి పోయిన తర్వాత, 2013 లో ఏర్పడిన ఒక రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చతుష్టయం
సహాయపడింది. ఇది ప్రభుత్వం దిగిపోవటానికి మరియు 2014 లో కొత్త ఎన్నికలకు మార్గం సుగమంచేసింది
మరియు ఒక ఆపద్ధర్మప్రభుత్వానికి(care
taker) అధికారం ఇవ్వడంలో లో
జోక్యం చేసుకోంది.
చతుష్టయం విజయవంతమైంది అంటే దానికి కారణం అది ప్రభుత్వానికి విశ్వసనీయ మూడవ
పార్టీగా ప్రాతినిధ్యం వహించుట. ఈజిప్ట్
లో పతనం అయిన ముస్లిం బ్రదర్హుడ్ ప్రభుత్వ
గతిని చూసిన తరువాత, ట్యునీషియా యొక్క ఇస్లాంవాదులు తమకు ఇదే గతి పడుతుందని
బయపడ్డారు. ఇస్లాంవాదులు వారి రాజకీయ
ప్రత్యర్థులను నమ్మలేదు.
ట్యునీషియా దేశంలో
ఏ ఒక్క సమూహం దానియెక్క సొంత పెత్తనం అమలు చేయదానికి తగినంత సొంత బలo లేక పోవటం దాని అదృష్టo
అని కొందరు వ్యాఖ్యానించారు. ఈజిప్ట్ లో
కాకుండా, ట్యునీషియన్ సైన్యం - మిస్టర్ బెన్ ఆలీ
యొక్క నియంతృత్వం కింద బలహీన పడింది అది అధికారం గ్రహించే స్థితి లో లేదు.- దాంతో మాజీ ప్రభుత్వ, లేదా దాని ప్రజాస్వామ్య ప్రత్యర్థులు ఇస్లామిస్ట్ నేతృత్వంలోని
ప్రభుత్వాన్ని పడగొట్ట లేకపోయారు.
ఎన్నఃడా (Ennahda) పార్టీ బహుమతి పొందిన చతుష్టయం ను అభినందించారు. "ఇది చతుష్టయం యొక్క ప్రయత్నాలు గౌరవీస్తుంది , మరియు ట్యునీషియా ను గౌరవిస్తుంది, శక్తి
కోసం పోరాడటంలో విజయం సాధించిన దేవుని మరియు ట్యునీషియా యొక్క పిల్లల ప్రయత్నాలు కు
ధన్యవాదాలు తెల్పుతుందని అని ఇస్లామిస్ట్ పార్టీ నాయకుడు, రాచేడ్ ఘన్నౌచి (Rached Ghannouchi) ఒక పేస్-బుక్ పోస్ట్ లో రాశాడు
ఓస్లో లో నోబెల్ కమిటీ ఆలోచన నిర్ణయాత్మకo అని నోబుల్ కమిటి చైర్మన్ చెప్పారు. "చతుష్టయం పౌరులు, రాజకీయ పార్టీలు మరియు అధికారుల మధ్య
శాంతియుత చర్చలకు మార్గం సుగమం చేసింది , మరియు రాజకీయ మరియు మత సవాళ్లులకు విస్తృత
ఏకాభిప్రాయ ఆధారిత పరిష్కారాలను కనుగొనేందుకు సహాయం చేసిందని కమిటి చైర్మన్ చెప్పారు
ప్రజల యొక్క ఉత్తమ ప్రయోజనాల పరిరక్షణకు ఇస్లామిస్ట్ మరియు లౌకిక రాజకీయ ఉద్యమాలు కలసి
పనిచేయడం సాధ్యం అని ట్యునీషియా
నిరుపించిదని అని నోబుల్ కమిటి చైర్మన్ అన్నారు.
• అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా
క్వార్టెట్ గురించి మాట్లాడుతూ “ఏకాభిప్రాయ మార్గం ను మించినది లేదు, ట్యునీషియా
కు సంభాషణ మార్గం తప్పితే శాశ్వత శాంతి భద్రతలను సాధించేది ఏది లేదు” అని అన్నారు.
ఐక్య రాజ్య సమితి ప్రతినిధి అహ్మద్
ఫజ్మి మాట్లాడుతూ “ముందుకు వెళ్ళటానికి మాకు ఒక పౌర సమాజం ఆవశ్యకత ఉంది” అని
అన్నారు..
No comments:
Post a Comment