25 February 2016

ఇస్లాం పుట్టుక దాని వ్యాప్తికి కారణాలు. (Causes for the Origin and Spread of Islam)




ఇస్లాం మతం ఆవిర్భవించి  100 సంవత్సరాలు పూర్తి కాక ముందు అది  తూర్పున చైనా  మరియు పడమర యూరోప్ వరకు త్వరగా వ్యాప్తి చెందినది. అది భూగోళం యొక్క ఒక పెద్ద భూభాగం(అనగా రెండు అతి శక్తివంతమైన సామ్రాజ్యాలు ఉదా: పెర్షియన్ సామ్రాజ్యంమరియు బైజాంటైన్ సామ్రాజ్యం) ను జయించినది.  ఏ ఇతర మతం కూడా పూర్వం ఇటువంటి ఘన విజయం సాధించలేదు.
మనం  ఈ వ్యాసం లో  ఇస్లాం మతం యొక్క శీఘ్ర వ్యాప్తి కి కారణాలు అన్వేషించుదాము. ముఖ్యం గా రాజకీయ, చారిత్రక, ఆర్థిక మరియు సామాజిక కారణాలను అన్వేషించ వలసి  ఉంది. కవి ఇక్బాల్ తో  సహా చాలా మంది ఈ కారణాలు విశ్లేషించారు. అనేమంది ముస్లింలు, ఇస్లాం మతం అబివృద్ది కి ముస్లింల నిజాయితీ, నిబద్ధత మరియు ఇస్లాం మతం యొక్క బోధనలను వారు సదా  అనుసరించడం వలన  ముస్లింలు  విజయం తర్వాత విజయం పొందారు  అని పేర్కొన్నారు.
ఇస్లాం యొక్క విజయానికి  నిజమైన కారణాలను సరిగ్గా  నిర్ధారణ చేయవలసి  ఉంది. వాస్తవానికి అనుచరుల ఆలోచన విధేయత మరియు నిబద్ధత ప్రాముఖ్యతను  విస్మరించడానికి వీలు లేదు కానీ ఇస్లాం మతం త్వరగా వ్యాప్తి చెందటానికి కారణాలను శాస్త్రీయo గా మరియు మరింత ప్రయోజనాత్మకంగా కనుగొనాలి.
హిజాజ్: గిరిజనవాసం  నుండి వాణిజ్య ప్రదేశం
ఇస్లాం మతం  వాణిజ్యం మరియు ఆర్ధికం గా అంతర్జాతీయ కేంద్రంగా ఉన్న ఒక  పట్టణ ప్రాంతం(మక్కా)లో పుట్టింది. కానీ హిజాజ్ (ఇప్పుటి  సౌదీ అరేబియా మరియు ఇస్లాం మతప్రారంభ స్థానం) పరిసర ప్రాంతాలు ప్రధానంగా వ్యవసాయo మరియు భూస్వామ్య వ్యవస్థ పై ఆధార పడినవి. వాణిజ్య  నాగరికత వ్యవసాయం కన్నా చాలా ఆధునికoగా  మరియు ప్రగతి శీలoగా ఉంది. వ్యవసాయ నాగరికత పెరుగుదల చాలా పరిమితం గా ఉంది.
ఆనాటి  మక్కా యొక్క సామాజిక నేపథ్యం ను మనం ముందు గమనించాలి. అది సంక్లిష్టం సమాజం. ఒక గిరిజన సమాజం నుండి వ్యాపార సమాజం మొదలైంది. మక్కా సమాజం నిజానికి, గిరిజన మరియు వాణిజ్య సమాజాల కలయిక గా ఉంది. గిరిజన మరియు వాణిజ్య సంఘాలు రెండు వ్యవసాయ సమాజంకంటే ఆధునికo గా  ఉంటాయి. వాణిజ్య సమాజo కన్నా గిరిజన సమాజం లోనే  సమానత ఎక్కువ. వాణిజ్య సమాజం లో  గిరిజన సమాజం మరియు వ్యవసాయ సమాజం కన్నా ఎక్కువ అసమానత ఉంటుoది.
ఇస్లాం మతం లో  మక్కా యొక్క గిరిజన మరియు వాణిజ్య సమాజాల మెరుగైన లక్షణాలు ఉన్నాయి.  గిరిజన సమాజంలోని సమానత్వంను మరియు వాణిజ్య సమాజం లోని చైతన్యాన్ని ఇస్లాం స్వికరించినది. గిరిజన సమాజంలో జ్ఞానం మీద ఎక్కువ శ్రద్ధ లేదు కానీ వ్యాపార సమాజంలో జ్ఞానం  తప్పనిసరి. ఇస్లాం మతం ఉనికిలోకి వచ్చిన తర్వాత కూడా అరబ్బులలో  గిరిజన విలువలు పోలేదు పైగా వారికి వారి పూర్వీకుల పరిజ్ఞానం ప్రధాన మయినది.
అందువలననే  మనం సమానత్వం ను  ఇస్లాం మతం లో ప్రాథమిక విలువ గా చూస్తాము. భూస్వామ్య సమాజంలో వలే  అరబ్బులలో  సోపానక్రమం(Heirarchy) భావన లేదు.దివ్య ఖురాన్,  సమానత్వం ను ఒక విలువగా గుర్తించినది  మరియు అత్యంత దైవభక్తి కలిగిన వారు మాత్రమే అల్లాహ్ దృష్టిలో అత్యంత గౌరవనీయలు  అని అన్నది. ఇది ఇస్లాం మతం యొక్క ప్రగతిశీల మరియు విలువైన భావన గా  ఉంది.
ఇరాన్ మరియు తూర్పు రోమన్ సామ్రాజ్యం వంటి ఇతర సమాజాల లో  అత్యంత క్రమానుగత శ్రేణి(Heirarchy) అమలులో ఉంది  మరియు ఆ  సమాజాలలో సామాజిక అధిక్యత  మరియు జన్మించిన కుటుంబానికి చాల  ప్రాధాన్యత ఉంది. నిజానికి ఇస్లాం మతం లో ఆమాల్ -ఇ-సాలిహః అనగా మంచి పనులు మాత్రమే ముఖ్యమైనవి.దివ్య ఖురాన్ ప్రకారం గౌరవానికి అతని/ఆమె  సామాజిక హోదా లేదా ధనవంతుల ఇంట   పుట్టుకతో సంబంధం లేదు ఉదాహరణకు, అబూ ధర్ లేదా సల్మాన్ అల్-ఫార్సీ ఇద్దరు రెండు సాధారణ మరియు పేద కుటుంబాలు మరియు పేద తెగల నుండి వచ్చారు. కాని వారు ఇరువురు ప్రవక్త () కు అతి సన్నిహితులుగా  పరిగణించబడ్డారు. ప్రవక్త(స) వారిని మెచ్చుకుంటూ ఉన్నత స్థాయి గౌరవం చూపెవారు.
వ్యాపార సమాజంలో కూడా వ్యక్తిగత గౌరవం కన్నా ఆర్థిక స్థితి కి  అధిక ప్రాధాన్యత ఉంది. మరియు మక్కా సమాజం కూడా ఒక వాణిజ్య మరియు ఆర్థిక సమాజం వలే వ్యక్తి ఆర్థిక స్థితి కి గొప్ప ప్రాముఖ్యత ఇచ్చినది. ప్రవక్త () వ్యతిరేకులు సమాజం లో ధనవంతులు  మరియు శక్తిమంతులు.  ప్రవక్త () ఒక అనాథ మరియు ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు. ఇస్లాం మతం వ్యాపార సమాజo ను  దాటి వెళ్లి అత్యంత ఆధునిక మరియు ప్రజాస్వామ్య భావన అయిన సమానత్వం మరియు వ్యక్తిగత గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది. అందువలననే దివ్య ఖురాన్ ఆదం సంతానమందరు  వారి పుట్టిన, తెగ, జాతీయత లేదా స్థితి తో సంబంధం లేకుండా సమాన  గౌరవం ఆస్వాదిస్తారని చెప్పింది.
తీవ్ర (radical)సమానత్వం
ఇస్లామిక్ బోధనలు ఎలాంటి హక్కులు లేని బానిసలకు కూడా  హక్కులను ప్రసాదించినవి. బానిసలు కూడా పరువు(dignity) జ్ఞానం పొందారు. ఇది ఒక గొప్ప విప్లవం/మార్పు. సమాజంలోని అట్టడుగు వర్గాలుగా బావించే  మహిళలు మరియు బానిసలు హక్కులు మరియు గౌరవం పొందారు. హాబషి బిలాల్ ను ఈ విషయం లో ఒక ప్రముఖ ఉదాహరణగా చేప్పవచ్చు.
బిలాల్ ఒక బానిస అతనిని  హజ్రత్ అబూ బకర్ బానిసత్వం నుండి  విడిపించినాడు. ప్రవక్త () బిలాల్ కు అత్యధిక హౌదా ప్రసాదించారు.  ప్రవక్త () అతనికి  అజాన్ (azan) ఇచ్చే అదృష్టం ప్రసాదించారు. ఒక బానిసకు ఆ గౌరవం ఇచ్చి అల్లాహ్ దృష్టి లో మానవులు అందరు సమానులే అని చాటి నారు. ఇటువంటి సంఘటన అప్పటి వరకు సమకాలిన అరబ్ చరిత్రలో ఎక్కడా కనిపించదు.
ఇస్లాం బోధనలు ఇతర దేశాల ప్రజల కు క్రమంగా అందుబాటులోకి వచ్చాయి. బానిసలు మరియు సమాజం లోని ఇతర బలహీనవర్గాలు  ఇస్లాం బోధనలు వైపు ఆకర్షితులయ్యారు. బానిస వ్యవస్థ  లేదా క్రమానుగత సంఘాలు(heirarchial society) ఉన్న దేశాల లోని ప్రజలు రక్తపాతం జరగకుండా ఇస్లాం ను స్వాగతించారు. ప్రారంబ చరిత్రకారులు తబరి మరియు బలాధురి రచనలలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కన్పిస్తాయి.
ఆక్రమణలు
మనం ఈ వివరాలు చర్చించడానికి ముందు అరబ్ ముస్లిoలు ఇతర దేశాలను ఎందుకు   ఆక్రమించారు? అన్న ప్రశ్న కు జవాబు ఇవ్వాలి. వారు ఆ దేశాలలోని ప్రజలను ముస్లింలుగా కత్తి తో (force) మార్చ దలచు కొన్నారా? లేదా వారి సమాజాలపై  అరబ్ పాలన రుద్ద దలుచు కొన్నారా? లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా?
ప్రవక్త ()  తన ఆధిపత్యాన్ని స్థాపించడానికి లేదా ఇతరుల వనరులపై నియంత్రణను చేయడానికి ఏ దేశం లేదా ఇతర అరబ్ తెగల పై  దాడి చేయ లేదు. ఒకటి  మినహా, అతను దాడి చేసినప్పుడు మాత్రమే  పోరాడారు. ఆ విధంగా ప్రవక్త(స) రక్షణ(defensive) యుద్ధాలు మాత్రమే చేసారు. నిజానికి అబూ బకర్,మొదటి ఖలీఫా కూడా ఎవరిపై దండెత్త లేదు. అతని పాలన అంతా రిద్దా (Riddah-ఖలీఫా కు వ్యతిరేకంగా తిరుగు బాటు) ను అణిచివేయటం తోనే సరిపోయింది. అప్పటి అరబ్ గిరిజనులకు ఖలీఫా కు పన్నులు చెల్లించడం తెలియదు. చేల్లించమంటే కోపం వస్తుంది.
అనేక అరబ్  తెగల కు  ఒక మతంగా ఇస్లాం స్వీకరించడం పై ఎటువంటి అభ్యంతరము లేదు  కానీ ప్రభుత్వంకు జకాత్ (పన్ను) చెల్లించటం  మరియు లొంగి ఉండడం సుతారాము ఇష్టం లేదు. ఈ తెగలు అత్యంత స్వతంత్ర కలిగి  పట్టణ ప్రాంత వాసులకు లొంగి ఉండటాన్ని వ్యతిరేకించారు. అది వారి చరిత్రలో లేదు. దీంతో హజ్రత్ అబూ బకర్ వారి తిరుగు బాటు రిద్దాః ను అణిచివేయ చేయవలసి వచ్చింది.
2వ ఖలీఫా హజ్రత్ ఉమర్ కాలం లో దండయాత్రలు ప్రారంభ మైనవి. అతని కాలం లోనే  పాలస్తీనా, సిరియా మరియు ఇరాన్ ఆక్రమించ బడినవి. జైత్ర యాత్రలు అతని సమయం నుండి ప్రారంభమైనవి. ఎందుకు హజ్రత్ ఉమర్ ఈ ఆక్రమణలను ను ప్రారంభించినాడు?
ప్రధాన కారణం గా ఆర్ధిక కారణాలను చెప్పవచ్చును. దివ్య ఖురాన్ లో కూడా ప్రస్తావించబడిన మారిబ్ (Ma'arib) డ్యామ్ విధ్వంసం తరువాత, యెమెన్ భూసారo నాశనమైంది మరియు యెమెన్ ప్రజలు సారవంతమైన ఉత్తరం వైపు వలస పోయారు. ఇది  యెమెన్ అరబ్బులు మరియు మక్కా  ఖురైషుల  మధ్య సామాజిక ఉద్రిక్తతకు  కారణమయిoది. యెమెన్ ప్రజలు చొరబాటుదారులుగా కన్పించారు.  అలాగే, ఇస్లాం కు ముందు, అరబియా ఎడారి లో సాధారణం గా బెదౌయిన్ (Bedouin) తెగవారు ఇతర తెగలను ఆక్రమించడం, పరాజిత తెగ వారి జంతువులను  మరియు మహిళలను స్వాధీనం చేసుకోవడం జరిగేది.
హజ్రత్ ఉమర్ సమయానికి అన్ని బెదౌయిన్ తెగలు  ఇస్లాం మతం స్వీకరించారు మరియు అందరు  ముస్లింలు ఒకరికొకరు సోదరులు గా (మువఖాట్ muwakhat)  పిలవబడ్డారు. ఒక ముస్లిం మతం తెగ ఇంకొక  ముస్లిం తెగ పై దాడి చేసి  వారి జంతువులు మరియు మహిళలను స్వాధీన పరుచుకొనే అవకాశం లేకుండా పోయింది. దీనితో ఎడారి లో మనుగడ ఒక సమస్యగా మారింది.
యెమెన్ వలస ప్రభావం  మరియు బెదౌయిన్(Bedouin) తెగల మనుగడ ప్రశ్నార్ధకం గా మారింది అప్పుడు బైజాంటిన్ (Byzentine) సామ్రాజ్యం మరియు ఇరాన్ భూభాగం (పాలస్తీనా సిరియా మొదలైన  ప్రాంతాలతో కూడినది ) సారవంతమైన ప్రాంతాలు  కావడంతో వాటిని సారవంతమైన నెలవంక(‘fertile crescent’) గా పిలిచేవారు దానితో దక్షిణాన ఉన్న అరబ్ల దృష్టి ని ఇవి ఆకర్షించినవి.
ఆర్థికపరమైన కారణాలు
ఆర్థిక ఒత్తిడి అరబ్ జైత్ర యాత్ర కు ఒక ముఖ్యమైన కారణం అయింది. బలాదూరి  (Baladhuri) ప్రకారం తన “ఫుతు అల్-బుల్డాన్” (దేశాల జైత్రయాత్ర ) అనే గ్రంధం లో  ప్రతి యుద్ధం ముందు ఒక ప్రకటన వేలుబడేది. అల్లాహ్ మార్గంలో పోరాడటానికి ముందుకు వచ్చేవారు  మరియు యుద్ధం (naf'i) ద్వారా ప్రయోజనం పొందాలని అనుకునేవారు సైన్యంలో చేరాలని పిలుపు నిచ్చారు . అందువలన కొందరు  అల్లాహ్ మార్గంలో మరియు కొందరు స్వచ్ఛమైన ఆర్థిక ప్రయోజనం కోసం పోరాటానికి సైన్యంలో చేరారు.
ఆర్థిక ప్రయోజనం కోసం పోరాటo లో చేరిన ప్రజల తో పాటు అల్లాహ్ మార్గంలో పోరాడటానికి సిద్దమైన వారు సైనిక దళం లోకి ఆహ్వానించబడ్డారు. బలాధురి (Baladhuri) రచనలలో అరుదుగా ఇస్లాం మతమార్పిడి ప్రస్తావన వస్తుంది. సాధారణంగా ఒప్పందం పత్రం లో  స్వాధీన దేశం ఇస్లామిక్ సైన్యం కు  ఎంత ఆహార ధాన్యాలు , బట్టలు, బానిస పురుషులు మరియు బానిస అమ్మాయిల సరఫరా గురించి ప్రస్తావన ఉండేది. కొన్ని సార్లు నగదు కుడా  ప్రస్తావించ బడేది. ఓడిన దేశాల ప్రజల నుంచి ఎంత జిజియా పన్ను (jizyah) సేకరించబడాలో చర్చించేవారు.జిజియా పన్ను (jizyah) నిర్ధారితం గా ఉండేది కాదు పరాజిత ప్రజలతో సైనిక సేవ బదులుగా నిర్ణయిoచ బడేది.
మత మార్పిడి యొక్క ప్రస్తావన లేనప్పటికీ కొంతమంది అల్లాహ్ మార్గంలో పోరాటం లో ఎందుకు చేరారు? దాని  వెనుక తర్కం ఏమిటి? స్వాధీనం దేశాలను ఇస్లామిక్ వలసలు గా మార్చడమా లేదా  ఇస్లామిక్ ఆధిపత్యాన్ని స్థాపించడమా? అసలు   ఉద్దేశం ఏమిటి? ఇక్కడ మనం రష్యన్ విప్లవాన్ని  గుర్తుకు చేసుకొందాము. ఒక దేశం లో సంభవించిన విప్లవం స్థిరం గా ఉండాలంటే చుట్టూ పక్కల దేశాలలో కూడా విప్లవం స్థాపించ బడాలి. ప్రపంచ వ్యాప్తం గా కాకపోయినా?
ఇస్లామిక్ విప్లవం సామాజిక-మతపరమైన విప్లవం. అది  కేవలం ఆర్థిక విప్లవం కాదు. ఇస్లాం మతం మానవ సమానత్వం ను నొక్కి చేప్పింది.  అది ఆర్థిక సమానత్వం కంటే మానవ పరువు(dignity) కి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దివ్య ఖురాన్ లోని మక్కా సురాలు  సంపద కేంద్రికరణను ఖండించినవి మరియు ఒక సురా అల్లాహ్ మార్గం లో అవసరం కన్నా అధికంగా ఉన్న  సంపదను వినియోగించమంది. హలాల్ సంపాదన భావన విస్తృతమైనది అది కేవలం  వ్యక్తిగత ఆస్తుల కే పరిమితం కాలేదు.
ఇస్లాం మతం సార్వత్రిక మతం ఇది కొన్ని దేశాలకే పరిమితం కాలేదు. ఇస్లామిక్ తత్వవేత్తలు మరియు ఉలేమా ఇస్లాం మతం  ప్రాదేశిక పరిమితుల కు పరిమితం కాలేదు అన్నారు. కాబట్టి ఇస్లాం లో జాతీయత భావన లేదు అంతర్జాతీయ భావన ఉంది.
ఇరానియన్ లేదా భైజంతిన్ (Byzantinian) వంటి విదేశీ దళాల దండయాత్ర భయం కావచ్చు. రోమన్ సామ్రాజ్యం కు  ఎల్లప్పుడూ అరబ్ భూభాగం ను నియంత్రణలో తీసుకోవాలని ఉంది ఎందుకంటే యెమెన్ నుంచి  పాలస్తీనా వరకు లాభదాయక వ్యాపార మార్గంను నియంత్రించడంలో వారికి ఆసక్తి ఉంది. ఒకసారి దాని సొంత నియంత్రణ కింద ఒక అరబ్ రాజు ను ఉంచడానికి ప్రయత్నించినది. అతనిని అరబ్బులు కీలు బొమ్మగా చూసారు మరియు అరబ్బులు అతనిని తిరస్కరించారు. దీనితో  రోమన్లు ​​అరబ్ భూమి ని నియంత్రించడంలో విజయవంతం కాలేదు. అరబ్బులు స్వతఃగా స్వతంత్రులు మరియు మరియు ఏ విదేశి అధికారం కు లొంగరు.
కానీ ఈ భయాలను  ఇస్లామిక్ ఆధిపత్యం స్థాపించటం కోసం లెక్కలోనికి తీసుకోలేము. పొరుగు దేశాలపై ఆధిపత్యం, విపరీతమయిన ఆర్ధిక సంపద, పొరుగు దేశాల వలన దురాక్రమణ భయం వంటి అనేక కారణాలు అరబ్ ఆక్రమణకు కారణాలుగా చెప్పుకోవచ్చును. ఇస్లామిక్ విప్లవం తరువాత, సారవంతమైన భూమి గెలుపు ఈ యుద్ధాల వల్ల సంభవించినది.100 దాటి లెక్కింపు తెలియని  అరబ్లు, లక్షలకు  యజమానులు అయ్యారు. వారిలో కొందరు  దిర్హామ్ మరియు దినార్ లను పాతర వేయడానికి పారలను ఉపయోగించారు.
ప్రవక్త(స) సహచరులు కొందరు విపరీతంగా సంపదను కేంద్రీకరించారు. దివ్య ఖురాన్ ను ఉటంకిస్తూ  అబూధర్ తరువాత జీవితంలో వారికి  తీవ్రమైన శిక్ష ఉంటుందని హేచ్చరించాడు. ఇంబ్ ఖల్లాడున్(InbKhalladun) అనే ప్రఖ్యాత చరిత్రకారుడు సంపద అధికంగా ఉన్న కొందరు ప్రవక్త సహచరుల  పేర్లు పేర్కొన్నాడు.  అలాగే ఈ ఆక్రమణల వలన తూర్పున సెంట్రల్ ఆసియా మరియు పడమర యూరోప్ వరకు అరబ్ సామ్రాజం విస్తరించినది. ఈ ఆక్రమణల వలన  అరబ్బులు అనేక విధాల లాభ పడినారు.
ఇస్లాం మతం యొక్క వ్యాప్తి(Spread of Islam)
మరో ప్రశ్న అంత తొందరగా ఇస్లాం మతం ఎలా వ్యాప్తి చెందినది? ఆక్రమణల ప్రధాన ఉద్దేశం మతవ్యాప్తి కానప్పుడు  (ఒక చేతిలో ఖడ్గం, మరియొక చేతిలో దివ్య ఖురాన్ వలన ఇస్లాం వ్యాపించినది అని  కొందరు దురభిప్రాయ చరిత్రకారులు ఆరోపించారు ) దీనికి మళ్ళీ అనేక క్లిష్టమైన కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ చర్చించుదాము.
ముందుగా ఇస్లాం మతం లో మెదటి నుంచి రెండు ధోరణులు ప్రబలినవి ఉదా: రాజకీయ ఇస్లాం. అది శక్తి(POWER) మరియు షరియాత్ చట్టం అమలు కు సంభందించినది. విజయాల ప్రధాన లక్ష్యం శక్తి అయింది మరియు అది  ముస్లిం లలో  భారి రక్తపాతం కు దారి తీసింది. షరియత్ చట్టందివ్య ఖురాన్ లో లేని  ఉలేమా వ్యవస్థ కు దారి తీసింది. ఈ 'ఉలేమా లు  తమ గుత్తాధిపత్యాన్ని జీవితం యొక్క అన్ని రంగాలలో స్థాపించారు.
రెండవ ధోరణి సూఫీ వాదం.  రాజకీయ ఇస్లాం కు  వ్యతిరేకంగా సూఫిజం, ప్రధానంగా ఆధ్యాత్మిక మరియు తరిక్యత్(tariqat-ఒక రకమైనఆధ్యాత్మిక పద్దతులు) పై ఎక్కువ ఆధార పడి రాజకీయ అధికార పోరాటాల నుండి దూరంగా ఉన్నది. వారు ప్రవక్త (స) వలే పూర్తిగా సాధారణ జీవితం గడిపినారు మరియు వారు అంతర్గత  శాంతి మరియు అంతర్గత భద్రత కు ప్రాధాన్యమిచ్చారు.
ఈ రెండు ధోరణులలో  ధనిక మరియు శక్తివంతమైన వారు  రాజకీయ ఇస్లాం వైపు మొగ్గు చూపారు. వారు నిరంతరం శక్తి లో నిమగ్నమై అంతర్గత  శాంతి కి కరువైనారు. సాధారణ ప్రజా సమూహాలు మరోవైపు, అంతర్గత  శాంతి శోధన కొరకు సూఫీ మార్గం  వైపు ఆకర్షితులయ్యారు. సూఫీలు  వారిని ఆదరించి గౌరవ భావన ఇచ్చారు. పాలక వర్గాలు  వారిని  చీదరించుకున్నారు. మనశ్శాంతి, ఓదార్పు,సమానత్వం, గౌరవం ఇచ్చిన సూఫీల ద్వారా సామాన్య  జనం ఇస్లాం మతం వైపు  ఆకర్షింపబడ్డారు.
20 వ శతాబ్దంలో కూడా తూర్పున ఇండోనేషియా నుండి పశ్చిమాన అల్జీరియా వరకు  పేదరికం బారినపడిన సామాన్య ముస్లిం  జనం కనబడతారు. ఇస్లామిక్ ప్రపంచం వెనుకబడిన,అత్యంత పేదరికం తో నిండినది. చమురును గుర్తించే నాటికి గల్ఫ్ దేశాల్లోని అరబ్లు అత్యంత పేదలు మరియు చమురు వనరులు లేని  ఈజిప్ట్, అల్జీరియా మరియు ఇతర అరబ్ దేశాలలో నివసిస్తున్న అరబ్బులు చాలా పేదవారి గా ఉన్నారు.
మూడవది, అనేక మంది ముస్లిం లు కాని అధికార వర్గం వారు అధికారం, పలుకుబడి  కోసం ఇస్లాం మతం స్వీకరించినారు. వారి  అనుచరులు కూడా ఇస్లాం స్వికరించారు. స్వాధీన దేశాలలో అనేక మంది  పేదవారు  మరియు ఉన్నవారిలో ఒక వర్గం వారు  ఇస్లాం మతం స్వీకరించారు.సూఫీవాదం  ఇస్లామిక్ ప్రపంచమంతటా విస్తరించినది. కాని  సౌదీ అరేబియా లో వహాబీ ఇస్లాం  బలపడిన తరువాత  సూఫివాదం మెల్లగా తన  ప్రభావం కోల్పోయినది.
సూఫీవాదం  ఇప్పటికీ అరబ్ ఇస్లామిక్ ప్రపంచంలో మరియు ఇస్లామిక్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అత్యంత ప్రజాదరణ పొందింది. దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా లో  సూఫీవాదం  ఇస్లాం మతం యొక్క ఒక ప్రధానమైన ధోరణిగా ఉంది  మరియు సూఫీ తత్వవేత్తల  ప్రభావం ముస్లింలను దాటి ముస్లిమేతరులు పై  ఉంది. అందువలననే  భారతదేశం లో అనేకమంది సూఫీ సన్యాసులను హిందువులు, పార్సీలు మరియు క్రైస్తవులు పూజిస్తారు.
పశ్చిమ సామ్రాజ్యవాదులు  ఇస్లాం మతం కత్తి ద్వారా వ్యాప్తి చెందినది అన్నారు. చరిత్ర దాన్ని అంగీకరించదు. వారు చరిత్రను తప్పుగా అన్వయించి నారు. తమ స్వార్ధ రాజకీయ ఉద్దేశ్యాలు సాధించడానికి తప్పుడు ప్రచారాలు చేసారు.
పేద ప్రజలకి  ఇస్లాం మతం సమానత్వం మరియు మానవ పరువు(HUMAN DIGNITY) ప్రసాదించే సిద్ధాంతం మరియు శక్తీ, అధికారం కలవారి కోసం అది శక్తిని ఇచ్చే ఒక సాదనం. ధనికులు తమ ప్రవర్తన చే ఇస్లాం మత మూల సూత్రాలను అపహాస్యం చేయసాగారు.  నిజానికి వారు ఇస్లాం మతం యొక్క నైతిక సూత్రాలను,ప్రవర్తనను  నగుబాటు చేసారు. ఇస్లాం మతం యొక్క ప్రాథమిక సిద్ధాంతం శాంతి కానీ అధికార వర్గం వారు వారి అధికార దాహం తో స్వార్ధం తో ఇస్లాం ను హింస ను ప్రోత్సహించే  మతం గా  వ్యాప్తి చేసారు. దీనికి విరుద్దంగా సూఫీతత్వం  ఇస్లాం మతం ను సామాన్యుల దరికి చేరి  రక్షించి పదిల పరిచినది.

No comments:

Post a Comment